భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ)లో 303 ఉద్యోగాలు
భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) గ్రేడ్ బీ, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి ఇటీవల ప్రకటన విడుదల చేసింది. దీనిద్వారా పలు విభాగాల్లో మొత్తం 303 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. డిగ్రీ అర్హతతోనే వీటికి పోటీపడవచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల్లో చూపిన ప్రతిభ ఆధారంగా నియామకాలు చేపడతారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు సంఖ్య: 303
గ్రేడ్–బీ: జనరల్ ఆఫీసర్లు– 238
గ్రేడ్–బీ: ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్ విభాగం(డీఈపీఆర్)–31
గ్రేడ్–బీ: స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ విభాగం(డీఎస్ఐఎం)–25, అసిస్టెంట్ మేనేజర్లు(రాజ్‌భాష)–06, అసిస్టెంట్ మేనేజర్లు(ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ)–03
అర్హతలు
ఏదైనా డిగ్రీలో కనీసం 60శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులు 55శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది.
వయోపరిమితి: 01 జనవరి 2022 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు;దివ్యాంగులకు పదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
ఎంపిక ప్రక్రియ
ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం
ఈ పరీక్షను ఫేజ్–1, ఫేజ్–2 విధానంలో నిర్వహిస్తారు.
ఫేజ్ 1: ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ పద్ధతిలో 200 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం రెండు గంటలు. ఇందులో జనరల్ అవేర్నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
ఫేజ్–2: ఈ దశలో నిర్వహించే పరీక్షలో మొత్తం 3 పేపర్లు ఉంటాయి. 300 మార్కులకు ఉంటుంది. ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ పద్ధతిలో ప్రశ్నలు అడుగుతారు.
పేపర్–1 ఆబ్జెక్టివ్ తరహా పరీక్ష (స్టాటిస్టిక్స్‌పై ప్రశ్నలు ఇస్తారు) 100 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం 2 గంటలు.
పేపర్–2 డిస్క్రిప్టివ్ విధానంలో స్టాటిస్టిక్స్‌పై ప్రశ్నలుంటాయి. ప్రశ్నలు కంప్యూటర్ స్క్రీన్‌పై డిస్ప్లే అవుతాయి. సమాధానాలు పెన్‌తో పేపర్ మీద రాయాల్సి ఉంటుంది. పరీక్ష సమయం 3 గంటలు.
పేపర్–3 çపరీక్ష 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇంగ్లిష్‌లో డిస్క్రిప్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది. పరీక్షను కీ బోర్డ్ సహాయంతో కంప్యూటర్‌పైనే రాయాల్సి ఉంటుంది. పరీక్ష సమయం గంటన్నర
ఇంటర్వ్యూ
ఫేజ్–2(పేపర్1,2,3)లో పొందిన మార్కుల ఆధారంంగా అభ్యర్థులను ఇంటర్వ్యూలకు షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ 50 మార్కులకు ఉంటుంది. ఇంటర్వ్యూను హిందీ/ఇంగ్లిష్ రెండింట్లో దేనిలోనైనా ఎంపిక చేసుకోవచ్చు.
ఫేజ్–2లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూలో పొందిన మార్కులు కలిపి తుది జాబితాను రూపొందిస్తారు.
వేతనాలు
గ్రేడ్–బి ఆఫీసర్లకు ప్రతి నెల రూ.55,200, ఆఫీసర్ గ్రేడ్ –బి(డీఆర్)–డీఈపీఆర్ వారికి ప్రతి నెల రూ.44,500 వేతనంగా చెల్లిస్తారు.
పరీక్ష కేంద్రాలు
తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ నగరాల్లో పరీక్ష కేంద్రాలున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, కాకినాడ, నెల్లూరు, గుంటూరు, చీరాల, కర్నూలు, విజయనగరం
ముఖ్యమైన సమాచారం
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులకు చివరి తేదీ: 18.04.2022
వెబ్సైట్: www.rbi.org.in
-----------------------------------------------------------------------------------------------------------------------------
బార్క్ లో 266 ఉద్యోగాలు
ముంబైలో ఉన్న బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్(బార్క్) పరిధిలోని న్యూక్లియర్ రీసైకిల్ బోర్డుల్లో(తారాపూర్, కల్పకం) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 266
పోస్టుల వివరాలు: స్టైపెండరీ ట్రెయినీలు కేటగిరి1–71, స్టైపెండరీ ట్రెయినీలు కేటగిరి2–189, సైంటిఫిక్ అసిస్టెంట్ బి(సేఫ్టీ)–01,టెక్నీషియన్ బి(లైబ్రరీ సైన్స్)–01, టెక్నీషియన్ బి(రిగ్గర్)–04
స్టైపెండరీ ట్రెయినీలు కేటగిరీ–1:
విభాగాలు: కెమిస్ట్రీ, కెమికల్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్.
అర్హత: కనీసం 60శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, బీఎస్సీ(కెమిస్ట్రీ) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: దరఖాస్తు తేదీ ముగిసేనాటికి 18–24 ఏళ్ల మధ్య ఉండాలి.
స్టైపెండ్: మొదటి ఏడాది నెలకు రూ.16,000, రెండో ఏడాది నెలకు రూ.18,000 చెల్లిస్తారు.
స్టైపెండరీ ట్రెయినీలు కేటగిరి–2:
ట్రేడులు: ఏసీ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, టర్నర్, వెల్డర్, ప్లాంట్ ఆపరేటర్ తదితరాలు.
అర్హత: కెమికల్ ప్లాంట్ ఆపరేటర్ పోస్టులకు కనీసం 60శాతం మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్, మిగతా పోస్టులకు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: దరఖాస్తు తేదీ ముగిసే నాటికి 18–22 ఏళ్ల మధ్య ఉండాలి.
స్టైపెండ్: మొదటి ఏడాది నెలకు రూ.10,500, రెండో ఏడాది నెలకు రూ.12,500 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష(ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్) ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
సైంటిఫిక్ అసిస్టెంట్ బి(సేఫ్టీ):
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిప్లొమా/బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.35,400 చెల్లిస్తారు.
టెక్నీషియన్–బి(లైబ్రరీ సైన్స్):
అర్హత: పదో తరగతి/ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణులవ్వాలి. లైబ్రరీ సైన్స్ సర్టిఫికేట్ ఉండాలి.
వయసు: దరఖాస్తు తేదీ ముగిసే నాటికి 18–30 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.21,700 చెల్లిస్తారు.
టెక్నీషియన్–బి(రిగ్గర్):
అర్హత: పదో తరగతి/ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణులవ్వాలి. రిగ్గర్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి.
వయసు: దరఖాస్తు తేదీ ముగిసే నాటికి 18–30 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.21,700 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.04.2022
వెబ్సైట్: https://nrbapply.formflix.com
-----------------------------------------------------------------------------------------------------------------------------
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) వివిధ విభాగాల్లో 225 ఎగ్జిక్యూటివ్ ట్రైనీలు
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఆసక్తి కలిగినవారు ఈనెల 28లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. నోటిఫికేషన్ ద్వారా మొత్తం 225 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వంటి విభాగాల్లో కాళీలు ఉన్నాయి. ఎలాంటి రాపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు
మొత్తం ఖాళీలు: 225
ఇందులో మెకానికల్ 87, కెమికల్ 49, ఎలక్ట్రికల్ 31, ఎలక్ట్రానిక్స్ 13, ఇన్స్ట్రుమెంటేషన్ 12, సివిల్ 33 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ చేసి ఉండాలి. గేట్ 2020, 21, 22లో అర్హత సాధించి, 26 ఏండ్లలోపువారై ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 28
వెబ్సైట్: www.npcilcareers.co.in