Monday, 17 June 2019

ఎయిర్‌ఫోర్స్‌లో ఎయిర్‌మెన్లు ఉద్యోగాలు, వెటర్నరీ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ ప్రవేశాలు, లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్‌లో ఉద్యోగాలు, బీఈసీఐఎల్‌లో ఉద్యోగాలు.

ఎయిర్‌ఫోర్స్‌లో ఎయిర్‌మెన్లు ఉద్యోగాలు,

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఎఎఫ్)లోని గ్రూప్ ఎక్స్, గ్రూప్ వై (నాన్ టెక్నికల్) ట్రేడ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎయిర్‌మెన్ పోస్టుల భర్తీకి అర్హులైన అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

- పోస్ట్ పేరు: ఎయిర్‌మ్యాన్ (గ్రూప్ ఎక్స్, గ్రూప్ వై, గ్రూప్ వై మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్)
- అర్హత: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ/బయాలజీ, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్/10+2 లేదా రెండేండ్ల వొకేషనల్ కోర్సు/తత్సమాన పరీక్ష లేదా మూడేండ్ల ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత.
- వయస్సు: 1999 జూలై 19 నుంచి 2003 జూలై 1 మధ్య జన్మించి ఉండాలి. రిజర్వుడు అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

శారీరక ప్రమాణాలు:
- ఎత్తు - 152.5 సెం.మీ.
- ఛాతీ - శరీరానికి తగ్గ అనుపాతంలో ఉండాలి. గాలిని పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. వ్యాకోచం తప్పనిసరి. ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.
- అప్లికేషన్ ఫీజు: రూ. 250/-

ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌లో..
- 6 నిమిషాల 30 సెకండ్లలో 1.6 కి.మీ. దూరాన్ని పరుగెత్తాలి. 10 సిట్‌అప్‌లు, 20 స్కాట్‌లు, 10 పుష్‌అప్‌లు చేయాలి.
- ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు మాత్రమే మెడికల్ టెస్ట్‌కు అనుమతిస్తారు.
- పే స్కేల్: శిక్షణ కాలంలో నెల జీతం రూ. 14,600/-, శిక్షణ కాలం పూర్తయిన తర్వాత గ్రూప్ ఎక్స్ పోస్టులకు నెలకు రూ. 33,100/-, గ్రూప్ వై పోస్టులకు రూ. 26,900/- అదనంగా ఉచిత వైద్య సౌకర్యం, రేషన్, ట్రాన్‌ఫోర్ట్ అలవెన్స్‌లు తదితర వసతులు ఉంటాయి.
- ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్, మెడికల్ పరీక్షల ద్వారా
- దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
- రిజిస్ట్రేషన్ ప్రారంభం: జూలై 1
- చివరితేదీ: జూలై 15
- వెబ్‌సైట్: www.airmenselection.cdac.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
వెటర్నరీ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ ప్రవేశాలు,
రాజేంద్రనగర్‌లోని పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ 2019-20 విద్యా సంవత్సరానికిగాను రెండేండ్ల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

- కోర్సు పేరు: పాలిటెక్నిక్ (పశుసంవర్ధక & మత్స్య శాస్త్రం)
- మొత్తం సీట్ల సంఖ్య:121
- మహబూబ్‌నగర్, కరీంనగర్, సిద్దిపేట పశుసంవర్ధ్దక పాలిటెక్నిక్‌లలో 30 మంది చొప్పున మామనూర్ పశుసంవర్దక పాలిటెక్నిక్‌లో 20 మంది, భావదేవరపల్లి మత్స్య పాలిటెక్నిక్‌లో 11 మందికి ప్రవేశం కల్పిస్తారు.
- గ్రామీణ ప్రాంతాల్లో నివసించే యువకులకు స్వయం ఉపాధి కల్పించుకోవాలనే ఉద్దేశంతో పశుపోషణ, మత్స్య పరిశ్రమల్లో శిక్షణ ఇవ్వడానికి పాలిటెక్నిక్‌లను ఏర్పాటుచేశారు. 
- అర్హత: పదోతరగతి లేదా తత్సమాన పరీక్షలో కనీసం 60 శాతం (ఎస్సీ/ఎస్టీలకు 50 శాతం) మార్కులతో ఉత్తీర్ణత. ఇద్దరు కంటే ఎక్కువ మందికి సమానమైన మార్కులు/గ్రేడ్‌లు వస్తే సైన్స్/మ్యాథమెటిక్స్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.2019 లేదా అంతకుముందు పదోతరగతిలో పాసైన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- కనీసం నాలుగు సంవత్సరాలపాటు గ్రామీణ ప్రాంతాల్లోని (నాన్ మున్సిపల్ పరిధి) పాఠశాలలో చదివిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
- వయస్సు: 2019 ఆగస్టు 31 నాటికి 15 నుంచి 22 ఏండ్ల మధ్య ఉండాలి. 

- అప్లికేషన్ ఫీజు: జనరల్, బీసీలకు రూ. 660/- ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీలకు రూ. 330/-
- ఎంపిక: పదోతరగతి అకడమిక్ మార్కులు/గ్రేడ్‌ల ప్రామాణికంగా తీసుకుని మెరిట్ ఆధారంగా అడ్మిషన్ కల్పిస్తారు. 
- పాలిటెక్నిక్ కోర్స్ ఎంపికలో రిజర్వేషన్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులకు లోబడి ఉంటాయి.
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి సంబంధిత అధికారికి పంపాలి.
- చిరునామా: P.V Narsimha Rao Telangna Veterinary University
- Administrative office: Rajendranagar : Hyderabad - 500 030
- చివరితేదీ: జూలై 10
- వెబ్‌సైట్: http://tsvu.nic.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్‌లో ఉద్యోగాలు,
తిరువనంతపురంలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ (ఎల్‌పీఎస్సీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

- మొత్తం పోస్టులు: 7
- పోస్టు పేరు: టెక్నికల్ అసిస్టెంట్
- అర్హత: మెకానికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమాలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
- వయస్సు: 2019 జూలై 2 నాటికి 35 ఏండ్లకు మించరాదు.
- పే స్కేల్ : రూ. 44,900-1,42,400/-
- ఎంపిక: రాతపరీక్ష/పర్సనల్ ఇంటర్వ్యూ
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- దరఖాస్తులకు చివరితేదీ: జూలై 2
- వెబ్‌సైట్: www.lpsc.gov.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బీఈసీఐఎల్‌లో ఉద్యోగాలు.

నోయిడాలోని బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) లో కాంట్రాక్టు ప్రాతిపదికన పేషెంట్‌కేర్ మేనేజర్ కో ఆర్డినేటర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. 

- మొత్తం పోస్టులు: 90 
- పోస్టుల వారీగా ఖాళీలు: పేషెంట్‌కేర్ మేనేజర్ (పీసీఎం)-20, పేషెంట్‌కేర్ కో ఆర్డినేటర్ (పీసీసీ)-70) 
- అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (లైఫ్ సైన్సెస్) లేదా డిగ్రీతోపాటు పీజీ (హాస్పిటల్/హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్) ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో ఏడాది అనుభవం ఉండాలి. 
- పే స్కేల్: పీసీఎం పోస్టులకు రూ. 30,000/-, పీసీసీ పోస్టులకు రూ. 17,916/-
- అప్లికేషన్ ఫీజు: రూ. 300/-
- ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ 
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- చివరితేదీ: జూలై 12
- వెబ్‌సైట్: www.becil.com.

సనత్‌నగర్ ఈఎస్‌ఐలో 154 ఉద్యోగాలు, బార్క్‌లో జేఆర్‌ఎఫ్‌లు, పవర్‌గ్రిడ్‌లో ఉద్యోగాలు, డా.బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు, ఎన్‌సీఏవోఆర్‌లో ఉద్యోగాలు, నిమ్‌హాన్స్ నర్సింగ్ ఆఫీసర్లు ఉద్యోగాలు.

సనత్‌నగర్ ఈఎస్‌ఐలో 154 ఉద్యోగాలు,
హైదరాబాద్ సనత్‌నగర్‌లోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ)లో ఫ్యాకల్టీ, సూపర్ స్పెషాలిటీ, సీనియర్ రెసిడెంట్, జూనియర్ రెసిడెంట్, ట్యూటర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

- పోస్టులు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్
- ఖాళీల సంఖ్య- 24
- విభాగాలు: బయోకెమిస్ట్రీ, పాథాలజీ, జనరల్ మెడిసిన్, టీబీ/చెస్ట్, పిడియాట్రిక్స్, సైకియాట్రీ, జనరల్ సర్జరీ, ఈఎన్‌టీ, ఆర్థోపెడిక్స్, అనెస్థీషియా, రేడియాలజీ, డెంటిస్ట్రీ, బ్లడ్‌బ్యాంక్, కమ్యూనిటీ మెడిసిన్.
- పోస్టు: సీనియర్ రెసిడెంట్స్ (మెడికల్ కాలేజీ హాస్పిటల్/సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్) -54 పోస్టులు.
- విభాగాల వారీగా ఖాళీలు: అనెస్థీషియా-7, పిడియాట్రిక్స్-3, ఆప్తాల్మాలజీ-1, ఆర్థోపెడిక్స్-3, ఓబీజీవై-5, రేడియాలజీ-7, జనరల్ మెడిసిన్-2, జనరల్ సర్జరీ-3, న్యూరాలజీ-5, ఎండొక్రైనాలజీ-1, గ్యాస్ట్రోఎంటరాలజీ-1, ఆంకాలజీ (మెడికల్)-1, ఐసీయూ/ఎంఐసీయూ (మెడికల్)-3, నియోనాటాలజీ/ఎన్‌ఐసీయూ-3. కార్డియాలజీ-2, పిడియాట్రిక్ సర్జరీ-2, యూరాలజీ-1, న్యూరో సర్జరీ-2, పిడియాట్రిక్ క్రిటికల్ కేర్-1, నెఫ్రాలజీ-1 ఉన్నాయి.
- పోస్టు: సూపర్ స్పెషలిస్టు (నాన్-టీచింగ్/ఫుల్‌టైం/పార్ట్‌టైం)
- ఖాళీల సంఖ్య- 12
- పోస్టు: స్పెషలిస్టు (నాన్ టీచింగ్/ఫుల్‌టైమ్/పార్ట్‌టైం)

- ఖాళీల సంఖ్య- 3 (పాథాలజీ-1, రేడియాలజీ-1, సైకియాట్రీ/న్యూరో సైకాలజీ-1)
- పోస్టు: జూనియర్ రెసిడెంట్
- ఖాళీల సంఖ్య- 38
- పోస్టు: ట్యూటర్
- ఖాళీల సంఖ్య-23
నోట్: పై పోస్టులను పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.
- అర్హతలు: ఎంసీఐ నిబంధనల ప్రకారం అర్హతలు కలిగి ఉండాలి.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: జూన్ 24 (సాయంత్రం 6 గంటల వరకు)
- వెబ్‌సైట్: https://www.esic.nic.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బార్క్‌లో జేఆర్‌ఎఫ్‌లు,
బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (బార్క్) జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్స్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

- పోస్టు: జూనియర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్‌ఎఫ్)
- ఖాళీల సంఖ్య - 25
- అర్హతలు: ఎమ్మెస్సీ/ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ (ఫిజిక్స్/కెమిస్ట్రీ లేదా లైఫ్ సైన్సెస్)
- ఎంపిక: యూజీసీ- సీఎస్‌ఐఆర్-నెట్/స్లెట్, జెస్ట్ లేదా ఐసీఎంఆర్-జేఆర్‌ఎఫ్ లేదా డీబీటీ-జేఆర్‌బీ బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్‌లో వచ్చిన మార్కుల ప్రాతిపదికన ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
- స్టయిఫండ్: నెలకు రూ. 31,400+ హెచ్‌ఆర్‌ఏ రూ.7,440/- (వసతి సౌకర్యం అందుబాటులో లేనప్పుడు)తోపాటు ఇతర అలవెన్సులు ఇస్తారు.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: జూలై 12
- వెబ్‌సైట్: www.barc.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
పవర్‌గ్రిడ్‌లో ఉద్యోగాలు,
పవర్‌గ్రిడ్‌లో విజిలెన్స్ విభాగంలో కింది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

- పోస్టులు: ఆఫీసర్ (విజిలెన్స్)-2, అసిస్టెంట్ మేనేజర్ (విజిలెన్స్)-1, డిప్యూటీ మేనేజర్ (విజిలెన్స్)-2 ఖాళీలు ఉన్నాయి.
- అర్హతలు, వయస్సు, ఎంపిక తదితర వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: జూలై 12
- వెబ్‌సైట్: www.powergridindia.com

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
డా.బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు,

శ్రీకాకుళంలోని డా.బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ కింది మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.

- కోర్సులు: మాస్టర్ ఆఫ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ (రెండేండ్లు), పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ రికార్డ్స్&హెల్త్ ఇన్ఫర్మేషన్ (ఏడాది)
- ఈ కోర్సులను అంబేద్కర్ యూనివర్సిటీ, బొల్లినేని మెడ్‌స్కిల్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
- అర్హతలు: ఎంబీబీఎస్, బీడీఎస్, బీఫార్మసీ, బీకాం, బీఎస్సీ నర్సింగ్, బీఏ లేదా ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
- వయస్సు: 2019, ఆగస్టు 31 నాటికి 20-35 ఏండ్ల మధ్య ఉండాలి.
- దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
- చివరితేదీ: జూన్ 21
- వెబ్‌సైట్: www.brau.edu.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌సీఏవోఆర్‌లో ఉద్యోగాలు,
నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రిసెర్చ్ (ఎన్‌సీఏవోఆర్)లో కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది.

- పోస్టులు-ఖాళీలు: వెహికిల్ మెకానిక్-2, వెహికిల్ ఎలక్ట్రీషియన్-3, క్రేన్ ఆపరేటర్-2, స్టేషన్ ఎలక్ట్రీషియన్-1, జనరేటర్ మెకానిక్/ఆపరేటర్-2, బాయిలర్ ఆపరేటర్/ప్లంబర్ లేదా ఫిట్టర్-1, కార్పెంటర్-2, వెల్డర్-3, మల్టీటాస్కింగ్ స్టాఫ్-1, మేల్ నర్స్-3, ల్యాబ్ టెక్నీషియన్-2, కమ్యూనికేటర్-3, ఇన్వెంటరీ/బుక్ కీపింగ్ స్టాఫ్-2, చెఫ్/కుక్-5 ఉన్నాయి.
- అర్హతలు, అనుభవం, ఎంపిక వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
- వెబ్‌సైట్: www.ncaor.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నిమ్‌హాన్స్ నర్సింగ్ ఆఫీసర్లు ఉద్యోగాలు.

బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (నిమ్‌హాన్స్) ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

- పోస్టు పేరు: నర్సింగ్ ఆఫీసర్
- మొత్తం ఖాళీలు: 99 (జనరల్-45, ఈడబ్ల్యూఎస్-9, ఓబీసీ-21, ఎస్సీ-11, ఎస్టీ-5)
- అర్హత: ఇంటర్ ఉత్తీర్ణతతోపాటు ఏ గ్రేడ్ నర్సుగా రిజిస్టరైనవారు/ బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులైనవారు అర్హులు. బ్యాచిలర్ డిగ్రీ లేని అభ్యర్థులకు సంబంధిత రంగంలో రెండేండ్ల అనుభవం ఉండాలి.
- జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ (జేఎస్‌ఏ)-24 ఖాళీలు (జనరల్ -14, ఈడబ్ల్యూఎస్-2, ఓబీసీ-3, ఎస్సీ-3, ఎస్టీ-2)
- అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
- వయస్సు: జేఎస్‌ఏకు 27 ఏండ్లు, నర్సింగ్ ఆఫీసర్‌కు 35 ఏండ్లకు మించరాదు. 
- పే స్కేల్: నర్సింగ్ ఆఫీసర్‌కు రూ. 44,900/-జేఎస్‌ఏకు రూ. 19,900/-
- ఎంపిక: ఆన్‌లైన్ పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 29
- వెబ్‌సైట్:www.nimhans.ac.in.

యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్-2019, మిధానిలో ఆపరేటర్లు ఉద్యోగాలు, ఈఐఎల్‌లో ఎగ్జిక్యూటివ్‌లు, ఈసీఐఎల్‌లో ట్రేడ్‌మెన్లు, అసోంలోని నేషనల్ లా యూనివర్సిటీ అండ్ జ్యుడీషియల్ అకాడమీ ప్రొఫెసర్ ఉద్యోగాలు.

యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్-2019,
భారత నావికాదళంలో యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్ కింద ఎస్‌ఎస్‌సీ ఎగ్జిక్యూటివ్ (ఐటీ), టెక్నికల్ బ్రాంచీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
indian-navy
-పోస్టు: షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్
-బ్రాంచీ: ఐటీ
-అర్హతలు: బీఈ/బీటెక్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ లేదా కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులు.
-బ్రాంచీ: ఇంజినీరింగ్
-అర్హతలు: బీఈ/బీటెక్‌లో మెకానికల్, మెరైన్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ప్రొడక్షన్, ఏరోనాటికల్, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ & మేనేజ్‌మెంట్, కంట్రోల్ ఇంజినీరింగ్, ఏరోస్పేస్, ఆటోమొబైల్స్, మెటలర్జి, మెకట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ బ్రాంచీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులు.
-బ్రాంచీ: ఎలక్ట్రికల్
-అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌లో కింది బ్రాంచీలో ఉత్తీర్ణత. బ్రాంచీలు-ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, టెలీకమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, పవర్ ఇంజినీరింగ్, కంట్రోల్ సిస్టమ్ ఇంజినీరింగ్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఏవియానిక్స్, ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్, ఇన్‌స్ట్రుమెంటేషన్.
-నోట్: ఈ అన్ని పోస్టులకు అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.
-వయస్సు: 1996, జూలై 2 నుంచి 1999, జూలై 1 మధ్య జన్మించి ఉండాలి.
-శారీరక ప్రమాణాలు: కనీసం 157 సెం.మీ ఎత్తు ఉండాలి.

ఎంపిక విధానం:
-దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంది.
-ఇంటర్వ్యూలను బెంగళూరు, భోపాల్, కోయంబత్తూర్, విశాఖపట్నం, కోల్‌కతాలో డిసెంబర్-2019 నుంచి ఏప్రిల్-2020 మధ్య నిర్వహిస్తారు.
-ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలు: రెండు దశల్లో నిర్వహిస్తారు.
-స్టేజ్-1: మొదటి రోజు ఆఫీసర్ ఇంటెలిజెన్సీ రేటింగ్ టెస్ట్, పీపీడీటీలను నిర్వహిస్తారు. వీటిలో అర్హత సాధించిన వారిని రెండోదశకు ఎంపిక చేస్తారు.
-స్టేజ్-2: సైకాలజికల్ టెస్టింగ్, గ్రూప్‌టాస్క్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలు. ఈ పరీక్షలను ఐదురోజులపాటు నిర్వహిస్తారు.
-నోట్: స్టేజ్ -2, వైద్యపరీక్షల్లో అర్హత సాధించినవారిని ఖాళీల సంఖ్యను బట్టి ఆల్ ఇండియా మెరిట్ ప్రాతిపదికన తుది ఎంపిక చేస్తారు.
-శిక్షణ: కేరళ ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో జూన్ 2020 నుంచి ప్రారంభమవుతుంది.
-22 వారాల శిక్షణను పూర్తిచేసుకున్నవారికి నావికాదళంలో ఆఫీసర్‌గా ఉద్యోగావకాశాన్ని కల్పిస్తారు. ఐటీ బ్రాంచీకి నాలుగు వారాల శిక్షణ మాత్రమే ఉంటుంది.
-పేస్కేల్: సబ్ లెఫ్టినెంట్ హోదాలో నెలకు రూ.56,100-1,10,700 (లెవల్ 10) జీతాన్ని ఇస్తారు. దీనికి అదనంగా ఇతర అలవెన్సులు, సౌకర్యాలను నేవీ కల్పిస్తుంది.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూన్ 27
-వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
మిధానిలో ఆపరేటర్లు ఉద్యోగాలు,
మిశ్రధాతు నిగం లిమిటెడ్ (మిధాని)లో ఆపరేటర్ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది.
MTNL-Recruitment
-చార్జర్ ఆపరేటర్- 3 ఖాళీలు
-అర్హతలు: ఏడో తరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత రంగంలో నాలుగేండ్ల అనుభవం ఉండాలి. 
-క్రేన్ ఆపరేటర్ - 2 పోస్టులు
-అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత రంగంలో ఐదేండ్ల అనుభవం ఉండాలి.
-జేవోటీ-టర్నర్ -10 ఖాళీలు
-అర్హతలు: పదోతరగతి, ఐటీఐ (టర్నర్)తోపాటు రెండేండ్ల అనుభవం ఉండాలి.
-ఫోర్గ్ ప్రెస్ ఆపరేటర్ - 3 ఖాళీలు
-అర్హతలు: డిప్లొమాలో మెటలర్జి/మెకానికల్ లేదా బీఎస్సీతోపాటు అల్ట్రాసోనిక్ టెస్టింగ్‌లో లెవల్-2 ఎన్‌డీటీ సర్టిఫికేషన్, ఏడేండ్ల అనుభవం ఉండాలి. 
-ఎంపిక: అకడమిక్ మార్కులకు 15, అనుభవానికి 15 మార్కులు, రాతపరీక్ష 100 మార్కులకు నిర్వహించి 70 మార్కులకు లెక్కిస్తారు, ట్రేడ్‌టెస్ట్ పాస్/ఫెయిల్. 
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూలై 13
-వెబ్‌సైట్: http://www.midhani-india.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఈఐఎల్‌లో ఎగ్జిక్యూటివ్‌లు,
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్)లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
eil
-పోస్టు: ఎగ్జిక్యూటివ్ 
-గ్రేడుల వారీగా: గ్రేడ్-1: 23
-పేస్కేల్: రూ. 72,000-80,000/-
-గ్రేడ్-3: 7 పోస్టులు
-పేస్కేల్: రూ. 1,00,800-1,12,000/-
-గ్రేడ్-7: 4 ఖాళీలు 
-పేస్కేల్: రూ.1,15,200-1,28,000/- 
-నోట్: ఈ పోస్టులను ఫిక్స్‌డ్ టర్మ్ బేసిస్‌లో భర్తీ చేస్తున్నారు. 
-అర్హతలు, ఎంపిక, రిజర్వేషన్లు తదితర వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో జూన్ 14 నుంచి
-చివరితేదీ: జూలై 4
-వెబ్‌సైట్: www.engineersindia.com

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఈసీఐఎల్‌లో ట్రేడ్‌మెన్లు,
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)లో ట్రేడ్‌మెన్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
ECIL_Logo
-పోస్టు: ట్రేడ్‌మెన్-సీ
-విభాగాల వారీగా ఖాళీలు: ఎలక్ట్రానిక్ మెకానిక్/ఆర్&టీవీ-25, ఫిట్టర్-9, ఎలక్ట్రీషియన్-5, మెషినిస్ట్-3, వెల్డర్-4, మిల్‌రైట్ మెకానిక్-2, ఎలక్ట్రోప్లేటర్-1, టర్నర్-1 ఖాళీలు ఉన్నాయి. 
-జీతభత్యాలు: నెలకు రూ.30,790/- (అన్ని కలుపుకొని).
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో జూన్ 14 నుంచి ప్రారంభం
-చివరితేదీ: జూన్ 29 పూర్తి వివరాల కోసం
-వెబ్‌సైట్: www.ecil.co.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
అసోంలోని నేషనల్ లా యూనివర్సిటీ అండ్ జ్యుడీషియల్ అకాడమీ ప్రొఫెసర్ ఉద్యోగాలు.

అసోంలోని నేషనల్ లా యూనివర్సిటీ అండ్ జ్యుడీషియల్ అకాడమీ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

-పోస్టులు: ప్రొఫెసర్-3, అసోసియేట్ ప్రొఫెసర్-3, అసిస్టెంట్ ప్రొఫెసర్-1
-విభాగం: లా
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-చివరితేదీ: జూలై 2
-వెబ్‌సైట్: www.nluas.ac.in

ఐసీఎఫ్‌లో అప్రెంటిస్‌లు, అగ్రికల్చర్ పాలిటెక్ని క్‌లో ప్రవేశాలు, హోంసైన్స్ కాలేజీలో బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ ప్రవేశాలు, ఆర్‌సీఎఫ్‌ఎల్‌లో ఇంజినీర్లు ఉద్యోగాలు, నీరీలో ఉద్యోగాలు.

ఐసీఎఫ్‌లో అప్రెంటిస్‌లు,
చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్‌ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచిదరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Integral-Coach-factory
-ట్రేడ్ అప్రెంటిస్‌లు
-మొత్తం ఖాళీల సంఖ్య: 992
-విభాగాలవారీగా ఖాళీలు: కార్పెంటర్-80, ఎలక్ట్రీషియన్-200, ఫిట్టర్-260, పెయింటర్-80, వెల్డర్-290, పాసా-2
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి సైన్స్/మ్యాథ్స్ సబ్జెక్టులతో 10+2 లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. సంబంధిత బ్రాంచీలో ఐటీఐ ట్రేడ్‌లో సర్టిఫికెట్ ఉండాలి.
-వయస్సు: 2019 అక్టోబర్ 1 నాటికి 15 ఏండ్ల నుంచి 24 ఏండ్ల మధ్య ఉండాలి.
-స్టయిఫండ్ : మొదటి ఏడాదికి రూ. 5700/-, రెండో ఏడాదికి రూ. 6500/- చెల్లిస్తారు.
-ఎంపిక: అకడమిక్ మార్కులు/ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 24
-వెబ్‌సైట్: www.icf.indianrailways.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
అగ్రికల్చర్ పాలిటెక్ని క్‌లో ప్రవేశాలు,
రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ 2019-20 విద్యా సంవత్సరానికి రెండేండ్ల/ మూడేండ్ల డిప్లొమా ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
jya-shanker-coll
-మొత్తం సీట్ల సంఖ్య: 880 (వ్యవసాయం-620, విత్తన సాంకేతిక పరిజ్ఞానం-80, సేంద్రీయ వ్యవసాయం-60, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్-110)
-అర్హత: పదోతరగతి/తత్సమాన పరీక్షలో కనీసం 5.0 గ్రేడ్ పాయింట్ (హిందీతో కలిపి)తో ఉత్తీర్ణులైనవారు అర్హులు. పదోతరగతి కంపార్ట్‌మెంట్/ ఇంటర్ ఫెయిలైన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ పాసైనవారు, దానికంటే పై చదువులు చదివిన అభ్యర్థులు అర్హులుకారు. పదోతరగతిలోపు ఏదైనా నాలుగేండ్లపాటు గ్రామీణ ప్రాంతాల్లో (నాన్ మున్సిపల్ పరిధి) చదివిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
-వయస్సు: 2019 డిసెంబర్ 31 నాటికి 15 నుంచి 22 ఏండ్ల మధ్య ఉండాలి.
-అప్లికేషన్ ఫీజు: జనరల్/బీసీలు రూ.1100/- ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీలు రూ. 600/-చెల్లించాలి.
-ఎంపిక: పదోతరగతి మార్కుల ఆధారంగా 
-కోర్సు కాలపరిమితి: వ్యవసాయం, విత్తన సాంకేతిక పరిజ్ఞానం/ సేంద్రీయ వ్యవసాయం- రెండేండ్లు. అగ్రికల్చరల్ ఇంజినీరింగ్-మూడేండ్లు 
-కోర్సు ఫీజు: రూ. 12,700/-, (ప్రైవేట్ పాలిటెక్నిక్‌లో రూ. 17,200/-) చెల్లించాలి.
ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్‌ల సీట్ల వివరాలు
-నాగర్‌కర్నూల్ (పాలెం), జగిత్యాల (పొలాస), నల్లగొండ (కంపాసాగర్), సంగారెడ్డి(బసంతపూర్), ఖమ్మం(మధిర), సంగారెడ్డి (జోగిపేట), సిద్దిపేట (తోర్నాల), కరీంనగర్ (జమ్మికుంట), కామారెడ్డి(మాల్‌తుమ్మెద), నిజామాబాద్ (రుద్రూరు), హైదరాబాద్ (రాజేంద్రనగర్) వీటితోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది ప్రైవేట్ పాలిటెక్నిక్‌లలో ఈ కోర్సును నిర్వహిస్తున్నాయి.
-వ్యవసాయం, విత్తన సాంకేతిక పరిజ్ఞానం, సేంద్రీయ వ్యవసాయం కోర్సుల్లో ప్రతి ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో 20 సీట్లు, ప్రైవేట్ పాలిటెక్నిక్‌లలో 60 సీట్లు ఉన్నాయి. అగ్రికల్చర్ ఇంజినీరింగ్‌లో ప్రతి ప్రైవేట్ పాలిటెక్నిక్‌లలో 30 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జూలై 4
-వెబ్‌సైట్: www.pjtsau.ac.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
హోంసైన్స్ కాలేజీలో బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ ప్రవేశాలు,
రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ 2019-20 ఇయర్‌కిగాను యూనివర్సిటీ సైఫాబాద్ హోంసైన్స్ కాలేజీలో నాలుగేండ్ల బీఎస్సీ (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్ కోర్సులో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.

-కోర్సు పేరు: బీఎస్సీ (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్ 
-కాలేజ్ ఆఫ్ హోంసైన్స్ సైఫాబాద్, హైదరాబాద్‌లో క్లాసులు జరుగుతాయి. ఈ కోర్సు చేయడానికి బాలికలు మాత్రమే అర్హులు.
-మొత్తం సీట్ల సంఖ్య: 60
-అర్హత: బైపీసీ, ఎంపీసీ, ఎంబైపీసీ సబ్జెక్టులతో రెండేండ్ల వ్యవధిగల ఇంటర్/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. మూడేండ్ల డిప్లొమా కోర్సు (హోమ్‌సైన్స్)లో సర్టిఫికెట్ ఉన్నవారికి సూపర్‌న్యూమరీకోటాలో 10 శాతం సీట్లను కేటాయిస్తారు. 
-వయస్సు: 2019 డిసెంబర్ 31 నాటికి 17 నుంచి 22 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 25 ఏండ్లు, పీహెచ్‌సీలకు 27 ఏండ్ల వరకు సడలింపు ఉంటుంది 
-అప్లికేషన్ ఫీజు: రూ.1800/- (ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు రూ. 900/-)
-ఎంపిక: ఇంటర్/డిప్లొమాలోని ఆప్షనల్ సబ్జెక్టు లోని వచ్చిన మార్కులను ప్రామాణికంగా తీసుకుని మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. 
-నాలుగేండ్ల బీఎస్సీ (ఆనర్స్) కోర్సు ఎంపికలో రిజర్వేషన్లు ప్రభుత్వ ఉత్తర్వులకు లోబడి ఉంటాయి.
-మొత్తం సీట్లలో 40 శాతం గ్రామీణ ప్రాంతాల్లో చదివిన అభ్యర్థులకు కేటాయించారు. నాన్ మున్సిపల్ పరిధిలోని 1 నుంచి 12వ తరగతి వరకు నాలుగేండ్లపాటు చదివి ఉండాలి.
-లోకల్ అభ్యర్థులకు 85 శాతం, నాన్‌లోకల్ అభ్యర్థులకు 15 శాతం సీట్లు భర్తీచేస్తారు.
-కోర్సు ఫీజు: రూ. 36,450/-(కోర్సు తదనంతరం రూ. 14,000/- రిఫండబుల్ ఉంటుంది)
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో 
-దరఖాస్తులకు చివరితేదీ: జూలై 4
-వెబ్‌సైట్: www.pjtsau.ac.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఆర్‌సీఎఫ్‌ఎల్‌లో ఇంజినీర్లు ఉద్యోగాలు,
ముంబైలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఆర్‌సీఎఫ్‌ఎల్) ఖాళీగా ఉన్న ఇంజినీర్, ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
RFCL
-మొత్తం పోస్టులు: 16 (బాయిలర్ ప్రొఫిషియన్సీ ఇంజినీర్-15, సీనియర్ ఆఫీసర్-2)
-అర్హత: బీఈ/బీటెక్ లేదా బీఎస్సీ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత. కంపెనీ సెక్రటరీలో మెంబర్‌గా నమోదై ఉండాలి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 18
-వెబ్‌సైట్: www.rcfltd.com

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నీరీలో ఉద్యోగాలు.

నాగ్‌పూర్‌లోని సీఎస్‌ఐఆర్-నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌ఈఈఆర్‌ఐ) ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

-ప్రాజెక్ట్ అసిస్టెంట్, జేఆర్‌ఎఫ్, ఎస్‌ఆర్‌ఎఫ్
-అర్హత: సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీసీఏ/డిప్లొమా, ఎమ్మెస్సీ, బీఈ/బీటెక్‌ల లేదా ఎంఏతోపాటు నెట్/గేట్ ఉత్తీర్ణత. అనుభవం ఉండాలి.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 30
-వెబ్‌సైట్ : www.neeri.res.in

Monday, 10 June 2019

ఎయిర్‌పోర్ట్ అథారిటీలో 176 ఉద్యోగాలు, వ్యాప్కోస్‌లో 62 ఉద్యోగాలు, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్‌లో ఉద్యోగాలు, స్త్రీనిధి క్రెడిట్‌లో మేనేజర్లు ఉద్యోగాలు, ఐఆర్‌సీటీసీలో ఉద్యోగాలు, ఐఐఎస్‌సీలో ఉద్యోగాలు.

ఎయిర్‌పోర్ట్ అథారిటీలో 176 ఉద్యోగాలు,

చెన్నైలోని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలోని ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ & ఐల్లెడ్ సర్వీసెస్ కంపెనీ (ఏఏఐసీఎల్‌ఏఎస్) ఖాళీగా ఉన్న సెక్యూరిటీ స్క్రీనర్ (కాంట్రాక్టు ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

- పోస్టు పేరు: సెక్యూరిటీ పర్సనల్ & ఎక్స్ రే స్క్రీనర్స్
- మొత్తం పోస్టులు:176 (జనరల్-95, ఓబీసీ-40, ఎస్సీ-23, ఎస్టీ-18)
- అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, బీసీఏఎస్ బేసిక్ ఏవీఎస్‌ఈసీ సర్టిఫికెట్/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. హిందీ/ఇంగ్లిష్, స్థానిక భాషల్లో పరిజ్ఞానం. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.
- వయస్సు: 2019 జూన్ 1 నాటికి 45 ఏండ్లకు మించరాదు.
- పే స్కేల్: రూ. 25,000 నుంచి 30,000 వరకు జీతం చెల్లిస్తారు.
- అప్లికేషన్ ఫీజు: రూ. 500/-
- ఎంపిక విధానం: రాతపరీక్ష, పీఈటీ, ఇంటర్వ్యూ ఆధారంగా
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- చివరితేదీ : జూన్ 20
- వెబ్‌సైట్: www.airportsindia.org.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
వ్యాప్కోస్‌లో 62 ఉద్యోగాలు,
వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (వ్యాప్కోస్) ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

- మొత్తం పోస్టుల సంఖ్య: 62
- వాటర్ సప్లయ్ ఎక్స్‌పర్ట్
- అర్హత: సివిల్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. వాటర్ సప్లయ్ విభాగంలో రెండేండ్ల అనుభవం ఉండాలి.
- ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ
- దరఖాస్తు: ఈ-మెయిల్ ద్వారా
- చివరితేదీ: జూన్ 20
- వెబ్‌సైట్: www.wapcos.gov.in---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నెహ్రూ యువ కేంద్ర సంఘటన్‌లో ఉద్యోగాలు,
న్యూఢిల్లీలోని యువజన వ్యవహారాలు, క్రీడలు శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ (ఎన్‌వైకేఎస్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

- మొత్తం ఖాళీలు: 337
- అసిస్టెంట్ డైరెక్టర్/డిస్ట్రిక్ట్ యూత్ కో ఆర్డినేటర్-160, జూనియర్ కంప్యూటర్ ప్రోగ్రామర్ (జేసీపీ)-17, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్-1, అసిస్టెంట్-38, లైబ్రేరియన్-1, కంప్యూటర్ ఆపరేటర్-4, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్-58, స్టెనోగ్రాఫర్ (గ్రేడ్-2)-23, లోయర్ డివిజన్ క్లర్క్-12, మల్టీ టాస్కింగ్ స్టాఫ్-23.
- అర్హత: డిస్ట్రిక్ట్ యూత్ కో ఆర్డినేటర్ పోస్టులకు ఏదైనా మాస్టర్ డిగ్రీ, జేసీపీ పోస్టులకు ఎమ్మెస్సీ (కంప్యూటర్ సైన్స్) లేదా బీఈ/బీటెక్ లేదా ఎంసీఏ, స్టెనో పోస్టులకు ఇంటర్+స్టెనోగ్రఫీలో ప్రావీణ్యం ఉండాలి. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ బీకాంతోపాటు అకౌంట్స్ వర్క్స్‌లో రెండేండ్ల అనుభవం ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్/టైపింగ్ స్కిల్స్‌లో పరిజ్ఞానం ఉండాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు పదోతరగతి/మెట్రిక్యులేషన్‌లో ఉత్తీర్ణత. మిగతా పోస్టులకు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
- వయస్సు: మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు 18 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి. మిగతా పోస్టులకు 28 ఏండ్లకు మించరాదు. 
- పే స్కేల్: కో ఆర్డినేటర్ రూ. 56,100-1,77, 500, అకౌంట్స్ క్లర్క్ & టైపిస్ట్ రూ. 25, 500-81,100/- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రూ. 18,000-56,900/-
- అప్లికేషన్ ఫీజు: రూ. 700/-, ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీలకు ఫీజు లేదు. 
- ఎంపిక: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా 
- దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 26
- వెబ్‌సైట్: http://nyks.nic.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
స్త్రీనిధి క్రెడిట్‌లో మేనేజర్లు ఉద్యోగాలు,
హైదరాబాద్‌లోని గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలోని స్త్రీనిధి క్రెడిట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మేనేజర్ (కాంట్రాక్ట్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

- మొత్తం పోస్టులు: 144
- పోస్టు పేరు: అసిస్టెంట్ మేనేజర్
- అర్హత: కనీసం 55 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
- వయస్సు: 2019 మార్చి 31 నాటికి 25 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి. 
- పే స్కేల్: రూ. 13,000/- (ఫిక్స్‌డ్ ట్రావెల్ అలవెన్స్ కింద రూ. 2500-3500/-+వెహికిల్ మెయింటేనెన్స్ కింద రూ. 700/- నెలకు చెల్లిస్తారు)
- ఎంపిక: రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్ ద్వారా
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- దరఖాస్తుకు చివరితేదీ: జూన్ 15
- వెబ్‌సైట్: www.streenidhi.telangana.gov.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఆర్‌సీటీసీలో ఉద్యోగాలు,
ఐఆర్‌సీటీసీ దక్షిణ జోన్ పరిధిలో ఖాళీగా ఉన్న సూపర్‌వైజర్ (తాత్కాలిక) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

- మొత్తం పోస్టులు: 74
- పోస్టు: సూపర్‌వైజర్ (హాస్పిటాలిటీ)
- అర్హత: బీఎస్సీ (హాస్పిటాలిటీ & హోటల్ అడ్మినిస్ట్రేషన్)లో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో రెండేండ్ల అనుభవం ఉండాలి.
- పే స్కేల్: నెలకు రూ. 25000/- అదనంగా రోజువారీ అలవెన్సుల కింద రూ. 250/-అవుట్‌స్టేషన్ అలవెన్సులు రూ. 250/- ఇస్తారు.
- ఎంపిక: మెడికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా 
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- ఇంటర్వ్యూ తేదీ: జూన్ 13,15
- వెబ్‌సైట్: www.irctc.com

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐఎస్‌సీలో ఉద్యోగాలు.

బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ)లోని బయాలాజికల్ సైన్సెస్, డీబీటీ- ఐఐఎస్సీ పార్ట్‌నర్‌షిప్ ప్రోగ్రామ్‌లో భాగంగా కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

- మొత్తం ఖాళీలు: 14 (సీనియర్ రిసెర్చ్ సైంటిస్ట్-8, జూనియర్ రిసెర్చ్ సైంటిస్ట్-6)
- అర్హతలు: సంబంధిత విభాగాలను అనుసరించి ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ ఉండాలి.
- వయస్సు: 45 ఏండ్లకు మించరాదు.
- పేస్కేల్: రూ. 50,000- 80,000 వరకు నెలకు కన్సాలిడేటెడ్ రూపంలో చెల్లిస్తారు 
- ఎంపిక విధానం: ఇంటర్వ్యూ 
- దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో
- చివరితేదీ: జూన్ 15
- వెబ్‌సైట్: www.iisc.ac.in

మెకాన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు, మనూలో ఉద్యోగాలు, 10 + 2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ నోటిఫికేషన్, స్పోర్ట్స్ న్యూట్రిషన్‌లో ఎమ్మెస్సీ ప్రవేశాలు, ఐఐపీఈలో బీటెక్ ప్రవేశాలు.

మెకాన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు,

భారత ఉక్కు మంత్రిత్వశాఖకు చెందిన మెకాన్ లిమిటెడ్ (రాంచీ) కాంట్రాక్టు ప్రాతిపదికన ఇంజినీరింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
MECON-Limited
-మొత్తం పోస్టులు-205
-ప్రొఫెషనల్ పోస్టులు: ఎగ్జిక్యూటివ్, అకౌంటెంట్, జూనియర్ ఎగ్జిక్యూటివ్, సేఫ్టీ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రాజెక్టు ఇంజినీర్, హిందీ ట్రాన్స్‌లేటర్, సేఫ్టీ ఆఫీసర్, ప్రాజెక్టు ఇంజినీర్, జూనియర్ ఇంజినీర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ తదితర పోస్టులు ఉన్నాయి.
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బీఈ/బీటెక్, బీఎస్సీ ఇంజినీరింగ్, ఎంబీఏ/పీజీడీఎం, బీఆర్క్, మాస్టర్ డిగ్రీ, బీకాం, ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-అప్లికేషన్ ఫీజు: రూ. 1000/-
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 20
-వెబ్‌సైట్: www.meconlimited.co.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
మనూలో ఉద్యోగాలు,

దరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

-మొత్తం పోస్టులు: 95
-విభాగాలవారీగా పోస్టులు..
-ప్రొఫెసర్- 17, అసోసియేట్ ప్రొఫెసర్-30, హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ (పాలిటెక్నిక్)-12, అసిస్టెంట్ ప్రొఫెసర్-17, లెక్చరర్ (పాలిటెక్నిక్)-19
-అర్హత: యూనివిన్సటీ నిబంధనల ప్రకారం
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ 
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జూలై 8
-వెబ్‌సైట్: www.manuu.ac.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
10 + 2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ నోటిఫికేషన్,
ఇండియన్ నేవీ 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీం (పర్మినెంట్ కమిషన్ ) కింద నాలుగేండ్ల బీటెక్ కోర్సు చేయడానికి అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి ఎజిమల (కేరళ)లోని ఇండియన్ నేవల్ అకాడమీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
insian-sailors
-కోర్సు పేరు: 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీం
-వయస్సు: 2000, జూలై 2 నుంచి 2003, జనవరి1 మధ్య జన్మించి ఉండాలి.
-విద్యార్హతలు: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో కనీసం 70 శాతం మార్కులతో ఇంటర్ లేదా 10+2 పరీక్ష ఉత్తీర్ణత. ఇంగ్లిష్ (ఎస్‌స్‌సీ/ఇంటర్‌స్థాయి)లో కనీసం 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి. జేఈఈ మెయిన్ -2019 ఎగ్జామ్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.
-శారీరక ప్రమాణాలు: ఎత్తు - కనీసం 157 సెం.మీ., ఎత్తుకు తగ్గ బరువు & ఇండియన్ నేవీ నిర్దేశించిన కంటి చూపు, ఇతర వైద్య ప్రమాణాలు ఉండాలి.
-ఎంపిక: జేఈఈ మెయిన్-2019 ఆల్ ఇండియా ర్యాంక్ ఆధారంగా సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తుంది. అనంతరం ఎస్‌ఎస్‌బీ బోర్డు ఆగస్టు-అక్టోబర్ మధ్య బెంగళూరు, భోపాల్, కోయంబత్తూర్, వైజాగ్‌లలో ఏదో ఒకచోట ఇంటర్వ్యూలను మొత్తం 5 రోజులపాటు ఇంటర్వ్యూ రెండు దశల్లో కొనసాగిస్తుంది.
-స్టేజ్ -1లో ఇంటెలిజెన్స్ టెస్ట్, పిక్చర్ ప్రిసిప్షన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ ఉంటాయి. వీటిలో అర్హత సాధించిన వారిని స్టేజ్ - 2కు ఎంపిక చేస్తారు.
-స్టేజ్ - 2లో సైకలాజికల్ టెస్టింగ్, గ్రూప్ టెస్టింగ్, ఇంటర్వ్యూ
-ఆల్ ఇండియా మెరిట్ ప్రకారం ఎంపికైన అభ్యర్థులను కేరళ ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో బీటెక్‌లో ప్రవేశం కల్పిస్తారు. కోర్సు పూర్తయిన తర్వాత జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) బీటెక్ సర్టిఫికెట్‌ను ప్రదానం చేస్తుంది.
-పేస్కేల్ : సబ్ లెఫ్టినెంట్ హోదాలో నెలకు సుమారుగా రూ. 83,448-96,204/-జీతం చెల్లిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూన్ 17
-వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
స్పోర్ట్స్ న్యూట్రిషన్‌లో ఎమ్మెస్సీ ప్రవేశాలు,

హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఎన్) 2019-21 విద్యాసంవత్సరానికిగాను స్పోర్ట్స్ న్యూట్రిషన్‌లో ఎమ్మెస్సీ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
NIN-logo
-రెండేండ్ల ఎమ్మెస్సీ (స్పోర్ట్స్ న్యూట్రిషన్)
-మొత్తం సీట్ల సంఖ్య: 15
-అర్హత: హోం సైన్సెస్ (ఫుడ్ &న్యూట్రిషన్, న్యూట్రిషన్, అప్లయిడ్ న్యూట్రిషన్ & పబ్లిక్ హెల్త్, క్లినికల్ న్యూట్రిషన్ & డైటిటిక్స్, ఫుడ్ సైన్స్ & క్వాలిటీ కంట్రోల్) లేదా లైఫ్ సైన్సెస్ (బాటనీ, జువాలజీ, జెనెటిక్స్, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ)లో బీఎస్సీ, ఎంబీబీఎస్, బీఏఎంఎస్/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
-అప్లికేషన్ ఫీజు: రూ.3000/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 2700/-
-ఎంపిక: ఎంట్రెన్స్ టెస్ట్ ఆధారంగా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో. 
-దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 28
-రాతపరీక్ష తేదీ: జూలై 14
-వెబ్‌సైట్: www.nin.res.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐపీఈలో బీటెక్ ప్రవేశాలు.

విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ) 2019-20 విద్యా సంవత్సరానికిగాను నాలుగేండ్ల బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
IIPE
-కోర్సు పేరు: బీటెక్ 
-మొత్తం సీట్ల సంఖ్య: 100 (పెట్రోలియం ఇంజినీరింగ్-50, కెమికల్ ఇంజినీరింగ్-50)
-ఈ కోర్సును మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ ఆధ్వర్యంలో ఐఐటీ/ఐఐఎం పర్యవేక్షణలో నిర్వహిస్తారు.
-అర్హత: ఇంటర్‌తోపాటు జేఈఈ అడ్వాన్స్‌డ్-2019 ర్యాంక్ సాధించాలి.
-అప్లికేషన్ ఫీజు: జనరల్/ఓబీసీ రూ. 1000/-, ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీ అభ్యర్థులకు రూ. 500/-
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: జూన్ 13 నుంచి 
-వెబ్‌సైట్: www.iipe.ac.in

బీఆర్‌వోలో 778 ఉద్యోగాలు, ఏఐఈఎస్‌ఎల్‌లో ఉద్యోగాలు, సెయిల్‌లో మెడికల్ ఆఫీసర్లు ఉద్యోగాలు, బార్క్‌లో వర్క్ అసిస్టెంట్లు ఉద్యోగాలు, సదరన్ రైల్వేలో కొలువులు.

బీఆర్‌వోలో 778 ఉద్యోగాలు,

పుణెలోని బోర్డర్ రోడ్డు ఆర్గనైజేషన్ (బీఆర్‌వో) వివిధ రీజియన్లలో ఖాళీగా ఉన్న మల్టీ స్కిల్డ్ వర్కర్ తదితర టెక్నికల్ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
BRO
-పోస్టు పేరు: మల్టీ స్కిల్డ్ వర్కర్
-మొత్తం ఖాళీలు: 778
-విభాగాలవారీగా ఖాళీలు: డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్‌పోర్ట్-388, ఎలక్ట్రీషియన్-101, వెహికిల్ మెకానిక్-92, మల్టీ స్కిల్డ్ వర్కర్-197
-సదరన్ రీజియన్‌లోని ప్రాంతాలు: తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, గోవా, పాండిచ్చేరి.
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి మల్టీ స్కిల్డ్ వర్కర్ పోస్టులకు పదోతరగతి, మిగతా కేటగిరి పోస్టులకు పదోతరగతితోపాటు ఆటో ఎలక్ట్రీషియన్, మెకానిక్ సర్టిఫికెట్ ఉండాలి. డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్‌పోర్ట్ పోస్టులకు పదోతరగతి+ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
-వయస్సు: మల్టీ స్కిల్డ్ వర్కర్‌కు 25 ఏండ్లు, మిగతా కేటగిరిలకు 27 ఏండ్లకు మించరాదు. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పేస్కేల్: మల్టీస్కిల్డ్ వర్కర్ పోస్టులకు లెవల్-1 ప్రకారం రూ. 18,000-39,900/-, మిగతా పోస్టులకు లెవల్-2 ప్రకారం రూ. 19,900-44,400/-
-అప్లికేషన్ ఫీజు: రూ. 50/-, ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీలకు ఫీజు లేదు
-ఎంపిక: ఫిజికల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్, రాతపరీక్ష ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చిరునామా: Commandant, GREF centre, Dighi camp, Pune - 411015
-దరఖాస్తులకు చివరితేదీ: జూలై 15
-వెబ్‌సైట్: www.bro.gov.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఏఐఈఎస్‌ఎల్‌లో ఉద్యోగాలు,
ముంబై (వెస్ట్రన్ రీజియన్)లోని ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఈఎస్‌ఎల్) ఖాళీగా ఉన్న కింది పోస్టుల (తాత్కాలిక ప్రాతిపదిన) భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
aiesl
-పోస్టు పేరు: యుటిలిటీ హ్యాండ్స్
-మొత్తం ఖాళీలు: 40 (జనరల్-23, ఓబీసీ-10, ఎస్సీ-4, ఎస్టీ-3)
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతితోపాటు లైట్ కమర్షియల్ ట్రాన్స్‌పోర్ట్ వెహికిల్ లైసెన్స్ ఉండాలి. ఎయిర్‌లైన్ ఇండస్ట్రీ/ఏవియేషన్ సెక్టార్‌లో పనిచేసిన అనుభవం ఉండాలి.
-వయస్సు: 2019 మార్చి 31 నాటికి 33 ఏండ్లకు మించరాదు.
-పే స్కేల్: రూ. 15,418/- (కన్సాలిడేటెడ్ పే)
-ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 24
-వెబ్‌సైట్: www.airindia.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సెయిల్‌లో మెడికల్ ఆఫీసర్లు ఉద్యోగాలు,
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
SAIL
-మొత్తం ఖాళీలు: 129 (మెడికల్ ఆఫీసర్/మెడికల్ ఆఫీసర్ (ఓహెచ్‌ఎస్)-70, మెడికల్ స్పెషలిస్ట్-59)
-విభాగాలు: పిడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, జనరల్ మెడిసిన్, సర్జరీ, ఈఎన్‌టీ, స్కిన్ అండ్ విడీ, రేడియాలజీ, పాథలాజీ, అనెస్థీషియా, సైకియాట్రీ, బ్లండ్ బ్యాంక్, పల్మనరీ మెడిసిన్, బయోకెమిస్ట్రీ, ఆప్తాల్మాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, మైక్రోబయాలజీ.
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి ఎంబీబీఎస్, సంబంధిత విభాగంలో డిప్లొమా/డిగ్రీ లేదా సర్టిఫికెట్, పీజీ డిగ్రీ/డీఎన్‌బీ ఉత్తీర్ణత. మెడికల్ ఫీల్డ్‌లో అనుభవం ఉండాలి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సభ్యత్వం నమోదు చేసుకోవాలి. 
-వయస్సు: 2019 జూన్ 26 నాటికి 30 ఏండ్లు (మెడికల్ స్పెషలిస్ట్‌కు 37 ఏండ్లు) మించరాదు. 
-పే స్కేల్: మెడికల్ ఆఫీసర్ పోస్టులకు రూ. 20,600-46,500/-, మెడికల్ స్పెషలిస్ట్‌లకు రూ. 32,900-58,000/- 
-దరఖాస్తు ఫీజు: రూ. 700/-, ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ. 100/-
-ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ 
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 26
-ఆన్‌లైన్ టెస్ట్: జూలై 21 
-వెబ్‌సైట్: www.sail.co.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బార్క్‌లో వర్క్ అసిస్టెంట్లు ఉద్యోగాలు,

డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ పరిధిలోని బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (బార్క్) ఖాళీగా ఉన్న వర్క్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
BRC
-మొత్తం పోస్టులు: 74 (జనరల్-8, ఓబీసీ-62, ఎస్సీ-1, ఎస్టీ-1)
-అర్హత: పదోతరగతిలో ఉత్తీర్ణత. 
-వయస్సు: 18 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి. 
-అప్లికేషన్ ఫీజు: రూ. 100/-
-ఎంపిక: ప్రిలిమినరీ, అడ్వాన్స్‌డ్ పరీక్ష 
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూలై 1
-వెబ్‌సైట్: https://recruit.barc.gov.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సదరన్ రైల్వేలో కొలువులు.

చెన్నై ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న సదరన్ రైల్వే తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
RRB
-ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్/డీఈవో & డిజిటల్ ఆఫీస్ అసిస్టెంట్
-మొత్తం పోస్టులు: 95 (జనరల్-48, ఓబీసీ-26, ఎస్సీ-14, ఎస్టీ-7)
-అర్హత: బీసీఏ లేదా బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్/ఐటీ) లేదా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. ఎంఎస్ ఆఫీస్‌లో పరిజ్ఞానం ఉండాలి. 
-వయస్సు: 18 నుంచి 28 ఏండ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-దరఖాస్తు ఫీజు: రూ. 500/- మహిళలు, ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ. 250/-
-ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 30
-వెబ్‌సైట్:http://rrcmas.in