Tuesday, 27 December 2016

రంగారెడ్డి కోర్టులో ప్రాసెస్ సర్వర్స్ ఉద్యోగాలు నేవ ల్ డాక్‌యార్డ్‌లో 121 చార్జ్‌మెన్‌ ఉద్యోగాలు, అటామిక్ ఎనర్జీలో ఉద్యోగాలు, ఎన్‌ఐఐలోరిసెర్చ్ ఫెలోలు, కేంద్రీయ హిందీ సంస్థాన్‌లో ప్రవేశాలు. Ranga Reddy court process servers jobs,Naval Dockyuard 121 Chargemen jobs,Atomic Energy Recruitment,NII Research fellows,Kendriya Hindi Sansthan Admissions.

రంగారెడ్డి కోర్టులో ప్రాసెస్ సర్వర్స్ ఉద్యోగాలు
కోర్టులో కొలువులు.
-కేవలం ఏడోతరగతి ఉత్తీర్ణత.
-రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.
-లోకల్, నాన్‌లోకల్ అభ్యర్థులకు అవకాశం.

రంగారెడ్డి జిల్లా, సెషన్స్ కోర్టులో ప్రాసెస్ సర్వర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు
Rangareddycourts
-రంగారెడ్డి జిల్లా జడ్జి పరిధిలోని కోర్టుల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
-పోస్టు పేరు: ప్రాసెస్ సర్వర్స్
-మొత్తం ఖాళీల సంఖ్య - 91 (30 మహిళలు). వీటిలో జనరల్ - 42 (14 మహిళలు), జనరల్ (వీహెచ్ కేటగిరి) - 1 (మహిళ), జనరల్ (హెచ్‌హెచ్) -1, జనరల్ (ఓహెచ్) -1, బీసీ ఏ - 7 (2మహిళలు), బీసీ బీ - 8 (3 మహిళలు), బీసీ సీ -1, బీసీ డీ - 7 (2 మహిళలు), బీసీ ఈ - 3 (1 మహిళ), ఎస్సీ - 14 (5 మహిళలు), ఎస్టీ - 6 (2 మహిళలు).

-పేస్కేల్: రూ. 15, 460 - 47,330
-విద్యార్హతలు: 7వ తరగతి లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. సైకిల్ తొక్కడం తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఫోర్ వీలర్స్ వ్యాలిడ్ లైసెన్స్ ఉన్నవారికి, కార్పెంటరీ, కుకింగ్, ఎలక్ట్రికల్, పెయింటింగ్, ప్లంబింగ్, వాషింగ్ అండ్ ఐరనింగ్, గృహఅవసరాల పనులు తదితర పనులు తెలిసిన వారికి ప్రాధాన్యతనిస్తారు. వీటికి సంబంధించి సర్టిఫికెట్స్‌ను ఆయా సంబంధిత సంస్థల నుంచి కలిగి ఉండాలి. తెలుగు, ఉర్దూ భాషలు తెలిసి ఉండాలి. రెండు భాషలు తెలిసిన వారు లేకుంటే ఏ ఒక్క భాష తెలిసిన వారు ఉన్నా అర్హులే.

-వయస్సు: 2016, జూలై 1 నుంచి 18 - 34 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-ఫీజు: రూ. 2

00/- (ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, పీహెచ్‌సీ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు)
రూ. 200/- కు THE PRL. DISTRICT & SESSIONS JUDGE, RANGAREDDY DISTRICT AT L.B.NAGAR,
PAYABLE AT HYDERABAD. పేరిట డీడీ తీయాలి.


ఎంపిక విధానం
-రెండంచెల విధానంలో ఎంపిక.
1. రాతపరీక్ష - 80 మార్కులు
2. ఓరల్ టెస్ట్/వైవా వాయిస్ - 20 మార్కులు
-రాతపరీక్ష: జనరల్ ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్, జ్యూడీషయరీ, జనరల్ సైన్స్, మ్యాథ్స్‌పై ప్రశ్నలు ఇస్తారు. ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు.
-రాతపరీక్షలో జనరల్ అభ్యర్థులకు 40 శాతం, బీసీలకు 35 శాతం, ఎస్సీ/ఎస్టీలకు 30 శాతం మార్కులు వస్తే క్వాలిఫై అయినట్లుగా ప్రకటిస్తారు.

-రాతపరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూకు 1: 10 నిష్పత్తిలో అభ్యర్థులను పిలుస్తారు.
-లోకల్/నాన్ లోకల్: మొత్తం 91 పోస్టుల్లో 80 శాతం లోకల్ కిందికి వస్తాయి. అంటే 73 లోకల్ అభ్యర్థులకు, 20 శాతం నాన్‌లోకల్ పోస్టుల కింద 18 పోస్టులు (లోకల్, నాన్ లోకల్ అభ్యర్థులకు మెరిట్ ప్రాతిపదికన).

-దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
-దరఖాస్తులను స్పీడ్ పోస్టు లేదా రిజిస్టర్ పోస్టు లేదా కొరియర్ సర్వీస్ ద్వారా మాత్రమే పంపాలి. నేరుగా ఎటువంటి దరఖాస్తులు స్వీకరించరు.
-చివరితేదీ: 2017, జనవరి 21 (సాయంత్రం 5 గంటలలోపు)

-దరఖాస్తులను పంపాల్సిన చిరునామా
THE PRL. DISTRICT & SESSIONS JUDGE,
RANGA REDDY DISTRICT AT L.B.NAGAR,
HYDERABAD 500 074
-వెబ్‌సైట్: WWW. ECOURTS.GOV.IN/RANGAREDDY


---------------------------------------------------------------------------------------------------------------------

-------------------------------------------------------------------------------------------------------------------
నేవ ల్ డాక్‌యార్డ్‌లో 121 చార్జ్‌మెన్‌ ఉద్యోగాలు,

ముంబైలో ఉన్న నేవల్ డాక్‌యార్డ్‌లో నాన్ ఇండస్ట్రియల్ (నాన్ గెజిటెడ్) విభాగంలోఖాళీగా ఉన్న చార్జ్‌మెన్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

వివరాలు
mubainavaldockyad
-పోస్టు పేరు: చార్జ్‌మెన్
-పని చేసే ప్రదేశం : ముంబై/ పశ్చిమ నేవల్ కమాండ్ లోపలనున్న ఏదైనా నేవల్ యూనిట్
-మొత్తం ఖాళీల సంఖ్య: 121 (ఎస్సీ-14, ఎస్టీ-6, ఓబీసీ-35, జనరల్-66)

విభాగాల వారీగా ఖాళీలు
-ఇంజినీరింగ్-33 పోస్టులు (ఎస్సీ-4, ఎస్టీ-3, ఓబీసీ-7, జనరల్-19)
-ఎలక్ట్రికల్-14 పోస్టులు (ఎస్సీ-2, ఎస్టీ-1, ఓబీసీ-3, జనరల్-8)
-వెపన్-8 పోస్టులు (ఓబీసీ-2, జనరల్-6)

-కన్‌స్ట్రక్షన్-24 పోస్టులు (ఎస్సీ-2, ఓబీసీ-10, జనరల్-12)
-మెయింటెనెన్స్-10 పోస్టులు (ఓబీసీ-4, జనరల్-6)
-ప్రొడక్షన్, ప్లానింగ్ అండ్ కంట్రోల్-32 పోస్టులు (ఎస్సీ-6, ఎస్టీ-2, ఓబీసీ-9, జనరల్-15)
-అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డ్ నుంచి సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్)లో ఉత్తీర్ణత.

సంబంధిత బ్రాంచిలో మూడేండ్ల ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత.
-వయస్సు: 18 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: రూ. 9,300-34,800+ గ్రేడ్ పే రూ. 4200/-
-ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా. కేవలం రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే ఎంపిక చేస్తారు.

రాత పరీక్ష సిలబస్
-రాత పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ఇందులో సైన్స్ డిగ్రీ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్), డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్/ మేనేజ్‌మెంట్, సూపర్‌వైజరీ స్కిల్స్, జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లిష్ అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్, హిందీ లాంగ్వేజీలో మాత్రమే ఉంటుంది.

-దరఖాస్తు : ఆన్‌లైన్ ద్వారా
-చివరి తేదీ: 2017 జనవరి 13
-వెబ్‌సైట్: WWW.INDIANNAVY.NIC.IN
---------------------------------------------------------------------------------------------------------------------

-------------------------------------------------------------------------------------------------------------------
అటామిక్ ఎనర్జీలో ఉద్యోగాలు,
అటామిక్ ఎనర్జీ డిపార్ట్‌మెంట్ పరిధిలో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు
igcarrecruitme
సైంటిఫిక్ ఆఫీసర్ (మెడికల్) - 5. వీటిలో రేడియో డయాగ్నసిస్/రేడియాలజీ - 1, ఆర్థోపెడిక్స్ - 1, పిడియాట్రిక్స్ - 1, జనరల్ ఫిజీషియన్ - 1, ఈఎన్‌టీ -1 ఖాళీలు ఉన్నాయి.
-సైంటిఫిక్ అసిస్టెంట్ - 2 ఖాళీలు. వీటిలో రేడియోగ్రఫీ - 1, మెకానికల్ - 1.

-క్యాంటీన్ అటెండెంట్ - 4.
-వయస్సు: 2017, జనవరి 24 నాటికి సైంటిఫిక్ ఆఫీసర్ - 35 ఏండ్లు, సైంటిఫిక్ అసిస్టెంట్ - 30 ఏండ్లు, క్యాంటీన్ అటెండెంట్ - 25 ఏండ్లు మించరాదు.

-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: 2017, జనవరి 24
-వెబ్‌సైట్: WWW.IGCAR.GOV.IN

---------------------------------------------------------------------------------------------------------------------

-------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఐఐలోరిసెర్చ్ ఫెలోలు,

న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ (ఎన్‌ఐఐ) ఖాళీగా ఉన్న జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్‌ఎఫ్), ఎస్‌ఆర్‌ఎఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు
Research
-పోస్టు పేరు: జేఆర్‌ఎఫ్
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ(బయాలాజికల్ సైన్స్)లో ఉత్తీర్ణత.

-పోస్టు పేరు: ఎస్‌ఆర్‌ఎఫ్
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ(బయాలాజికల్ సైన్స్)లో ఉత్తీర్ణత
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లైఫ్‌సైన్స్‌లో ఎమ్మెస్సీ/ఎంటెక్‌లో ఉత్తీర్ణత. రిసెర్చ్ రంగంలో రెండేండ్ల అనుభవం ఉండాలి.
-పే స్కేల్: జేఆర్‌ఎఫ్‌కు రూ.25,000/-, ఎస్‌ఆర్‌ఎఫ్‌కు రూ. 28,000/- ఫెలోషిప్ ఇస్తారు. అదనంగా నేషనల్ లెవల్ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు 30% హెచ్‌ఆర్‌ఏను కూడా ఇస్తారు.

-అప్లికేషన్ ఫీజు: రూ. 100/-
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఈ -మెయిల్ (AKS@NII.RES.IN) ద్వారా
-చివరితేదీ: డిసెంబర్ 31
-వెబ్‌సైట్: WWW.NII.RES.IN

---------------------------------------------------------------------------------------------------------------------

-------------------------------------------------------------------------------------------------------------------
కేంద్రీయ హిందీ సంస్థాన్‌లో ప్రవేశాలు.ఆగ్రాలోని కేంద్రీయ హిందీ సంస్థాన్ 2017-19 సంవత్సరానికిగాను ఎంఈడీ, బీఈడీ, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ టీచింగ్ కోర్సుల్లో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.

హిందీ శిక్షణ్ నిష్ణాత్ (ఎంఈడీకి సమానం)
KendriyaHindiSansthan-మొత్తం సీట్ల సంఖ్య: 50
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో బీఏ (హిందీ), బీఏ, బీఎస్సీ, బీకాం, బీఈడీ/లాంగ్వేజ్ టీచింగ్ (హిందీ) లేదా 55 శాతం మార్కులతో హిందీ శిక్షణ్ పరంగత్ ఉత్తీర్ణులై ఉండాలి.

-హిందీ శిక్షణ్ పరంగత్ (బీఈడీకి సమానం)
-మొత్తం సీట్ల సంఖ్య: 50
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో బీఏ (హిందీ), బీఏ, బీఎస్సీ, బీకాంలో ఉత్తీర్ణత. ఇంటర్ స్థాయిలో హిందీ సబ్జెక్ట్‌ను చదివి ఉండాలి లేదా బీఏ డిప్లొమా (విద్వాన్, రత్న, సంస్కృతం) ఉత్తీర్ణులై ఉండాలి.డిగ్రీ స్థాయిలో హిస్టరీ, జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్, సోషల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్ సబ్జెక్ట్‌ను చదివి ఉండాలి.
-హిందీ శిక్షణ్ ప్రవీణ్ (టీటీసీ, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సమానం)

-మొత్తం సీట్ల సంఖ్య: 50
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత. ఇంటర్ స్థాయిలో హిందీ సబ్జెక్ట్‌ను చదివి ఉండాలి లేదా ఇంటర్ లెవల్ (విద్వాన్, రత్న, సంస్కృతం) ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్ స్థాయిలో హిస్టరీ, జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్, సోషల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్ సబ్జెక్ట్‌ను చదివి ఉండాలి.
-స్టయిఫండ్: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 3000/- లను చెల్లిస్తారు.

-అప్లికేషన్ ఫీజు: రూ. 200/-
-ఎంపిక: ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా
-ఎంట్రన్ పరీక్ష తేదీ: 2017 మే 15
-పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, గువాహటి, మైసూర్
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా
-అప్లికేషన్‌లు పొందడానకి చివరితేదీ: 2017 ఫిబ్రవరి 28
-అప్లికేషన్‌లు దాఖలు చేయడానికి చివరితేదీ: 2017 మార్చి 31
-వెబ్‌సైట్: WWW.KHSINDIA.ORG

No comments:

Post a Comment