Wednesday, 31 January 2018

పవర్‌గ్రిడ్‌లో 150 ఏఈ ట్రెయినీలు, యూపీఎస్సీ మెడికల్ ఆఫీసర్లు, ఎన్‌ఆర్‌ఎల్‌లో ట్రెయినీలు, నిమ్‌హాన్స్‌లో ఎల్‌డీసీలు, సీసీఎంబీలో జేఆర్‌ఎఫ్ ఉద్యోగాలు,, సీఈసీఆర్‌ఐలో సైంటిస్టులు సుప్రీంకోర్టులో అసిస్టెంట్లు.

పవర్‌గ్రిడ్‌లో 150 ఏఈ ట్రెయినీలు,

ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్‌సైన్స్ అభ్యర్థులకు అవకాశం
- గేట్ 2017 స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
-చివరితేదీ: ఫిబ్రవరి 17

భారత ప్రభుత్వరంగ సంస్థ పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్)లో గేట్ - 2017 స్కోర్ ఆధారంగా అసిస్టెంట్ ఇంజినీర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
power-grid
వివరాలు: పవర్‌గ్రిడ్ ప్రభుత్వ పరిధిలోని ఒక నవరత్న కంపెనీ.
-పోస్టు పేరు: అసిస్టెంట్ ఇంజినీర్ ట్రెయినీ
-ఈ పోస్టులకు ఎంపికైనవారికి ఏడాది శిక్షణ సమయంగా పరిగణిస్తారు. అనంతరం అభ్యర్థులకు అసిస్టెంట్ ఇంజినీర్‌గా ఉద్యోగావకాశం కల్పిస్తారు.
మొత్తం ఖాళీలు - 150. విభాగాల వారీగా...
-ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ - 100 (జనరల్ -51, ఓబీసీ -27, ఎస్సీ -15, ఎస్టీ - 7)
-ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్- 20 (జనరల్ - 11, ఓబీసీ - 5, ఎస్సీ - 2, ఎస్టీ - 1)
-సివిల్ ఇంజినీరింగ్- 20 (జనరల్ - 10, ఓబీసీ - 5, ఎస్సీ - 4, ఎస్టీ - 1)
-కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ - 10 (జనరల్ - 5, ఓబీసీ - 3, ఎస్సీ -1, ఎస్టీ - 1)
-అర్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ లేదా బీఎస్సీ ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణత. సంబంధిత బ్రాంచీలో కనీసం 65 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పేపర్‌లో గేట్ - 2017లో వ్యాలిడ్ స్కోర్ వచ్చి ఉండాలి.
గమనిక: బ్యాచిలర్ డిగ్రీని ఫుల్‌టైంలో చేసిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
-వయస్సు: 2016, డిసెంబర్ 31 నాటికి 28 ఏండ్లు మించరాదు. ఓబీసీలకు మూడేండ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-అప్లికేషన్ ఫీజు : రూ. 200/-
-ఎంపిక: గేట్ - 2017 స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూకు పిలుస్తారు.
-మొత్తం 100 నార్మలైజ్డ్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
-గేట్ - 2017 మార్కులకు - 85 శాతం
-గ్రూప్ డిస్కషన్ - 3 శాతం
-పర్సనల్ ఇంటర్వ్యూ - 12 శాతం
-మొత్తం - 100 శాతం మార్కులకు ఎంపికచేస్తారు.
నోట్: గేట్- 2016, 2018 స్కోర్‌లను పరిగణనలోకి తీసుకోరు.
-జీతభత్యాలు: ఎంపికైన అభ్యర్థులకు శిక్షణా సమయంలో నెలకు రూ. 24,500/- ఇస్తారు.
-విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్న తర్వాత ఏఈ పోస్టు ఇస్తారు.
-పేస్కేల్: రూ. 20,600 - 46,500/- లేదా సీటీసీ రూ. 12.8 (సుమారుగా) లక్షలు.
-బాండ్ : ఎంపికైన అభ్యర్థులు సంస్థలో కనీసం మూడేండ్లు పనిచేస్తామని బాండ్ అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఫిబ్రవరి 17
-వెబ్‌సైట్: www.powergridindia.com
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
యూపీఎస్సీ మెడికల్ ఆఫీసర్లు,

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న మెడికల్ ఆఫీసర్, సైంటిస్ట్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
upsc
వివరాలు: యూపీఎస్సీ స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థ.
-మొత్త పోస్టుల సంఖ్య: 23
విభాగాలవారీగా ఖాళీలు
-అసిస్టెంట్ ప్రొఫెసర్ (స్పెషలిస్ట్ గ్రేడ్ 3)-2, కెమిస్ట్-3, డిప్యూటీ డైరెక్టర్-1, సైంటిస్ట్ (గ్రేడ్ బీ)-6, మెడికల్ ఆఫీసర్-11 ఖాళీలు ఉన్నాయి.
-అర్హత:యూపీఎస్సీ నింబధనల ప్రకారం అర్హతలను కలిగి ఉండాలి.
-వయస్సు: 35 ఏండ్లకు మించరాదు.
-అప్లికేషన్ ఫీజు : రూ. 25/-,
ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళలకు ఫీజు లేదు.
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఫిబ్రవరి 1
-వెబ్‌సైట్: www.upsconline.nic.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఆర్‌ఎల్‌లో ట్రెయినీలు,

అసోంలోని నుమాలీగఢ్ రిఫైనరీ లిమిటెడ్ (ఎన్‌ఆర్‌ఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్ ఇంజినీర్, మేనేజ్‌మెంట్/ఆఫీసర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
nrl
వివరాలు: ఎన్‌ఆర్‌ఎల్ అనేది మినీరత్న హోదా కలిగిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) అనుబంధ సంస్థ. దీన్ని 1999 జూలై 9న ఏర్పాటు చేశారు.
-మొత్తం పోస్టుల సంఖ్య: 21
-విభాగాలవారీగా ఖాళీలు: గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రెయినీ (కెమికల్-7, ఎలక్ట్రికల్-4, ఇన్‌స్ట్రుమెంటేషన్-2, మెకానికల్-3, సివిల్-1, ఐఐఎస్-2) మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఫైనాన్స్-1), ఆఫీసర్ (ఫైనాన్స్)-1
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రెయినీ పోస్టులకు కెమికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, సివిల్/ఐఐఎస్ ఇంజినీరింగ్ బ్రాంచీలో 65 శాతం మార్కులతో బీఈ/బీటెక్, మేనేజ్‌మెంట్ ట్రెయినీకి ఎంబీఏ/పీజీడీఎంలో 60 శాతం, ఆఫీసర్ (ఫైనాన్స్)పోస్టుకు సీఏలో ఉత్తీర్ణత ఉండాలి. ఐసీఏఐలో అసోసియేట్ మెంబర్‌షిప్‌గా నమోదు చేసుకుని ఉండాలి.
-వయస్సు: 2018 జనవరి 1 నాటికి 30 ఏండ్లు (ఆఫీసర్‌కు 32 ఏండ్లకు) మించరాదు. కంపెనీ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: రూ. 24,900/-. ఏడాది ట్రెయినింగ్ పీరియడ్ పూర్తయిన తర్వాత సుమారు రూ. 60,000-1,80,000/- జీతం చెల్లిస్తారు.
గమనిక : ఎంపికైన అభ్యర్థులు ఎన్‌ఆర్‌ఎల్ లేదా అనుబంధ సంస్థల్లో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది.
-ఎంపిక: రాతపరీక్ష + గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 23
-వెబ్‌సైట్: www.nrl.co.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నిమ్‌హాన్స్‌లో ఎల్‌డీసీలు,
బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (నిమ్‌హాన్స్) ఖాళీగా ఉన్న లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్‌డీసీ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
NIMHANS
వివరాలు:-మొత్తం ఖాళీలు: 24 (జనరల్-14, ఓబీసీ-6, ఎస్సీ-3, ఎస్టీ-1)
-పోస్టు పేరు: లోయర్ డివిజన్ క్లర్క్
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి డిగ్రీతోపాటు టైపింగ్ స్కిల్స్ ఉండాలి. ఇంగ్లిష్/హిందీలో నిమిషానికి 35/30 పదాల వేగాన్ని కలిగి టైపింగ్ సామర్థ్యం ఉండాలి.
-వయస్సు: 27 ఏండ్లకు మించరాదు
-పే స్కేల్: రూ. 21,000/-
-అప్లికేషన్ ఫీజు : రూ. 500/-
(ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250/-)
-ఎంపిక: రాతపరీక్ష/స్కిల్ టెస్ట్ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: 2018 జనవరి 31
-వెబ్‌సైట్:www.nimhans.ac.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీసీఎంబీలో జేఆర్‌ఎఫ్ ఉద్యోగాలు,,
హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
ccmb
వివరాలు:సీసీఎంబీ అనేది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్‌ఐఆర్) పరిధిలో పనిచేస్తున్న అనుబంధ సంస్థ.
-పోస్టు పేరు : ప్రాజెక్ట్ జూనియర్ రిసెర్చ్ ఫెలో
-అర్హత: బయోటెక్నాలజీ/బయోఇన్ఫర్మాటిక్స్, ఫార్మసీలో బీఈ/బీటెక్/ఎమ్మెస్సీలో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-వయస్సు: 28 ఏండ్లకు మించరాదు.
-స్టయిఫండ్: రూ. 16,000+ హెచ్‌ఆర్‌ఏ
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఫిబ్రవరి 1
-వెబ్‌సైట్ : www.ccmb.res.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీఈసీఆర్‌ఐలో సైంటిస్టులు
తమిళనాడులోని సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఈసీఆర్‌ఐ)లో ఖాళీగా ఉన్న సైంటిస్టు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు: సీఈసీఆర్‌ఐ అనేది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్‌ఐఆర్) పరిధిలో పనిచేస్తున్న సంస్థ.
cecri
-మొత్తం పోస్టుల సంఖ్య: 20
-విభాగాలవారీగా ఖాళీలు: సైంటిస్ట్-11, సీనియర్ సైంటిస్ట్-2, టెక్నికల్ అసిస్టెంట్-5, మెడికల్ ఆఫీసర్ (మహిళ)-1
-అర్హతలు: సంబంధిత పోస్టులను బట్టి పీహెచ్‌డీ, ఎంఈ/ఎంటెక్, ఎమ్మెస్సీ, బీఈ/బీటెక్, +ఎంబీఏ, ఇంజినీరింగ్ డిప్లొమా, ఎంబీబీఎస్ లో ఉత్తీర్ణత.సంబంధిత రంగంలో అనుభవం.
-వయస్సు: 2018 ఫిబ్రవరి 12 నాటికి సైంటిస్ట్‌కు 32 ఏండ్లు, సీనియర్ సైంటిస్ట్‌కు 37 ఏండ్లు, టెక్నికల్ అసిస్టెంట్‌కు 28 ఏండ్లకు మించరాదు
-ఎంపిక: రాత పరీక్ష/ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఫిబ్రవరి 12
-హార్డ్‌కాపీలకు చివరితేదీ: ఫిబ్రవరి 19
-వెబ్‌సైట్: www.cecri.res.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సుప్రీంకోర్టులో అసిస్టెంట్లు.
సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా టెక్నికల్ విభాగంలో తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న అసిస్టెంట్ (టెక్నికల్ అసిస్టెంట్ కమ్ ప్రోగ్రామర్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Supreme-Court 
వివరాలు:
-మొత్తం పోస్టుల సంఖ్య:15
-పోస్టు పేరు: అసిస్టెంట్ 
-అర్హత: బీఈ/బీటెక్ (కంప్యూటర్ సైన్స్/ఐటీ) లేదా ఎంసీఏ, బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) లేదా బీసీఏలో ఉత్తీర్ణత. ఎల్‌ఎల్‌బీ ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-వయస్సు: 30 ఏండ్లకు మించరాదు.
-పే స్కేల్: రూ. 44,900/-
-ఎంపిక:రాతపరీక్ష,ఆప్టిట్యూడ్ టెస్ట్, ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా.
-చివరితేదీ: ఫిబ్రవరి 20
-వెబ్‌సైట్: www.sci.nic.in.

No comments:

Post a comment