Wednesday, 31 January 2018

నావికాదళంలో ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్లు , ఎన్‌ఈఐఎస్‌టీ ప్రాజెక్టు అసిస్టెంట్లు, కురుక్షేత్ర నిట్‌లో ఫ్రొఫెసర్లు, ఐఐటీలో ఎల్‌ఎల్‌బీ ప్రవేశాలు, సెంట్రల్ ఎక్సైజ్‌లో 26 ఉద్యోగాలు, ఓషియన్ టెక్నాలజీలో ఎస్‌ఆర్‌ఎఫ్ ఉద్యోగాలు.

నావికాదళంలో ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్లు ,
భారత నావికాదళం ఎడ్యుకేషన్ బ్రాంచీలో షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ), పర్మినెంట్ కమిషన్ లాజిస్టిక్ బ్రాంచీలో ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.


-ఎంఏ ఇంగ్లిష్, ఎమ్మెస్సీ మ్యాథ్స్/ఫిజిక్స్, బీఈ/బీటెక్ అభ్యర్థులకు అవకాశం
-షార్ట్ సర్వీస్, పర్మినెంట్ కమిషన్ లో ఆఫీసర్ ఉద్యోగాలు
-చివరితేదీ ఫిబ్రవరి 10


వివరాలు: జనవరి 2019 కోర్సు ప్రవేశాల కోసం ఈ ప్రకటనను నేవీ విడుదల చేసింది. ఈ కోర్సును కేరళలోని ఎజిమల ఇండియన్ నేవల్ అకాడమీలో నిర్వహిస్తారు.
-వయస్సు: బ్రాంచీల వారీగా..
-ఎడ్యుకేషన్: 1994, జనవరి 2 నుంచి 1998, జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి. పురుష, మహిళా అభ్యర్థులు అర్హులు.
-లాజిస్టిక్స్: 1994, జనవరి 2 నుంచి 1999, జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి. పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.
Indian-Navy

ఎస్‌ఎస్‌సీ (ఎడ్యుకేషన్):
-ఖాళీల సంఖ్య - 4
-ఎమ్మెస్సీ (ఫిజిక్స్/న్యూక్లియర్ ఫిజిక్స్)తోపాటు బీఎస్సీలో మ్యాథ్స్ చదివి ఉండాలి.
-ఖాళీల సంఖ్య - 5
-అర్హతలు: ఎమ్మెస్సీ మ్యాథ్స్/ఆపరేషనల్ రిసెర్చ్‌తోపాటు బీఎస్సీలో ఫిజిక్స్ చదివి ఉండాలి.
-ఖాళీల సంఖ్య - 1
-అర్హతలు: ఎంఏ ఇంగ్లిష్ ఉత్తీర్ణత.
-ఖాళీల సంఖ్య - 5
-అర్హతలు: బీఈ/బీటెక్ (ఈసీఈ/ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ లేదా ఈఐ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్/ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్
-ఖాళీల సంఖ్య - 3
-అర్హతలు: మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్
-పర్మినెంట్ కమిషన్ (లాజిస్టిక్స్) - 20 ఖాళీలు
-అర్హతలు: బీఈ/బీటెక్ ఏదైనా విభాగం లేదా ఎంబీఏ లేదా బీఎస్సీ/బీకాం (ఐటీ)తోపాటు పీజీ డిప్లొమా ఇన్ ఫైనాన్స్/లాజిస్టిక్స్ లేదా సప్లయ్‌చైన్ మేనేజ్‌మెంట్/మెటీరియల్ మేనేజ్‌మెంట్ లేదా ఎంసీఏ/ఎమ్మెస్సీ (ఐటీ).
నోట్: పై అర్హత పరీక్షల్లో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.

శారీరక ప్రమాణాలు:
-ఎత్తు: పురుషులు - 157 సెం.మీ, మహిళలు - 152 సెం.మీ. ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.
పదోన్నతులు, పేస్కేల్:
-సబ్‌లెఫ్టినెంట్ హోదా నుంచి కమాండర్ వరకు పదోన్నతి పొందవచ్చు.
-సబ్‌లెఫ్టినెంట్ పేస్కేల్: రూ. 56,100 - 1,10,700/-
-షార్ట్ సర్వీస్ కమిషన్: ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టుకు మొదట 12 ఏండ్ల కాలానికి ఎంపికచేస్తారు. ఆ తర్వాత అవసరాన్నిబట్టి మరో రెండేండ్లు పొడగిస్తారు.

ఎంపిక ప్రక్రియ:
-దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల అకడమిక్ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. వీరికి బెంగళూరు/ భోపాల్ లేదా కోయంబత్తూరు, విశాఖపట్నం కేంద్రాల్లో మే 18 - జూన్ 18 మధ్య ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది.
-ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలు ఐదురోజుల పాటు ఉంటాయి.
-స్టేజ్ - 1 ఒక్కరోజు, స్టేజ్ -2 నాలుగు రోజులు నిర్వహిస్తారు.
-స్టేజ్ - 1లో ఇంటెలిజెన్స్ టెస్ట్, పీపీ, డిస్కషన్ టెస్ట్‌లు ఉంటాయి. వీటిలో అర్హత సాధించినవారిని స్టేజ్ -2కు అనుమతిస్తారు.
-స్టేజ్ -2లో సైకలాజికల్ టెస్టింగ్, గ్రూప్ టెస్టింగ్, ఇంటర్వ్యూలు ఉంటాయి. వీటిలో అర్హత సాధించినవారికి వైద్యపరీక్షలు నిర్వహిస్తారు.
-వైద్య పరీక్షల అనంతరం తుది ఎంపికచేస్తారు.
-శిక్షణ: ఎంపికైన అభ్యర్థులకు సబ్ లెఫ్టినెంట్ హోదాలో శిక్షణనిస్తారు. ఈ శిక్షణ 2018, డిసెంబర్ చివరివారంలో ప్రారంభమవుతుంది. 22 వారాలపాటు శిక్షణనిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఫిబ్రవరి 10
-వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఈఐఎస్‌టీ ప్రాజెక్టు అసిస్టెంట్లు,

నార్త్ ఈస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎన్‌ఈఐఎస్‌టీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రాజెక్టు అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు:
-మొత్తం పోస్టుల సంఖ్య: 6
-అర్హత: ఎమ్మెస్సీ (ఆర్గానిక్ కెమిస్ట్రీ, అగ్రికల్చర్, బాటనీ, బయోటెక్నాలజీ, టిష్యూ కల్చర్, లైఫ్ సైన్స్, బయోఇన్ఫర్మాటిక్స్)లో ఉత్తీర్ణత.
-పే స్కేల్: రూ.25,000/- అదనంగా హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా.
-ఇంటర్వ్యూ తేదీ: ఫిబ్రవరి 7
-వెబ్‌సైట్ : www.neist.res.in.
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
కురుక్షేత్ర నిట్‌లో ఫ్రొఫెసర్లు,
కురుక్షేత్ర (హార్యానా)లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
కురుక్షేత్ర నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) 1963లో ఏర్పాటుచేశారు.
-మొత్తం పోస్టుల సంఖ్య: 36
-విభాగాలవారీగా ఖాళీలు: ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్-3, మెకానికల్/ప్రొడక్షన్-2, ఎలక్ట్రానిక్స్&కమ్యూనికేషన్-8, కంప్యూటర్ సైన్స్/ఐటీ-10, ఫిజిక్స్-2,మ్యాథమెటిక్స్-2, హ్యుమానిటీస్ &సోషల్ సైన్సెస్-1, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్-3, కంప్యూటర్ అప్లికేషన్స్-5
-అర్హతలు: ఇంజినీరింగ్, సైన్స్/హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, కంప్యూటర్ అప్లికేషన్స్‌లో పీజీతోపాటు పీహెచ్‌డీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. డిగ్రీ, పీజీ స్థాయిలో కనీసం 60 శాతం మార్కులు ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
-దరఖాస్తుకు చివరితేదీ: ఫిబ్రవరి 23
-వెబ్‌సైట్:www.nitkkr.ac.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐటీలో ఎల్‌ఎల్‌బీ ప్రవేశాలు,
ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో ఎల్‌ఎల్‌బీ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు:
-కోర్సు: ఎల్‌ఎల్‌బీ ఆనర్స్ ఇన్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా
-కాలవ్యవధి: మూడేండ్లు
-అర్హతలు: ప్రథమశ్రేణిలో బీఈ/బీటెక్ లేదా మెడిసిన్ లేదా తత్సమాన కోర్సు లేదా సైన్స్/ఫార్మసీ లేదా తత్సమాన సబ్జెక్టుల్లో పీజీ లేదా ఎంబీఏ.
-కోర్సు: ఎల్‌ఎల్‌ఎం ప్రోగ్రామ్
-కాల్యవవధి: రెండేండ్లు
-అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో బ్యాచిలర్ ఇన్ లా/ఎల్‌ఎల్‌బీ/బీఎల్ (ఐదేండ్ల కోర్సు) లేదా ఫస్ట్‌క్లాస్ మార్కులతో ఎల్‌ఎల్‌బీ/బీఎల్ (మూడేండ్ల కోర్సు)తోపాటు మూడేండ్ల హ్యుమానిటీస్/సైన్స్ లేదా కామర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. 
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: మార్చి 28
-ఎంపిక: జాతీయస్థాయి పరీక్ష ద్వారా
-ఎంట్రెన్స్ టెస్ట్ తేదీ: ఏప్రిల్ 29

-వెబ్‌సైట్: http://www.iitkgp.ac.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సెంట్రల్ ఎక్సైజ్‌లో 26 ఉద్యోగాలు,
కొచ్చిన్‌లోని కస్టమ్స్ (ప్రివెంటివ్) కమిషనరేట్ గ్రూప్ సీ డిపార్ట్‌మెంట్‌లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

-మొత్తం పోస్టులు: 26


విభాగాలవారీగా ఖాళీలు
-సీమెన్-7, గీజర్-11, స్కిప్పర్‌మెట్-2 , ఇంజిన్ డ్రైవర్-1, సుఖాని-1, లాంచ్ మెకానిక్-1, అన్‌స్కిల్డ్ ఇండస్ట్రియల్ వర్కర్- 3
-అర్హతలు: పదోతరగతి లేదా తత్సమాన పరీక్షతోపాటు ఫిషింగ్ వెజల్‌లో సెకండ్ హ్యాండ్ సర్టిఫికెట్ ఉండాలి. ఇంజిన్ డ్రైవర్‌కు ఎనిమిదో తరగతి, అన్‌స్కిల్డ్ ఇండస్ట్రియల్ వర్కర్‌కు పదోతరగతితోపాటు మెకానిక్/ డీజిల్/ ఫిట్టర్/ టర్నర్/ వెల్డర్/ ఎలక్ట్రీషియన్/ ఇన్‌స్ట్రుమెంట్/ కార్పెంటరీ ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-వయస్సు: 18 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి. కొన్ని పోస్టులకు 30 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తులు: ఆఫ్‌లైన్
-చివరి తేదీ: జనవరి 31
-వెబ్‌సైట్: www.cenexcisekochi.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఓషియన్ టెక్నాలజీలో ఎస్‌ఆర్‌ఎఫ్ ఉద్యోగాలు.
తమిళనాడులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీ (ఎన్‌ఐఓటీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎస్‌ఆర్‌ఎఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
-మొత్తం పోస్టుల సంఖ్య: 21


విభాగాలవారీగా ఖాళీలు:
-రిసెర్చ్ అసోసియేట్(ఆర్‌ఏ)-6
-సీనియర్ రిసెర్చ్ ఫెలో (ఎస్‌ఆర్‌ఎఫ్)-11
-జూనియర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్‌ఎఫ్)-4
-అర్హత: పీహెచ్‌డీ (ఓషియనోగ్రఫీ, ఫిజికల్ ఓషియనోగ్రఫీ, మెరైన్ జియోఫిజిక్స్, మెరైన్ జియాలజీ), ఎంటెక్ (ఓషియన్ టెక్నాలజీ/ఓషియనోగ్రఫీ/ ఫిజికల్ ఓషియనోగ్రఫీ, మెరైన్ జియోఫిజిక్స్, మైరైన్ జియాలజీ, బయోటెక్నాలజీ, జెనెటిక్స్), సంబంధిత బ్రాంచిలో బీఈ/బీటెక్, బీఫార్మసీ, ఎంఫార్మసీ, లైఫ్ సైన్స్‌లో మాస్టర్ డిగ్రీ/ పీహెచ్‌డీ ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
-వయస్సు: 28 ఏండ్లు, (ఆర్‌ఏకు 35 ఏండ్లు, ఎస్‌ఆర్‌ఎఫ్‌కు 32 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా.
-దరఖాస్తు: ఆన్‌లైన్
-చివరితేదీ: ఫిబ్రవరి 9
-వెబ్‌సైట్: http://www.niot.res.in


No comments:

Post a comment