Wednesday, 31 January 2018

ఐసీఏఆర్‌లో అగ్రికల్చర్ సైంటిస్టులు, ఐఐటీ హైదరాబాద్‌లో ఉద్యోగాలు, పీఎన్‌బీలో స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు, టీఎంసీలో జేఆర్‌ఎఫ్ ఉద్యోగాలు, ఎన్‌ఐటీటీటీఆర్‌లో ప్రొఫెసర్లు, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీలో ఉద్యోగాలు, నేషనల్ హెల్త్ మిషన్ మైక్రోబయాలజిస్టులు.

ఐసీఏఆర్‌లో అగ్రికల్చర్ సైంటిస్టులు,
న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్ (ఐసీఏఆర్) ఆధ్వర్యంలోని అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఏఎస్‌ఆర్‌బీ) సైంటిస్ట్ పోస్టుల భర్తీకి అగ్రికల్చరల్ రిసెర్చ్ సర్వీస్ (ఏఆర్‌ఎస్) ఎగ్జామినేషన్-2017 (ప్రిలిమినరీ) , వివిధ వ్యవసాయ యూనివర్సిటీల్లో లెక్చరర్/
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల అర్హతకు నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్-I)-2018 ఉమ్మడి పరీక్ష రాయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
scientists

వివరాలు:
ప్రిలిమినరీ ఏఆర్‌ఎస్-2017, నెట్ (I)-2018 కంబైన్డ్ పరీక్షను హైదరాబాద్‌తో సహా దేశవ్యాప్తంగా 23 కేంద్రాల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఏఆర్‌ఎస్-2017 మెయిన్ పరీక్షను 12 కేంద్రాల్లో నిర్వహిస్తారు.
-పోస్టు: సైంటిస్ట్
-మొత్తం ఖాళీల సంఖ్య -195 (జనరల్-103, ఓబీసీ-48, ఎస్సీ-23, ఎస్టీ-21)
-విభాగాలవారీగా ఖాళీలు : అగ్రికల్చరల్ (బయోటెక్నాలజీ-6, ఎంటమాలజీ-1, మైక్రోబయాలజీ-6), జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్-18, ప్లాంట్ బయోకెమిస్ట్రీ-9, ప్లాంట్ పాథాలజీ-8, ప్లాంట్ ఫిజియాలజీ-3, సీడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ-2, యానిమల్ బయోటెక్నాలజీ-2, యానిమల్ జెనెటిక్స్ అండ్ బ్రీడింగ్-4, యానిమల్ ఫిజియాలజీ-2, లైవ్‌స్టాక్ ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్-4, వెటర్నరీ (మెడిసిన్-1, ఫార్మకాలజీ-1, పబ్లిక్ హెల్త్-1), ఫిషరీస్ రిసోర్సెస్ మేనేజ్‌మెంట్-6, అగ్రికల్చరల్ (కెమికల్స్-5, మెటీరియాలజీ-1), ఆగ్రోఫారెస్ట్రీ-4, ఆగ్రానమీ-8, సాయిల్ సైన్సెస్-10, అగ్రికల్చరల్ ఎకనామిక్స్-16, అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్-6, అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్-9, ఫామ్ మెషినరీ అండ్ పవర్-9, కంప్యూటర్ అప్లికేషన్ అండ్ ఐటీ-22, ల్యాండ్ అండ్ వాటర్ మేనేజ్‌మెంట్ ఇంజినీరింగ్-8, బయోఇన్ఫర్మాటిక్స్-11, అగ్రికల్చరల్ స్ట్రక్చర్ అండ్ ప్రాసెస్ ఇంజినీరింగ్-12
-అర్హతలు: అగ్రికల్చర్ రిసెర్చ్ సర్వీస్ (ఏఆర్‌ఎస్)-2017 కోసం గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. 2018 జూన్ 24 నాటికి డిగ్రీని పూర్తిచేసి ఉండాలి. నెట్ (I)-2018 కోసం సంబంధిత స్పెషలైజేషన్‌లో మాస్టర్ డిగ్రీని 2018 జూన్ 24లోపు పూర్తిచేయాలి.
-వయస్సు: ఏఆర్‌ఎస్ పరీక్షకు 21 నుంచి 32 ఏండ్ల మధ్య ఉండాలి. నెట్ పరీక్షకు కనిష్ఠంగా 21 ఏండ్లు, గరిష్ఠ వయోపరిమితి లేదు.
-పే స్కేల్: రూ. 15,600-39,100 + రిసెర్చ్ గ్రేడ్ పే రూ. 6,000/-
-ఎంపిక: ఆన్‌లైన్ రాతపరీక్ష ద్వారా
-దరఖాస్తు ఫీజు: ఏఆర్‌ఎస్ పరీక్షకు రూ. 500/-. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళలకు ఎటువంటి ఫీజు లేదు. నెట్ 2018 పరీక్షకు జనరల్ అభ్యర్థులు రూ. 1000/-. ఓబీసీ అభ్యర్థులు రూ. 500/-ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళలకు 250/-, ఏఆర్‌ఎస్, నెట్‌లకు (రెండింటికి) అప్లయ్ చేసేవారు
జనరల్ అభ్యర్థులు రూ. 1500/- ఓబీసీ అభ్యర్థులు రూ. 1000/- ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళలకు రూ. 250/-
-ఎన్నిసార్లు పరీక్ష రాయవచ్చు: జనరల్ అభ్యర్థులు ఆరుసార్లు, ఓబీసీ అభ్యర్థులు తొమ్మిదిసార్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు (గరిష్ట వయోపరిమితి లోపల) ఎన్నిసార్లయిన పరీక్ష రాయవచ్చు. నెట్ పరీక్ష రాయడానికి ఎలాంటి పరిమితులు లేవు.
-పరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా మొత్తం 23 సెంటర్లలో పరీక్షను నిర్వహిస్తారు
-ఎంపిక: ప్రిలిమినరీ, మెయిన్, వైవా ద్వారా
-ఏఆర్‌ఎస్-2017 ప్రిలిమినరీ(ఆబ్జెక్టివ్ టైప్)-150 మార్కులు, మెయిన్ (డిస్క్రిప్టివ్ టైప్)-240 మార్కులు, వైవాకు 60 మార్కులు.
-ప్రిలిమినరీ పరీక్షకు 2 గంటలు, మెయిన్ పరీక్షకు 3 గంటలు పరీక్ష సమయాన్ని కేటాయించారు.
-ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కులను తగ్గిస్తారు.
-ఏఆర్‌ఎస్-2017 మెయిన్ పరీక్షకు అర్హత సాధించడానికి ప్రిలిమినరీ పరీక్షలో జనరల్ అభ్యర్థులు 45 శాతం, ఓబీసీ అభ్యర్థులు 40 శాతం, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు 35 శాతం కనీస అర్హత మార్కులను తప్పనిసరిగా సాధించాలి.
-వివిధ యూనివర్సిటీల్లో లెక్చరర్/అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల అర్హతకు నిర్వహించే నెట్ (I)-2018 పరీక్షలో జనరల్ అభ్యర్థులు 75 శాతం, ఓబీసీ అభ్యర్థులు 45 శాతం, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు 40 శాతం కనీస అర్హత మార్కులను తప్పనిసరిగా సాధించాలి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష: 2018 ఏప్రిల్ 6 నుంచి 13
-ఏఆర్‌ఎస్ మెయిన్ పరీక్ష: 2018 జూన్ 24
-చివరితేదీ: 2018 మార్చి 2
-వెబ్‌సైట్: www.asrb.org.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐటీ హైదరాబాద్‌లో ఉద్యోగాలు,

హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో ఖాళీగా ఉన్న జేఆర్‌ఎఫ్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
iit-hyd
-పోస్టు పేరు: జేఆర్‌ఎఫ్-2
-అర్హత : బయోమెడికల్, బయోటెక్నాలజీ, నానో/కెమికల్ ఇంజినీరింగ్, ఎంఎస్ (ఫార్మా) లేదా తత్సమాన బయోసైన్సెస్ డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-పే స్కేల్ : రూ.25,000/-
-ఎంపిక: ఇంటర్వ్యూ.
-దరఖాస్తు: ఈ మెయిల్ ద్వారా
-చివరితేదీ: ఫిబ్రవరి 4
-వెబ్‌సైట్: www.iith.ac.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
పీఎన్‌బీలో స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు,

పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్పోర్ట్స్ కోటా(హాకీ) విభాగంలో ఖాళీగా ఉన్న క్లరికల్ క్యాడర్ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
punjab-national-bank
-పోస్టు పేరు: క్లరికల్ క్యాడర్
-మొత్తం పోస్టుల సంఖ్య: 9
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. నేషనల్/స్టేల్ లెవల్ స్థాయిలో హాకీ క్రీడలో పాల్గొని ఉండాలి.
-వయస్సు: 18 నుంచి 26 ఏండ్ల మధ్య ఉండాలి.
-అప్లికేషన్ ఫీజు: రూ. 300/- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 50/-
-పే స్కేల్ : రూ. 11,765-31,540/- అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ తదిదర సదుపాయాలు ఉంటాయి
-ఎంపిక: స్పోర్ట్స్ ట్రయల్స్, ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 3
-వెబ్‌సైట్:www.pnbindia.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
టీఎంసీలో జేఆర్‌ఎఫ్ ఉద్యోగాలు,
ముంబైలోని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) లైఫ్ సైన్సెస్ విభాగాల్లో ఖాళీగా ఉన్న జేఆర్‌ఎఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
tata-memorial-centre

వివరాలు:
డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ పరిధిలో
పనిచేస్తున్న స్వయం ప్రతిపత్తిగల సంస్థ.
-జూనియర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్‌ఎఫ్)
-అర్హత: ఎమ్మెస్సీ (అప్లయిడ్ బయాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, బయోఇన్ఫర్మాటిక్స్, బయోఫిజిక్స్, బాటనీ, లైఫ్ సైన్సెస్, మైక్రోబయాలజీ, మాలిక్యులర్ బయాలజీ, జువాలజీ), ఎంటెక్ (బయోఇన్ఫర్మాటిక్స్/బయోటెక్నాలజీ), ఎంవీఎస్సీ లేదా ఎంఫార్మసీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-స్టయిఫండ్: రూ. 25,000/ + 30 శాతం హెచ్‌ఆర్‌ఏ (అదనంగా) చెల్లిస్తారు.
-అప్లికేషన్ ఫీజు: రూ. 500/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు ఫీజు లేదు.
-ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
-చివరితేదీ: ఏప్రిల్ 20
-రాతపరీక్ష: మే 27
-వెబ్‌సైట్ : www.actrec.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఐటీటీటీఆర్‌లో ప్రొఫెసర్లు,

భోపాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రెయినింగ్ అండ్ రిసెర్చ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల (రెగ్యులర్/కాంట్రాక్టు ప్రాతిపదికన) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
nitttrbhopal

వివరాలు:
ఎంహెచ్‌ఆర్‌డీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఒక
అటానమస్ ఇన్‌స్టిట్యూషన్.
-మొత్తం పోస్టుల సంఖ్య: 25 (ప్రొఫెసర్-5, అసిస్టెంట్ ప్రొఫెసర్-10, రిసెర్చ్ అసోసియేట్-10)
-పోస్టు పేరు : ప్రొఫెసర్స్/అసిస్టెంట్ ప్రొఫెసర్
-అర్హతలు: బీఈ/బీటెక్‌తోపాటు ఎంఈ/ఎంటెక్, పీహెచ్‌డీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
-పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ, సైన్స్‌లో పీజీ, ఎంఈడీ / ఎంఏ ఎడ్యుకేషన్, పీహెచ్‌డీ, నెట్/స్లెట్, సెట్‌లో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి. రిసెర్చ్ ఫెలో పోస్టుకు బీఈ/బీటెక్ తోపాటు ఎంఈ/ఎంటెక్‌లో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత. గేట్‌లో ఉత్తీర్ణత సాధించాలి.
-పే స్కేల్: ప్రొఫెసర్-రూ. 37,400-67,000 + అకడమిక్ గ్రేడ్ పే రూ. 10,000/-
-అసిస్టెంట్ ప్రొఫెసర్-రూ. 15600-39,100 + అకడమిక్ గ్రేడ్ పే రూ. 6,000/-
-రిసెర్చ్ ఫెలో రూ. 25,000/- రెండో ఏడాదికి రూ. 28,000/-, మూడో ఏడాది రూ. 38,000/-
-అప్లికేషన్ ఫీజు: రూ. 1000/-
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-వెబ్‌సైట్: http://nitttrbpl.ac.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీలో ఉద్యోగాలు,
ఉత్తరాఖండ్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ వివిధ విబాగాల్లో ఖాళీగా ఉన్న రిసెర్చ్ సైంటిస్ట్, జేఆర్‌ఎఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
nih

వివరాలు:
-మొత్తం ఖాళీల సంఖ్య: 23
-డిప్యూటీ ప్రాజెక్టు లీడర్-1, డోమైన్ ఎక్స్‌పర్ట్-2, జీఐఎస్/రిమోట్ సెన్సింగ్ స్పెషలిస్ట్-1, సాఫ్ట్‌వేర్ స్పెషలిస్ట్-2, జూనియర్ రిసెర్చ్ ఫెలో-8, రిసెర్చ్ సైంటిస్ట్-1, రిసెర్చ్ అసోసియేట్-4, ప్రాజెక్ట్ అసిస్టెంట్-3, స్టూడెంట్ ఇంటర్న్‌షిప్-1
-అర్హత: సంబంధిత సబ్జెక్టులో డాక్టరేట్ (సైన్స్/ఇంజినీరింగ్), పీజీ (ఇంజినీరింగ్), ఎంఈ/ఎంటెక్ (హైడ్రాలజీ, వాటర్ రిసోర్సెస్ ఇంజినీరింగ్, హైడ్రాలిక్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, రిమోట్ సెన్సింగ్, జీఐఎస్, జియోఇన్ఫర్మాటిక్స్, ఎంసీఏ, బీటెక్( కంప్యూటర్ సైన్స్, ఐటీ), పీజీ (బేసిక్ సైన్స్, ఎర్త్ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, కెమిస్ట్రీ) లేదా తత్సమాన డిగ్రీలో ఉత్తీర్ణత. నెట్ లేదా గేట్‌లో ఉత్తీర్ణత సాధించాలి.
-వయస్సు: 35 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఇంటర్వ్యూతేదీ: ఫిబ్రవరి 12, 15
-వెబ్‌సైట్: www.nihroorkee.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నేషనల్ హెల్త్ మిషన్ మైక్రోబయాలజిస్టులు.
నేషనల్ హెల్త్ మిషన్ - తెలంగాణ ఆర్‌ఎన్‌టీసీపీ ప్రోగ్రామ్‌లో ఖాళీగా ఉన్న మైక్రోబయాలజిస్ట్ (తాత్కాలిక ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
-పోసు: మైక్రోబయాలజిస్ట్ (ఐఆర్‌ఎల్, ఈక్యూఏ, సీ అండ్ డీఎస్‌టీ ల్యాబ్)
-అర్హతలు: ఎమెస్సీ (మెడికల్/అప్లయిడ్ మైక్రోబయాలజీ), మైక్రోబయాలజీలో ఎండీ, పీహెచ్‌డీ (మెడికల్ మైక్రోబయాలజీ)లో ఉత్తీర్ణత.
-దరఖాస్తు : ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జనవరి 31
-వెబ్‌సైట్: https://cgg.gov.in


No comments:

Post a Comment