Wednesday, 31 January 2018

ఐవోసీఎల్‌లో జూనియర్ ఆపరేటర్లు, మనూలో 52 ఉద్యోగాలు, శ్రీహరికోట షార్‌లో 33 ఉద్యోగాలు, వీసీఆర్‌సీ ప్రాజెక్టు టెక్నీషియన్లు, ఆర్‌ఏసీలో జేఆర్‌ఎఫ్ ఉద్యోగాలు, బీఎస్ రిసెర్చ్ ప్రవేశాలు.

ఐవోసీఎల్‌లో జూనియర్ ఆపరేటర్లు,

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్) సదరన్ రీజియన్ పరిధిలోని మార్కెటింగ్ డివిజన్ (నాన్ ఎగ్జిక్యూటివ్ )లో ఖాళీగా ఉన్న జూనియర్ ఆపరేటర్ (గ్రేడ్ 1, ఏవియేషన్) తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
oil
వివరాలు: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది ఇండియాలోని ఫార్చ్యూన్ గ్లోబల్ 500 కంపెనీల్లో అతిపెద్ద వాణిజ్య సంస్థ.
-మొత్తం ఖాళీల సంఖ్య: 98 (జూనియర్ ఆపరేటర్ (గ్రేడ్ 1)-51, జూనియర్ ఆపరేటర్ ఏవియేషన్-46, జూనియర్ చార్జ్‌మ్యాన్-1)
-ప్రాంతాలవారీగా ఖాళీలు: తెలంగాణ-11, ఏపీ-12, కర్ణాటక-28, కేరళ-3, తమిళనాడు/పుదుచ్చేరి-44
-పోస్టు పేరు: జూనియర్ ఆపరేటర్ (ఏవియేషన్)
-అర్హత: హయ్యర్ సెకండరీ లేదా ఇంటర్‌లో 45 శాతం (ఎస్సీ, ఎస్టీ 40 శాతం) మార్కులతో ఉత్తీర్ణత. వినియోగంలో ఉన్న హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. సంబంధిత రంగంలో ఏడాది అనుభవం ఉండాలి.
-పోస్టు పేరు: జూనియర్ ఆపరేటర్ (గ్రేడ్ 1)
-అర్హత: పదోతరగతితోపాటు రెండేండ్ల వ్యవధిగల ఐటీఐ ట్రేడ్ (ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, ఫిట్టర్)లో ఉత్తీర్ణత . సంబంధిత రంగంలో ఏడాది అనుభవం ఉండాలి.
-పోస్టు పేరు: జూనియర్ చార్జ్‌మ్యాన్
-అర్హత: పదోతరగతితోపాటు మూడేండ్ల వ్యవధిగల డిప్లొమా (మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్)లో ఉత్తీర్ణత . సంబంధిత రంగంలో ఏడాది అనుభవం ఉండాలి.
-వయస్సు: 2018 జనవరి 31 నాటికి 18 నుంచి 26 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌లకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్ : రూ. 10,500-24,500/-
-అప్లికేషన్ ఫీజు: జనరల్/ఓబీసీ రూ. 150/-
-ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, స్కిల్ ప్రొఫిషియెన్సీ ఫిజికల్ టెస్ట్(ఎస్‌పీపీటీ) ద్వారా. అభ్యర్థులు రాత పరీక్షలో సంస్థ నిర్ణయించిన కనీస అర్హత మార్కులను సాధించాలి.
-రాతపరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో మొత్తం 100 మార్కులకు ఉంటుంది. సంబంధిత టెక్నికల్ నాలెడ్జ్-40, జనరల్ ఆప్టిట్యూడ్ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-20, రీజనింగ్ ఎబిలిటీస్-20, బేసిక్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్కిల్స్-20 అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
-ఈ ఆబ్జెక్టివ్ పరీక్షను 90 నిమిషాల్లో పూర్తిచేయాలి.
-నెగెటివ్ మార్కింగ్ విధానం లేదు
-ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు ఇస్తారు.
-రాతపరీక్షలో నిర్దేశిత మార్కులతో ఉత్తీర్ణలై వారి మెరిట్ జాబితా నుంచి 1:2 నిష్పత్తిలో ఎస్‌పీపీటీకి ఎంపిక చేస్తారు.
-దరఖాస్తు : ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌లో పంపిన దరఖాస్తులను ప్రింట్ తీసి, అవసరమైన సర్టిఫికెట్లను జతచేసి పర్సనల్ అధికారికి పంపాలి.
చిరునామా:
Post Box No-3321,
Nungambakkam MDO,
Chennai-600034
-చివరితేదీ: ఫిబ్రవరి 10
-హార్డ్ కాపీలకు చివరితేదీ: ఫిబ్రవరి 16
-రాతపరీక్ష తేదీ: ఫిబ్రవరి 25
-ఫలితాలు విడుదల: మార్చి 10
-వెబ్‌సైట్: https://www.iocl.com
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
మనూలో 52 ఉద్యోగాలు,

హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను అహ్వానిస్తున్నది.
mannu
వివరాలు:
మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ అనేది సెంట్రల్ యూనివర్సిటీ. హైదరాబాద్ గచ్చిబౌలిలో 1998లో ఏర్పాటుచేశారు.
-మొత్తం పోస్టుల సంఖ్య: 52
విభాగాలవారీగా పోస్టులు
-హైదరాబాద్ క్యాంపస్‌లో మొత్తం టీచింగ్ పోస్టులు: 26
-ప్రొఫెసర్స్- 10 పోస్టులు (ఇంగ్లిష్-1, వుమెన్ ఎడ్యుకేషన్-1, ఇస్లామిక్ స్టడీస్-1, పొలిటికల్ సైన్స్-1, బాటనీ-1, ఫిజిక్స్-1, కెమిస్ట్రీ-1, సీడబ్ల్యూఎస్-1, డీడీఈ-1, మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్ చైర్-1)
-అసోసియేట్ ప్రొఫెసర్స్-14 పోస్టులు (ఇంగ్లిష్-2, పర్షియన్-1, హిందీ-1, వుమెన్ ఎడ్యుకేషన్-1, మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం-1, సోషల్ వర్క్-1, సోషియాలజీ-1, ఎకనామిక్స్-1, మ్యాథమెటిక్స్-1, హిస్టరీ (డీఈ)-1, సీపీడీయూఎంటీ-1,సీయూసీఎస్-1)
-అసిస్టెంట్ ప్రొఫెసర్స్-2 పోస్టులు (అరబిక్-1, సీడబ్ల్యూఎస్-1)
ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఫర్ ఉమెన్, శ్రీనగర్ టీచింగ్ పోస్టులు - విభాగాల వారీగా పోస్టులు:
-అసోసియేట్ ప్రొఫెసర్స్-8 పోస్టులు (ఉర్దూ-1, అరబిక్-1, ఇంగ్లిష్-1, పర్షియన్-1, ఎకనామిక్స్-1, హిస్టరీ-1, పొలిటికల్ సైన్స్-1, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-1)
-అసిస్టెంట్ ప్రొఫెసర్స్-3 పోస్టులు (హిస్టరీ-1, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-1, కశ్మీరీ-1)
-అకడమిక్ పోస్టులు-5 ఖాళీలు (కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్-1, లైబ్రేరియన్-1, డైరెక్టర్ ఫిజికల్ ఎడ్యుకేషన్-1, డిప్యూటీ డైరెక్టర్ ఫిజికల్ ఎడ్యుకేషన్-1, అసిస్టెంట్ డైరెక్టర్ ఫిజికల్ ఎడ్యుకేషన్-1)
మోడల్ స్కూల్ టీచర్-10 పోస్టులు
-విభాగాలు: పీజీటీ ఇంగ్లిష్-1, టీజీటీ ఇంగ్లిష్-1, టీజీటీ హిందీ-1, టీజీటీ ఫిజికల్ ఎడ్యుకేషన్-1, యోగా టీచర్-3, ఎలక్ట్రానిక్స్-2, ఎంబ్రాయిడరీ-1
-అర్హత: యూనివర్సిటీ/సంస్థ నిబంధనల ప్రకారం అర్హతలు ఉండాలి.
-వయస్సు: 35 ఏండ్లకు మించరాదు
-ఎంపిక : రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: ఫిబ్రవరి 28
-వెబ్‌సైట్: www.manuu.ac.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
శ్రీహరికోట షార్‌లో 33 ఉద్యోగాలు,

ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)లో ముఖ్య కేంద్రంగా పనిచేస్తున్న సతీస్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ (శ్రీహరికోట) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
isro-logo
-మొత్తం పోస్టుల సంఖ్య: 33
-ఫైర్‌మ్యాన్ ఏ-7 పోస్టులు
-క్యాటరింగ్ అటెండెంట్-17 పోస్టులు
-కుక్-8 పోస్టులు
-అర్హత: పదోతరగతిలో ఉత్తీర్ణత. ఫైర్‌మ్యాన్ పోస్టులకు నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి. ఫిజికల్ పిటినెస్ టెస్ట్, ఎండ్యూరెన్స్ టెస్ట్‌లో అర్హతను సాధించాలి. కుక్ పోస్టులకు హోటల్ లేదా క్యాంటీన్‌లో ఐదేండ్లు పనిచేసిన అనుభవం.
-హిందీ టైపిస్ట్-1 పోస్టు
-అర్హత: ఏదైనా డిగ్రీలో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత. పదోతరగతి/డిగ్రీస్థాయిలో హిందీ సబ్జెక్టు చదివి ఉండాలి లేదా హిందీ మాధ్యమంలో చదివి ఉండాలి. కంప్యూటర్‌పై హిందీ టైప్ రైటింగ్‌లో నిమిషానికి 25 పదాల వేగాన్ని కలిగి ఉండాలి.
-వయస్సు: 18 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి (కుక్‌కు 18 నుంచి 35 ఏండ్లు, హిందీ టైపిస్ట్‌కు 18-26 ఏండ్ల మధ్య)
-పే స్కేల్: ఫైర్‌మ్యాన్, కుక్ రూ. 19,900/-, టైపిస్ట్‌కు రూ. 25,500/-, క్యాటరింట్ అటెండెంట్‌కు రూ. 18,000/-, ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఫిబ్రవరి 16
-వెబ్‌సైట్: http://sdsc.shar.gov.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
వీసీఆర్‌సీ ప్రాజెక్టు టెక్నీషియన్లు,
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ ఆధ్యర్యంలోని వెక్టార్ కంట్రోల్ రిసెర్చ్ సెంటర్(వీసీఆర్‌సీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
-మొత్తం పోస్టుల సంఖ్య-13. విభాగాల వారీగా ఖాళీలు: సైంటిస్ట్-సీ (నాన్ మెడికల్)-1, సైంటిస్ట్-బీ (నాన్ మెడికల్)-2, ఎంటమాలజీ-1, మాలిక్యులార్ బయాలజీ-1, ప్రాజెక్టు అసిస్టెంట్-4, ప్రాజెక్టు అసిస్టెంట్ (గ్రేడ్ 1/గ్రేడ్ 2, గ్రేడ్ 3)-6
-అర్హత: లైఫ్ సైన్సెస్‌లో మాస్టర్ డిగ్రీ, ఎమ్మెస్సీ+ పీహెచ్‌డీ, ఎమ్మెస్సీ (పబ్లిక్ హెల్త్ ఎంటమాలజీ), బయాలజికల్ సైన్స్‌లో డిగ్రీలో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-ఎంపిక: రాతపరీక్ష/పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో. చివరితేదీ: ఫిబ్రవరి 5
-వెబ్‌సైట్: www.vcrc.res.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఆర్‌ఏసీలో జేఆర్‌ఎఫ్ ఉద్యోగాలు,
ఢిల్లీలోని డిఫెన్స్ రిసెర్చ్ & డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) పర్సనల్ డిపార్ట్‌మెంటైన రిక్రూట్‌మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెంటర్(ఆర్‌ఏసీ) ఖాళీగా ఉన్న జేఆర్‌ఎఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
DRD
-మొత్తం ఖాళీల సంఖ్య: 4
-అర్హత: కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్/ఐటీ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ లేదా ఎంఈ/ఎంటెక్‌లో ఉత్తీర్ణత, పీజీ (సైకాలజీ)లో ఉత్తీర్ణత. నెట్ పరీక్షలో ఉత్తీర్ణత.సీ, సీ++, జావా, పీహెచ్‌పీ, ఎస్‌క్యూఎల్, డాట్ నెట్‌లో పరిజ్ఞానం ఉండాలి.
-పే స్కేల్: రూ.25000/-
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్ లేదా ఈ మెయిల్ ద్వారా
-ఇంటర్వ్యూ తేదీ:
ఫిబ్రవరి 15
-వెబ్‌సైట్: www.rac.gov.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బీఎస్ రిసెర్చ్ ప్రవేశాలు.
బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)లో బీఎస్ రిసెర్చ్‌లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
DRD 
-కోర్సు: బీఎస్ రిసెర్చ్
-అర్హతలు: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో కనీసం 60 శాతం మార్కులతో 10+2/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
-ఎంపిక: కేవీపీవై ఎస్‌ఏ, ఎస్‌బీ, ఎస్‌ఎక్స్‌ల్లో ఏదో ఒకటిలో మెరిట్‌తో లేదా మెయిన్ 2018, ఐఐటీ అడ్వాన్స్‌డ్ 2018, నీట్ యూజీ -2018లో ర్యాంక్ ఆధారంగా.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి 1 నుంచి
-చివరితేదీ: ఏప్రిల్ 30
-వెబ్‌సైట్: www.iisc.ac.in/ug

No comments:

Post a comment