Monday, 22 January 2018

ఎన్‌టీపీసీలో ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలు, నిట్‌లో ప్రొఫెసర్లు ఉద్యోగాలు, ఆర్‌బీఐలో మేనేజర్లు ఉద్యోగాలు, ఐవోసీఎల్‌లో జూనియర్ ఆపరేటర్లు ఉద్యోగాలు, ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌లో ఉద్యోగాలు, ఆయుర్వేదలో 37 ఉద్యోగాలు, అక్వాకల్చర్‌లో ట్రెయినీలు.

ఎన్‌టీపీసీలో ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలు,
ఇంజినీరింగ్ అభ్యర్థులకు అవకాశం
-ఉద్యోగ భద్రత, మంచి జీత భత్యాలు
-గేట్-2018 స్కోర్ + గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

-చివరితేదీ: జనవరి 31

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌టీపీసీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీల భర్తీకి అర్హులైన ఇంజినీరింగ్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు: ఎన్‌టీపీసీ విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, సహజ వాయువు అన్వేషణ, ఉత్పత్తి, రవాణా చేస్తుంది. దేశ వ్యాప్తంగా 49 ఎన్‌టీపీసీ స్టేషన్లు ఉన్నాయి.
-పోస్టు పేరు: ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ
-పనిచేసే ప్రదేశం: దేశ వ్యాప్తంగా
-మొత్తం ఖాళీలు: 150 పోస్టులు
-ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ విభాగాల వారీగా :
-ఎలక్ట్రికల్-35 పోస్టులు (జనరల్-20, ఓబీసీ-6, ఎస్సీ-4, ఎస్టీ-5)
-అర్హత: ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్, పవర్ సిస్టమ్ & హై వోల్టేజ్, పవర్ ఎలక్ట్రానిక్స్, పవర్ ఇంజినీరింగ్‌లో 65 శాతం మార్కులతో ఏఎమ్‌ఐఈ/ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత.
-మెకానికల్-55 పోస్టులు (జనరల్-34, ఓబీసీ-11, ఎస్సీ-6, ఎస్టీ-4)
-అర్హత: మెకానికల్, ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, థర్మల్, మెకానికల్ & ఆటోమేషన్, పవర్ ఇంజినీరింగ్‌లో 65 శాతం మార్కులతో ఏఎమ్‌ఐఈ/ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత.
-మైనింగ్ - 20 పోస్టులు (జనరల్-9, ఓబీసీ-4, ఎస్సీ-4, ఎస్టీ-3)
-అర్హత: మైనింగ్ ఇంజినీరింగ్‌లో 65 శాతం మార్కులతో ఏఎమ్‌ఐఈ/ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత.
-ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ - 40 పోస్టులు (జనరల్-21, ఓబీసీ-9, ఎస్సీ-4, ఎస్టీ-3)
-అర్హత: ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ & పవర్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ ఇంజినీరింగ్‌లో 65 శాతం మార్కులతో ఏఎమ్‌ఐఈ/ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత.
-పే స్కేల్: రూ. 24,900-3%-50,500/-ఇతర అలవెన్స్‌లు ఉంటాయి
-వయస్సు: 2018 జనవరి 31 నాటికి 27 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక: గేట్ - 2018 స్కోర్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి అభ్యర్థులను గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
-గేట్ స్కోర్‌కు 85 శాతం, గ్రూప్ డిస్కషన్‌కు 5 శాతం, ఇంటర్వ్యూకు 10 శాతం వెయిటేజీ ఇచ్చి తుది ఫలితాలు ప్రకటిస్తారు.
-అప్లికేషన్ ఫీజు: రూ.150/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.
-ప్రొబేషన్ పీరియడ్: ఏడాదిపాటు ఉంటుంది. ఈ ట్రెయినింగ్‌లో ప్రతిభ ఆధారంగా దేశంలో ఏక్కడైనా పోస్టింగ్ ఇస్తారు.
NTPC

-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఈ- మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌తోపాటు గేట్ 2018 రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేయాలి.
-దరఖాస్తులకు చివరి తేదీ : జనవరి 31
-వెబ్‌సైట్ : www.ntpccareers.net

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నిట్‌లో ప్రొఫెసర్లు ఉద్యోగాలు,
మణిపూర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
-మొత్తం పోస్టుల సంఖ్య: 22 (ప్రొఫెసర్-8, అసోసియేట్/అసిస్టెంట్-14)
-విభాగాలు: సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, సెంట్రల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఫెసిలిటీస్
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్, సైన్స్‌లో పీహెచ్‌డీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
-అప్లికేషన్ ఫీజు: రూ. 1000/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు రూ. 500/-
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: జనవరి 30
-వెబ్‌సైట్: www.nitmanipur.ac.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఆర్‌బీఐలో మేనేజర్లు ఉద్యోగాలు,

బెంగళూరులోని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మేనేజర్, పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు:
బీఆర్‌బీఎన్‌ఎమ్‌పీఎల్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంపూర్ణ యాజమాన్య అనుబంధ సంస్థ. దీన్ని 1995 ఫిబ్రవరి 3న ఆర్‌బీఐ ఏర్పాటుచేసింది.
-మొత్తం పోస్టుల సంఖ్య-7
-అసిస్టెంట్ మేనేజర్ (ఇంక్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్)-4 పోస్టులు
-అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (కెమికల్ ఇంజినీరింగ్/పాలీమర్ సైన్స్ అండ్ టెక్నాలజీ/కెమిస్ట్రీ) లేదా డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణత.
-అసిస్టెంట్ మేనేజర్ (రాజభాష)-3 పోస్టులు
-అర్హత: మాస్టర్ డిగ్రీ (హిందీ/హిందీ ట్రాన్స్‌లేషన్)లో ఉత్తీర్ణత. డిగ్రీ స్థాయిలో ఇంగ్లిష్ సబ్జెక్టును చదివి ఉండాలి.
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరి తేదీ: ఫిబ్రవరి 19
-వెబ్‌సైట్: www.brbnmpl.co.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐవోసీఎల్‌లో జూనియర్ ఆపరేటర్లు ఉద్యోగాలు,
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్) వెస్టర్న్ రీజియన్ పరిధిలో ఖాళీగా ఉన్న జూనియర్ ఆపరేటర్ (నాన్ ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు:
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ దేశంలోని ఫార్చ్యూన్ గ్లోబల్ 500 కంపెనీల్లో అతిపెద్ద వాణిజ్య సంస్థ.
-మొత్తం ఖాళీల సంఖ్య: 10 పోస్టులు
-పోస్టు పేరు: జూనియర్ ఆపరేటర్ (ఏవియేషన్)
-అర్హత: హయ్యర్ సెకండరీ లేదా ఇంటర్‌లో 45 శాతం (ఎస్సీ, ఎస్టీ 40 శాతం) మార్కులతో ఉత్తీర్ణత. వినియోగంలో ఉన్న హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. సంబంధిత రంగంలో ఏడాదిపాటు అనుభవం ఉండాలి.
-వయస్సు: 18 నుంచి 26 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్ : రూ. 10,500-24,500/-
-ఎంపిక: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, స్కిల్ ప్రొఫిషియెన్సీ ఫిజికల్ టెస్ట్ ద్వారా. రాత పరీక్షలో సంస్థ నిర్ణయించిన కనీస అర్హత మార్కులను సాధించాలి.
-రాతపరీక్ష: ఆబ్జెక్టివ్ విధానంలో మొత్తం 100 మార్కులకు ఉంటుంది. జనరల్ ఆప్టిట్యూడ్ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-40, రీజనింగ్ ఎబిలిటీస్-40, బేసిక్ ఇంగ్లిష్ లాంగ్వేజే స్కిల్స్-20 అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. సమయం 90 ని.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 7
-రాతపరీక్ష తేదీ: ఫిబ్రవరి 25
-వెబ్‌సైట్: https://www.iocl.com

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌లో ఉద్యోగాలు,

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్) ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.
వివరాలు:
ఎన్‌ఐఆర్‌డీ అనేది గ్రామీణ అభివృద్ధి, పరిశోధన కోసం హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఏర్పాటు చేశారు.
-అసిస్టెంట్ డైరెక్టర్ (ఫైనాన్స్)-1, ప్రాజెక్ట్ ఆఫీసర్ (అకౌంట్స్)-5, జావా డెవలపర్-1, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ (లైనక్స్)-1, పీహెచ్‌పీ డెవలపర్స్-2, యూఐ డెవలపర్-1, జావా కమ్ మొబైల్ డెవలపర్-1, బిహేవియర్ చేంజ్ కమ్యూనికేషన్ స్పెషలిస్ట్-1, కంటెన్ట్ మేనేజర్-1, గ్రాఫిక్ డిజైనర్-1, మీడియా ప్లానింగ్ మేనేజర్-1, కన్సల్టెంట్ (ఫైనాన్స్)-1
-దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
-వెబ్‌సైట్: www.nird.org.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఆయుర్వేదలో 37  ఉద్యోగాలు,
న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
-మొత్తం పోస్టుల సంఖ్య: 37
-టీచింగ్ ఖాళీల సంఖ్య: 12 (ప్రొఫెసర్-5, అసోసియేట్ ప్రొఫెసర్-6, అసిస్టెంట్ ప్రోఫెసర్-1)
-అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్‌ల సంఖ్య: 25
-జాయింట్ డైరెక్టర్-1, ఫైనాన్స్ అడ్వైజర్-1, ప్రిన్సిపాల్ ప్రైవేట్ సెక్రటరీ-1, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్-1, కంప్యూటర్ ప్రోగ్రామర్-1, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్-1, స్టోర్ ఆఫీసర్-1, అకౌంట్స్ ఆఫీసర్-1, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్-1, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్-1, ఫార్మసీ మేనేజర్-1, అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్-1, అసిస్టెంట్ స్టోర్ ఆఫీసర్-1, సెక్యూరిటీ ఆఫీసర్-1, ల్యాబ్ టెక్నీషియన్-2, టెక్నికల్ అసిస్టెంట్-8, జూనియర్ ఇంజినీర్ (మెయింటేనెన్స్)-1
-అర్హత: సంబంధిత ఆయుర్వేద విభాగంలో మాస్టర్ డిగ్రీలో ఉత్తీర్ణత. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు ఐదేండ్ల అనుభవం ఉండాలి. మిగతా పోస్టులకు వేర్వేరు అర్హతలు ఉన్నాయి.
-ఎంపిక: రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో. దరఖాస్తులను పూర్తిగా నింపి, సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.
-చిరునామా: The Director, All India Instittute of Ayurveda (AIIA) Gautampuri, Sarita Vihar, mathura Road, New Delhi-110076
-చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ (జనవరి 20-26) వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తులను పంపించాలి.
-వెబ్‌సైట్: www. aiia.co.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
అక్వాకల్చర్‌లో ట్రెయినీలు.

తమిళనాడులోని రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ అక్వాకల్చర్ (ఆర్‌జీసీఏ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రెయినీ (స్పెషల్ డ్రైవ్-ఎస్సీ/ఎస్టీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

వివరాలు: ఆర్‌జీసీఏ అనేది మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో పనిచేస్తున్న సంస్థ.
-మొత్తం పోస్టుల సంఖ్య: 35
-విభాగాలవారీగా ఖాళీలు:
-ట్రెయినీ టెక్నికల్ -25
-అర్హత: గ్రాడ్యుయేషన్ (సైన్స్, అక్వాకల్చర్)లో ఉత్తీర్ణత.
-ట్రెయినీ ఎలక్ట్రీషియన్ -6
-అర్హత: ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా లేదా ఐటీఐలో ఉత్తీర్ణత.
-ట్రెయినీ సిస్టమ్ అనలిస్ట్-1
-అర్హత: కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత.
-ట్రెయినీ ఇంజినీర్ (సివిల్, ఎలక్ట్రికల్) -3
-అర్హత: సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా లేదా ఐటీఐలో ఉత్తీర్ణత.
-పే స్కేల్: రూ. 18,000/- (కన్సాలిడేటెడ్ పే)
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఈ మెయిల్ (rgcaho@gmail.com) ద్వారా ఫిబ్రవరి 8 తేదీలోగా పంపాలి.
-ఇంటర్వ్యూ తేదీ: ఫిబ్రవరి 9
-వెబ్‌సైట్: www.rgca.org.in

No comments:

Post a comment