Monday, 22 January 2018

ఎన్‌డీఏ & ఎన్‌ఏ ఎగ్జామినేషన్ ఉద్యోగాలు, ఎస్‌బీఐలో ఆఫీసర్లు ఉద్యోగాలు, సీడబ్ల్యూసీలో ఉద్యోగాలు, బీహెచ్‌ఈఎల్‌లో అప్రెంటిస్‌లుఉద్యోగాలు, ఏఎల్‌ఐఎంసీవోలో ఆడియాలజిస్టులుఉద్యోగాలు, వాప్కోస్‌లో ఇంజినీర్లు ఉద్యోగాలు.

ఎన్‌డీఏ & ఎన్‌ఏ ఎగ్జామినేషన్ ఉద్యోగాలు,
ఇంటర్ అభ్యర్థులకు అవకాశం
-రాతపరీక్ష, ఇంటర్వూ ద్వారా ఎంపిక
-చివరితేదీ: ఫిబ్రవరి 5
-పరీక్షతేదీ: ఏప్రిల్ 22

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ) & నేవల్ అకాడమీ (ఎన్‌ఏ) ఎగ్జామినేషన్ (I), 2018 కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది.
UPSC-NDA
వివరాలు:
ఎన్‌డీఏ & ఎన్‌ఏ ఎగ్జామినేషన్‌ను ప్రతిఏటా రెండుసార్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తుంది.
ఈ ఎగ్జామ్ ద్వారా ఇండియన్ ఆర్మీ, నేవి, ఎయిర్‌ఫోర్స్‌లో ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ విభాగాల్లో ఉద్యోగంలో చేరి భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు.
-మొత్తం పోస్టుల సంఖ్య: 415
-నేషనల్ డిఫెన్స్ అకాడమీ: 360 పోస్టులు (ఇండియన్ ఆర్మీ-208, ఇండియన్ నేవి-60, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్-92)
-ఇండియన్ నేవల్ అకాడమీ-55 పోస్టులు (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్)
అర్హతలు:
-ఆర్మీ విభాగం (ఎన్‌డీఏ): గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి ఇంటర్/10+2 లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
-ఎయిర్ ఫోర్స్/నేవల్ (ఎన్‌డీఏ)/ఇండియన్ నేవల్ అకాడమీ: ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో ఇంటర్ లేదా 10+2లో ఉత్తీర్ణత. ఇంటర్ చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
శారీరక ప్రమాణాలు
-ఎత్తు: 157.5 సెం.మీ. (ఎయిర్‌ఫోర్స్ 162.5 సెం.మీ.)
-బరువు: ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.
-కంటిచూపు: 6/6, 6/9
-ఈ విధానంలో ఎంపికైనవారు ఉచితంగా బ్యాచిలర్ డిగ్రీ చదువుకోవచ్చు.
ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌లో..
-15 నిమిషాల్లో 2.4 కి.మీ. దూరాన్ని పూర్తిచేయాలి
-స్కిప్పింగ్, 3-4 మీటర్ల రోప్ ైక్లెంబింగ్ చేయాలి.
-20 ఫుష్‌అప్‌లు, 8 చిన్‌అప్‌లు చేయాలి.
-వయస్సు: 1990, జూలై 2 నుంచి 2002, జూలై 1 మధ్య జన్మించి ఉండాలి.
-అప్లికేషన్ ఫీజు: రూ. 100/- జనరల్/ఓబీసీ (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు)
-జీతభత్యాలు: రూ. 56,100/- శిక్షణ సమయంలో స్టయిఫండ్ చెల్లిస్తారు.
-పదోన్నతులు: ఆర్మీ/నేవి/ ఎయిర్‌ఫోర్స్‌లో లెఫ్ట్‌నెంట్/సబ్ లెఫ్ట్‌నెంట్/ఫ్లయింగ్ ఆఫీసర్ నుంచి జనరల్/అడ్మిరల్/ఎయిర్ చీఫ్ మార్షల్ హోదా వరకు.
గమనిక: ఈ పోస్టులకు బాలురు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
-ఎంపిక: రాత పరీక్ష, సర్వీస్ సెలక్షన్ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూ ద్వారా.
-రాత పరీక్ష విధానం: అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. 1.రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ తరహా), 2. ఇంటెలిజెన్స్, పర్సనాలిటీ టెస్ట్
-రాత పరీక్షలో..మొత్తం మార్కులు 900. దీనిలో పేపర్1 (మ్యాథమెటిక్స్)-300 మార్కులు, పేపర్ 2 (జనరల్ ఎబిలిటీ టెస్ట్)- 600 మార్కులు, ప్రతి పేపర్‌కు 150 నిమిషాలు కేటాయించారు.
-నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
-ఎస్‌ఎస్‌బీ/ఇంటర్వ్యూ 900 మార్కులు
రాతపరీక్షలో అర్హత పొందినవారికి ఎస్‌ఎస్‌బీ ఆధ్వర్యంలో యూపీఎస్సీ రెండు దశల్లో ఇంటెలిజెన్స్, పర్సనాలిటీ టెస్ట్‌లు నిర్వహిస్తుంది.
-మొత్తం (రాతపరీక్ష+ఎస్‌ఎస్‌బీ టెస్ట్/ఇంటర్వ్యూ)-1800 మార్కులకుగాను ప్రతిభ చూపిన అభ్యర్థులను ఎంపిక చేసి ట్రెయినింగ్ ఇస్తారు.
-ట్రెయినింగ్ విజయవంతంగా పూర్తిచేసిన వారికి జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ డిగ్రీ సర్టిఫికెట్లను ప్రదానం చేస్తారు.
-ఆర్మీ క్యాడెట్స్- బీఎస్సీ/బీఎస్సీ (కంప్యూటర్)/ బీఏ
-నేవల్ క్యాడెట్స్- బీటెక్
-ఎయిర్ ఫోర్స్ క్యాడెట్స్- బీటెక్
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
-ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: ఫిబ్రవరి 5 (సాయంత్రం 6 గంటల వరకు)
-రాత పరీక్ష: ఏప్రిల్ 22
-పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, బెంగళూరు,చెన్నైతో సహా దేశవ్యాప్తం గా 41 కేంద్రాల్లో నిర్వహిస్తారు.
-ఇంటర్వ్యూలు: 2018 ఆగస్టు-సెప్టెంబర్ మధ్య
-వెబ్ సైట్: upsconline.nic.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎస్‌బీఐలో ఆఫీసర్లు ఉద్యోగాలు,

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
sbi-state-bank-of-india

వివరాలు:
దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకైన ఎస్‌బీఐని 1955 జూలై1న ఏర్పాటుచేశారు.
-మొత్తం పోస్టుల సంఖ్య: 121
(జనరల్-61, ఓబీసీ-32, ఎస్సీ-19, ఎస్టీ-9)
విభాగాలవారీగా ఖాళీలు:
-మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్ -సీఏజీ)-12, చీఫ్ మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్-సీఏజీ)-6, మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్ -ఎంసీజీ)-16, చీఫ్ మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్ -ఎంసీజీ)-24, అసెట్ మేనేజ్‌మెంట్ ఎస్‌ఏఆర్‌జీ (మేనేజర్-2, చీఫ్ మేనేజర్-1), చీఫ్ మేనేజర్ (బిజినెస్ డెవలప్‌మెంట్, మార్కెటింగ్ & ఎంఐఎస్ రిపోర్టింగ్)-5, మేనేజర్ (బిజినెస్ డెవలప్‌మెంట్, మార్కెటింగ్)-20, మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్-ఎస్‌ఎంఈబీయూ)-5, మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్-ఐబీజీ)-2, చీఫ్ మేనేజర్ (రిలేషన్‌షిప్ అండ్ సిండికేషన్స్ మేనేజ్‌మెంట్)-1, మేనేజర్ (హై వాల్యూ అగ్రి బిజినెస్ డెవలప్‌మెంట్)-4, చీఫ్ మేనేజర్ (హై వాల్యూ అగ్రి బిజినెస్ డెవలప్‌మెంట్)-1, చీఫ్ మేనేజర్ (డెబిట్ కార్డ్ బిజినెస్ )-1, మేనేజర్ (మర్చెంట్ అక్వైరింగ్ బిజినెస్ )-2, చీఫ్ మేనేజర్ (డిజిటల్ బ్యాంకింగ్)-1, మేనేజర్ (హెచ్‌ఎన్‌ఐ మార్కెటింగ్ అండ్ పబ్లిసిటీ)-1, చీఫ్ మేనేజర్ (ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్ సీఐటీయూ)-1, చీఫ్ మేనేజర్ (ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్ ఆపరేషన్)-1, మేనేజర్ (హెచ్‌ఎన్‌ఐ బ్యాంకింగ్ అండ్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్)-8, మేనేజర్ డిజిటల్ మార్కెటింగ్-2, చీఫ్ మేనేజర్ (ప్రొడక్ట్ ఇన్వెన్షన్ అండ్ మార్కెట్ రిసెర్చ్)-1, చీఫ్ మేనేజర్ (డాటా ఇంటర్‌ప్రిటేషన్/మేనేజ్‌మెంట్)-1, మేనేజర్ (మార్కెటింగ్)-1, మేనేజర్ (వెల్త్ మేనేజ్‌మెంట్ , బిజినెస్ ప్రాసెస్, మేనేజర్ టెక్నాలజీ)-1
-అర్హత: ఎంబీఏ/పీజీడీఎం, సీఏ/ఐసీడబ్ల్యూఏ, ఏసీఎస్, పీజీ (పైనాన్స్), ఎంబీఏ (మార్కెటింగ్), బీఈ/బీటెక్, ఎంబీఏ/పీజీడీబీఎం లేదా పీజీడీఎంలో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-వయస్సు: 2017 జూన్ 30 నాటికి 35 ఏండ్లకు మించరాదు (కొన్ని పోస్టులకు 38 ఏండ్లు)
-అప్లికేషన్ ఫీజు: రూ. 600/-
(రిజర్వేషన్ అభ్యర్థులురూ. 100/-)
-ఎంపిక : పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
-చివరితేదీ: ఫిబ్రవరి 4
-హార్డ్‌కాపీలకు చివరితేదీ: ఫిబ్రవరి 12
-వెబ్‌సైట్: www.statebankofindia.com
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీడబ్ల్యూసీలో ఉద్యోగాలు,

సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) ఖాళీగా ఉన్న స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ (ఎస్‌డబ్ల్యూఏ) పోస్టుల తాత్కాలిక ప్రాతిపదికన భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
cwc

వివరాలు
సీడబ్ల్యూసీ కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్నది.
-మ్తొతం పోస్టుల సంఖ్య: 21 (జనరల్-13, ఓబీసీ-5, ఎస్సీ-2, ఎస్టీ-1)
-పోస్టు పేరు: స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్
-అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి మెట్రిక్యులేషన్ లేదా ఐటీఐ చేసి ఉండాలి.
-వయస్సు: 18 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-ఎంపిక విధానం: మార్కుల ఆధారంగా. ఎంపికైన అభ్యర్థులు ఫిజికల్ లేదా స్కిల్ టెస్ట్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది.
-దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.
-దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 23
-వెబ్‌సైట్: www.cwc.gov.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బీహెచ్‌ఈఎల్‌లో అప్రెంటిస్‌లు ఉద్యోగాలు,
భోపాల్‌లోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రేడ్ అప్రెంటిస్‌ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
BHEL_2018

వివరాలు:
-మొత్తం అప్రెంటిస్‌లు- 750
-పేస్కేల్: నెలకు రూ. 7,982/-
-ఎలక్ట్రీషియన్- 155, ఫిట్టర్- 217, మెకానిస్ట్ కాంపోజిట్- 102, వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రికల్)- 108, టర్నర్- 53, కంప్యూటర్ (సీవోపీఏ/పాసా)- 36, డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మెకానిక్)- 15, ఎలక్ట్రానిక్ (మెకానిక్)- 15, మెకా నిక్ మోటార్ వెహికిల్- 17, మెకానిస్ట్ గ్రైండర్- 10, మేషన్- 5, పెయింటర్ (జనరల్)- 7, కార్పెంటర్- 4, ప్లంబర్- 8 ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు: పదోతరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐలో కనీసం 60 శాతం (ఎస్సీ/ఎస్టీలు 55 శాతం) మార్కులతో ఉత్తీర్ణత.
-వయస్సు: మార్చి 31 నాటికి 14 - 25 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎంపిక: అకడమిక్ ప్రతిభ/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఫిబ్రవరి 3
-ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొన్న కాపీ ప్రింట్ తీసి ఫిబ్రవరి 10లోగా చేరేలా కింది చిరునామాకు పంపాలి. Post Box No. 35,
Post Office Piplani, BHEL,
Bhopal Pin Code - 462022 (MP)
-వెబ్‌సైట్: http://careers.bhelbpl.co.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఏఎల్‌ఐఎంసీవోలో ఆడియాలజిస్టులు ఉద్యోగాలు,
ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఏఎల్‌ఐఎంసీవో) ఖాళీగా ఉన్న ఆడియాలజిస్ట్ (కాంట్రాక్టు ప్రాతిపదికన)పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.


వివరాలు:
ఏఎల్‌ఐఎంసీవో భారత ప్రభుత్వరంగ సంస్థ. దీని ప్రధాన కార్యాలయం కాన్పూర్‌లో ఉంది.
-పోస్టు పేరు: ఆడియాలజిస్ట్
-ఖాళీల సంఖ్య - 36
-అర్హతలు: గుర్తింపు పొందిన సంస్థ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆడియాలజీ, స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ/పీజీలో ఆడియాలజీ అం డ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీతోపాటు సెంట్రల్ రిహాబిలిటేషన్ రిజిస్టర్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
-వయస్సు: 2018, జనవరి 1నాటికి 34 ఏండ్లు మించరాదు.
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-చివరితేదీ: జనవరి 22
-వెబ్‌సైట్: http://www.alimco.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
వాప్కోస్‌లో ఇంజినీర్లు ఉద్యోగాలు.
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన వాప్కోస్ వివిధ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న ఎక్స్‌పర్ట్స్ లేదా ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
WAPCOS

వివరాలు
-మొత్తం పోస్టులు: 16
-సిస్టమ్ ఇంజినీర్ లేదా ఐటీ ఎక్స్‌పర్ట్- 1
-ప్రాజెక్ట్ పర్ఫార్మెన్స్ అండ్ మేనేజ్‌మెంట్ స్పెషలిస్ట్-1, అర్బన్ ప్లానర్-1, డిజైన్ ఇంజినీర్-1, ఎన్విరాన్‌మెంట్ స్పెషలిస్ట్-1, సపోర్ట్ ఇంజినీర్-5, ఆఫీస్ మేనేజర్-5
-అర్హతలు: సంస్థ నిబంధనల ప్రకారం.
-ఎంపిక విధానం: స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ
-దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి సంబంధిత అధికారికి పంపాలి.
-దరఖాస్తులకు చివరితేదీ: జనవరి 23
-వెబ్‌సైట్: www.wapcos.co.in

No comments:

Post a comment