Thursday, 11 January 2018

ఇండియన్ ఆయిల్‌లో జేఈఏలు, సికింద్రాబాద్‌’లో టీచర్ పోస్టులు, స్పైసెస్ రిసెర్చ్ ట్రెయినీ ఉద్యోగాలు, ఎన్‌ఐఈఎల్‌ఐటీ అడ్వాన్స్‌డ్ పీజీ డిప్లొమా ప్రవేశాలు, ఐఎంఎస్ టెక్నికల్ అసిస్టెంట్లు, ఆర్‌జీఎన్‌ఐవైడీ ట్రెయినింగ్ ఆఫీసర్లు, ఐఐటీలో ఎంబీఏ ప్రోగ్రామ్.

ఇండియన్ ఆయిల్‌లో జేఈఏలు,

-రాతపరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో మొత్తం 100 మార్కులకు ఉంటుంది. సంబంధిత సబ్జెక్ట్ నుంచి 75 మార్కులు, జనరల్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, జనరల్ ఇంగ్లిష్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ అండ్ జనరల్ నాలెడ్జ్‌ల నుంచి 25 మార్కులు.
-ఈ ఆబ్జెక్టివ్ పరీక్షకు 90 నిమిషాల సమయం కేటాయించారు.
-నెగెటివ్ మార్కింగ్ విధానం లేదు.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్) బరౌని రిఫైనరీ నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ (జేఈఏ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
iocrefrecruit
వివరాలు:
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది ఇండియాలోని ఫార్చ్యూన్ గ్లోబల్ 500 కంపెనీల్లో అతిపెద్ద వాణిజ్య సంస్థ.
-మొత్తం ఖాళీల సంఖ్య: 58 పోస్టులు
-విభాగాలు: కెమికల్, పవర్ & యుటిలిటీస్, ఫైర్ అండ్ సేఫ్టీ, ఎలక్ట్రికల్, క్వాలిటీ కంట్రోల్, మెటీరియల్స్, స్టాఫ్ నర్స్
-జూ. ఇంజినీరింగ్ అసిస్టెంట్ (ప్రొడక్షన్)- 30
-అర్హత: కెమికల్/రిఫైనరీ & పెట్రోకెమికల్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా లేదా బీఎస్సీ (ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ/ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ)లో ఉత్తీర్ణత.
-జూ. ఇంజినీరింగ్ అసిస్టెంట్ (పీ & యు)- 6
-అర్హత: మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత. పదోతరగతితో ఐటీఐ (ఫిట్టర్)తోపాటు బాయిలర్ కాంపిటెన్సీ సర్టిఫికెట్ ఉండాలి లేదా బీఎస్సీ (పీసీఎం)తోపాటు అప్రెంటిస్‌షిప్ చేసి ఉండాలి.
-జూ. కంట్రోల్ రూమ్ ఆపరేటర్/అసిస్టెంట్-8
-అర్హత: ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమాలో ఉత్తీర్ణత.
-జూ. క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ (క్యూ సీ)- 4
-అర్హత: బీఎస్సీ (ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ/ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ)లో ఉత్తీర్ణత.
-జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ (ఫైర్&సేఫ్టీ)-1
-అర్హత: మెట్రిక్యులేషన్+నాగ్‌పూర్ ఎన్‌ఎఫ్‌ఎస్సీచే సబ్ ఆఫీసర్స్ కోర్సు లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. సంస్థ సూచించిన నమూనాలో ఫిజికల్ కొలతలను కలిగి ఉండాలి.
-జూనియర్ మెటీరియల్ అసిస్టెంట్-1
-అర్హత: మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
-జూనియర్ నర్సింగ్ అసిస్టెంట్ (స్టాఫ్ నర్స్)- 1
-అర్హత: నాలుగేండ్ల బీఎస్సీ (నర్సింగ్) లేదా నర్సింగ్ & మిడ్‌వైఫరీ లేదా ఓ అండ్ జీలో మూడేండ్ల డిప్లొమాలో ఉత్తీర్ణత.
గమనిక: పైన అన్ని పోస్టులకు జనరల్, ఓబీసీలు 50 శాతం, ఎస్సీ, ఎస్టీలు 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో ఏడాది అనుభవం.
-వయస్సు: 18 నుంచి 26 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: రూ. 11,900-32,000/-
-ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా. రాత పరీక్షలో సంస్థ నిర్ణయించిన కనీస మార్కులను సాధించాలి.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
-దరఖాస్తులకు చివరితేదీ: జనవరి 20
-ఆన్‌లైన్ హార్డ్‌కాపీలకు చివరితేదీ: జనవరి 31
-రాతపరీక్ష తేదీ: ఫిబ్రవరి 4
-ఫలితాలు విడుదల: ఫిబ్రవరి 12
-వెబ్‌సైట్: www.iocrefrecruit.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సికింద్రాబాద్‌’లో టీచర్ పోస్టులు,

సికింద్రాబాద్ ఆర్‌కేపురంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
apsrkpuram

వివరాలు:
-మొత్తం ఖాళీలు- 39
-విభాగాల వారీగా ఖాళీలు, అర్హతలు
-ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ)- 16 ఖాళీలు (ఫిజిక్స్-1, కెమిస్ట్రీ-1, సోషల్ సైన్స్ -3, మ్యాథ్స్-4, ఇంగ్లిష్-4, హిందీ- 2, సంస్కృతం-1)
-అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత. బోధనలో అనుభవం ఉండాలి. బీఎడ్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత.
-పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్- 7 ఖాళీలు. (ఫిజిక్స్- 1, బయాలజీ- 1, పొలిటికల్ సైన్స్- 1, జాగ్రఫీ- 1, సైకాలజీ- 1, ఎకనామిక్స్- 1, హిస్టరీ - 1)
-అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో పీజీతోపాటు బీఈడీ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. బోధించే సామర్థ్యం, అనుభవం ఉండాలి.
నోట్: ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ నిర్వహించిన సీఎస్‌బీ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయినవారికి ప్రాధాన్యం ఇస్తారు.
-ప్రైమరీ టీచర్స్ (పీఆర్‌టీ)- 12 ఖాళీలు.
-అర్హతలు: గ్రాడ్యుయేషన్‌తోపాటు డీఈడీ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
-టీజీటీ, పీఆర్‌టీ పోస్టులకు సీటెట్/టెట్ ఎగ్జామ్, అవేస్ నిర్వహించిన సీఎస్‌బీలో అర్హత సాధించినవారికి ప్రాధాన్యం ఇస్తారు.
-ఫిజికల్ ట్రెయినింగ్ ఇన్‌స్ట్రక్టర్ (పీటీఐ-పీఆర్‌టీ)- 2
-అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ ఉండాలి.
-పీఆర్‌టీ- మ్యూజిక్ (వెస్ట్రన్) - 1
-ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ - 1
-అర్హతలు: పై రెండు పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, సీబీఎస్‌ఈ నిబంధనల ప్రకారం అర్హతలు ఉండాలి.
-వయస్సు: అనుభవం ఉన్నవారికి 57 ఏండ్ల లోపు, ఫ్రెషర్స్‌కు 40 ఏండ్లు మించరాదు.
-దరఖాస్తు: స్కూల్ వెబ్‌సైట్‌లో
-ఫీజు: రూ. 100/-
-పూర్తిచేసిన దరఖాస్తును దాఖలు చేయడానికి చివరితేదీ: జనవరి 31
పాఠశాల చిరునామా:
ఆర్మీ పబ్లిక్ స్కూల్,
ఆర్‌కేపురం, సికింద్రాబాద్
వెబ్‌సైట్: http://www.apsrkpuram.edu.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
స్పైసెస్ రిసెర్చ్ ట్రెయినీ  ఉద్యోగాలు,
కొచ్చిన్‌లోని స్పైసెస్ బోర్డు రిసెర్చ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
indian-spices

వివరాలు:
స్పైసెస్ బోర్డు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తుంది. ప్రస్తుత ఖాళీలను షెడ్యూల్ కులాల అభ్యర్థులతో భర్తీ చేయనున్నారు.
-పోస్టు: స్పైసెస్ రిసెర్చ్ ట్రెయినీ
విభాగాల వారీగా ఖాళీలు అర్హతలు:
-క్రాప్ ఇంప్రూవ్‌మెంట్ (బాటనీ) - 2
-అర్హత: ఎమ్మెస్సీ బాటనీ/ బయోటెక్నాలజీతోపాటు కంప్యూటర్‌పై పనిచేసే సామర్థ్యం ఉండాలి.
-ఆగ్రానమీ అండ్ సాయిల్ సైన్స్ - 6
-అర్హతలు: ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ/ఆగ్రానమీ/ సాయిల్ సైన్స్)తోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
-ప్లాంట్ పాథాలజీ- 4
-అర్హతలు: ఎమ్మెస్సీ (మైక్రోబయాలజీ/బాటనీ)తోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
-ఎంటమాలజీ- 4
-అర్హతలు: ఎమ్మెస్సీ (ఎంటమాలజీ/జువాలజీ)తోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
-వయస్సు: పై పోస్టులన్నింటికి 2018, జనవరి 1 నాటికి 35 ఏండ్లు మించరాదు.
-స్టయిఫండ్: నెలకు రూ. 17,000/-
-ఈ పోస్టులను ఏడాది కాలపరిమితికి తీసుకొంటారు. తర్వాత అవసరాన్ని బట్టి మరో ఏడాది పొడిగిస్తారు.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా చేస్తారు
-ఇంటర్వ్యూ తేదీ: జనవరి 17
-వెబ్‌సైట్: www.indianspices.com

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఐఈఎల్‌ఐటీ అడ్వాన్స్‌డ్ పీజీ డిప్లొమా ప్రవేశాలు,
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఈఎల్‌ఐటీ) పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
NIELIT 

వివరాలు:
ఎన్‌ఐఈఎల్‌ఐటీ సంస్థ కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ పరిధిలో పనిచేస్తుంది. ఎన్‌ఐఈఎల్‌ఐటీకి దేశవ్యాప్తంగా కేంద్రాలు ఉన్నాయి.
-కోర్సు: అడ్వాన్స్‌డ్ పీజీ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్
-కాలవ్యవధి: ఏడాది. దీనిలో ఆరునెలలు థీయరీ, మరో ఆరునెలలు ఇండస్ట్రీలో ఇంటర్న్‌షిప్ ఉంటుంది.
-కోర్సు ప్రారంభం: ఫిబ్రవరి 19
-అర్హతలు: ఎంటెక్/బీటెక్ లేదా ఎమ్మెస్సీ

-వెబ్‌సైట్: www.nielit.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఎంఎస్ టెక్నికల్ అసిస్టెంట్లు,
చెన్నైలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ (ఐఎంఎస్)లో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
imsc

వివరాలు:
-ఐఎంఎస్ అనేది ఒక స్వతంత్ర సంస్థ. ఇది డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ పరిధిలోనిది.
-పోస్టు: టెక్నికల్ అసిస్టెంట్
-ఖాళీల సంఖ్య - 2
-పేస్కేల్: నెలకు రూ. 20,000/-
-అర్హతలు: డిగ్రీలో (ఫిజిక్స్/మ్యాథ్స్ లేదా కంప్యూటర్‌సైన్స్ / ఐటీ) లేదా కంప్యూటర్ అప్లికేషన్స్, కామర్స్ చదివి ఉండాలి లేదా ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులు.
-పనిచేయాల్సిన ప్రదేశం: చెన్నై
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జనవరి 18
-వెబ్‌సైట్: https://www.imsc.res.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఆర్‌జీఎన్‌ఐవైడీ ట్రెయినింగ్ ఆఫీసర్లు,
రాజీవ్‌గాంధీ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్‌మెంట్ (ఆర్‌జీఎన్‌ఐవైడీ)లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ట్రెయినింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
RGNIYD

వివరాలు:
ఆర్‌జీఎన్‌ఐవైడీ జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థ. ఇది యువజన వ్యవహారాలు, క్రీడాశాఖ పరిధిలో పనిచేస్తుంది.
-పోస్టు: ట్రెయినింగ్ ఆఫీసర్- 10 ఖాళీలు
-అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో పీజీ (హ్యుమానిటీస్/సోషల్ సైన్సెస్ లేదా మేనేజ్‌మెంట్ సైన్సెస్/లా)తోపాటు రెండేండ్ల అనుభవం, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జనవరి 19
-వెబ్‌సైట్: http://www.rgniyd.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐటీలో ఎంబీఏ ప్రోగ్రామ్.

దేశంలోని వివిధ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లలో 2018-20 అకడమిక్ ఇయర్‌కు ఎంబీఏ/ఎంఎంజీటీ ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
-కోర్సు పేరు: ఎంబీఏ/ఎంఎంజీటీ
-వివరాలు: ఈ కోర్సును ఐఐటీ (బాంబే, ఢిల్లీ, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, రూర్కీ)ల్లో కల్పిస్తారు.
-కోర్సు కాలపరిమితి: రెండేండ్లు
-అర్హత: బ్యాచిలర్ డిగ్రీతోపాటు క్యాట్ స్కోర్ ఉండాలి.
-ఎంపిక: క్యాట్ స్కోర్, ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
-దరఖాస్తు దాఖలకు చివరితేదీ: జనవరి 29
-ఇంటర్వ్యూతేదీ: ఫిబ్రవరి, మార్చి
-వెబ్‌సైట్: www.iitd.ac.in

No comments:

Post a Comment