Monday, 22 January 2018

రామగుండంలో మేనేజ్‌మెంట్ ట్రెయినీలు, పవర్‌గ్రిడ్‌లో డిప్లొమా ట్రెయినీలు, సీఐఎంఎఫ్‌ఆర్‌లో టెక్నీషియన్లు ఉద్యోగాలు, సీఈసీఆర్‌ఐలో ఉద్యోగాలు. ఇస్రో శాటిలైట్ సెంటర్‌లో ఉద్యోగాలు, ఐటీఐ లిమిటెడ్ మేనేజర్లు,ఏఈఈ పోస్టులు.

రామగుండంలో మేనేజ్‌మెంట్ ట్రెయినీలు,

భారత ప్రభుత్వరంగ సంస్థ పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పీజీసీఐఎల్)లో డిప్లొమా ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
powergrid
వివరాలు: పవర్‌గ్రిడ్ ఒక పబ్లిక్ సెక్టార్ నవరత్న కంపెనీ. ఇది కేంద్ర విద్యుత్‌శాఖ పరిధిలో పనిచేస్తుంది. ప్రస్తుత ఖాళీలు పవర్‌గ్రిడ్ వెస్టర్న్ రీజియన్‌లో ఉన్నాయి.
-పోస్టు పేరు:డిప్లొమా ట్రెయినీ (ఎలక్ట్రికల్)-40 (జనరల్-20, ఓబీసీ-8, ఎస్సీ-7, ఎస్టీ-5)
-పోస్టు పేరు:డిప్లొమా ట్రెయినీ (సివిల్) - 5
(జనరల్ - 3, ఎస్సీ - 1, ఎస్టీ - 1)
-పోస్టు పేరు:జూనియర్ ఆఫీసర్ ట్రెయినీ
(హెచ్‌ఆర్)-3 (జనరల్- 2, ఓబీసీ- 1)
-అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 70 శాతం మార్కులతో సంబంధిత బ్రాంచీలో డిప్లొమా ఇంజినీరింగ్. జూనియర్ ఆఫీసర్ ట్రెయినీ పోస్టుకు ఎంబీఏ హెచ్‌ఆర్/పర్సనల్ మేనేజ్‌మెంట్ లేదా ఇండస్ట్రియల్ రిలేషన్స్ లేదా ఎంఎస్‌డబ్ల్యూలో రెండేండ్ల ఫుల్‌టైం పీజీ/పీజీ డిప్లొమాలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-వయస్సు: జనరల్ అభ్యర్థులకు 27 ఏండ్లు, ఓబీసీలకు 30 ఏండ్లు, ఎస్సీ/ఎస్టీలకు 32 ఏండ్లు మించరాదు.
-స్టయిఫండ్: శిక్షణ సమయంలో నెలకు
రూ. 16,500/- చెల్లిస్తారు.
-శిక్షణానంతరం రూ. 16,000 - 35,500/-
-ఎంపిక: రాతపరీక్ష
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జనవరి 25
-వెబ్‌సైట్: www.powergridindia.com
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
పవర్‌గ్రిడ్‌లో డిప్లొమా ట్రెయినీలు,

ఇంజినీరింగ్ అభ్యర్థులకు అవకాశం
-గేట్ స్కోర్ ఆధారంగా ఎంపిక
-మంచి జీతభత్యాలు, ఉద్యోగభద్రత

న్యూఢిల్లీలోని రామగుండం ఫెర్టిలైజర్స్ & కెమికల్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్) టెక్నికల్ విభాగంలో ఖాళీగా ఉన్న మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Team

వివరాలు: ఆర్‌ఎఫ్‌సీఎల్ అనేది నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమెటెడ్ (ఎన్‌ఎఫ్‌ఎల్), ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్), ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆప్ ఇండియా లిమిటెడ్ (ఎఫ్‌సీఐఎల్) సంస్థల జాయింట్ వెంచర్ కంపెనీ. ఎన్‌ఎఫ్‌ఎల్‌ను న్యూఢిల్లీలో 1974 ఆగస్టు 23న ఏర్పాటుచేశారు.
-పోస్టు పేరు: మేనేజ్‌మెంట్ ట్రెయినీ
-మొత్తం పోస్టుల సంఖ్య: 46
విభాగాలవారీగా ఖాళీలు:
-మేనేజ్‌మెంట్ ట్రెయినీ (కెమికల్)-35 (జనరల్-19, ఓబీసీ-9, ఎస్సీ-5, ఎస్టీ-2)
-మేనేజ్‌మెంట్ ట్రెయినీ (మెకానికల్)-10 (జనరల్-7, ఓబీసీ-2, ఎస్సీ-1)
-మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఎలక్ట్రికల్)-8 (జనరల్-5, ఓబీసీ-2, ఎస్సీ-1)
-మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఇన్‌స్ట్రుమెంటేషన్)-8 (జనరల్-5, ఓబీసీ-2, ఎస్సీ-1)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ లేదా తత్సమాన పరీక్షలో 60 శాతం (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం) మార్కులతో ఉత్తీర్ణత. సంబంధిత ఇంజినీరింగ్ బ్రాంచిలో గేట్ స్కోర్ -2016లో
అర్హత సాధించాలి. సంబంధిత రంగంలో ఏడాది అనుభవం ఉండాలి.
-వయస్సు: 2018 జనవరి 1 నాటికి 27 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులు పదేండ్లవరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: రూ. 16,400-40,500/- డీఏ, హెచ్‌ఆర్‌ఏ, మెడికల్, తదితర సౌకర్యాలు కల్పిస్తారు. మేనేజ్‌మెంట్ ట్రెయినీగా ఎంపికైన అభ్యర్థులకు
ఏడాదికి సుమారుగా రూ. 7.53 లక్షలు జీతం సంస్థ చెల్లిస్తుంది.
-దరఖాస్తు ఫీజు: రూ. 700/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.
-ఎంపిక: గేట్ -2016 స్కోర్- +ఇంటర్వ్యూ
-గేట్ -2016 స్కోర్‌కు 80 శాతం, ఇంటర్వ్యూకు 20 శాతం వెయిటేజీ ఇచ్చి ఫైనల్ సెలక్షన్ చేస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
-దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 9
(సాయంత్రం 5.30 గంటలకు)
-వెబ్‌సైట్: www.nationalfertilizers.com
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీఐఎంఎఫ్‌ఆర్‌లో టెక్నీషియన్లు ఉద్యోగాలు,
సీఎఎస్‌ఐఆర్-సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రిసెర్చ్ (సీఐఎంఎఫ్‌ఆర్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
CIMFR
వివరాలు:సీఐఎంఎఫ్‌ఆర్ అనేది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎఎస్‌ఐఆర్) పరిధిలో పనిచేస్తున్న సంస్థ
-మొత్తం ఖాళీల సంఖ్య-18 పోస్టులు
(జనరల్-8, ఓబీసీ-3, ఎస్సీ-2, ఎస్టీ-4)
-పోస్టు పేరు: గ్రేడ్-2 టెక్నీషియన్
-విభాగాలు: కార్పెంటర్, సర్వేయర్, ప్లంబర్/పంప్ ఆపరేటర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, హౌస్ కీపింగ్
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి క నీసం 55 శాతం మార్కులతో పదోతరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత.
-వయస్సు: 35 ఏండ్లకు మించరాదు
-పే స్కేల్: రూ.5, 200-20, 200+గ్రేడ్ పే రూ. 1,900/-
-అప్లికేషన్ ఫీజు: రూ. 100/-
-ఎంపిక: ట్రేడ్ టెస్ట్/స్కిల్ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి, సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.
చిరునామా: Controller of
Administration, CIMFR,
Barwa Road, Dhanbad -826015 JHARKHAND.
-చివరితేదీ: ఫిబ్రవరి 15
-వెబ్‌సైట్ : www.cimfr.nic.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీఈసీఆర్‌ఐలో ఉద్యోగాలు.

సీఎస్‌ఐఆర్ - సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఈసీఆర్‌ఐ) సైంటిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
cecri-building
-పోస్టు పేరు: సైంటిస్ట్- 11 పోస్టులు
-వయస్సు: 32 ఏండ్లు మించరాదు
-సీనియర్ సైంటిస్ట్- 2
-వయస్సు: 37 ఏండ్లు మించరాదు
-సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్- 1
-టెక్నికల్ అసిస్టెంట్- 5
-మెడికల్ ఆఫీసర్ (మహిళ)- 1
నోట్: వేర్వేరు పోస్టులకు వేర్వేరుగా ఉన్నాయి.
వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఫిబ్రవరి 12
-వెబ్‌సైట్: www.cecri.res.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఇస్రో శాటిలైట్ సెంటర్‌లో ఉద్యోగాలు,

బెంగళూరులోని ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) శాటిలైట్ సెంటర్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జేఆర్‌ఎఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
isro
వివరాలు:ఉపగ్రహాలు నిర్మించడానికి, అనుబంధ ఉపగ్రహా సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి ఇస్రోకు ప్రధాన కేంద్రంగా ఇస్రో శాటిలైట్ సెంటర్ పనిచేస్తుంది.
-పోస్టు పేరు: జేఆర్‌ఎఫ్
-మొత్తం ఖాళీల సంఖ్య-20
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత బ్రాంచీలనుంచి ఎంఈ/ఎంటెక్, ఎమ్మెస్సీ (ఇంజినీరింగ్), ఎమ్మెస్సీ (ఫిజిక్స్, కెమిస్ట్రీ)లో 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత. నెట్, జామ్, గేట్, జెస్ట్ లేదా తత్సమాన అర్హత పరీక్షలో ఉత్తీర్ణత.
-వయస్సు: 2018 ఫిబ్రవరి 2 నాటికి 28 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్లవరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: రూ.25000/-. అదనంగా హెచ్‌ఆర్‌ఏను చెల్లిస్తారు.
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు:ఆన్‌లైన్ ద్వారా
-చివరితేదీ: ఫిబ్రవరి 2
-వెబ్‌సైట్: www.isro.gov.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐటీఐ లిమిటెడ్ మేనేజర్లు,ఏఈఈ పోస్టులు.
బెంగళూరులోని ఐటీఐ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్లు, అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 
ITI-Limited 
వివరాలు: ఐటీఐ లిమిటెడ్ అనేది భారత ప్రభుత్వ సంస్థ. ఇది పబ్లిక్ సెక్టార్ టెలికం కంపెనీ. ప్రస్తుత ఖాళీలను ఐదేండ్ల కాలానికి భర్తీ చేయనున్నారు.
-మేనేజర్ - 20 ఖాళీలు. 
-ప్రాజెక్టుల వారీగా ఖాళీలు, అర్హతలు..
-ఆస్కాన్/డిఫెన్స్ నెట్‌వర్క్ - 4 ఖాళీలు
-జీపీవోఎన్/భారత్ నెట్ - 4 ఖాళీలు
-అర్హతలు: పై రెండు పోస్టులకు బీఈ/బీటెక్‌లో టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదా ఈసీఈ, సివిల్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత.
-ఫైనాన్స్- 4 ఖాళీలు
-అర్హతలు: సీఏ/ఐసీడబ్ల్యూఏ లేదా ఫుల్‌టైం ఎంబీఏ (ఫైనాన్స్) ఉత్తీర్ణత.
-ఎంకేటీజీ- 4 ఖాళీలు
-అర్హతలు: బీఈ/బీటెక్‌లో ఈసీఈ/ఈఈఈ ఉత్తీర్ణత. ఎంబీఏ మార్కెటింగ్ చేసినవారికి ప్రాధాన్యం ఇస్తారు.
-హెచ్‌ఆర్- 4 ఖాళీలు
-అర్హతలు: హెచ్‌ఆర్/సోషల్ వర్క్ లేదా పర్సనల్ మేనేజ్‌మెంట్ లేదా ఇండస్ట్రియల్ రిలేషన్స్‌లో రెండేండ్ల ఫుల్‌టైం పీజీ ఉత్తీర్ణత లేదా తత్సమాన పీజీ డిప్లొమా (సంబంధిత విభాగంలో)
-అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు
-ఖాళీల సంఖ్య - 25
-విభాగాలు: ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్.
-కాలపరిమితి: మొదట ఐదేండ్ల కాలపరిమితికి తీసుకుంటారు. తర్వాత అవకాశాన్ని బట్టి రెగ్యులర్ చేయవచ్చు.
-అర్హతలు: బీఈ/బీటెక్‌లో సంబంధిత విభాగంలో ఉత్తీర్ణత. జనరల్/ఓబీసీలకు కనీసం 65 శాతం, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలు 63 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. 
-వయస్సు: 30 ఏండ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఫిబ్రవరి 5

-వెబ్‌సైట్: http://www.itiltd-india.com


No comments:

Post a comment