Monday, 12 March 2018

ఎంఎస్‌ఐటీ ప్రోగ్రామ్-2018, జిప్‌మర్‌లో ఎంబీబీఎస్ ప్రవేశాలు, వెక్టార్ కంట్రోల్‌లో టెక్నీషియన్లు ఉద్యోగాలు, ఐఐటీ జోధ్‌పూర్ ఉద్యోగాలు, వాటర్‌వేస్‌లో కన్సల్టెంట్లు ఉద్యోగాలు, నైపర్‌లో ఉద్యోగాలు.

ఎంఎస్‌ఐటీ ప్రోగ్రామ్-2018,

హైదరాబాద్‌లోని ట్రిపుల్ ఐటీ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ -ఎంఎస్‌ఐటీ ప్రోగ్రామ్ లో ప్రవేశాలకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
JEE-Mains

వివరాలు:
ఈ ప్రోగ్రామ్‌ను ఐఐఐటీహెచ్, జేఎన్టీయూ- హైదరాబాద్, కాకినాడ, అనంతపురం, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ లెర్నింగ్ సెంటర్‌లతో ఏర్పడిన కన్సార్టియం ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.
-కోర్స్ పేరు: మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎంఎస్‌ఐటీ) ప్రోగ్రామ్
-విభాగాలు: మెషిన్ లెర్నింగ్, కంప్యూటర్ నెట్‌వర్క్స్, ఈ-బిజినెస్ టెక్నాజీస్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, సాప్ట్‌వేర్ ఇంజినీరింగ్, డాటా అనలిటిక్స్ అండ్ డాటా విజువలైజేషన్ అండ్ మొబైల్ టెక్నాలజీస్.
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ (బీఈ/బీటెక్) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.

ఎంఎస్‌ఐటీ సీట్ల వివరాలు
-మొత్తం సీట్ల సంఖ్య: 360
-ట్రిపుల్ ఐటీ హైదరాబాద్-110
-జేఎన్టీయూ హైదరాబాద్-100
-జేఎన్టీయూ కాకినాడ-50
-జేఎన్టీయూ అనంతపురం-50
-శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ-50

-ఫీజు: ఐఐఐటీహెచ్‌లో రూ. 2,00,000, జేఎన్టీయూహెచ్‌లో రూ. 1,70,000, జేఎన్టీయూకే,జేఎన్టీయూఏ, ఎస్‌వీయూలో రూ. 1,60,000/- వీటితోపాటు అడ్మిషన్ ఫీజు: రూ. 30,000, ప్రిపరేటరీ ఫీజు: రూ. 10,000/-
-గమనిక: ఐఐఐటీహెచ్, జేఎన్టీయూహెచ్ ఎంట్రెన్స్ టెస్ట్‌లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఎంఎస్‌ఐటీ మెయిన్ ప్రోగ్రామ్‌లో నేరుగా ప్రవేశాలు కల్పిస్తారు. జేఎన్టీయూకే, జేఎన్టీయూఏ, ఎస్‌వీయూల్లో 4 వారాల ప్రిపరేటరీ ప్రోగ్రామ్ తర్వాత ఎంఎస్‌ఐటీ మెయిన్ ప్రోగ్రామ్‌లో అడ్మిషన్ కల్పిస్తారు

-అప్లికేషన్ ఫీజు: రూ. 1000/-
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: మే 14
-రెగ్యులర్ జీఏటీ ఎంట్రెన్స్ టెస్ట్: మే 27
-వాక్‌ఇన్ ఆన్‌లైన్ పరీక్ష: మార్చి 15 నుంచి మే 19 వరకు (ప్రతి గురు, శుక్ర, శని, ఆదివారాల్లో నిర్వహిస్తారు)
-రెగ్యులర్ జీఏటీ ఎంట్రెన్స్ టెస్ట్ ఫలితాలు విడుదల: జూన్ 3
-వెబ్‌సైట్: www.msitprogram.net

-ఎంపిక: ఆన్‌లైన్ పరీక్ష ద్వారా/గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (జీఏటీ)
-గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌ను రెండు విధాలుగా నిర్వహిస్తారు. మొదటిది అభ్యర్థులు వారి అనుకూలమైన తేదీల్లో ఆన్‌లైన్‌ల్లో www. msitprog ram.net లో స్లాట్ బుకింగ్ చేసికోవాలి. వాక్‌ఇన్ ఆన్‌లైన్ పరీక్షను హైదరాబాద్, కాకినాడలో నిర్వహిస్తారు. రెండోది రెగ్యులర్ జీఏటీ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్ణయించిన తేదీన హైదరాబాద్, వరంగల్, విజయవాడ, కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం, అనంతపురంలో పరీక్ష ఉంటుంది.
-గమనిక: జీఆర్‌ఈ టెస్ట్‌ను 2015 జూలై తర్వాత జీఆర్‌ఈ స్కోర్ (301/3.5) ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఎంట్రెన్స్ పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. వీరు డైరెక్టుగా ఎంఎస్‌ఐటీ మెయిన్ ప్రోగ్రామ్‌లో ప్రవేశం పొందవచ్చు.
-అర్హత కలిగిన అభ్యర్థులు వాక్‌ఇన్ ఎంట్రెన్స్ టెస్ట్ లేదా రెగ్యులర్ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా అడ్మిషన్ పొందవచ్చు. వీలైతే రెండు పరీక్షలకు హాజరుకావచ్చు.
-రెండు పరీక్షల్లో బెస్ట్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటారు
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
జిప్‌మర్‌లో ఎంబీబీఎస్ ప్రవేశాలు,

పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (జిప్‌మర్) 2018-19 విద్యాసంవత్సరానికి ఎంబీబీఎస్ కోర్సు ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Jipmer-mbbs-exm

వివరాలు:
దేశంలోని ప్రతిష్ఠాత్మక వైద్య విజ్ఞాన సంస్థల్లో జిప్‌మర్ ఒకటి. ఈ ఇన్‌స్టిట్యూట్‌ను 1956లో స్థాపించారు. జిప్‌మర్‌కు పుదుచ్చేరితోపాటు, కరైకల్‌లో క్యాంపస్‌లు ఉన్నాయి. ఈ రెండు క్యాంపస్‌ల్లో కలిపి మొత్తం 200 సీట్లు ఉన్నాయి.
-కోర్సు పేరు: ఎంబీబీఎస్
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి ఇంటర్ (ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ) లేదా 10+2లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 2018 లో ఇంటర్ ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
Jipmer-mbbs-exm1
-వయస్సు: 2018 డిసెంబర్ 31 నాటికి 17 ఏండ్లు నిండి ఉండాలి.
-అప్లికేషన్ ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ. 3000/-, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 1200/-, పీహెచ్‌సీ అభ్యర్థులకు ఫీజు లేదు.
-ఎంపిక: ఆన్‌లైన్ పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్)

-దేశవ్యాప్తంగా 120 కేంద్రాల్లో ఆన్‌లైన్‌లో కంప్యూటర్ బేస్డ్ విధానం (సీబీటీ)లో రాతపరీక్ష నిర్వహిస్తారు.
-జూన్ 3న రెండు విడతలుగా (ఉదయం, మధ్యాహ్నం) 150 నిమిషాల్లో రాతపరీక్షను నిర్వహిస్తారు.
-ఆబ్జెక్టివ్ విధానంలో ఐదు విభాగాల నుంచి 200 ప్రశ్నలను ఇస్తారు.
-పరీక్ష పేపర్ ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది. సంస్థ నిర్ణయించిన కనీస అర్హత మార్కులను సాధించాలి.
-ప్రతి ప్రశ్నకు 4 మార్కులు, తప్పు సమాధానానికి 1 మార్కును తగ్గిస్తారు.
-ఈ ఆబ్జెక్టివ్ రాతపరీక్ష ఇంటర్ స్థాయిలో ఉంటుంది.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 13
-హాల్‌టిక్కెట్ డౌన్ లోడింగ్: మే 21 నుంచి
-జిప్‌మర్ ఎంబీబీఎస్ పరీక్షతేదీ: జూన్ 3
-కౌన్సెలింగ్ తేదీలు: జూన్ 27 నుంచి 29 వరకు
-వెబ్‌సైట్: www.jipmer.edu.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
వెక్టార్ కంట్రోల్‌లో టెక్నీషియన్లు ఉద్యోగాలు,
పుదుచ్చేరిలోని వెక్టార్ కంట్రోల్ రిసెర్చ్ సెంటర్‌లో కింది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
VCRC-Recruitment

వివరాలు:
వెక్టార్ కంట్రోల్ అనేది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ పరిధిలో పనిచేస్తుంది.
-ప్రాజెక్ట్ టెక్నీషియన్లు - 11 పోస్టులు. (జనరల్ - 3, ఓబీసీ - 4, ఎస్సీ - 3, ఎస్టీ - 1)
-అర్హతలు: బీఎస్సీ/ఇంటర్ సైన్స్ సబ్జెక్టులు చదివి ఉండాలి. డిగ్రీ చదివిన వారికి మూడేండ్లు, ఇంటర్ చదివినవారికి రెండేండ్ల అనుభవం ఉన్నట్లుగా పరిగణిస్తారు.
-వయస్సు: ఇంటర్వ్యూ తేదీ నాటికి 28 ఏండ్లు మించరాదు
-జీతం: నెలకు రూ. 17,000/-
-ఈ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
-వెబ్‌సైట్: www.vcrc.res.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐటీ జోధ్‌పూర్ ఉద్యోగాలు,
జోధ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో ఇంజినీర్లు, జూనియర్ అసిస్టెంట్లు, రిజిస్ట్రార్ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
iit-jodhpur

వివరాలు:
-రిజిస్ట్రార్ - 1, డిప్యూటీ రిజిస్ట్రార్ - 1, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ - 1, అసిస్టెంట్ రిజిస్ట్రార్ - 1,అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) - 1, ఏఈఈ (ఎలక్ట్రికల్) - 1, జూనియర్ ఇంజినీర్ (సివిల్) - 1, జేఈ (ఎలక్ట్రికల్) - 1, అసిస్టెంట్ మేనేజర్ (హార్టికల్చర్) - 1, అసిస్టెంట్ - 2, జూనియర్ అసిస్టెంట్ - 6, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (కెమిస్ట్రీ) - 1, జేటీఏ (ఆటోమేషన్) - 1, జేటీఏ (బయోసైన్స్ అండ్ బయో ఇంజినీరింగ్) - 1, జేటీఏ (కెమికల్ ఇంజినీరింగ్) - 2, జేటీఏ (సివిల్ ఇంజినీరింగ్) - 2, జేటీఏ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) - 1, జేటీఏ (మెకానికల్ ఇంజినీరింగ్) - 1, జేటీఏ (మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్) - 2, జేటీఏ (ఫిజిక్స్) - 2, జేటీఏ (ఇన్‌స్ట్రుమెంటేషన్) - 1 ఖాళీ ఉన్నాయి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: మార్చి 13
-హార్డ్‌కాపీ పంపడానికి చివరితేదీ: మార్చి 20
-వెబ్‌సైట్: http://www.iitj.ac.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
వాటర్‌వేస్‌లో కన్సల్టెంట్లు ఉద్యోగాలు,
ఇన్‌లాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
IWAI

వివరాలు:
ఇన్‌లాండ్ వాటర్‌వేస్ కేంద్ర నౌకాయాన శాఖ పరిధిలో పనిచేస్తుంది.
-చీఫ్ కన్సల్టెంట్ (ట్రాఫిక్) - 1, సీనియర్ కన్సల్టెంట్ (ట్రాఫిక్) - 1, సీనియర్ కన్సల్టెంట్ (మార్కెటింగ్ అండ్ లాజిస్టిక్స్) - 2, కన్సల్టెంట్ (మార్కెటింగ్ అండ్ లాజిస్టిక్స్) పాట్నా - 1, కన్సల్టెంట్ (మార్కెటింగ్ అండ్ లాజిస్టిక్) గువాహటి - 1, కన్సల్టెంట్ (ఎం & ఎల్) - 1, కన్సల్టెంట్ (అడ్మిన్ & ఫైనాన్స్) - 1 ఖాళీ ఉన్నాయి.
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-చివరితేదీ: ఏప్రిల్ 5
-వెబ్‌సైట్: www.iwai.nic.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నైపర్‌లో  ఉద్యోగాలు.

గువాహటిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (నైపర్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.


వివరాలు:
దేశంలోని ఔషధ విజ్ఞానశాస్త్రంలో నాణ్యమైన విద్య, ఉన్నత పరిశోధనలు చేయడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రం నైపర్.
-మొత్తం పోస్టుల సంఖ్య-10 ( అసోసియేట్ ప్రొఫెసర్-3, అసిస్టెంట్ ప్రొఫెసర్-3, సిస్టమ్ ఇంజినీర్-1, సెక్షన్ ఆఫీసర్-1, అసిస్టెంట్ గ్రేడ్3 (అడ్మినిస్ట్రేషన్-1, అకౌంట్స్-1)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత మాస్టర్ డిగ్రీ/ఎం ఫార్మా లేదా ఎంఎస్ ఫార్మా, ఎంసీఏ, బీఈ, పీజీ, ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత.
-ఎంపిక: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్
-చివరి తేదీ: ఏప్రిల్ 5
-వెబ్‌సైట్:http://niperguwahati.ac.in

No comments:

Post a Comment