Friday, 27 April 2018

ఇస్రోలో 78 టెక్నీషియన్ ఉద్యోగాలు, ఎయిర్ ఇండియాలో 295 ఉద్యోగాలు, నాల్కోలో గ్రాడ్యుయేట్ ఇంజినీర్లు ఉద్యోగాలు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్‌లు, ఐఐఎస్‌ఈఆర్ నాన్ టీచింగ్ ఉద్యోగాలు.

ఇస్రోలో 78 టెక్నీషియన్ ఉద్యోగాలు,

-పదోతరగతి, ఐటీఐ ఉత్తీర్ణులకు అవకాశం
-మంచి జీతాలు, పదోన్నతులు
-రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్ ద్వారా ఎంపిక
అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (ఎస్‌ఏసీ)లో కింది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
isro
వివరాలు:
ఇస్రో పరిధిలో స్పేస్ అప్లికేషన్ సెంటర్ పనిచేస్తుంది.
-మొత్తం ఖాళీల సంఖ్య- 78
-టెక్నీషియన్-బి (ఫిట్టర్)- 14. వీటిలో జనరల్- 7, ఓబీసీ- 3, ఎస్సీ- 2, ఎస్టీ- 2 ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు: పదోతరగతి/మెట్రిక్యులేషన్‌తోపాటు ఐటీఐ ఉత్తీర్ణత.
-టెక్నీషియన్-బి (మెషినిస్ట్)- 4. వీటిలో జనరల్- 2, ఓబీసీ- 1, ఎస్టీ- 1 ఖాళీ ఉన్నాయి.
-అర్హతలు: పదోతరగతితోపాటు ఐటీఐ ఉత్తీర్ణత.
-టెక్నీషియన్-బి (టర్నర్)- 1 ఖాళీ (జనరల్).
-అర్హతలు: పదోతరగతితోపాటు టర్నర్ ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత.
-టెక్నీషియన్-బి (ఎలక్ట్రానిక్స్)- 39. వీటిలో జనరల్-20, ఓబీసీ- 3, ఎస్సీ- 3, ఎస్టీ- 5 ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు: పదోరతగతితోపాటు ఎలక్ట్రానిక్స్ ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత.
-టెక్నీషియన్-బి (ఎలక్ట్రీషియన్)- 2. ఇవి జనరల్ కేటగిరీలో ఉన్నాయి.
-అర్హతలు: పదోతరగతితోపాటు ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లో ఐటీఐ.
-టెక్నీషియన్-బి (ఎల్‌ఏసీపీ/ఏవోసీపీ)- 4. వీటిలో జనరల్- 2, ఓబీసీ- 1, ఎస్టీ- 1 ఖాళీ ఉన్నాయి.
-అర్హతలు: పదోతరగతితోపాటు ల్యాబ్ అసిస్టెంట్ ప్లాంట్/అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్ ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత.
-టెక్నీషియన్-బి (డిజిటల్ ఫొటోగ్రాఫర్)- 1. ఇది జనరల్ కేటగిరీలో ఉంది.
-అర్హతలు: మెట్రిక్యులేషన్‌తోపాటు ఐటీఐ లేదా ఎన్‌టీసీ/ఎన్‌ఏసీలో డిజిటల్ ఫొటోగ్రఫీ ట్రేడ్ ఉత్తీర్ణత.
-టెక్నీషియన్-బి (ఆర్‌ఏసీ)- 2. జనరల్- 1, ఎస్టీ- 1.
-అర్హతలు: పదోతరగతితోపాటు ఐటీఐలో రిఫ్రిజిరేషన్ & ఎయిర్ కండీషనింగ్ మెకానిక్ ట్రేడ్‌లో ఉత్తీర్ణత.
-టెక్నీషియన్-బి (సీహెచ్‌ఎన్‌ఎం)- 2. ఈ పోస్టులు జనరల్ కేటగిరీలో ఉన్నాయి.
-అర్హతలు: పదోరతగతితోపాటు ఐటీఐ లేదా తత్సమాన కోర్సులో కంప్యూటర్ హార్డ్‌వేర్ అండ్ నెట్‌వర్క్ మెయింటెనెన్స్ ట్రేడ్ ఉత్తీర్ణత.
-పేస్కేల్: లెవల్- 3లో పేమ్యాట్రిక్స్ రూ. 21,700 - 69,100/-, వీటికి అదనంగా హెచ్‌ఆర్‌ఏ, టీఏ తదితర అలవెన్సులు ఇస్తారు.
-వయస్సు: పై అన్ని పోస్టులకు ఏప్రిల్ 2 నాటికి 18-35 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎస్సీ, ఎస్టీలకు 40, ఓబీసీలకు 38 ఏండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-ఎంపిక విధానం: మొదట రాతపరీక్ష నిర్వహిస్తారు. దీనిలో వచ్చిన మార్కుల ఆధారంగా స్కిల్‌టెస్ట్ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. స్కిల్‌టెస్ట్ కేవలం క్వాలిఫయింగ్ టెస్ట్ మాత్రమే. తుది ఎంపికకు కేవలం రాతపరీక్ష మార్కులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: మే 11
-వెబ్‌సైట్: http://www.sac.gov.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎయిర్ ఇండియాలో 295 ఉద్యోగాలు,

న్యూఢిల్లీలోని నార్తర్న్ రీజియన్‌లోని ఎయిర్ ఇండియా లిమిటెడ్ వివిధ ప్రదేశాల్లో ఖాళీగా ఉన్న ఎక్స్‌పీరియన్స్‌డ్/ట్రెయినీ క్యాబిన్ క్య్రూ (అవివాహిత) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
air-india

వివరాలు:
ఈ పోస్టులను తాత్కాలికంగా ఐదేండ్ల వరకు భర్తీచేస్తారు. ఆ తర్వాత సంస్థ అవసరాలు, అభ్యర్థి పనితీరునుబట్టి మరో ఐదేండ్లవరకు పొడిగించే అవకాశం ఉంది.
-పోస్టు పేరు: ట్రెయినీ క్యాబిన్ క్య్రూ/ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాబిన్ క్య్రూ
-మొత్తం పోస్టుల సంఖ్య: 295 (పురుషులు-86, మహిళలు-209)
కేటగిరీల వారీగా పోస్టుల వివరాలు
-పురుషులు- 86 పోస్టులు (ఓబీసీ-72, ఎస్సీ-2, ఎస్టీ-12)
-మహిళలు- 209 పోస్టులు (జనరల్-85, ఓబీసీ-124)
-అర్హతలు: ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాబిన్ క్య్రూ పోస్టులకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2 లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. ట్రెయినీ క్యాబిన్ క్య్రూ పోస్టులకు ఇంటర్ లేదా బ్యాచిలర్ డిగ్రీతోపాటు హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ లేదా ట్రావెల్ & టూరిజంలో డిప్లొమా లేదా డిగ్రీ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
-వయస్సు: 2018 మే 2 నాటికి 18 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి (ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాబిన్ క్య్రూ పోస్టులకు 35 ఏండ్లు మించరాదు). ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
శారీరక ప్రమాణాలు:
-ఎత్తు: 172 సెం.మీ (పురుషులు), 160 సెం.మీ (మహిళలు). ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సెం.మీ వరకు ఎత్తులో మినహాయింపు ఉంటుంది.

బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ)..
-పురుషులు-18-25 (నార్మల్ రేంజ్‌లో ఉండాలి)
-మహిళలు-18-22 (నార్మల్ రేంజ్‌లో ఉండాలి)
-కంటిచూపు: ఎయిర్ ఇండియా నిర్దేశించిన కంటి చూపు, ఇతర వైద్య ప్రమాణాలు ఉండాలి. స్పష్టమైన కంటిచూపు (నియర్ విజన్ ఎన్/5, డిస్టెంట్ విజన్ 6/6, 6/9 ప్రమాణాలకు తగ్గట్లు) ఉండాలి. రేచీకటి, వర్ణాంధత్వం ఉండకూడదు.
-భాష: ఇంగ్లిష్, హిందీ అనర్గళంగా మాట్లాడాలి. ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు గల ఒక విదేశీ భాష మాట్లాడేవారికి ప్రాధాన్యం ఇస్తారు.
-పే స్కేల్: ట్రెయినింగ్ పీరియడ్‌లో నెలకు రూ. 15,000/- స్టయిఫండ్‌గా ఇస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత నెలకు రూ. 21,125 చెల్లిస్తారు. జీతంతోపాటు అదనంగా ఫ్లయింగ్, లేఓవర్ అలవెన్సులు, స్టాండ్ బై అలవెన్సులు ఉంటాయి.
-అప్లికేషన్ ఫీజు: రూ. 1000/-
-(ఎయిర్ ఇండియా లిమిటెడ్ ఢిల్లీలో చెల్లేవిధంగా డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో)
-ఎస్సీ, ఎస్టీ, అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
ఎంపిక విధానం:
-పర్సనల్ అసెస్‌మెంట్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా
-రాత పరీక్ష ఇంగ్లిష్/హిందీ భాషల్లో ఉంటుంది.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: మే 2
-రాతపరీక్షతేదీ: మే 6 (ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాబిన్ క్య్రూ),
-ట్రెయినీ క్యాబిన్ క్య్రూ పోస్టులకు త్వరలో తెలియజేస్తారు.
-వెబ్‌సైట్: www.airindia.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నాల్కోలో గ్రాడ్యుయేట్ ఇంజినీర్లు ఉద్యోగాలు,
నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (నాల్కో)లో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
nalco

వివరాలు:
నాల్కో భారత ప్రభుత్వ రంగ సంస్థ. ఇది ఒక నవరత్న కంపెనీ.
-పోస్టు: గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రెయినీ
-మొత్తం ఖాళీల సంఖ్య- 115. వీటిలో జనరల్- 60, ఓబీసీ- 30, ఎస్సీ- 17, ఎస్టీ- 8 ఖాళీలు ఉన్నాయి.
-విభాగాల వారీగా ఖాళీలు..
-మెకానికల్- 54, ఎలక్ట్రికల్- 32, మెటలర్జీ- 18, ఎలక్ట్రానిక్స్- 5, ఇన్‌స్ట్రుమెంటేషన్- 6 ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు: కనీసం 65 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌లో సంబంధిత బ్రాంచీలో ఉత్తీర్ణత.
-వయస్సు: మే 22 నాటికి 30 ఏండ్లు మించరాదు.
-ఎంపిక: గేట్-2018 స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపికచేస్తారు.
-సీటీసీ: శిక్షణ సమయంలో రూ. 10.52 లక్షలు. శిక్షణానంతరం సుమారు రూ. 15.73 లక్షలు ఇస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: మే 22
-ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ. 500/-
-ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ. 100/-
-వెబ్‌సైట్: http://www.nalcoindia.com


---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్‌లు,
జబల్‌పూర్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్‌ల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
ordkham

వివరాలు:
భారత రక్షణ శాఖ పరిధిలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ
పనిచేస్తుంది.
-పోస్టు: అప్రెంటిస్
-మొత్తం ఖాళీలు- 34
విభాగాల వారీగా..
-డిగ్రీ అభ్యర్థులకు: కెమికల్- 10, ఎలక్ట్రికల్- 1, మెకానికల్- 4, మెటలర్జీ- 1 ఖాళీ ఉన్నాయి.
-డిప్లొమా అభ్యర్థులకు: సివిల్- 1, ఎలక్ట్రికల్- 3, మెకానికల్- 10 ఖాళీలు ఉన్నాయి.
-టెక్నీషియన్ వొకేషనల్ అభ్యర్థులకు (10+2): మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్- 1, ఆఫీస్ సెక్రటరీ/స్టెనోగ్రఫీ- 1, పర్చేజింగ్ & స్టోర్ కీపింగ్- 2 ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి డిగ్రీ/డిప్లొమా లేదా టెక్నీషియన్ (వొకేషనల్) సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
-శిక్షణా కాలం: ఏడాది
-స్టయిఫండ్: ఇంజినీర్ గ్రాడ్యుయేట్ ట్రెయినీ- రూ. 4983/-
-డిప్లొమా ఇంజినీరింగ్ ట్రెయినీ- రూ. 3542/-
-టెక్నీషియన్ (వొకేషనల్)- రూ. 2758/-
-ఎంపిక: అకడమిక్ మార్కులు, ప్రి మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-చివరితేదీ: మే 11
-వెబ్‌సైట్: http://www.ordkham.gov.in


---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐఎస్‌ఈఆర్ నాన్ టీచింగ్  ఉద్యోగాలు.
భోపాల్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్) నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
iiser

వివరాలు:
-ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్- 2, హిందీ ఆఫీసర్/అసిస్టెంట్ రిజిస్ట్రార్- 1, అసిస్టెంట్ రిజిస్ట్రార్- 2, మెడికల్ ఆఫీసర్- 1, టెక్నికల్ సూపరింటెండెంట్ (ఐటీ & నెట్‌వర్కింగ్)- 1, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్-1, అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్)- 1, సైంటిఫిక్ సూపరింటెండెంట్ (కెమిస్ట్రీ)- 1, జూనియర్ సూపరింటెండెంట్- 1, జూనియర్ అసిస్టెంట్ (ఎంఎస్)- 1 ఖాళీ ఉన్నాయి.
-అర్హతలు, వయస్సు, ఎంపిక తదితరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: మే 17
-వెబ్‌సైట్: https://www.iiserb.ac.in


No comments:

Post a Comment