Wednesday, 18 April 2018

నేషనల్ సీడ్స్ లో ట్రెయినీ ఉద్యోగాలు, టీఎస్ పీజీఈసెట్-2018 , కోల్‌ఫీల్డ్‌లో 117 ఉద్యోగాలు, ఎన్‌ఐఎస్‌డీలో పీజీ డిప్లొమా ప్రవేశాలు, జీవ వైద్యపరిశోధనలో అసిస్టెంట్లు ఉద్యోగాలు, ఎంఫిల్ ప్రవేశాలు.

నేషనల్ సీడ్స్ లో ట్రెయినీ ఉద్యోగాలు,
-డిగ్రీ, ఎ మ్మెస్సీ, బీఈ/బీటెక్, ఎంబీఏ, డిప్లొమా అభ్యర్థులకు అవకాశం
-ఉద్యోగ భద్రత, మంచి జీతభత్యాలు
-రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
-దేశవ్యాప్తంగా ఎక్కడైనా పనిచేయవచ్చు
-చివరి తేదీ: మే 5
నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌సీ) కార్పొరేట్ ఆఫీస్/రీజినల్ ఆఫీసుల్లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్, సూపర్‌వైజర్ స్థాయిలోని మేనేజ్‌మెంట్ ట్రెయినీ, డిప్లొమా/ట్రెయినీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
students
వివరాలు:
మినీరత్న హోదా కలిగిన ఎన్‌ఎస్‌సీ వ్యవసాయం, రైతు సంక్షేమ, పరిపాలన నియంత్రణ శాఖ పరిధిలో పనిచేస్తుంది. దీన్ని 1963 మార్చిలో ఏర్పాటు చేశారు.
-మొత్తం ఖాళీల సంఖ్య: 258
-మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఎగ్జిక్యూటివ్ స్థాయి)-58
-విభాగాలవారీగా ఖాళీలు: మెటీరియల్స్ మేనేజ్‌మెంట్-2, అసిస్టెంట్ కంపెనీ సెక్రటరీ-1, ప్రొడక్షన్-27, మార్కెటింగ్-9, అగ్రికల్చర్ ఇంజినీరింగ్-3, సివిల్ ఇంజినీరింగ్ -2, హ్యూమన్ రిసోర్స్-7, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్-7
-అర్హత: బీఈ/బీటెక్ (అగ్రికల్చర్ ఇంజినీరింగ్), అగ్రికల్చర్ బీఎస్సీతోపాటు ఎంబీఏ (మెటీరియల్స్ మేనేజ్‌మెంట్), ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియాలోగ్రాడ్యుయేట్ అసోసియేట్ మెంబర్‌షిప్, అగ్రికల్చర్ బీఎస్సీతోపాటు ఎంబీఏ (అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్). ఎమ్మెస్సీ అగ్రికల్చర్ (ఆగ్రానమీ, సీడ్ టెక్నాలజీ, ప్లాంట్ బ్రీడింగ్ & జెనెటిక్స్, అగ్రికల్చర్ ఎంటమాలజీ, ప్లాంట్ పాథాలజీ), అగ్రికల్చర్/సివిల్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్, పర్సనల్ మేనేజ్‌మెంట్/ఇండస్ట్రియల్ రిలేషన్, లేబర్ వెల్ఫేర్/హెచ్‌ఆర్ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిగ్రీ/ డిప్లొమా లేదా ఎంబీఏ (హెచ్‌ఆర్‌ఎం), సీఏ/ఐసీడబ్ల్యూఏ లేదా రెండేండ్ల ఎంబీఏ (ఫైనాన్స్)లో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత.
-పేస్కేల్ : శిక్షణ సమయంలో రూ. 41,360/- (కన్సాలిడేటెడ్ స్టయిఫండ్ )
-సీనియర్ ట్రెయినీ/డిప్లొమా (సూపర్‌వైజర్ స్థాయి)-90 ఖాళీలు
విభాగాలవారీగా ఖాళీలు: సీనియర్ ట్రెయినీ (మార్కెటింగ్-48, హ్యూమన్ రిసోర్స్-1, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్-6, అగ్రికల్చర్/ప్లాంట్ ప్రొటెక్షన్, సీడ్ ప్రొటెక్షన్-18, క్వాలిటీ కంట్రోల్-2, హార్టికల్చర్-3)
-అర్హత: బీఎస్సీ అగ్రికల్చర్‌తోపాటు ఎంబీఏ (మార్కెటింగ్/అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్), ఎమ్మెస్సీ (అగ్రికల్చర్) లేదా మార్కెటింగ్/అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో రెండేండ్ల పీజీ, ఎంబీఏ (హెచ్‌ఆర్), ఇండస్ట్రియల్ రిలేషన్స్/పర్సనల్ మేనేజ్‌మెంట్, లేబర్ వెల్ఫేర్‌లో పీజీ/డిప్లొమా, ఎంకాం/ఎంబీఏ (ఫైనాన్స్), ఎమ్మెస్సీ అగ్రికల్చర్ (ఆగ్రానమి, సీడ్ టెక్నాలజీ, ప్లాంట్ బ్రీడింగ్ & జెనెటిక్స్, అగ్రికల్చర్ ఎంటమాలజీ, ప్లాంట్ పాథాలజీ), ఎమ్మెస్సీ (హార్టికల్చర్)లో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-డిప్లొమా ట్రెయినీ (సివిల్-4,అగ్రికల్చర్ -8)
-అర్హత: అగ్రికల్చర్/మెకానికల్, సివిల్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత.
-పే స్కేల్ : శిక్షణ సమయంలో రూ. 22,748/- (కన్సాలిడేటెడ్ స్టయిఫండ్ )
-ట్రెయినీ మేట్ (అగ్రికల్చర్)-21
-అర్హత: అగ్రికల్చర్‌లో ఇంటర్/సీనియర్ సెకండరీ ( 12 వ స్థాయి)లో ఉత్తీర్ణత.
-పే స్కేల్ : రూ.16,500/-(కన్సాలిడేటెడ్ స్టయిఫండ్)
-వయస్సు: ఎగ్జిక్యూటివ్ స్థాయి పోస్టులకు 25 ఏండ్లు, ట్రెయినీ/డిప్లొమా స్థాయి పోస్టులకు 23 ఏండ్లు, ట్రెయినీమేట్‌కు 20 ఏండ్లకు మించరాదు.
-దరఖాస్తు ఫీజు: రూ. 525/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ. 25/-
-ప్రొబేషనరీ పీరియడ్: ఏడాది
-ఎంపిక: రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో.
-దరఖాస్తులకు చివరితేదీ: మే 5
-రాతపరీక్ష తేదీ: మే 27
-వెబ్‌సైట్: www.indiaseeds.com
-ట్రెయినీ (నాన్ సూపర్‌వైజర్ స్థాయి)
-110 ఖాళీలు

విభాగాలవారీగా ఖాళీలు:
-ట్రెయినీ (అగ్రికల్చర్-27, హెచ్‌ఆర్ -22, అకౌంట్స్-11, స్టోర్-11, టెక్నీషియన్ (ఎలక్ట్రీషియన్)-5, స్టోర్ (టెక్నికల్)-2, డాటా ఎంట్రీ ఆపరేటర్-11)
-అర్హత: బీఎస్సీ (అగ్రికల్చర్), బ్యాచిలర్ డిగ్రీ, బీకాం, ఐటీఐ (ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఆటో ఎలక్ట్రీషియన్, వెల్డర్, డీజిల్ మెకానిక్, ట్రాక్టర్ మెకానిక్, మెషీన్‌మ్యాన్), బీసీఏ, కంప్యూటర్ సైన్స్/ ఐటీలో బీఎస్సీ /డిప్లొమాలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-పే స్కేల్ : రూ. 17,578/- (కన్సాలిడేటెడ్ స్టయిఫండ్ )

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
టీఎస్ పీజీఈసెట్-2018 ,

తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ వృత్తి విద్యా కళాశాలల్లో 2018-19 విద్యా సంవత్సరానికి వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ పీజీఈసెట్ నోటిఫికేషన్‌ను ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది.
TS-PGECET

వివరాలు:
టీఎస్ పీజీఈసెట్‌ను తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీఎస్‌సీహెచ్‌ఈ) తరపున ఓయూ నిర్వహిస్తుంది.
-కోర్సు పేరు: ఎంఈ/ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్, గ్రాడ్యుయేట్ లెవల్ ఫార్మాడీ
-అర్హతలు: వివిధ కోర్సులను బట్టి సంబంధిత/అనుబంధ విభాగంలో బీఈ/బీటెక్, బీఫార్మసీ, బీఆర్క్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేయవచ్చు.
-ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
-ఆబ్జెక్టివ్ విధానంలో ఎంట్రన్స్ టెస్ట్‌ను నిర్వహిస్తారు. మొత్తం 120 ప్రశ్నలు-120 మార్కులు. నెగెటివ్ మార్కింగ్ లేదు.
-ప్రవేశ పరీక్షలో మొత్తం మార్కుల్లో (120 మార్కులు) జనరల్ అభ్యర్థులకు కనీస అర్హత మార్కులు 30. ఎస్సీ, ఎస్టీ వారికీ ఎలాంటి అర్హత మార్కులు లేవు. పరీక్ష కాలవ్యవధి 2 గంటలు
-అప్లికేషన్ ఫీజు: రూ. 1000/- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500/-
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో.
-దరఖాస్తులకు చివరితేదీ: మే 1
-టీఎస్ పీజీఈసెట్ పరీక్ష తేదీ: మే 28 నుంచి 31 వరకు)
-వెబ్‌సైట్: http://pgecet.tsche.ac.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
కోల్‌ఫీల్డ్‌లో 117 ఉద్యోగాలు,

వెస్ట్‌బెంగాల్‌లోని ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఈసీఎల్) జార్ఖండ్, బెంగాల్ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న మైనింగ్ సిర్దార్ (గ్రూప్ సీ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
coal-field

వివరాలు:
ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ కోల్ ఇండియా లిమిటెడ్ పరిధిలో పని చేస్తున్న సంస్థ. స్పెషల్ రిక్రూట్‌మెంట్ లో భాగంగా (ఓబీసీ, ఎస్సీ/ఎస్టీ) ఈ పోస్టులను భర్తీ చేస్తారు.
-మొత్తం పోస్టుల సంఖ్య: 117 ఖాళీలు (ఓబీసీ-27, ఎస్సీ-70, ఎస్టీ-20)
-పోస్టు పేరు: మైనింగ్ సిర్దార్ (గ్రూప్ సీ)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డు నుంచి మైనింగ్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా/డిగ్రీ లేదా ఇంటర్‌తోపాటు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేప్టీ (డీజీఎమ్‌ఎస్) నుంచి మైనింగ్ సిర్దార్‌షిప్ సర్టిఫికెట్‌లో ఉత్తీర్ణత. గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికెట్, వ్యాలిడ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
-పే స్కేల్: రూ. 31,182 /-
-వయస్సు : 2018 ఫిబ్రవరి 1 నాటికి కనిష్ఠంగా 18 ఏండ్లు, గరిష్ఠంగా ఓబీసీలకు 38 ఏండ్లు, ఎస్సీ/ఎస్టీలకు 40 ఏండ్లు మించరాదు.
-అప్లికేషన్ పీజు : రూ. 300/- (ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు)
-ఎంపిక : రాతపరీక్ష ద్వారా
-రాతపరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. మొత్తం 50 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
-దరఖాస్తు : ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేది : ఏప్రిల్ 19
-వెబ్‌సైట్: www.easterncoal.gov.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఐఎస్‌డీలో పీజీ డిప్లొమా ప్రవేశాలు,

న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ (ఎన్‌ఐఎస్‌డీ) పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
NISD

వివరాలు:
సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వశాఖకు చెందిన సంస్థ ఇది.
-కోర్సు పేరు: పీజీ డిప్లొమా ఇన్ ఇంటిగ్రేటెడ్ జెరియాట్రిక్ కేర్
-కోర్సు వ్యవధి: ఏడాది
-మొత్తం సీట్ల సంఖ్య: 25
-అర్హత :గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత.
-వయస్సు: 21 నుంచి 35 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎంపిక: అకడమిక్ ప్రతిభ, ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో. 
-దరఖాస్తులకు చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ (మార్చి 24-30)లో వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తులను పంపించాలి. 

-వెబ్‌సైట్: www.nisd.gov.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
జీవ వైద్యపరిశోధనలో అసిస్టెంట్లు ఉద్యోగాలు,
హైదరాబాద్ (తార్నాక)లోని జాతీయ జీవ వైద్యపరిశోధన జంతు వనరుల సంస్థ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.


వివరాలు:
ఎన్‌ఏఆర్‌ఎఫ్‌బీఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) అనుబంధగా పనిచేస్తున్న సంస్థ.
-మొత్తం పోస్టుల సంఖ్య: 10
విభాగాలవారీగా ఖాళీలు:
-పర్సనల్ అసిస్టెంట్-1, ఆఫీస్ అసిస్టెంట్-3, డాటా ఎంట్రీ ఆపరేటర్-2, టెక్నీషియన్-2, కన్సల్టెంట్ ఫర్ అడ్మిన్ అండ్ అకౌంట్స్-1, కన్సల్టెంట్ ఇంజినీరింగ్ సర్వీసెస్-1
-అర్హత: బ్యాచిలర్ డిగ్రీ, ఇంటర్‌లో ఉత్తీర్ణత. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. కొన్ని పోస్టులకు సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-ఎంపిక: రాతపరీక్ష/ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 20
-వెబ్‌సైట్: www.narfbr.org

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎంఫిల్ ప్రవేశాలు.

భోపాల్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ (ఐఐఎఫ్‌ఎం) ఎంఫిల్‌లో 2018 -19 విద్యాసంవత్సరానికి ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.


వివరాలు:
-కోర్సు: ఎంఫిల్ (నేచురల్ రిసోర్స్ మేనేజ్‌మెంట్)
-ఈ కోర్సులో నేచురల్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, ైక్లెమెట్ చేంజ్ తదితర అంశాలు ప్రధానంగా ఉంటాయి. అర్హతలు, వయస్సు, ఫీజు, ఎంపిక తదితరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో, చివరితేదీ: మే 4

-వెబ్‌సైట్: http://iifm.ac.in/

No comments:

Post a Comment