Saturday, 14 April 2018

ఇస్రోలో పర్సనల్ అసిస్టెంట్లు ఉద్యోగాలు, డీఎల్‌ఆర్‌ఎల్‌లో జేఆర్‌ఎఫ్ ఉద్యోగాలు, ఈఐఎల్‌లో మేనేజ్‌మెంట్ ట్రెయినీలు, ఎగ్జిమ్ బ్యాంకులో ఉద్యోగాలు, ఎన్‌ఐవో ఉద్యోగాలు, మద్రాస్ ఐఐటీలో ఉద్యోగాలు.

ఇస్రోలో పర్సనల్ అసిస్టెంట్లు ఉద్యోగాలు,

- బ్యాచిలర్ డిగ్రీ అభ్యర్థులకు అవకాశం
- ఇండియన్ స్పేస్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం
- రాతపరీక్ష+స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక
- ఉద్యోగ భద్రత, మంచి జీతభత్యాలు
- చివరితేదీ: ఏప్రిల్ 30
ISRO-SATELLITE
డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ పరిధిలో పనిచేస్తున్న ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) వివిధ జోన్లవారీగా ఖాళీగా ఉన్న జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీకి ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఐసీఆర్‌బీ) అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
బెంగళూరు ప్రధాన కార్యాలయంగా ఏర్పాటుచేసిన ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)ను విక్రమ్ సారాభాయ్ 1969 ఆగస్టు 15న స్థాపించారు. అంతరిక్ష పరిశోధనల కోసం భారత ప్రభుత్వం నెలకొల్పిన సంస్థ ఇస్రో.
- మొత్తం పోస్టుల సంఖ్య: 171
- పోస్టు పేరు: జూనియర్ పర్సనల్ అసిస్టెంట్
- మొత్తం ఖాళీల సంఖ్య- 166 (జనరల్- 100, ఓబీసీ- 35, ఎస్సీ- 21, ఎస్టీ- 10) ఇస్రో సెంటర్/ యూనిట్ల వారీగా ఖాళీలు..
- హైదరాబాద్- 16 పోస్టులు (జనరల్-10, ఓబీసీ-3, ఎస్సీ-2, ఎస్టీ-1)
- అహ్మదాబాద్- 19 పోస్టులు (జనరల్-12, ఓబీసీ-2, ఎస్సీ-1, ఎస్టీ-4)
- బెంగళూరు - 61 పోస్టులు (జనరల్-34, ఓబీసీ-14, ఎస్సీ-10, ఎస్టీ-3)
- శ్రీహరికోట - 25 పోస్టులు (జనరల్-15, ఓబీసీ-5, ఎస్సీ-3, ఎస్టీ-2)
- తిరువనంతపురం - 44 పోస్టులు (జనరల్-28, ఓబీసీ-11, ఎస్సీ-5)
- న్యూఢిల్లీ - 1 ఖాళీ ఉన్నాయి.

- స్టెనోగ్రాఫర్ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ బెంగళూరు)
- మొత్తం ఖాళీల సంఖ్య- 5 (జనరల్- 4, ఓబీసీ- 1)
- అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ప్రథమశ్రేణిలో ఆర్ట్స్/కామర్స్ లేదా మేనేజ్‌మెంట్ /సైన్స్/ కంప్యూటర్ అప్లికేషన్స్‌లో డిగ్రీ ఉత్తీర్ణత లేదా ఫస్ట్‌క్లాస్‌లో డిప్లొమా ఇన్ కమర్షియల్/సెక్రటేరియల్ ప్రాక్టీస్ ఉత్తీర్ణత, ఏడాది స్టెనో- టైపిస్ట్/స్టెనోగ్రాఫర్‌గా అనుభవం, ఇంగ్లిష్ స్టెనోగ్రఫీలో నిమిషానికి 80 పదాల వేగంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
- వయస్సు: 2018, ఏప్రిల్ 30 నాటికి 18 నుంచి 26 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 31 ఏండ్లు, ఓబీసీలకు 29 ఏండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్లకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.
- ఎంపిక: దరఖాస్తు చేసుకున్నవారి అకడమిక్ ప్రతిభ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. వీరందరికి రాతపరీక్ష నిర్వహిస్తారు. దీనిలో ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ విభాగాల్లో కనీసం 50 శాతం మార్కులు సాధించినవారిని స్కిల్‌టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. ఇంగ్లిష్ స్టెనోగ్రఫీలో స్కిల్‌టెస్ట్ నిర్వహిస్తారు.
- నోట్: షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు జూలై చివరివారం లేదా ఆగస్టు మొదటివారంలో సమాచారాన్ని ఈ-మెయిల్ ద్వారా పంపిస్తారు.
- అప్లికేషన్ ఫీజు: రూ. 100/- ఎస్సీ, ఎస్టీ, మహిళ, ఎక్స్‌సర్వీస్‌మెన్, పీహెచ్‌సీ అభ్యర్థులకు ఫీజు లేదు.
- పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, భోపాల్, చండీగఢ్, డెహ్రాడూన్, గువాహటి, కోల్‌కతా, లక్నో, ముంబై, న్యూఢిల్లీ, తిరువనంతపురం సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తారు.
- పేస్కేల్: లెవల్ 4 పే మ్యాట్రిక్స్ ప్రకారం జీతభత్యాలు చెల్లిస్తారు. జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్టుకు రూ. 25,500/- వీటికి అదనంగా హెచ్‌ఆర్‌ఏ, టీఏ తదితర అలవెన్సులు చెల్లిస్తారు.
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
డీఎల్‌ఆర్‌ఎల్‌లో జేఆర్‌ఎఫ్ ఉద్యోగాలు,
హైదరాబాద్‌లోని డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రిసెర్చ్ ల్యాబొరేటరీ (డీఎల్‌ఆర్‌ఎల్) ఖాళీగా ఉన్న జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్‌ఎఫ్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
DRDO_Scientist

వివరాలు:
డీఎల్‌ఆర్‌ఎల్ డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) పరిధిలో పనిచేస్తుంది.
-జేఆర్‌ఎఫ్-9 ఖాళీలు (ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్-5, కంప్యూటర్ సైన్స్-2, మెకానికల్-2)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టులో బీఈ/బీటెక్ లేదా ఎంఈ/ఎంటెక్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. గేట్‌లో అర్హత సాధించాలి.
-వయస్సు: గరిష్టంగా 28 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: రూ. 25,000+ హెచ్‌ఆర్‌ఏ తదితర అలవెన్సులు ఉంటాయి.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో. అర్హత కలిగిన అభ్యర్థులు సంబంధిత అర్హత, ఎక్స్‌పీరియన్స్ తదితర సర్టిఫికెట్లను జతచేసి పర్సనల్ అధికారికి పంపాలి.
-చిరునామా: డైరెక్టర్, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రిసెర్చ్ ల్యాబొరేటరీ (డీఎల్‌ఆర్‌ఎల్), చాంద్రాయణ గుట్ట లైన్స్, హైదరాబాద్-500005
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ (ఏప్రిల్ 14-20)లో వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తులను పంపించాలి.
-వెబ్‌సైట్: www.drdo.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఈఐఎల్‌లో మేనేజ్‌మెంట్ ట్రెయినీలు,

ఇంజినీరింగ్ అభ్యర్థులకు అవకాశం
-గేట్ స్కోర్ ఆధారంగా ఎంపిక
-మంచి జీతభత్యాలు, ఉద్యోగభద్రత
EIL-LIMITED
న్యూఢిల్లీలోని ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
నవరత్న హోదా ఉన్న ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌ను 1965 మార్చి 15న న్యూఢిల్లీలో ఏర్పాటుచేశారు.
-పోస్టు పేరు: మేనేజ్‌మెంట్ ట్రెయినీ
-మొత్తం ఖాళీల సంఖ్య- 67 ( సివిల్-17, మెకానికల్-35, కెమికల్-15)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెకానికల్, కెమికల్, సివిల్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ లేదా బీఎస్సీ ఇంజినీరింగ్/ తత్సమాన పరీక్షలో 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత. 2017, 2018 విద్యాసంవత్సరాల్లో కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులు మాత్రమే అర్హులు. సంబంధిత బ్రాంచిలో గేట్-2018లో అర్హత సాధించాలి.
-వయస్సు: 2018 జూలై 1 నాటికి 25 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-ప్రొబేషనరీ పీరియడ్: ఏడాది
-పే స్కేల్: శిక్షణాకాలంలో రూ. 35,000/- అదనంగా అకామిడేషన్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్‌కు రూ. 5000/- స్టయిఫండ్ చెల్లిస్తారు. ట్రెయినింగ్ పూర్తయిన తర్వాత నెలకు జీతం రూ. 60,000-1,80,000/-, డీఏ, హెచ్‌ఆర్‌ఏ, మెడికల్ తదితర సౌకర్యాలు కల్పిస్తారు.
-ఎంపిక: గేట్-2018 స్కోర్+ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: మే 2
-వెబ్‌సైట్: www.engineersindia.com


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎగ్జిమ్ బ్యాంకులో ఉద్యోగాలు,
ముంబైలోని ఎక్స్‌పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాళీగా ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
EXIM-BANK
-మొత్తం పోస్టుల సంఖ్య: 5
-అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో మూడేండ్ల అనుభవం ఉండాలి.
-వయస్సు: 40 ఏండ్లకు మించరాదు.
-పే స్కేల్: రూ. 23,700-42,020/-
-ఎంపిక: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో.
-చివరితేదీ: ఏప్రిల్ 28
-వెబ్‌సైట్: www.eximbankindia.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఐవో ఉద్యోగాలు,

NIOS
గోవాలోని సీఎస్‌ఐఆర్- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (ఎన్‌ఐవో)లో సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.


వివరాలు:
-పోస్టు పేరు: సైంటిస్ట్-18 ఖాళీలు
-అర్హతలు: ఏదైనా యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ (ఓషియన్ సైన్సెస్/మెరైన్ సైన్సెస్)
-పోస్టు పేరు: సైంటిస్ట్-2 ఖాళీలు
-అర్హతలు: ఎంఈ/ఎంటెక్ (ఓషన్ ఇంజినీరింగ్/మెరైన్ ఇన్‌స్ట్రుమెంటేషన్)
-వయస్సు: 32 ఏండ్లు మించరాదు.
-జీతం: నెలకు రూ. 72,439/-
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: మే 14
-హార్డ్‌కాపీని పంపడానికి చివరితేదీ: మే 21
-వెబ్‌సైట్: www.nio.org
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
మద్రాస్ ఐఐటీలో ఉద్యోగాలు.

వివరాలు:
ఐఐటీ మద్రాస్‌ను 1959లో ఏర్పాటుచేశారు.
-మొత్తం పోస్టుల సంఖ్య: 25
-డిప్యూటీ రిజిస్ట్రార్-3, చీఫ్ మెడికల్ ఆఫీసర్-1, అసిస్టెంట్ రిజిస్ట్రార్-2 జూనియర్ ఇంజినీర్-5 జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్-4 జూనియర్ టెక్నీషియన్-10
-అర్హతలు, వయస్సు, అనుభవం తదితరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో.
-చివరితేదీ: మే 19
-వెబ్‌సైట్: http://recruit.iitm.ac.in

No comments:

Post a Comment