Saturday, 26 May 2018

ఎన్‌ఎఫ్‌ఎల్‌లో ఇంజినీరింగ్ అసిస్టెంట్లు ఉద్యోగాలు, ధీరూభాయ్ అంబానీలో బీటెక్ ప్రవేశాలు, ఇన్‌కమ్ ట్యాక్స్‌లో స్పోర్ట్స్‌కోటా జాబ్స్, టెక్స్‌టైల్స్ ప్రాసెసింగ్‌లో పీజీ డిప్లొమా ప్రవేశాలు, ఎన్‌ఐటీటీటీఆర్‌లో ప్రవేశాలు, ఎన్‌ఐఎఫ్‌టీఈఎం ఫుడ్ టెక్నాలజీ కోర్సులు.

ఎన్‌ఎఫ్‌ఎల్‌లో ఇంజినీరింగ్ అసిస్టెంట్లు ఉద్యోగాలు,

బీఎస్సీ (ఎంపీసీ), డిప్లొమా అభ్యర్థులకు అవకాశం
-ఆన్‌లైన్ రాతపరీక్ష, ఎండ్యూరెన్స్ టెస్ట్ ద్వారా ఎంపిక
-జూలై 7న ఆన్‌లైన్ పరీక్ష
NFL-STUDENTS
ఉత్తరప్రదేశ్‌లోని నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్‌ఎఫ్‌ఎల్) టెక్నికల్ డిపార్ట్‌మెంట్‌లోని వివిధ యూనిట్లలో ఖాళీగా ఉన్న ఇంజినీరింగ్ అసిస్టెంట్ (నాన్ ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:

ఈ సంస్థ మినీరత్న, ప్రీమియర్ ఫెర్టిలైజర్ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ కంపెనీ. ఎన్‌ఎఫ్‌ఎల్‌ను న్యూఢిల్లీలో 1974 ఆగస్టు 23న ఏర్పాటుచేశారు.
-మొత్తం పోస్టుల సంఖ్య: 129 (జనరల్-77, ఓబీసీ-23, ఎస్సీ-23, ఎస్టీ-6)
-పోస్టు పేరు: ఇంజినీరింగ్ అసిస్టెంట్ (నాన్ ఎగ్జిక్యూటివ్)
-విభాగాల వారీగా ఖాళీలు: ప్రొడక్షన్-60, మెకానికల్-37, ఎలక్ట్రికల్-12, ఇన్‌స్ట్రుమెంటేషన్-18, ఫైర్-2
-యూనిట్లు: భటిండా, పానిపట్, విజయ్‌పూర్, నంగల్
-అర్హతలు: గుర్తింపుపొందిన యూనివర్సిటీ/ బోర్డు నుంచి బీఎస్సీ (ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ) లేదా కెమికల్/మెకానికల్, ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్ & ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇండస్ట్రియల్/ఎలక్ట్రానిక్స్ లేదా అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రా నిక్ &కంట్రోల్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత.
-ఫైర్‌మ్యాన్ పోస్టులకు: పదోతరగతి/మెట్రిక్యులేషన్+న్యూఢిల్లీ జనరల్ రెగ్యులర్ ఫైర్ ఫైటింగ్ కోర్సు లేదా నాగ్‌పూర్ ఎన్‌ఎఫ్‌ఎస్సీచే సబ్ ఆఫీసర్స్ కోర్సు పరీక్షలో ఉత్తీర్ణత. సంస్థ సూచించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.
గమనిక: అభ్యర్థులు ఏదైనా ఒక విభాగం/బ్రాంచి మత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అన్ని విభాగాలకు ఒకే రోజున, ఒకే సమయాన ఆన్‌లైన్ పరీక్ష ఉంటుంది.

-వయస్సు: 2018 మే 31 నాటికి 18 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పేస్కేల్: రూ. 9000-16,400/-
-పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, జమ్ము/కశ్మీర్, భటిండా, భోపాల్, చండీగడ్, ఢిల్లీ, పానిపట్, లక్నో, పాట్నా, గ్వాలియర్
-దరఖాస్తు ఫీజు: రూ. 235/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.
-ఎంపిక: ఆన్‌లైన్ రాతపరీక్ష, ఎండ్యూరెన్స్ టెస్ట్
-ఆబ్జెక్టివ్ రాతపరీక్షలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం150 ప్రశ్నలు ఇస్తారు. దీనికి కేటాయించిన సమయం 120 నిమిషాలు. డిప్లొమా/సంబంధిత సబ్జెక్టు నుంచి 100 ప్రశ్నలు, జనరల్ ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్/అవేర్‌నెస్ నుంచి 50 ప్రశ్నలు ఇస్తారు. ఇంటర్వ్యూ లేదా నెగెటివ్ మార్కింగ్ విధానం లేదు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 17
-హాల్‌టెక్కెట్ల డౌన్‌లోడింగ్: జూన్ 24 నుంచి 26
-ఆన్‌లైన్ పరీక్షతేదీ: జూలై 7
-వెబ్‌సైట్: www.nationalfertilizers.com

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ధీరూభాయ్ అంబానీలో బీటెక్ ప్రవేశాలు,

గాంధీనగర్‌లోని ధీరూభాయ్ అంబానీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (డీఏ-ఐఐసీటీ) 2018-19 విద్యా సంవత్సరానికి బీటెక్ ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
daiict--2018

వివరాలు:

-కోర్స్ పేరు: బీటెక్ (ఆనర్స్/ఐసీటీ)
-మొత్తం సీట్ల సంఖ్య: 115 (ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ)-92 సీట్లు, ఆనర్స్-23 సీట్లు)
-అర్హత: ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలోఉత్తీర్ణత. ఇంటర్ స్థాయిలో మ్యాథ్స్, ఫిజిక్స్‌తోపాటు కెమిస్ట్రీ/బయోటెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్/ బయాలజీ సబ్జెక్టు చదివి ఉండాలి. జేఈఈ మెయిన్-2018లో వచ్చిన ఆల్ ఇండియా ర్యాంక్ ఆధారంగా అడ్మిషన్ కల్పిస్తారు. ప్రతిభావంతులకు స్కాలర్ షిప్స్ ఇస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జూలై 1
-వెబ్‌సైట్:www.daiict.ac.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఇన్‌కమ్ ట్యాక్స్‌లో స్పోర్ట్స్‌కోటా జాబ్స్,

చెన్నైలోని ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపాల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్యాక్స్ అసిస్టెంట్, ఎంటీఎస్, ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి అర్హులైన ప్రతిభావంతులైన క్రీడాకారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.


incometax
వివరాలు:
-మొత్తం ఖాళీల సంఖ్య: 32
-క్రీడావిభాగాలు: అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, క్యారమ్, క్రికెట్, కబడ్డీ, ఫుట్‌బాల్, హాకీ, షటిల్ బ్యాడ్మింటన్, వాలీబాల్.
-ట్యాక్స్ అసిస్టెంట్-11 ఖాళీలు
-అర్హత: డిగ్రీలో ఉత్తీర్ణత. డాటా ఎంట్రీలో గంటకు 8000 కీ డిప్రెషన్స్ వేగాన్ని కలిగి ఉండాలి.
-ఇన్‌కమ్‌ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్-7 ఖాళీలు
-అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత.
-మల్టీ టాస్కింగ్ స్టాఫ్-14 ఖాళీలు
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
గమనిక: రాష్ట్ర/ నేషనల్, ఇంటర్నేషనల్, ఒలింపిక్స్, వరల్డ్ చాంపియన్‌షిప్, ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, ఆఫ్రో ఏషియన్ గేమ్స్, ఎస్‌ఏఎఫ్, తదితర పోటీ స్థాయిలోని సంబంధిత క్రీడాంశాల్లో పాల్గొని ఉండాలి.
-ఎంపిక విధానం: సంబంధిత క్రీడలో గ్రౌండ్ టెస్ట్/నైపుణ్య పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో.
-దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 11
-వెబ్‌సైట్: www.incometaxindia.gov.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
టెక్స్‌టైల్స్ ప్రాసెసింగ్‌లో పీజీ డిప్లొమా ప్రవేశాలు,
వారణాసిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్‌లూమ్స్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ) 2018 జూలైలో ప్రారంభమయ్యే పీజీ డిప్లొమా ఇన్ టెక్స్‌టైల్స్ ప్రాసెసింగ్‌లో ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

iiht-logo

వివరాలు:

కేంద్ర వస్త్ర మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది.
-కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ టెక్స్‌టైల్స్ ప్రాసెసింగ్.
-కోర్సు వ్యవధి: ఏడాది నుంచి ఏడాదిన్నర వరకు)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డు నుంచి హ్యాండ్‌లూమ్స్ టెక్నాలజీ/ హ్యాండ్‌లూమ్స్ టెక్స్‌టైల్స్ టెక్నాలజీలో మూడేండ్ల డిప్లొమా లేదా సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా బీఎస్సీ (హోమ్ సైన్స్). ఇంటర్ స్థాయిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు చదివి ఉండాలి.
-స్టయిఫండ్: రూ. 1500 (నెలకు)
-ఎంపిక: అకడమిక్ మార్కుల ఆధారంగా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా
-దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 20
-వెబ్‌సైట్: www.htcampus.com

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఐటీటీటీఆర్‌లో ప్రవేశాలు,
భోపాల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రెయినింగ్ అండ్ రిసెర్చ్ ( ఎన్‌ఐటీటీటీఆర్) 2018-19 విద్యా సంవత్సరానికి వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలచేసింది.
-కోర్సు పేరు: ఎంఈ/ఎంటెక్, ఎంబీఏ
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి నాలుగేండ్ల బీఈ/బీటెక్ లేదా డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. గేట్, సీమ్యాట్, క్యాట్, మ్యాట్ స్కోర్‌లో అర్హత సాధించాలి.
-ఎంపిక: గేట్/మ్యాట్/క్యాట్ స్కోర్ ఆధారంగా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూన్ 20
-వెబ్‌సైట్:http://nitttrbpl.ac.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఐఎఫ్‌టీఈఎం ఫుడ్ టెక్నాలజీ కోర్సులు.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్
(ఎన్‌ఐఎఫ్‌టీఈఎం) ఫుడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

NIFTEM_NEW

కోర్సుల వివరాలు
బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ &మేనేజ్‌మెంట్ - నాలుగేండ్లు)
-అర్హత: ఇంటర్‌తోపాటు జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించాలి. 180 సీట్లు ఉన్నాయి.
-ఎంపిక: జేఈఈ మెయిన్ ర్యాంక్ ఆధారంగా
పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్
-ఫుడ్ టెక్నాలజీ & మేనేజ్‌మెంట్, ఫుడ్ ప్రాసెస్ ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, ఫుడ్ సేఫ్టీ & క్వాలిటీ మేనేజ్‌మెంట్, ఫుడ్ సప్లయ్ చెయిన్ మేనేజ్‌మెంట్, ఫుడ్ ప్లాంట్ ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్.
కాలవ్యవధి: రెండేండ్లు, రెగ్యులర్ కోర్సు
-అర్హత : కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో నాలుగేండ్ల డిగ్రీ/పీజీ ఉత్తీర్ణత.
-ఎంపిక: గేట్ స్కోర్/నాన్ గేట్ అభ్యర్థులకు ఎన్‌ఐఎఫ్‌టీఈఎం ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
-ప్రతి ఎంటెక్ ప్రోగ్రామ్‌లో 18 సీట్లు
డాక్టరేట్ ప్రోగ్రామ్: కింది విభాగాల్లో..
-అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సైన్సెస్. బేసిక్, అప్లయిడ్ సైన్సెస్. ఫుడ్ ఇంజినీరింగ్. ఫుడ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్. ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
-అర్హత: సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో పీజీ.నెట్‌లోఉన్నవారికి ప్రాధాన్యం.

ఎంబీఏ ప్రోగ్రామ్:40 సీట్లు
-ఫుడ్ &అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్ (కంపల్సరీ)/మార్కెటింగ్/ఫైనాన్స్/ ఇంటర్నేషనల్ బిజినెస్‌లో ఏదైనా ఒకటి.
-అర్హత: కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
-ఎంపిక: క్యాట్/మ్యాట్ స్కోర్. నాన్ క్యాట్/మ్యాట్ అభ్యర్థులకు ఇంటర్నల్ టెస్ట్, జీడీ, ఇంటర్వ్యూ ద్వారా
-స్కాలర్‌షిప్స్: ప్రతిభావంతులైన విద్యార్థులకు ట్యూషన్ ఫీజు రద్దు చేస్తారు. ఇతర స్కాలర్‌షిప్స్‌ను కూడా సంస్థ అందిస్తుంది.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూన్ 15
-వెబ్‌సైట్: www.niftem.ac.in

No comments:

Post a Comment