Monday, 14 May 2018

నాల్కోలో 115 గ్రాడ్యుయేట్ ఇంజినీర్లు ఉద్యోగాలు, కెన్‌ఫిన్‌లో 125 జూనియర్ ఆఫీసర్లు ఉద్యోగాలు, ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో టీచర్లు ఉద్యోగాలు, జీఐసీలో మేనేజర్లు ఉద్యోగాలు, సీఎస్‌ఐఈర్ పీహెచ్‌డీ ప్రవేశాలు.

నాల్కోలో 115 గ్రాడ్యుయేట్ ఇంజినీర్లు ఉద్యోగాలు,

ఇంజినీరింగ్ అభ్యర్థులకు అవకాశం
-ఉద్యోగ భద్రత, మంచి జీతభత్యాలు
-గేట్-2018 స్కోర్+ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
-మే 24 చివరితేదీ

businessmeeting
వివరాలు:
నాల్కో గనుల మంత్రిత్వశాఖలో పనిచేస్తుంది. 1981 జనవరి 7న భువనేశ్వర్‌లో ఏర్పాటుచేశారు.
- పోస్టు పేరు: గ్రాడ్యుయేట్ ఇంజినీర్
- మొత్తం ఖాళీల సంఖ్య: 115
(జనరల్-60, ఓబీసీ-30, ఎస్సీ-17, ఎస్టీ-8)
- విభాగాల వారీగా ఖాళీలు: మెకానికల్ ఇంజినీరింగ్-54, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్-32, మెటలర్జీ ఇంజినీరింగ్-18, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్-5, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్-6
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 65 శాతం (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు 55 శాతం) మార్కులతో బీఈ/బీటెక్ (మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెటలర్జీ ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణత. గేట్-2018లో ఉత్తీర్ణత సాధించాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

- వయస్సు: 2018 మే 22 నాటికి 30 ఏండ్లకు మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్ల వరకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
- పే స్కేల్: ట్రెయినింగ్ పీరియడ్‌లో రూ. 40,000-3%-1,60,000 పే స్కేల్‌తో విజయవంతంగా ప్రొబేషనరీ పీరియడ్ పూర్తయిన తర్వాత జూనియర్ మేనేజర్‌గా పే స్కేల్ రూ. 60,000-3%-1,80,000/- చెల్లిస్తారు.
- ఎంపికైన అభ్యర్థులకు ట్రెయినింగ్ పీరియడ్‌లో ఏడాదికి రూ. 10.52 లక్షలు, శిక్షణానంతరం రూ. 15.73 లక్షల జీతం చెల్లిస్తారు.
- సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ లేదా నాలుగేండ్లపాటు సంస్థలో పనిచేయాలి.
- అప్లికేషన్ ఫీజు: ఓసీ, ఓబీసీ అభ్యర్థులకు
రూ. 500/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ/డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు రూ. 100/-.
- ప్రొబేషనరీ పీరియడ్: ఏడాది. ప్రొబేషన్ పీరియడ్‌లో చూపిన పర్‌ఫామెన్స్ ఆధారంగా దేశంలో ఎక్కడైనా పోస్టింగ్ ఇస్తారు.
- ఎంపిక: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) 2018 స్కోర్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా
- దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌లో నిర్ణీత నమూనాలో ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి. వినియోగంలో ఉన్న ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి.
- దరఖాస్తులకు చివరితేదీ: మే 22
(సాయంత్రం 5.30 గంటలకు)
- వెబ్‌సైట్:www.nalcoindia.com
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
కెన్‌ఫిన్‌లో 125 జూనియర్ ఆఫీసర్లు ఉద్యోగాలు,

బెంగళూరులోని కెన్‌ఫిన్ హోమ్స్ లిమిటెడ్ వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఆఫీసర్ (కాంట్రాక్ట్ ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
can-fin-homes
వివరాలు:
కెన్‌ఫిన్ హోమ్స్ లిమిటెడ్ అనేది కెనరా బ్యాంక్ అనుబంధ సంస్థ. 133 బ్రాంచి ఆఫీస్‌లు, 20 ఏహెచ్‌ఎల్‌సీ, 20 శాటిలైట్ ఆఫీసులు ఉన్నాయి.
-పోస్టు పేరు: జూనియర్ ఆఫీసర్
-మొత్తం పోస్టుల సంఖ్య: 125
-ప్రాంతాలవారీగా ఖాళీలు: తెలంగాణ-11, కర్ణాటక-20, ఆంధ్రప్రదేశ్-10, ఛత్తీస్‌గఢ్-2, గుజరాత్-8, హర్యానా-10, జార్ఖండ్-2, కేరళ-2, మధ్యప్రదేశ్-7, మహారాష్ట్ర-14, పుదుచ్చేరి-1, పంజాబ్-2, తమిళనాడు-17, ఉత్తరాఖండ్-1, ఉత్తరప్రదేశ్-12
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. డాటా ఎంట్రీ, కంప్యూటర్ అప్లికేషన్‌లో పరిజ్ఞానం ఉండాలి. ప్రాంతీయ/లోకల్ లాంగ్వేజ్‌లో రాయడం, మాట్లాడటం, చదవడం తప్పనిసరిగా రావాలి.
గమనిక: ఈ పోస్టులను మొదట ఏడాది వ్యవధికి తీసుకుంటారు. అవసరం మేరకు మరో రెండేండ్ల వరకు పొడగిస్తారు.
-వయస్సు: 2018 ఫిబ్రవరి 1 నాటికి 21 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి. (1988 మే 1 నుంచి 1997 మే 1 మధ్య జన్మించి ఉండాలి).
-పే స్కేల్: మొదటి ఏడాదిలో నెలకు రూ. 18,000/- చొప్పున ఏడాదికి రూ. 2.50 లక్షలు, రెండో ఏడాది నుంచి రూ. 2.72 లక్షలు, మూడో ఏడాది నుంచి రూ. 3.08 లక్షల జీతం చెల్లిస్తారు.
-అప్లికేషన్ ఫీజు: రూ. 100/-
-ఎంపిక: రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: మే 15
-వెబ్‌సైట్: www.canfinhomes.com.
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో టీచర్లు ఉద్యోగాలు,
సికింద్రాబాద్ (ఆర్‌కే పురం)లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ 2018-19 అకడమిక్ ఇయర్‌గాను వివిధ సబ్జెక్టుల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Future

వివరాలు:
ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ సొసైటీ (అవేస్) ఆధ్వర్యంలో ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ నడుస్తున్నాయి.

అర్హతలు, వివరాలు
-పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్(పీజీటీ)- ఫిజిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్
-అర్హత: పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ (ఫిజిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్)లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. సీనియర్ సెకండరీ క్లాసెస్ (9, 10వ తరగతి సీబీఎస్‌ఈ సిలబస్)లో బోధించిన అనుభవం ఉండాలి.
-గ్రాడ్యుయేట్ టీచర్స్(టీజీటీ)- సోషల్ సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లిష్, హిందీ
-అర్హత: సంబంధిత గ్రాడ్యుయేట్ డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత బీఈడీతోపాటు సెకండరీ క్లాసెస్ (6 నుంచి 10వ తరగతి) బోధించిన అనుభవం ఉండాలి.
-కంప్యూటర్ సైన్స్ టీచర్
-అర్హత: ఎంటెక్/ఎంసీఏ, ఎమ్మెస్సీ (కంప్యూటర్ సైన్స్)లో ఉత్తీర్ణత.
-ప్రైమరీ టీచర్ (పీఆర్‌టీ)-ఆల్ సబ్జెక్ట్స్
-అర్హత: ఏదైనా డిగ్రీతో పాటు బీఇడీ ఉండాలి.
-యాక్టివిటీ టీచర్స్ (మ్యూజిక్ టీచర్ (వెస్ట్రన్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్)
-అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో 50 శాతం మార్కులతోపాటు సంబంధిత సబెక్టుల్లో సర్టిఫికెట్ ఉండాలి.
-స్పెషల్ ఎడ్యుకేటర్
-అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతోపాటు బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్)లో ఉత్తీర్ణత.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో. దరఖాస్తులను పూర్తిగా నింపి, సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.
-దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 1
-వెబ్‌సైట్:www.apsrkpuram.edu.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
జీఐసీలో మేనేజర్లు ఉద్యోగాలు,
-జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ)లో స్కేల్-
- ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

general
వివరాలు:

జీఐసీ భారత ప్రభుత్వ రంగ సంస్థ. ప్రపంచంలో 12వ అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ.
-పోస్టు: అసిస్టెంట్ మేనేజర్ (స్కేల్-I)
-మొదట పోస్టింగ్ ముంబై ప్రధానకార్యాలయంలో ఇస్తారు. తర్వాత అవసరాన్ని బట్టి దేశ/విదేశాల్లో ఎక్కడైనా పోస్టింగ్ ఇవ్వొచ్చు.
-మొత్తం ఖాళీల సంఖ్య: 25. వీటిలో జనరల్ స్ట్రీమ్- 24, హిందీ- 1 ఉన్నాయి.
-అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ/పీజీ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీలకు 55 శాతం మార్కులు వస్తే సరిపోతుంది.
-హిందీ పోస్టుకు కనీసం 60 శాతం మార్కులతో హిందీలో పీజీతోపాటు డిగ్రీస్థాయిలో ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. లేదా పీజీలో ఇంగ్లిష్‌తోపాటు డిగ్రీలో హిందీ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
-వయస్సు: 2018 మే 8 నాటికి 21 - 30 ఏండ్ల మధ్య ఉండాలి.
-జీతం: ప్రారంభ వేతనం నెలకు
రూ. 53,400/- (సుమారుగా)
-ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్ . దీనిలో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. రాతపరీక్ష, జీడీ, ఇంటర్వ్యూలకు కేటాయించిన మార్కులు 200.
-ఆన్‌లైన్ టెస్ట్ జూన్/జూలైలో నిర్వహిస్తారు.
-హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, తిరువనంతపురం, ముంబై/నవీముంబై, థానే, కోల్‌కతా, గ్రేటర్ కోల్‌కతా, న్యూఢిల్లీ ఎన్‌సీఆర్‌లలో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: మే 29
-వెబ్‌సైట్: www.gicofindia.com


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీఎస్‌ఐఈర్ పీహెచ్‌డీ ప్రవేశాలు.

చండీగఢ్‌లోని సీఎస్‌ఐఈర్-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబయాల్ టెక్నాలజీ (ఐఎంటెక్) 2018-19 విద్యా సంవత్సరానికి వివిధ విభాగాల్లో పీహెచ్‌డీ ప్రవేశాల కోసం
నోటిఫికేషన్ విడుదల చేసింది.
Imtech
-కోర్సుపేరు: పీహెచ్‌డీ
-అర్హత: 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ/ఎమ్మెస్సీలో 55 శాతం (ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 50 శాతం) మార్కులతో ఉత్తీర్ణత. సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్/డీబీటీ జేఆర్‌ఎఫ్, డీఎస్‌టీ ఇన్‌స్పైర్ ఫెలోషిప్, ఐసీఎంఆర్ జేఆర్‌ఎఫ్ స్కోర్ కార్డ్ కలిగి ఉండాలి. పీజీ ఫైనల్ ఇయర్ పూర్తిచేయనున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: మే 24
-వెబ్‌సైట్: www.imtech.res.in

No comments:

Post a Comment