Thursday, 7 June 2018

ఇండియన్ నేవీలో సెయిలర్స్ ఉద్యోగాలు, సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌లో స్టాఫ్‌నర్స్ ఉద్యోగాలు, ఐసీఎంఆర్‌లో యూడీసీలు ఉద్యోగాలు, ఐఐటీ బాంబేలో ఉద్యోగాలు, సీడాక్‌లో ప్రాజెక్టు ఇంజినీరు ఉద్యోగాలు, ఎన్‌సీఏఓఆర్‌లో ఉద్యోగాలు.

ఇండియన్ నేవీలో సెయిలర్స్ ఉద్యోగాలు,

ఇంటర్/10+2 లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత
-శిక్షణ తర్వాత మాస్టర్ చీఫ్ పెట్టీ ఆఫీసర్ హోదాలో ఉద్యోగం
-ఉద్యోగ భద్రత, మంచి జీతం, చాలెంజింగ్ కెరీర్
-రాతపరీక్ష, పీఎఫ్‌టీ ద్వారా ఎంపిక
-దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 15
భారత ప్రభుత్వ రక్షణశాఖ పరిధిలోని ఇండియన్ నేవీ (ఐఎన్) సెయిలర్ పోస్టుల భర్తీకి ఆర్టిఫైజర్ అప్రెంటిస్ (ఏఏ) ఫిబ్రవరి-2019 బ్యాచ్‌లో చేరడానికి అర్హత గల అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Indian-Navy-Officer.jpg
వివరాలు:
భారత రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని నావికాదళంలో సెయిలర్ (ఆర్టిఫైజర్ అప్రెంటిస్ ) పోస్టులు. దీనికి సంబంధించిన కోర్సు ఫిబ్రవరి 2019లో ప్రారంభమవుతుంది.
-విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్ లేదా 10+2 లేదా తత్సమాన కోర్సులో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఇంటర్ స్థాయిలో మ్యాథ్స్, ఫిజిక్స్‌తోపాటు కెమిస్ట్రీ/బయాలజీ లేదా కంప్యూటర్ సైన్స్‌లో ఏదో ఒక ఆప్షనల్ సబ్జెక్టును చదివి ఉండాలి.
-వయస్సు: 1999 ఫిబ్రవరి 1 నుంచి 2002 జనవరి 31 మధ్యన జన్మించి ఉండాలి.
-జీతభత్యాలు: శిక్షణా కాలంలో నెలకు రూ. 14,600/- స్టయిఫండ్ చెల్లిస్తారు. ఆర్టిఫైజర్ అప్రెంటిస్ పూర్తి అయిన తర్వాత సుబేదార్ హోదాలో పే స్కేల్ రూ. 21,700-69,100/ అదనంగా ఎంఎస్‌పీ రూ. 5,200+ ఎక్స్ గ్రూప్ పే రూ. 6,200/+ డీఏ ఇస్తారు.
-పదోన్నతులు: సెయిలర్ నుంచి మాస్టర్ చీఫ్ పెట్టీ ఆఫీసర్ - 1 (సుబేదార్‌కు సమాన స్థాయి) వరకు ఉంటుంది.
-శిక్షణాకాలంలో సెయిలర్స్‌కు పుస్తకాలు, యూనిఫాం, భోజనం, వసతి సౌకర్యాలను ఉచితంగా ఇస్తారు. సెయిలర్స్, వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్యసౌకర్యం కల్పిస్తారు. సెయిలర్స్ పిల్లల విద్య, హెచ్‌ఆర్‌ఏ అలవెన్స్‌లు ఇస్తారు. వీటితోపాటు సంవత్సరాంత సెలవులు ఉంటాయి.
-ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ ఎగ్జామ్
-ఆబ్జెక్టివ్ విధానంలో 100 మార్కులకుగాను కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ప్రశ్నపత్రం కేవలం ఇంగ్లిష్/హిందీలో మాత్రమే ఉంటుంది. ప్రశ్నపత్రం ఇంటర్ స్థాయిలో ఉంటుంది. పరీక్ష కాలవ్యవధి 60 నిమిషాలు
-పరీక్షలో ఇంగ్లిష్, సైన్స్, మ్యాథ్స్, జనరల్ నాలెడ్జ్‌పై ప్రశ్నలు ఇస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కులను తగ్గిస్తారు.
-అభ్యర్థులు ప్రతి సెక్షన్‌లో తప్పనిసరిగా క్వాలిఫై కావాలి.
-ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (పీఎఫ్‌టీ): 7 నిమిషాల్లో 1.6 కి.మీ దూరం పరుగెత్తాలి. 20 ఉతక్, బైతక్ (గుంజీలు), 10 పుష్ అప్స్ చేయాలి.
-శారీరక ప్రమాణాలు: కనీసం 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఛాతీ గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ వ్యాకోచించాలి. ఎత్తుకు తగ్గ బరువు, ఛాతీ ఉండాలి. వీటితోపాటు నేవీ నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. మంచి కంటిచూపు (6/12, 6/12 లేదా 6/9, 6/12) ఉండాలి.
-పరీక్ష ఫీజు: రూ. 106/-, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు.
-శిక్షణ: ఫిబ్రవరి 2019లో ప్రారంభమవుతుంది. 9 వారాల పాటు ప్రాథమిక శిక్షణ ఐఎన్‌ఎస్ చిల్కాలో ఇస్తారు. దీనితోపాటు వృత్తిగత శిక్షణ నేవల్ శిక్షణ కేంద్రాల్లో ఇస్తారు. శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకొన్నవారికి 20 ఏండ్ల కాలపరిమితికి నియామక ఉత్తర్వులు అందజేస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూన్ 15
-వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌లో స్టాఫ్‌నర్స్ ఉద్యోగాలు,

న్యూఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ హాస్పిటల్ అండ్ వీఎంఎంసీలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్స్ (తాత్కాలిక ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
SAFDARJUNG-HOSPITAL.jpg

వివరాలు:
ఆరోగ్య కుటుంబ, సంక్షేమ మంత్రిత్వశాఖ ఆధ్యర్యంలో ఈ హాస్పిటల్ పనిచేస్తుంది.
-పోస్టు పేరు: స్టాఫ్‌నర్స్
-మొత్తం పోస్టుల సంఖ్య: 932 (జనరల్-514, ఓబీసీ-199, ఎస్సీ-154, ఎస్టీ-65)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ నర్సింగ్ (ఆనర్స్) లేదా నాలుగేండ్ల బీఎస్సీ నర్సింగ్/ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీలో డిప్లొమా లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
-పే స్కేల్: రూ. 37,500/-(కన్సాలిడేటెడ్ పే)
-వయస్సు: 35 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూన్ 10
-ఇంటర్వ్యూ తేదీ: జూన్ 25
-వెబ్‌సైట్: www.vmmc-sjh.nic.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐసీఎంఆర్‌లో యూడీసీలు ఉద్యోగాలు,
న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
ICMR.jpg

వివరాలు:
ఐసీఎంఆర్ దేశవ్యాప్తంగా మొత్తం 32 రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లను నడుపుతున్నది.
-మొత్తం పోస్టుల సంఖ్య: 71
-విభాగాలవారీగా ఖాళీలు..అసిస్టెంట్-4 (జనరల్-3, ఓబీసీ-1)
-పర్సనల్ అసిస్టెంట్-3 (జనరల్), అప్పర్ డివిజన్ క్లర్క్-64 (జనరల్-34, ఓబీసీ-17, ఎస్సీ-9, ఎస్టీ-4)
-అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతోపాటు అసిస్టెంట్ పోస్టులకు.. కంప్యూటర్ ( ఎంఎస్ ఆఫీస్/పవర్ పాయింట్)లో పరిజ్ఞానం ఉండాలి, పర్సనల్ అసిస్టెంట్ పోస్టులకు..ఇంగ్లిష్/హిందీ షార్ట్‌హ్యాండ్‌లో నిమిషానికి 120 పదాల వేగాన్ని కలిగి ఉండాలి.యూడీసీ పోస్టులకు.. ఇంగ్లిష్/హిందీ టైపింగ్‌లో నిమిషానికి 30 పదాల వేగంతో కంప్యూటర్ స్క్రీన్ పైన టైప్ చేయాలి.
-వయస్సు: యూజీసీ పోస్టులకు 18 నుంచి 27 ఏండ్ల మధ్య, అసిస్టెంట్/పర్సనల్ అసిస్టెంట్‌కు 30 ఏండ్లకు మించరాదు.
-ఫీజు: రూ. 300/-
-ఎంపిక: ఆన్‌లైన్ కంప్యూటర్ టెస్ట్ ద్వారా
-ఆబ్జెక్టివ్ రాతపరీక్షలో 200 ప్రశ్నలు వస్తాయి. 120 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది.
-ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 200 మార్కులు. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కులను తగ్గిస్తారు.
-రాతపరీక్షలో జనరల్ ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్/అవేర్‌నెస్ అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
-ప్రశ్నలు పదోతరగతి స్థాయిలో ఇస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూలై 9
-ఫీజు చెల్లింపు చివరితేదీ: జూలై 10
-రాతపరీక్ష తేదీ: 2018 ఆగస్టులో
-వెబ్‌సైట్: www.icmr.nic.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐటీ బాంబేలో ఉద్యోగాలు,
ముంబైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
IIT-BOMBAY.jpg

వివరాలు:
ఇండస్ట్రియల్ డిజైన్ సెంటర్ పరిధిలోని ప్రాజెక్ట్‌లో కింది ఖాళీలు ఉన్నాయి.
-ప్రాజెక్ట్ రిసెర్చ్ అసోసియేట్ - 1
-అర్హత: మాస్టర్ ఇన్ డిజైనింగ్‌తోపాటు రెండేండ్ల అనుభవం ఉండాలి.
-ప్రాజెక్టు రిసెర్చ్ అసిస్టెంట్ - 1
-అర్హత: ఎం.డిజైన్‌తోపాటు రెండేండ్ల అనుభవం.
-ప్రాజెక్టు టెక్నికల్ అసిస్టెంట్ - 1
-అర్హత: ఐటీఐతోపాటు మూడేండ్ల అనుభవం.
-సీనియర్ ప్రాజెక్టు టెక్నికల్ అసిస్టెంట్ - 1
-అర్హత: బీఈ/బీటెక్/ఎంఏ లేదా ఎమ్మెస్సీ లేదా ఎంసీఏ/ఎంబీఏ.
-ప్రాజెక్టు రిసెర్చ్ ఇంజినీర్ - 1
-అర్హత: ఎంటెక్/ఎంఈ/ఎం.డిజైన్‌తోపాటు రెండు లేదా మూడేండ్ల అనుభవం ఉండాలి.
-ప్రాజెక్టు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - 2
-అర్హత: ఎంటెక్/ఎంఈ/ఎం.డిజైన్
-వీటితోపాటు సీనియర్ ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్ -1, ప్రాజెక్టు అసిస్టెంట్ - 2, ప్రాజెక్టు రిసెర్చ్ అసిస్టెంట్ - 2, ప్రాజెక్టు రిసెర్చ్ అసోసియేట్ - 1ఖాళీ ఉన్నాయి.
-మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో..
-ప్రాజెక్టు రిసెర్చ్ అసిస్టెంట్ -3, ప్రాజెక్టు రిసెర్చ్ సైంటిస్ట్ - 1, ప్రాజెక్టు రిసెర్చ్ అసోసియేట్ - 2 పోస్టులు ఉన్నాయి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూన్ 15
-వెబ్‌సైట్: http://www.ircc.iitb.ac.in


---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
 సీడాక్‌లో ప్రాజెక్టు ఇంజినీరు ఉద్యోగాలు,
హైదరాబాద్‌లోని సీడాక్‌లో ప్రాజెక్టు ఇంజినీరు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
CDAC.jpg
-పోస్టు: ప్రాజెక్టు ఇంజినీర్/మేనేజర్, ప్రాజెక్టు ఆఫీసర్, ప్రాజెక్టు అసోసియేట్
-మొత్తం పోస్టుల సంఖ్య - 18
-విభాగాల వారీగా ప్రాజెక్టు ఇంజినీర్ (వీఎల్‌ఎస్‌ఐ) - 3, ప్రాజెక్టు ఇంజినీర్ (ఈఎల్‌టీ) - 3, ప్రాజెక్టు ఇంజినీర్ (ఎస్‌ఏఎన్‌ఎస్) - 2, ప్రాజెక్టు ఇంజినీర్ (ఐఎస్‌ఈఏ/1) - 1, ప్రాజెక్టు ఇంజినీర్ (ఐఎస్‌ఈఏ/2) - 1, ప్రాజెక్టు ఇంజినీర్ (డాటా అనలిస్ట్) - 2, ప్రాజెక్టు మేనేజర్ (ఐఈఎస్‌ఈ) హైదరాబాద్ - 1, ప్రాజెక్టు ఆఫీసర్ (పర్చేస్) - 1, ప్రాజెక్టు ఆఫీసర్ (ట్రెయినింగ్) - 1, ప్రాజెక్టు అసోసియేట్ (ఎస్‌ఏఎన్‌ఎస్) - 2 ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు: సంబంధిత బ్రాంచీ/సబ్జెక్టులో బీఈ/బీటెక్ లేదా డీవోఈఏసీసీ బీ లెవల్ కోర్సుతోపాటు ఏడాది అనుభవం లేదా ఎమ్మెస్సీ (సంబంధిత బ్రాంచీ)తోపాటు అనుభవం.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూన్ 15
-వెబ్‌సైట్: https://cdac.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌సీఏఓఆర్‌లో ఉద్యోగాలు.

నేషనల్ సెంటర్ ఫర్ అంటార్కిటికా అండ్ ఓషియన్ రిసెర్చ్ (ఎన్‌సీఏఓఆర్)లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
-మొత్తం పోస్టుల సంఖ్య: 27
-వెహికిల్ మెకానిక్ - 3, వెహికిల్ ఎలక్ట్రీషియన్ - 2, ఆపరేటర్ ఎగ్జావేటింగ్ మెషిన్ - 1, క్రేన్ ఆపరేటర్ - 1, స్టేషన్ ఎలక్ట్రీషియన్ - 1, జనరేటర్ మెకానిక్/ఆపరేటర్ - 2, వెల్డర్ - 3, బాయిలర్‌ఆపరేటర్ అండ్ మెకానిక్/ప్లంబర్ - 1, కార్పెంటర్ - 2, మల్టీటాస్కింగ్ స్టాఫ్ - 1, మేల్ నర్స్ - 2, ల్యాబ్ టెక్నీషియన్ - 2, ఇన్వెంటరీ/బుక్ కీపింగ్ స్టాఫ్ - 2, కుక్ - 4 ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు: సంస్థ నిబంధనల ప్రకారం
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా. జూలై 10 నుంచి 13 వరకు నిర్వహిస్తారు.
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-వెబ్‌సైట్: http://www.ncaor.gov.in

No comments:

Post a Comment