Sunday, 8 July 2018

న్యూ ఇండియా అస్యూరెన్స్‌లో 685 అసిస్టెంట్లు జాబ్స్, స్పీచ్ అండ్ హియరింగ్‌లో ఫ్యాకల్టీ పోస్టులు, ఎన్‌పీటీఐలో పీజీ డిప్లొమా ప్రవేశాలు.

న్యూ ఇండియా అస్యూరెన్స్‌లో 685 అసిస్టెంట్లు జాబ్స్,

ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వివిధ ప్రదేశాలు/ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
students
-మొత్తం ఖాళీల సంఖ్య -685 
-పోస్టు పేరు : అసిస్టెంట్ 
-విద్యార్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత
-వయస్సు: 2018 జూన్ 30 నాటికి 21 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
-ట్రెయినింగ్ పీరియడ్: ఏడాది
-పే స్కేల్: రూ.14,435-40,080/-మెట్రోపాలిటన్ నగరాల్లో నెలకు సుమారుగా రూ. 23,500/- జీతం ఉంటుంది. వీటికి తోడు ఇన్సూరెన్స్ నిబంధనల ప్రకారం మరికొన్ని అలవెన్స్‌లు ఇస్తారు.
-అప్లికేషన్ ఫీజు: రూ. 600/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు రూ. 100/-
-ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాతపరీక్ష 
-దీనిలో ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్స్ ఉంటాయి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులు ప్రారంభం: జూలై 16
-చివరితేదీ: జూలై 31
-ప్రిలిమినరీ ఎగ్జామ్: సెప్టెంబర్ 8, 9
-మెయిన్ ఎగ్జామ్: అక్టోబర్ 6
-వెబ్‌సైట్: www.newindia.co.in
-ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (టైర్ 1):100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష కాలవ్యవధి 60 నిమిషాలు. 
-ఈ పరీక్షలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ (30 మార్కులు), రీజనింగ్ ఎబిలిటీ (35 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (35 మార్కులు) అంశాలపైన ప్రశ్నలు ఇస్తారు. 
-మెయిన్ ఎగ్జామినేషన్ (టైర్ 2): 250 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష కాలవ్యవధి120 నిమిషాలు. 

-ఈ పరీక్షలో ఇంగ్లిష్ లాంగ్వేజ్, రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంశాలపైన పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి విభాగం నుంచి 40 ప్రశ్నలు ఇస్తారు-ఒక్కొక్క విభాగానికి 50 మార్కులు కేటాయించారు.
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
స్పీచ్ అండ్ హియరింగ్‌లో ఫ్యాకల్టీ పోస్టులు,
మైసూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ & హియరింగ్‌లో ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
Aiish
-ప్రొఫెసర్లు - 17
-అసోసియేట్ ప్రొఫెసర్లు-9
-అసిస్టెంట్ ప్రొఫెసర్లు -15
-విభాగాలు: స్పీచ్ సైన్సెస్, ఆడియాలజీ, స్పీచ్ ఫాథాలజీ/లాంగ్వేజ్ పాథాలజీ, ఈఎన్‌టీ, క్లినికల్ సైకాలజీ తదితర విభాగాలు ఉన్నాయి.
-ఇయర్ మౌల్డ్ టెక్నీషియన్-1
-పేస్కేల్: ప్రొఫెసర్లు - లెవల్ 13, అసోసియేట్ ప్రొఫెసర్లు-లెవల్ 12, అసిస్టెంట్ ప్రొఫెసర్లు-లెవల్ 11, ఇయర్ మౌల్డ్ టెక్నీషియన్-లెవల్ 5 పేమ్యాట్రిక్స్ ప్రకారం జీతభత్యాలు చెల్లిస్తారు.
-దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
-చివరితేదీ: ఆగస్టు 17
-వెబ్‌సైట్: http://www.aiishmysore.com


---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌పీటీఐలో పీజీ డిప్లొమా ప్రవేశాలు.

న్యూఢిల్లీలోని నేషనల్ పవర్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్ ట్రాన్స్‌మిషన్ & డిస్ట్రిబ్యూషన్ విభాగంలో పీజీ డిప్లొమా ప్రోగ్రామ్ ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
-కోర్సు పేరు: పీజీ డిప్లొమా ఇన్ ట్రాన్స్‌మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్
-మొత్తం సీట్ల సంఖ్య: 60
-కోర్స్ వ్యవధి: 26 వారాలు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్, పవర్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో నాలుగేండ్ల బ్యాచిలర్ డిగ్రీ (బీఈ/బీటెక్)లో ఉత్తీర్ణత లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
-దరఖాస్తు ఫీజు: రూ. 500/- (డీడీ రూపంలో చెల్లించాలి)
-దరఖాస్తు : ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తును నింపి, సంబంధిత అధికారికి పంపాలి. 
చిరునామా: The Principal Director, National Power Training Institute, Badarpur, New Delhi-110044
-చివరితేదీ: ఆగస్టు 10
-వెబ్‌సైట్: www.nptinagpur.com

No comments:

Post a Comment