Monday, 23 July 2018

సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో 54,953 ఉద్యోగాలు, ఏఏఐలో జూనియర్ అసిస్టెంట్లు ఉద్యోగాలు, సౌత్ ఈస్టర్న్ రైల్వేలో ఉద్యోగాలు, ఏఐఏటీఎస్‌ఎల్ ఆఫీసర్లు ఉద్యోగాలు, కాఫీ బోర్డులో పీజీ డిప్లొమా ప్రవేశాలు.

సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో 54,953 ఉద్యోగాలు,
కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఏపీఎఫ్), ఎన్‌ఐఏ & ఎస్‌ఎస్‌ఎఫ్, అస్సాం రైఫిల్స్ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఉమ్మడి ఎగ్జామినేషన్-2018కు సంబంధించిన నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) విడుదల చేసింది.
Central-Armed-Police-Force
-మొత్తం పోస్టుల సంఖ్య: 54,953 (పురుషులు-47,307, మహిళలు-7,646)
-విభాగాలవారీగా ఖాళీలు: బీఎస్‌ఎఫ్-16,984, సీఐఎస్‌ఎఫ్-200, సీఆర్‌పీఎఫ్-21,566, ఎస్‌ఎస్‌బీ-8,546, ఐటీబీపీ-4,126, అస్సాం రైఫిల్స్-3,076, ఎన్‌ఐఏ-8, ఎస్‌ఎస్‌ఎఫ్-447
-పే స్కేల్: రూ. 21,700-69,100
-అర్హతలు: గుర్తింపు పొందిన సంస్థ/ బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ లేదా పదోతరగతి ఉత్తీర్ణత.
-వయస్సు: 2018, ఆగస్టు 1 నాటికి 18 నుంచి 23 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎంపిక: ఆన్‌లైన్ రాతపరీక్ష, పీఈటీ, పీఎస్‌టీ
-5 కిలోమీటర్ల పరుగు పందెంను పురుషులు 24 నిమిషాల్లో పూర్తి చేయాలి
-1.6 కిలోమీటర్ల పరుగు పందెం మహిళలు 6 1/2 నిమిషాల్లో పూర్తి చేయాలి
-శారీరక ప్రమాణాలు: ఎత్తు: పురుషులు - 170 సెం.మీ., ఛాతీ: 80 సెం.మీ., గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. వ్యాకోచించాలి. మహిళా అభ్యర్థులు 157 సెం.మీ.ల ఎత్తు ఉండాలి.
-ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్ రాత పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్‌నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్/ హిందీ అంశాల్లో నుంచి ప్రశ్నలు ఇస్తారు. ప్రతి విభాగం నుంచి ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 25 ప్రశ్నలు ఇస్తారు. 90 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తు రుసుం: రూ.100/-
-చివరితేదీ: ఆగస్టు 20
-వెబ్‌సైట్: www.ssconline.nic.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ఏఏఐలో జూనియర్ అసిస్టెంట్లు ఉద్యోగాలు,

వెస్టర్న్ రీజియన్ (ముంబై)లోని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఫైర్ సర్వీస్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్స్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Airports-Authority
-పోస్టు పేరు: జూనియర్ అసిస్టెంట్స్ 
-మొత్తం పోస్టుల సంఖ్య: 119 (జనరల్-66, ఓబీసీ-35, ఎస్టీ-18)
-అర్హతలు: పదోతరగతితోపాటు మెకానికల్, ఆటోమొబైల్/ఫైర్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా లేదా ఇంటర్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. వినియోగంలో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. సంస్థ నిబంధనల ప్రకారం శారీరక ప్రమాణాలను కలిగి ఉండాలి.
-వయస్సు : 2018 జూన్ 30 నాటికి 30 ఏండ్లకు మించరాదు. 
-పే స్కేల్: రూ. 12,500-28,500/- 
-ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాతపరీక్ష
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ : ఆగస్టు 6
-వెబ్‌సైట్: www.airportsindia.org.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సౌత్ ఈస్టర్న్ రైల్వేలో ఉద్యోగాలు,
కోల్‌కతాలోని సౌత్ ఈస్టర్న్ రైల్వే (ఎస్‌ఈఆర్) స్కౌట్స్ అండ్ గైడ్ కోటాలో 2018-19కుగాను ఖాళీగా ఉన్న గ్రూప్ -సి, డి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 
Indian_Railway
-మొత్తం పోస్టుల సంఖ్య: 10 (గ్రూప్ సి పోస్టులు-2, గ్రూప్ డి పోస్టులు-8)
-అర్హత: ఇంటర్ (గ్రూప్ డి పోస్టులకు పదోతరగతి) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. రెండు పోస్టులకూ ప్రెసిడెంట్ స్కౌట్/ గైడ్, రోవర్, రేంజర్ లేదా హిమాలయన్ ఉడ్ బ్రిడ్జి సభ్యత్వం ఉండాలి.
-పే స్కేల్: రూ. 5,200-20,200 + గ్రేడ్ పే రూ.1800/- (గ్రూప్ సి పోస్టులకు గ్రేడ్ పే రూ. 1900/-)
-ఎంపిక: రాత పరీక్ష, స్కౌట్ స్కిల్ టెస్ట్ ద్వారా.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: ఆగస్టు 16
-వెబ్‌సైట్: www.ser.indianrailways.gov.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఏఐఏటీఎస్‌ఎల్ ఆఫీసర్లు ఉద్యోగాలు,
ముంబై పరిధిలోని ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఏటీఎస్‌ఎల్) ఖాళీగా ఉన్న ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
air-india
-మొత్తం పోస్టుల సంఖ్య:15
-ఆఫీసర్ (హెచ్‌ఆర్-7, అకౌంట్స్-8)
-అర్హతలు: ఆఫీసర్ (హెచ్‌ఆర్& ఐఆర్) పోస్టులకు ఎంబీఏ (హెచ్‌ఆర్ లేదా పర్సనల్ మేనేజ్‌మెంట్), ఆఫీసర్ (అకౌంట్స్) పోస్టులకు సీఏ/సీఎంఏ ఇంటర్ లేదా ఎంబీఏ (ఫైనాన్స్)లో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-పే స్కేల్: రూ. 32, 200/-
-వయస్సు: 30 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక : గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ.
-దరఖాస్తు: ఈ మెయిల్ (rftc.aiatsl@airindia.in) 
-ఇంటర్వ్యూ తేదీ: ఆగస్టు 3
-వెబ్‌సైట్: www.airindia.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

కాఫీ బోర్డులో పీజీ డిప్లొమా ప్రవేశాలు.

బెంగళూరులోని కాఫీ బోర్డు 2018-19కుగాను పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
-పీజీ డిప్లొమా (కాఫీ క్వాలిటీ మేనేజ్‌మెంట్) 
-కోర్సు వ్యవధి: 12 నెలలు
-అర్హతలు: సంబంధిత సైన్స్ సబ్జెక్టుల్లో డిగ్రీ లేదా అగ్రికల్చర్ సైన్స్‌లో డిగ్రీ.
-ఎంపిక: అకడమిక్ మార్కులు+ ఇంటర్వ్యూ
-దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 14
-వెబ్‌సైట్: www.indiacoffee.org

No comments:

Post a Comment