Thursday, 25 October 2018

కెనరాబ్యాంక్‌లో 800 ఉద్యోగాలు, గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ & ఇంజినీర్స్ లిమిటెడ్‌లో జనరల్ మేనేజర్లు ఉద్యోగాలు, ఐసీఏఐ సబ్జెక్టు ఎక్స్‌పర్ట్స్ ఉద్యోగాలు, ఓఎన్‌జీసీలో ఉద్యోగాలు, పవర్‌గ్రిడ్‌లో ఇంజినీర్లు ఉద్యోగాలు.

కెనరాబ్యాంక్‌లో 800 ఉద్యోగాలు,

కెనరాబ్యాంక్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం ప్రత్యేకంగా రూపొందించిన పీజీడీబీఎఫ్ కోర్సు ప్రకటన విడుదలైంది.
canara-bank
-పోస్టు: ప్రొబేషనరీ ఆఫీసర్ (జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్-I)
-పేస్కేల్: రూ. 23,700-42020/-
-ఈ పోస్టుల భర్తీ కోసం ఏడాదిపాటు నిర్వహించే పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్) కోర్సు పూర్తి చేయాలి. అనంతరం బ్యాంక్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా ఉద్యోగావకాశం కల్పిస్తారు.
-పీజీడీబీఎఫ్: ఈ కోర్సులో 9 నెలలు తరగతి బోధన ఉంటుంది. మూడునెలలు కెనరాబ్యాంక్ బ్రాంచీ/కార్యాలయాల్లో ఇంటర్న్‌షిప్ చేయాలి.
-బెంగళూరులోని మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ లేదా గ్రేటర్ నోయిడాలోని ఎన్‌ఐటీటీఈ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్‌లో ఈ కోర్సు చేయవచ్చు.
-ఇది పూర్తిగా రెసిడెన్షియల్ ప్రోగ్రామ్
-ఎంపిక: ఆన్‌లైన్ విధానంలో రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ
-రాతపరీక్ష విధానం: 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. దీనిలో రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్‌నెస్ నుంచి 50 ప్రశ్నల చొప్పున మొత్తం 200 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష కాలవ్యవధి రెండు గంటలు.
-పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కులు కోతవిధిస్తారు.
-పరీక్ష కేంద్రాలు: రాష్ట్రంలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
-అర్హత: 2018, అక్టోబర్ 1 నాటికి కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు 55 శాతం మార్కులు వస్తే సరిపోతుంది.
-వయస్సు: 2018, అక్టోబర్ 1 నాటికి 20 -30 ఏండ్ల మధ్య ఉండాలి.
-కోర్సు ఫీజు: మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్‌లో రూ.4,13,000 (అన్ని కలుపుకొని). ఎన్‌ఐటీటీఈ ఎడ్యుకేషన్‌లో
రూ. 3,54,000/- (అన్ని కలుపుకొని). ఫీజును రెండు వాయిదాల్లో చెల్లించాలి.
-అర్హత ఉన్నవారికి బ్యాంక్ ఎడ్యుకేషన్ లోన్ ఇస్తుంది.
-ఇంటర్న్‌షిప్ కాలంలో నెలకు రూ. 10 వేలు స్టయిఫండ్ చెల్లిస్తారు.
-పీజీడీబీఎఫ్ కోర్సు విజయవంతంగా పూర్తిచేసుకున్న వారికి పీవోగా అవకాశం కల్పిస్తారు. ఏడాది ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఫీజు: జనరల్, ఓబీసీలకు రూ. 708/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ. 118/-
-చివరితేదీ: నవంబర్ 13
-ఆన్‌లైన్ టెస్ట్ కాల్‌లెటర్స్ డౌన్‌లోడింగ్: 2018, డిసెంబర్ 5 తర్వాత
-ఆన్‌లైన్ టెస్ట్ తేదీ: 2018, డిసెంబర్ 23
-వెబ్‌సైట్: https://www.canarabank.com

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ & ఇంజినీర్స్ లిమిటెడ్‌లో జనరల్ మేనేజర్లు ఉద్యోగాలు,

మినీరత్న కంపెనీ గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ & ఇంజినీర్స్ లిమిటెడ్‌లో జీఎం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
-పోస్టు: జనరల్ మేనేజర్ (టెక్నికల్)
-ఖాళీలు: 4 (ఎస్సీ-2, ఓబీసీ-2)
-అర్హతలు, వయస్సు, ఎంపిక తదితరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 12
-వెబ్‌సైట్: http://www.grse.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐసీఏఐ సబ్జెక్టు ఎక్స్‌పర్ట్స్ ఉద్యోగాలు,
న్యూఢిల్లీలోని ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ)లో సబ్జెక్టు ఎక్స్‌పర్ట్, అకౌంటెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
iicai
పోస్టులు-వివరాలు:
-సబ్జెక్టు ఎక్స్‌పర్ట్: ఫైనాన్షియల్ రిపోర్టింగ్, కార్పొరేట్ లా, డైరెక్ట్ అండ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, రిస్క్ మేనేజ్‌మెంట్, ఎకనామిక్స్, కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటింగ్, ఆడిటింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బిజినెస్ కమ్యూనికేషన్ అండ్ రిపోర్టింగ్.
-ప్రొఫెషనల్స్: ఐటీ, చార్టెర్డ్ అకౌంటెంట్స్
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: నవంబర్ 7
-వెబ్‌సైట్: www.icai.org

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఓఎన్‌జీసీలో ఉద్యోగాలు,
ఓఎన్‌జీసీ మంగళూరు పెట్రోకెమికల్స్ లిమిటెడ్‌లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
OMPL
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రెయినింగ్:
-కెమికల్ ఇంజినీరింగ్-2, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్-3, ఈసీఈ-1, మెకానికల్-1 ఖాళీ ఉన్నాయి.
-అర్హతలు: సంబంధిత బ్రాంచీలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత. 
-టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ ట్రెయినింగ్:
-కెమికల్ ఇంజినీరింగ్-2, ఈఈఈ-2, ఈఐఈ-1 ఖాళీ ఉన్నాయి.
-అర్హతలు: సంబంధిత బ్రాంచీలో డిప్లొమా ఉత్తీర్ణత.
-ఎంపిక: అకడమిక్ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు.
-వయస్సు, స్టయిఫండ్, తుది ఎంపిక వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-వెబ్‌సైట్: www.ompl.co.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
పవర్‌గ్రిడ్‌లో ఇంజినీర్లు ఉద్యోగాలు.

నవరత్న కంపెనీ పవర్‌గ్రిడ్‌లో ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
PowerGrid
పోస్టులు-ఖాళీలు:
-అసిస్టెంట్ ఇంజినీర్ (సేఫ్టీ)-13. వీటిలో జనరల్-6, ఓబీసీ-4, ఎస్సీ-2, పీహెచ్‌సీ-1ఖాళీ ఉన్నాయి.
-అసిస్టెంట్ ఆఫీసర్ (అకౌంట్స్)- 2 (ఎస్టీ)
-సీనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్)-1 (ఎస్సీ)
-డిప్యూటీ మేనేజర్ (ఎలక్ట్రికల్)-1 (ఓబీసీ ఎన్‌సీఎల్)
-అర్హతలు ఆయా పోస్టులకు వేర్వేరుగా ఉన్నాయి. వెబ్‌సైట్ చూడవచ్చు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 30
-వెబ్‌సైట్: www.powergridindia.com

No comments:

Post a Comment