Wednesday, 24 October 2018

బ్యాంక్ నోట్ ప్రెస్‌లో 86 ఉద్యోగాలు, ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో నావిక్ ఉద్యోగాలు, ఐఐటీడీలో పీహెచ్‌డీ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్, ఏఎఫ్‌ఆర్‌ఐలో ఉద్యోగాలు, హైదరాబాద్ ఐఐటీలో ఉద్యోగాలు.

బ్యాంక్ నోట్ ప్రెస్‌లో 86 ఉద్యోగాలు,

దివాస్‌లోని బ్యాంక్ నోట్ ప్రెస్‌లో ఆఫీసర్లు, సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
bank-note-press

పోస్టులు-ఖాళీలు:
-సేఫ్టీ ఆఫీసర్-1, వెల్ఫేర్ ఆఫీసర్-1, సూపర్‌వైజర్ (ప్రింటింగ్ అండ్ ప్లేట్ మేకింగ్)-15, సూపర్‌వైజర్ (ఎలక్ట్రికల్)-1, సూపర్‌వైజర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)-1, సూపర్‌వైజర్ (ఏసీ)-2, సూపర్‌వైజర్ (టెక్నికల్ సపోర్టు- సివిల్)-3, సూపర్‌వైజర్ (ఇంక్ ఫ్యాక్టరీ)-6, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్-18, జూనియర్ టెక్నీషియన్ (ఇంక్ ఫ్యాక్టరీ)-30, జూనియర్ టెక్నీషియన్ (ప్రింటింగ్ అండ్ ప్లేట్‌మేకింగ్) -9 ఖాళీలు ఉన్నాయి.
-వయస్సు: జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్‌కు 28 ఏండ్లు, జూనియర్ టెక్నీషియన్‌కు 25 ఏండ్లు మిగిలిన పోస్టులకు 30 ఏండ్లు మించరాదు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 11
-వెబ్‌సైట్: http://bnpdewas.spmcil.com
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో నావిక్ ఉద్యోగాలు,
ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో నావిక్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
INDIAN-COAST-GUARD 
-పోస్టు: నావిక్ (డొమస్టిక్ బ్రాంచీ), 10వ ఎంట్రీ -1/2019 బ్యాచ్. 
-వయస్సు: 2019, ఏప్రిల్ 1 నాటికి 18 - 22 ఏండ్ల మధ్య ఉండాలి. అంటే 1997, ఏప్రిల్ 1 నుంచి 2001, మార్చి 31 మధ్య జన్మించి ఉండాలి. 
-అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు జాతీయ/ఇంటర్‌స్టేట్ నేషనల్ చాంపియన్‌షిప్‌లో మొదటి/రెండు లేదా మూడో స్థానంలో నిలిచినవారు. 
-నోట్: ఈ పోస్టుకు ఎంపికైనవారు కుక్, స్టీవార్డ్‌గా పనిచేయాల్సి ఉంటుంది.
-పేస్కేల్: లెవల్ 3 ప్రకారం ప్రారంభవేతనం నెలకు రూ.21,700/-తోపాటు అదనంగా డీఏ ఇతర అలవెన్స్‌లు ఇస్తారు. 
-పదోన్నతులు: నావిక్ నుంచి ప్రధాన అధికారి (లెవల్ 8) వరకు పదోన్నతి పొందవచ్చు. 
-గమనిక: నిబంధనల ప్రకారం రేషన్, దుస్తులు, కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య సౌకర్యం, నామమాత్రపు ఫీజుతో వసతి సౌకర్యం, క్యాంటీన్, రుణ సౌకర్యాలు కల్పిస్తారు.


ఎంపికవిధానం:
-అకడమిక్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. 
-షార్ట్‌లిస్ట్ చేసిన తర్వాత అభ్యర్థులకు ఆబ్జెక్టివ్ విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. దీనిలో మ్యాథ్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ సైన్స్, జనరల్ ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్, రీజనింగ్‌పై ప్రశ్నలు ఉంటాయి.
-రాతపరీక్షలో అర్హత సాధించినవారికి ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహిస్తారు.
-దీనిలో అర్హత సాధించినవారికి రాతపరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా వైద్యపరీక్షలకు ఎంపికచేస్తారు. దానిలో అర్హత సాధించినవారికి ఉద్యోగ అవకాశం కల్పిస్తారు.
-శారీరక ప్రమాణాలు: ఎత్తు - కనీసం 157 సెం.మీ., ఎత్తుకు తగ్గ ఛాతీ, బరువు ఉండాలి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: అక్టోబర్ 29 
(సాయంత్రం 5 గంటల వరకు)
-వెబ్‌సైట్: www.joinindiancoastgaurd.gov.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ఐఐటీడీలో పీహెచ్‌డీ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్,

న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీడీ)- యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్‌ల్యాండ్ (యూక్యూ) సంయుక్తంగా వివిధ విభాగాల్లో పీహెచ్‌డీ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ (2018 డిసెంబర్‌లో ప్రారంభమయ్యే పీహెచ్‌డీ) కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 
IIT_Delhilogo 
-ప్రోగ్రామ్ పేరు: పీహెచ్‌డీ స్కాలర్‌షిప్స్
-విభాగాలు: సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో మాస్టర్ డిగ్రీ (సైన్స్, ఆర్ట్స్, హ్యుమానిటీస్) లేదా ఎంఈ/ఎంటెక్ లేదా బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత. గేట్, యూజీసీ నెట్/సీఎస్‌ఐఆర్ నెట్, ఐసీఏఆర్, ఐసీఎంఆర్, డీఎస్‌టీ ఇన్‌స్పైర్‌లో అర్హత సాధించిన వారికి ప్రాధాన్యం ఇస్తారు.
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: అక్టోబర్ 31
-వెబ్‌సైట్: www.uqidar.org

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ఏఎఫ్‌ఆర్‌ఐలో ఉద్యోగాలు,
జోధ్‌పూర్‌లోని అరిడ్ ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఏఎఫ్‌ఆర్‌ఐ)లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
Arid_Forest 

పోస్టులు-ఖాళీలు:
-లోయర్ డివిజన్ క్లర్క్-2, ఫారెస్టర్-1, ఫారెస్ట్ గార్డ్-2, మల్టీటాస్కింగ్ స్టాఫ్-2 పోస్టులు ఉన్నాయి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: అక్టోబర్ 23
-వెబ్‌సైట్: www.afri.icfra.org

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
హైదరాబాద్ ఐఐటీలో ఉద్యోగాలు.
హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) రిజిస్ట్రార్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
iit-hyd 

పోస్టులు-ఖాళీలు:
-డిప్యూటీ రిజిస్ట్రార్-3
-అర్హతలు: పీజీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. కనీసం తొమ్మిదేండ్లపాటు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఏజీపీ స్కేల్ రూ.6,000తో పనిచేసి ఉండాలి లేదా ఐదేండ్లు అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా పనిచేసిన అనుభం ఉండాలి. 
-అసిస్టెంట్ రిజిస్ట్రార్-9
-అర్హతలు: పీజీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. మంచి అకడమిక్ రికార్డు. గ్రేడ్‌పే రూ. 4,200తో కనీసం ఐదేండ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. 
-వయస్సు: పై రెండు పోస్టులకు 55 ఏండ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-చివరితేదీ: నవంబర్ 14
-వెబ్‌సైట్: https://www.iith.ac.in


No comments:

Post a Comment