Thursday, 25 October 2018

ఐబీలో 1054 ఎగ్జిక్యూటివ్‌లు ఉద్యోగాలు, ఐటీబీపీలో 101 ఉద్యోగాలు , చెస్‌లో జేఆర్‌ఎఫ్‌లు ఉద్యోగాలు, యూఎన్‌డీపీలో ఉద్యోగాలు, ఎన్‌బీఈ డీఎన్‌బీ పీడీసెట్ ప్రవేశాలు .

ఐబీలో 1054 ఎగ్జిక్యూటివ్‌లు ఉద్యోగాలు,

మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఇంటెలిజెన్స్ బ్యూరో వివిధ సబ్సిడిరీ ఐబీ యూనిట్లలో ఖాళీగా ఉన్న సెక్యూరిటీ అసిస్టెంట్ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
EXECUTIVES
-పోస్టు పేరు: సెక్యూరిటీ అసిస్టెంట్ (ఎగ్జిక్యూటివ్)
-మొత్తం పోస్టులు: 1054 (జనరల్-620, ఓబీసీ-187, ఎస్సీ-160, ఎస్టీ-87). ఇందులో హైదరాబాద్‌కు 36, విజయవాడకు 20 పోస్టులు ఉన్నాయి.
-అర్హతలు: మెట్రిక్యులేషన్ (పదోతరగతి) లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. లోకల్/ప్రాంతీయ భాషలో ప్రావీణ్యం ఉండాలి. ఇంటెలిజెన్స్ వర్క్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉండాలి.
-వయస్సు: 27 ఏండ్లకు మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు పదేండ్ల వరకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: రూ. 5,200-20,200+గ్రేడ్ పే రూ. 2,000/- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ఇతర అలవెన్సులుంటాయి.
-అప్లికేషన్ ఫీజు: రూ. 50/- (జనరల్, ఓబీసీ అభ్యర్థులు), ఎస్సీ/ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, మహిళలకు ఫీజులో మినహాయింపు ఉంది.
-ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ
-రాత పరీక్ష టైర్-1 (ఆబ్జెక్టివ్), టైర్-2 (డిస్క్రిప్టివ్) విధానంలో ఉంది.
-రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగానే మెరిట్ లిస్ట్ తయారుచేసి, ఇంటర్వ్యూకు పిలుస్తారు.
రాత పరీక్ష విధానం:
-టైర్-1(ఆబ్జెక్టివ్ పేపర్) మొత్తం 100 మార్కులకుగాను 100 ప్రశ్నలు ఉంటాయి.
-మొత్తం నాలుగు విభాగాల్లో జనరల్ అవేర్‌నెస్ (40 మార్కులు) మినహా, మిగతా ప్రతి విభాగం నుంచి 20 ప్రశ్నలు- 20 మార్కులు
-ఈ ఆబ్జెక్టివ్ పరీక్షలో జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, లాజికల్/అనలిటికల్ ఎబిలిటీ, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అంశాలపై ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం-120 నిమిషాలు.
-ప్రతి తప్పు సమాధానానికి 1/4 వంతు మార్కులను తగ్గిస్తారు.
-టైర్-2 (డిస్క్రిప్టివ్ పేపర్) మొత్తం 50 మార్కులకు ఉంటుంది.
-ఇంటర్వ్యూ 50 మార్కులకు ఉంటుంది.
-టైర్-1, టైర్-2, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా, రిజర్వేషన్ల ప్రాతిపదికన తుది ఎంపిక చేస్తారు.
-పరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా హైదరాబాద్, విజయవాడతోసహా మొత్తం 34 సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 10
-వెబ్‌సైట్: www.mha.nic.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐటీబీపీలో 101 ఉద్యోగాలు ,
ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీఎఫ్) స్పోర్ట్స్ కోటాలో పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. 
ITBP
పోస్టులు-ఖాళీలు:
-జూడో-8, రెజ్లింగ్-4, వెయిట్‌లిఫ్టింగ్-4, ఫుట్‌బాల్ టీం-3, బాక్సింగ్-8, ఆర్చరీ-4, జిమ్నాస్టిక్స్-4, కబడ్డీ-4, అథ్లెటిక్స్-17, రైఫిల్ షూటింగ్-5, ఆక్వాటిక్-5, కరాటే-8, వాలీబాల్-5, తైక్వాండో-7, వాటర్ స్పోర్ట్స్-5, స్కిప్పింగ్-3 ఖాళీలు ఉన్నాయి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో, చివరితేదీ: నవంబర్ 14
-వెబ్‌సైట్: www.recruitment.itbpolice.nic.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
చెస్‌లో జేఆర్‌ఎఫ్‌లు ఉద్యోగాలు,
హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో-సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ (చెస్)లో ఖాళీగా ఉన్న జేఆర్‌ఎఫ్, ఆర్‌ఏ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
CHESS
జేఆర్‌ఎఫ్-5 ఖాళీలు
-అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ లేదా ఎంఈ/ఎంటెక్‌తో పాటు నెట్/గేట్‌లో ఉత్తీర్ణత.
-పోస్టు పేరు: రిసెర్చ్ అసోసియేట్-2 ఖాళీలు
-అర్హత: పీజీతోపాటు పీహెచ్‌డీ (ఇంజినీరింగ్ అండ్ సైన్స్), ఎంఈ/ఎంటెక్‌తోపాటు ఆప్టికల్ సెన్సార్, ఆప్టికల్ సిస్టమ్‌లో మూడేండ్ల అనుభవం ఉండాలి. 
-వయస్సు: రిసెర్చ్ అసోసియేట్‌కు 35 ఏండ్లు, జేఆర్‌ఎఫ్‌కు 28 ఏండ్లకు మించరాదు
-పే స్కేల్: రూ. 25,000, (రిసెర్చ్ అసోసియేట్‌కు రూ. 40,000
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో 
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 9
-వెబ్‌సైట్: www.drdo.gov.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
యూఎన్‌డీపీలో ఉద్యోగాలు,

యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్‌డీపీ)లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
undp
పోస్టులు-ఖాళీలు:
-క్లస్టర్ కోఆర్డినేటర్ (నేషనల్ యునైటెడ్ నేషన్స్ వలంటీర్)-5, ప్రాజెక్టు అడ్మినిస్ట్రేషన్&ఆపరేషన్స్ అసిస్టెంట్-1, ఫైనాన్స్ కమ్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్-1, ప్రాజెక్టు అసోసియేట్-1 ఖాళీ ఉన్నాయి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: అక్టోబర్ 23
-వెబ్‌సైట్: www.in.undp.org
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌బీఈ డీఎన్‌బీ పీడీసెట్ ప్రవేశాలు .

న్యూఢిల్లీలోని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్‌బీఈ) మెడికల్ పీజీ డిప్లొమా అభ్యర్థులకు నిర్వహించే డిప్లొమేట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ పీడీ సెంట్రలైజ్డ్ ఎంట్రెన్స్ టెస్ ్ట (డీఎన్‌బీ పీడీసెట్) జనవరి 2019 ద్వారా పోస్టు డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
medical-students
-పరీక్ష పేరు: డీఎన్‌బీ పీడీ డిప్లొమా సెట్
-అర్హత: సంబంధిత స్పెషాలిటీలో పీజీ డిప్లొమా/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. ఇండియా/స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో సభ్యత్వం ఉండాలి. 
-దేశవ్యాప్తంగా మెడికల్ కళాశాలల్లో పీజీ మెడికల్ (పోస్టు డిప్లొమా-సెకండరీ) కోర్సుల్లో ప్రవేశానికి ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఈ కోర్సు జనవరి 2019లో ప్రారంభమవుతుంది.
-అప్లికేషన్ ఫీజు: రూ. 4500/-
-ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా.
-ఈ పరీక్ష మొత్తం 300 మార్కులకు ఉంటుంది. 
-నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 6
-ప్రవేశ పరీక్ష తేదీ: డిసెంబర్ 14
-ఎంట్రెన్స్ టెస్ట్ ఫలితాలు: 2019 జనవరి 15
-వెబ్‌సైట్ : www.nbe.edu.in

No comments:

Post a Comment