Tuesday, 30 October 2018

స్టీల్ ప్లాంట్‌లో 235 ట్రెయినీలు, నవోదయ పరీక్ష -2019, ఎన్‌టీపీసీలో ఉద్యోగాలు, ఐఐఎస్‌ఈఆర్‌లో ఉద్యోగాలు.

స్టీల్ ప్లాంట్‌లో 235 ట్రెయినీలు,

ఒడిశాలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పరిధిలో పనిచేస్తున్న రూర్కెలా స్టీల్ ప్లాంట్ (ఆర్‌ఎస్‌పీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రెయినీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
-మొత్తం పోస్టులు : 235
-ఆపరేటర్ కమ్ టెక్నీషియన్
ట్రెయినీ-170 ఖాళీలు
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్/పదోతరగతితోపాటు మెటలర్జీ, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత.
-ఆపరేటర్ కమ్ టెక్నీషియన్
(బాయిలర్ ఆపరేటర్)-28 ఖాళీలు
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్/పదోతరగతితోపాటు మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, పవర్ ప్లాంట్, ప్రొడక్షన్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత. ఫస్ట్ క్లాస్ బాయిలర్ అటెండెంట్ సర్టిఫికెట్ ఉండాలి.
-జూనియర్ మేనేజర్ (సేఫ్టీ)-7 ఖాళీలు
-అర్హత: ఏదైనా బ్రాంచీలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత. ఇండస్ట్రియల్ సేఫ్టీలో డిప్లొమా/పీజీ డిగ్రీ కలిగి ఉండాలి.
-న్యూరో టెక్నాలజిస్ట్ ట్రెయినీ-1 ఖాళీ
-అర్హత: బీఎస్సీ (న్యూరో టెక్నాలజీ)తోపాటు ఏదైనా హాస్పిటల్‌లో ఏడాది పనిచేసిన
అనుభవం.
-సిస్టర్ ట్యూటర్-5 ఖాళీలు
-అర్హత: ఎమ్మెస్సీ (నర్సింగ్) లేదా బీఎస్సీ నర్సింగ్ (బేసిక్/పోస్ట్ బేసిక్)/ డిప్లొమా ఇన్ నర్సింగ్ ఎడ్యుకేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్‌తోపాటు సంబంధిత రంగం లేదా ఏదైనా హాస్పిటల్‌లో
మూడేండ్ల పనిఅనుభవం ఉండాలి.
-నర్సింగ్ సిస్టర్ ట్రెయినీ-24 ఖాళీలు
-అర్హత: బీఎస్సీ నర్సింగ్ లేదా ఇంటర్/10+2తోపాటు జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీలో మూడేండ్ల డిప్లొమాలో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో ఏడాది అనుభవం ఉండాలి.
-వయస్సు: 2018 డిసెంబర్ 4 నాటికి ఆపరేటర్ కమ్ టెక్నీషియన్/న్యూరోటెక్నాలజిస్ట్/నర్సింగ్ సిస్టర్ పోస్టులకు 28 ఏండ్లు, మిగతా పోస్టులకు 30 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక: రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్/ట్రేడ్‌టెస్ట్, ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-రిజిస్ట్రేషన్ ప్రారంభం: నవంబర్ 5
-దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 4
-వెబ్‌సైట్: www.sailcareers.com.


---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నవోదయ పరీక్ష -2019,

జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2019-20 ఏడాదికి ఆరో తరగతిలో ప్రవేశం కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
-అర్హత: ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఏ జిల్లాలో నవోదయ విద్యాలయం పనిచేస్తుందో అదే జిల్లాకు చెందిన గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5వ తరగతి చదువుతూ ఉండాలి.
-వయస్సు: 2006 మే 1 నుంచి 2010 ఏప్రిల్ 30 మధ్య జన్మించి ఉండాలి.
-పరీక్ష మొత్తం 80 ప్రశ్నలకు 100 మార్కులకు ఉంటుంది. రెండుగంటల్లో పూర్తిచేయాలి. పరీక్ష పత్రం ఇంగ్లిష్/హిందీతోపాటు ప్రాంతీయ (తెలుగు) భాషలో ఉంటుంది.
-మెంటల్ ఎబిలిటీ-40 ప్రశ్నలు-50 మార్కులు
అర్థమెటిక్ టెస్ట్-20 ప్రశ్నలు-25 మార్కులు
లాంగ్వేజ్ టెస్ట్-20 ప్రశ్నలు-25 మార్కులు
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో, చివరితేదీ: నవంబర్ 30
-ప్రవేశ పరీక్ష: 2019 ఏప్రిల్ 6
-వెబ్‌సైట్: http://navodayahyd.gov.in
సీఎల్‌ఆర్‌ఐలో అసిస్టెంట్లు
చెన్నైలోని సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది
-అర్హతలు: ఇంటర్/10+2లో ఉత్తీర్ణతతోపాటు టైపింగ్ సామర్థ్యం ఉండాలి.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 5
-వెబ్‌సైట్: www.clri.org
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌టీపీసీలో ఉద్యోగాలు,

ఈస్ట్రన్ రీజియన్ పరిధిలోని ఎన్‌టీపీసీ (భువనేశ్వర్)-దార్లిపల్లి సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ ప్రాజెక్ట్‌లో ట్రెయినీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
-మొత్తం ఖాళీలు: 117
-డిప్లొమా ఇంజినీర్ ట్రెయినీ-55 (మెకానికల్-28, ఎలక్ట్రికల్-15, సీ అండ్ ఐ-10, సివిల్-2)
-ఐటీఐ ట్రెయినీ/ల్యాబ్ అసిస్టెంట్ ట్రెయినీ/అసిస్టెంట్ ట్రెయినీ-62 ఖాళీలు (ఫిట్టర్-22, ఎలక్ట్రీషియన్-12, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్-8, ల్యాబ్ అసిస్టెంట్ కెమిస్ట్రీ-6, అసిస్టెంట్ మెటీరియల్స్/స్టోర్ కీపర్-4)
-అర్హతలు: సంబంధిత ఇంజినీరింగ్‌లో డిప్లొమా. ఐటీఐ ట్రెయినీలకు సంబంధిత ఐటీఐ ట్రేడ్‌లో ఉత్తీర్ణత. అసిస్టెంట్ (మెటీరియల్స్/స్టోర్ కీపర్) పోస్టులకు పదోతరగతి, ఎన్‌సీవీటీ నుంచి స్టోర్ కీపింగ్‌తోపాటు ఇంగ్లిష్ టైపింగ్ ఉండాలి.
-ల్యాబ్ అసిస్టెంట్ (కెమిస్ట్రీ) పోస్టులకు కెమిస్ట్రీతో బీఎస్సీ ఉత్తీర్ణత.
-ఎంపిక: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ 
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ : నవంబర్ 24
-వెబ్‌సైట్: www.ntpccareers.net
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐఎస్‌ఈఆర్‌లో ఉద్యోగాలు.

తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లో జనవరి 2019 సెషన్‌కు పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాల ప్రకటన విడుదల
-విభాగాలు : బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ/బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. గేట్, జెస్ట్, జీప్యాట్, డీఏఈ-జెస్ట్/గేట్, సీఎస్‌ఐఆర్ నెట్, డీబీటీ/ఐసీఎంఆర్ జేఆర్‌ఎఫ్, ఐసీఏఆర్ నెట్‌లో ఉత్తీర్ణత.
-ఎంపిక: ఇంటర్వ్యూ+ గేట్/జెస్ట్ తదితర టెస్ట్‌ల స్కోర్ కార్డ్
-దరఖాస్తు: ఆన్‌లైన్, చివరితేదీ: నవంబర్ 20
-ఇంటర్వ్యూ తేదీలు: డిసెంబర్ 13-16 వరకు
-వెబ్‌సైట్: www.iisertirupati.in

No comments:

Post a Comment