Monday, 24 December 2018

టెస్కాబ్‌లో 439 ఉద్యోగాలు, ఆర్‌బీఐలో గ్రేడ్ సీ ఉద్యోగాలు, గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ మేనేజర్ ఉద్యోగాలు, రూర్కీ ఐఐటీలో ఉద్యోగాలు, మిధానిలో ఉద్యోగాలు.

టెస్కాబ్‌లో 439 ఉద్యోగాలు,

తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్(టెస్కాబ్) రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
tscab1
-మొత్తం ఖాళీలు: 439

జిల్లాల వారీగా ఖాళీలు:
- నోట్: ఏఎం-అసిస్టెంట్ మేనేజర్, ఎస్‌ఏ-స్టాఫ్ అసిస్టెంట్
- అసిస్టెంట్ మేనేజర్:
- పేస్కేల్: రూ.15,925-35,200 (ప్రారంభవేతనం అన్ని కలుపుకొని నెలకు సుమారు రూ.28,000/- వరకు వస్తాయి)
- వయస్సు: 2018, సెప్టెంబర్ 1 నాటికి 18-30 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, బీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. కామర్స్ డిగ్రీ అయితే 55 శాతం వస్తే సరిపోతుంది. తెలుగు మాట్లడటం తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఇంగ్లిష్ నాలెడ్జ్ ఉండాలి.
- స్టాఫ్ అసిస్టెంట్
- పేస్కేల్: రూ.11,765-30,305 (ప్రారంభ వేతనం అన్ని కలుపుకొని నెలకు రూ. 20,000 వరకు వస్తాయి)
- వయస్సు: 2018, సెప్టెంబర్ 1 నాటికి 18-30 ఏండ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ వర్గాలకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణత. తెలుగులో ప్రావీణ్యంతోపాటు ఇంగ్లిష్ పరిజ్ఞానం ఉండాలి.
ఎంపిక విధానం:
- ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ
- ఆన్‌లైన్ టెస్ట్: 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూకు 12.5 మార్కులు. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కులు కోత విధిస్తారు.
- ఆన్‌లైన్ టెస్ట్ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
- ఇంగ్లిష్: 30 ప్రశ్నలు-30 మార్కులు.
- రీజనింగ్: 35 ప్రశ్నలు-35 మార్కులు.
- క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: 35 ప్రశ్నలు-35 మార్కులు
- మొత్తం 100 ప్రశ్నలు. 100 మార్కులు. పరీక్ష కాలవ్యవధి 60 నిమిషాలు.
- పరీక్ష తేదీ: 16/17 ఫిబ్రవరి 2019
- నోట్: అసిస్టెంట్ మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్ పరీక్ష విధానం ఒకేలా ఉంటుంది. అయితే ప్రశ్నల కాఠిన్యత లో తేడా ఉంటుంది.
- అభ్యర్థులు ఏ జిల్లాకు లోకల్ అయితే ఆ జిల్లాలోనే దరఖాస్తు చేసుకోవాలి. లేనిచో నాన్‌లోకల్ కేటగిరీగా పరిగణిస్తారు.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: 2019, జనవరి 5
- ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.500/-, ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్లకు రూ.250/-
- దరఖాస్తు ఎడిటింగ్‌కు చివరితేదీ: 2019, జనవరి 5
- దరఖాస్తు ప్రింటింగ్ చేసుకోవడానికి చివరితేదీ: 2019, జనవరి 20
- వెబ్‌సైట్: https://tscab.org/recruitments

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఆర్‌బీఐలో గ్రేడ్ సీ ఉద్యోగాలు,
ముంబైలోని రిజర్వ్‌బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీసెస్ బోర్డు (ఆర్‌బీఐఎస్‌బీ)లో కింది పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయడానికి ప్రకటన విడుదలైంది.

పోస్టులు-ఖాళీలు:
- పోస్టు: గ్రేడ్ సీ (కాంట్రాక్టు ప్రాతిపదికన)
- బ్యాంక్ ఎగ్జామినర్/సూపర్‌వైజరీ మేనేజర్ (ట్రేడ్ ఫైనాన్స్)-5, బ్యాంక్ ఎగ్జామినర్ (కార్పొరేట్ లెండింగ్)-5, ట్రెజరీ-5, రిటైల్ లెండింగ్-5, అనలిటిక్స్&జనరల్ బ్యాంకింగ్-5, అకౌంటింగ్ (ఎఫ్‌ఆర్‌ఎస్)-5, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-10, స్ట్రెస్ టెస్టింగ్-5, మెయిన్‌ఫ్రేమ్ అడ్మినిస్ట్రేటర్-4, నెట్‌వర్క్ ఎక్స్‌పర్ట్-3, బిహేవియరల్ సైంటిస్ట్-1, లీగల్ స్పెషలిస్ట్-1 పోస్టు ఉన్నాయి.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: 2019, జనవరి 8
- వెబ్‌సైట్: www.rbi.org.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
 గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ మేనేజర్ ఉద్యోగాలు,
కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ (భారత ప్రభుత్వ సంస్థ) కింది పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.


- పోస్టులు-ఖాళీలు:
- డిప్యూటీ మేనేజర్ (మెడికల్)-4, డిప్యూటీ జనరల్ మేనేజర్ (టెక్నికల్)-5, సూపర్‌వైజర్-5, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్స్-1 ఖాళీ ఉన్నాయి.
- అర్హతలు, వయస్సు, ఎంపిక తదితర వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: 2019, జనవరి 19
- వెబ్‌సైట్: www.grse.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
రూర్కీ ఐఐటీలో ఉద్యోగాలు,
రూర్కీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

- పోస్టులు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: 2019, జనవరి 28
- వెబ్‌సైట్: www.iitr.ac.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
మిధానిలో ఉద్యోగాలు.


హైదరాబాద్‌లోని మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని)లో జనరల్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
Midhani
- పోస్టులు-ఖాళీలు:
- డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్&అకౌంట్స్)-2, సీనియర్ మేనేజర్ (సెక్యూరిటీ)-1, జూనియర్ సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్-3 ఖాళీలు ఉన్నాయి.
- అర్హతలు, వయస్సు, ఎంపిక తదితర వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: 2019, జనవరి 2
- వెబ్‌సైట్: www.midhani-india.in

No comments:

Post a Comment