Monday, 24 December 2018

ఎన్పీడీసీఎల్‌లో జేపీవో ఉద్యోగాలు, షిప్పింగ్ కార్పొరేషన్‌లో ట్రెయినీలు, ఎన్‌సీబీఎస్‌లో ఉద్యోగాలు, ఆలీంకోలో ఉద్యోగాలు, మ్యాట్ ఫిబ్రవరి-2019.

ఎన్పీడీసీఎల్‌లో జేపీవో ఉద్యోగాలు,

వరంగల్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్) పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న జేపీవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
tsnpdcl
-జూనియర్ పర్సనల్ ఆఫీసర్ (జేపీవో)-25 పోస్టులు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ప్రథమ్ర శేణిలో బీఏ/ బీకాం, బీఎస్సీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
-పే స్కేల్: రూ.34,925-66,420/-
-వయస్సు: 2018 జూలై 1 నాటికి 18 నుంచి 44 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఫీజు: అప్లికేషన్ ఫీజు రూ. 100/-,
-పరీక్ష ఫీజు: 120/-. ఎస్సీ/ఎస్టీ/బీసీ, పీహెచ్‌సీలకు ఎగ్జామినేషన్ ఫీజు లేదు.
-పరీక్ష కేంద్రాలు: జీహెచ్‌ఎంసీ పరిధి (హైదరాబాద్)
-ప్రొబేషనరీ పీరియడ్: రెండేండ్లు
-ఎంపిక: రాతపరీక్ష ద్వారా.
-ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 100 మార్కులకు ఉంటుంది. దీనిలో సెక్షన్ ఏ -60 మార్కుల్లో హెచ్‌ఆర్‌ఎం, ఇండస్ట్రియల్ లా, జనరల్ లా అండ్ లేబర్ లా తదితర అంశాలు, సెక్షన్ బీ-40 మార్కుల్లో ఇంగ్లిష్ (కాంప్రహెన్షన్), మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ అండ్ అర్థమెటిక్ ఎబిలిటీ & జనరల్ అవేర్‌నెస్ అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
-120 నిమిషాల్లో పరీక్ష పూర్తి చేయాల్సి ఉంటుంది.
-జనరల్ అభ్యర్థులు 40 శాతం, బీసీ అభ్యర్థులు 35 శాతం, ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీ అభ్యర్థులు 30 శాతం కనీస అర్హత మార్కులను రాతపరీక్షలో సాధించాలి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో..
-దరఖాస్తులు ప్రారంభం: డిసెంబర్ 27 నుంచి
-దరఖాస్తులకు చివరితేదీ: 2019 జనవరి 17 వరకు
-పరీక్షతేదీ: 2019 ఫిబ్రవరి 10
(10.30 AM -12.30 PM)
-వెబ్‌సైట్: http://www.tsnpdcl.in
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
షిప్పింగ్ కార్పొరేషన్‌లో ట్రెయినీలు,

ముంబైలోని షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌సీఐ)లో ఖాళీగా ఉన్న ఎలక్ట్రికల్ ఆఫీసర్ (ట్రెయినీ) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
sci_banner
-మొత్తం పోస్టుల సంఖ్య-40
-పోస్టు పేరు: ట్రెయినీ ఎలక్ట్రికల్ ఆఫీసర్
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా లేదా బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. డీజీఎస్ నుంచి ఎలక్ట్రో టెక్నికల్ ఆఫీసర్ కోర్సు సర్టిఫికెట్ ఉండాలి. వినియోగంలో ఉన్న ఇండియన్ సీడీసీ, పాస్‌పోర్టు, పాన్ కార్డ్, ఐఎన్‌డీవోఎస్ నంబర్ ఉండాలి.
-వయస్సు: 30 ఏండ్లకు మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-స్టయిఫండ్: శిక్షణలో భాగంగా ఎనిమిది నెలల వరకు రూ. 10,000/- ఆ తర్వాత ఆరునెలల వరకు రూ. 30,000 (కన్సాలిడేటెడ్ పే) చెల్లిస్తారు.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఇంటర్వ్యూ తేదీ: 2019 జనవరి 4
-వెబ్‌సైట్: www.shipindia.com
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌సీబీఎస్‌లో ఉద్యోగాలు,

బెంగళూరులోని ది నేషనల్ సెంటర్ ఫర్ బయలాజికల్ సైన్సెస్ (ఎన్‌సీబీఎస్) ఇంటర్న్‌షిప్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 
ncbs-logo
-ఇంటర్న్‌షిప్
-మొత్తం ఖాళీల సంఖ్య: 10
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ /సంస్థ నుంచి ఇంటర్ లేదా ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: 2019 జనవరి 15
-వెబ్‌సైట్: www.ncbs.res.in

--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఆలీంకోలో ఉద్యోగాలు,

కాన్పూర్‌లోని ఆర్టిఫీషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఆలీంకో) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Artificial-Limbs

-పోస్టుల వివరాలు:
-డిప్యూటీ జనరల్ మేనేజర్ (ప్రొడక్షన్, మెటీరియల్స్ మేనేజ్‌మెంట్), మేనేజర్ (ఫైనాన్స్), మేనేజర్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ (సివిల్), డిప్యూటీ మేనేజర్ (మెటీరియల్స్ మేనేజ్‌మెంట్), ఇంటర్నల్ ఆడిటర్, అకౌంట్స్ ఆఫీసర్, ఆఫీసర్ (ప్రోస్థటిస్ట్ &ఆర్థోటిస్ట్), మార్కెటింగ్ ఆఫీసర్, స్టెనోగ్రాఫర్
-అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్/మాస్టర్ డిగ్రీలో ఉత్తీర్ణత. సెంట్రల్ రిహాబిలిటేషన్ రిజిస్ట్రార్ (సీఆర్‌ఆర్)లో సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలి. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి. ప్రాంతీయ భాషలో పరిజ్ఞానం ఉండాలి.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో 
-దరఖాస్తులకు చివరితేదీ: 2019 జనవరి 31
-వెబ్‌సైట్: www.alimco.in
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
మ్యాట్ ఫిబ్రవరి-2019.

ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) దేశవ్యాప్తంగా వివిధ బిజినెస్ స్కూళ్లల్లో ఎంబీఏ, పీజీడీఎం & ఐల్లెడ్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాల కోసం నిర్వహించే మ్యాట్ ఎంట్రెన్స్ టెస్ట్ ఫిబ్రవరి 2019 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
mat-2018
-కోర్స్ పేరు: ఎంబీఏ, పీజీడీఎం & ఐల్లెడ్ ప్రోగ్రామ్స్ 
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
-ఎంపిక: పేపర్ బేస్డ్ టెస్ట్ (పీబీటీ) లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: పీబీటీ పరీక్షకు 2019 ఫిబ్రవరి 8, సీబీటీ పరీక్షకు 2019 ఫిబ్రవరి 12
-అప్లికేషన్ ఫీజు: సీబీటీ/పీబీటీ పరీక్షకు రూ. 1550/-, రెండింటికి (సీబీటీ/పీబీటీ) పరీక్షకు రూ. 2650/-
-రాతపరీక్ష: 2019 ఫిబ్రవరి 17 (పీబీటీ), 2019 ఫిబ్రవరి 23 (సీబీటీ)
-వెబ్‌సైట్: www.aima.in

No comments:

Post a Comment