Monday, 24 December 2018

రైల్వేలో 798 కానిస్టేబుళ్లు ఉద్యోగాలు, ఎన్‌ఐఆర్‌డీలో 42 ఉద్యోగాలు, స్త్రీనిధి క్రెడిట్‌లో మేనేజర్లు ఉద్యోగాలు, వీఎస్‌ఎస్‌సీలో టెక్నికల్ అసిస్టెంట్లు ఉద్యోగాలు.

రైల్వేలో 798 కానిస్టేబుళ్లు ఉద్యోగాలు,

భారతీయ రైల్వే వివిధ రైల్వే జోన్ల పరిధిలో ఖాళీగా ఉన్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్)/ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (ఆర్‌పీఎస్‌ఎఫ్) కానిస్టేబుల్ (యాన్సిలరీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
RPF-Women-Constable
-మొత్తం ఖాళీలు: 798 (ఆర్‌పీఎఫ్-539, ఆర్‌పీఎస్‌ఎఫ్-259)
-విభాగాలవారీగా ఖాళీలు: కానిస్టేబుల్ (వాటర్ క్యారియర్-452, సఫాయివాలా-199, వాషర్‌మ్యాన్-49, బార్బర్-49, మాలి-7, గ్రేడ్-3 టైలర్-20, కాబ్లర్-22)
-అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్/ పదోతరగతి ఉత్తీర్ణత.
-వయస్సు: 2019 జనవరి 1 నాటికి 18 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి.
-శారీరక ప్రమాణాలు: ఎత్తు: ఫురుషులు-165 సెం.మీ, మహిళలు-157 సెం.మీ . ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు (ఫురుషులు-160 సెం.మీ, మహిళలు-152 సెం.మీ)
-చాతీ: పురుషులు 80 సెం.మీ నుంచి 85 సెం.మీ వరకు (ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 76.2 సెం.మీ నుంచి 81.2 సెం.మీ వరకు) వ్యాకోచం చెందాలి.
-పే స్కేల్: ఆర్‌పీఎఫ్ పోస్టులకు రూ.19,900-63,200/- , ఆర్‌పీఎస్‌ఎఫ్ పోస్టులకు రూ. 21,700-69,100/- (7th సీపీసీ పేస్కేల్ ప్రకారం)
-పరీక్ష ఫీజు: రూ. 500/-, ఎస్సీ/ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళ, మైనారిటీస్, ఆర్థికంగా వెనకబడిన తరగతులు - రూ. 250/-
-ఈ పరీక్ష ఫీజును కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాసిన జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ.400/-, మిగతా అభ్యర్థులకు రూ.250/- రిఫండ్ చేస్తారు.
-ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, పీఈటీ, పీఎంటీ. ఈ మూడు పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు చివరగా డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ చేసి తుది ఫలితాలను ప్రకటిస్తారు.
-రాతపరీక్ష కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సీబీటీ) 2019 ఫిబ్రవరి/మార్చిలో నిర్వహిస్తారు. ఈ పరీక్షలో 60 ప్రశ్నలు ఇస్తారు. 45 నిమిషాల్లో పూర్తిచేయాలి. దీనిలో జనరల్ అవేర్‌నెస్-20 మార్కులు, అర్థమెటిక్-20 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్-20 మార్కులు అంశాల నుంచి ప్రశ్నలను ఇస్తారు.
-ఈ పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కులను తగ్గిస్తారు.
-సీబీటీలో మెరిట్ సాధించినవారికి పీఈటీ, పీఎంటీలను నిర్వహిస్తారు.
-ఇంగ్లిష్/హిందీతోపాటు ప్రాంతీయ భాషల్లో (తెలుగు) సీబీటీ పరీక్ష నిర్వహిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులు ప్రారంభ తేదీ: 2019 జనవరి 1
-చివరితేదీ: 2019 జనవరి 30
-వెబ్‌సైట్: www.indianrailways.gov.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఐఆర్‌డీలో 42 ఉద్యోగాలు,

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్) వివిధ విభాగాల్లో తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
nirdpr-building
-మొత్తం పోస్టులు: 42
-విభాగాలవారీగా: ప్రాజెక్ట్ మేనేజర్-1, కన్సల్టెంట్స్-16, డాటా ఎంట్రీ ఆపరేటర్స్ (డీఈవో)-14, హిందీ ట్రాన్స్‌లేటర్స్-2, స్టెనో (హిందీ-1, ఇంగ్లిష్-1), ప్రాజెక్టు అసిస్టెంట్-1, సీనియర్ ప్రాజెక్టు కన్సల్టెంట్-1, ప్రాజెక్టు కన్సల్టెంట్-5 ఖాళీలు ఉన్నాయి. 
-అర్హత: సంస్థ నిబంధనల ప్రకారం 
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ 
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో 
-దరఖాస్తులకు చివరితేదీ: 2019 జనవరి 10 
-వెబ్‌సైట్: www.nird.org.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
స్త్రీనిధి క్రెడిట్‌లో మేనేజర్లు ఉద్యోగాలు,
తెలంగాణ ప్రభుత్వ గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలోని స్త్రీనిధి క్రెడిట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ కాంట్రాక్ట్ పద్ధతిలో ఖాళీగా ఉన్న మేనేజర్ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
sreenidhi
-మొత్తం పోస్టులు : 27
-విభాగాల వారీగా ఖాళీలు : డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫండ్స్ మేనేజ్‌మెంట్-1, ఇన్‌స్టిట్యూషనల్ మానిటరింగ్/సోషల్ ఆడిట్/ట్రెయినింగ్-1, విజిలెన్స్-1), జోనల్ మేనేజర్ (మానిటరింగ్)-1, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ( ఇన్‌స్టిట్యూషనల్ మానిటరింగ్/సోషల్ ఆడిట్/ట్రెయినింగ్)-1, రీజినల్ మేనేజర్ (డిస్ట్రిక్ట్ లెవల్)-14, చీఫ్ మేనేజర్ (ఫండ్స్ మేనేజ్‌మెంట్-1, ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్-1), అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ)-3, కన్సల్టెంట్ (ఐటీ)-2, ఆఫీస్ అసిస్టెంట్ (హైదరాబాద్)-2
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీఏ/పీజీడీబీఎం (ఫైనాన్స్/కామర్స్), ఎంకామ్, అగ్రికల్చర్/వెటర్నరీలో డిగ్రీ, ఎంకామ్, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంసీఏ, బీటెక్/డిప్లొమా (సీఎస్‌ఈ/ఐటీ), ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. 
-పే స్కేల్: రూ. 35,000/- పోస్టులను బట్టి వేర్వేరుగా పేస్కేల్స్ ఉన్నాయి.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-దరఖాస్తుకు చివరితేదీ: డిసెంబర్ 31
-వెబ్‌సైట్: www.streenidhi.telangana.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

వీఎస్‌ఎస్‌సీలో టెక్నికల్ అసిస్టెంట్లు ఉద్యోగాలు.


తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్‌ఎస్‌సీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నికల్/సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
vikram-sarabhai
-మొత్తం ఖాళీలు- 14
-పోస్టు పేరు: టెక్నికల్ అసిస్టెంట్-11 ఖాళీలు
-అర్హత: ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ & టెలీకమ్యూనికేషన్,ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, సినిమాటోగ్రఫీ/ఫొటోగ్రఫీలో 60 శాతం మార్కులతో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత. 
-పోస్టు పేరు: సైంటిఫిక్ అసిస్టెంట్-1 ఖాళీ
-అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (అగ్రికల్చర్/హార్టికల్చర్) 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-లైబ్రేరి అసిస్టెంట్-2 ఖాళీలు
-అర్హత: లైబ్రేరి సైన్స్/లైబ్రేరి ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో 60 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత.
-వయస్సు: 35 ఏండ్లకు మించరాదు. 
-పే స్కేల్: రూ.44,900-1,42, 400/-
-ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా 
-దరఖాస్తు: ఆన్‌లైన్ 
-దరఖాస్తులకు చివరితేదీ: 2019 జనవరి 9
-వెబ్‌సైట్: www.vssc.gov.in

No comments:

Post a Comment