Thursday, 31 January 2019

ఎన్‌టీపీసీలో ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలు, నల్సార్‌లో ఎంబీఏ ప్రవేశాలు, ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఎమ్మెస్సీ కోర్సులు, నాటా-2019.

ఎన్‌టీపీసీలో ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలు,

న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌టీపీసీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీల భర్తీకి (గేట్ 2019 స్కోర్ ద్వారా) అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
students-NTPC
-పోస్టు పేరు: ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ
-మొత్తం ఖాళీలు: 207 
విభాగాలవారీగా.. 
-ఎలక్ట్రికల్-47 పోస్టులు (జనరల్-29, ఓబీసీ-10, ఎస్సీ-6, ఎస్టీ-2)
-అర్హత: ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్, పవర్ సిస్టమ్ & హై వోల్టేజ్, పవర్ ఎలక్ట్రానిక్స్, పవర్ ఇంజినీరింగ్‌లో 65 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. 
-మెకానికల్-95 పోస్టులు (జనరల్-50, ఓబీసీ-25, ఎస్సీ-14, ఎస్టీ-6)
-అర్హత: మెకానికల్, ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, ప్రొడక్షన్ & ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, థర్మల్, మెకానికల్ & ఆటోమేషన్, పవర్ ఇంజినీరింగ్‌లో 65 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
-మైనింగ్-15 పోస్టులు (జనరల్-9, ఓబీసీ-4, ఎస్సీ-1, ఎస్టీ-1)
-అర్హత: మైనింగ్ ఇంజినీరింగ్‌లో 65 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
-ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్-50 పోస్టులు (జనరల్-24, ఓబీసీ-16, ఎస్సీ-6, ఎస్టీ-4)
-అర్హత: ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & టెలీ కమ్యూనికేషన్, పవర్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ ఇంజినీరింగ్‌లో 65 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
-పేస్కేల్: రూ.60,000-1,80,000/-
-వయస్సు: 2019, జనవరి 31 నాటికి 27 ఏండ్లకు మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-ఎంపిక: గేట్-2019 స్కోర్, ఆన్‌లైన్ బిహేవియరల్/ఆప్టిట్యూడ్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్+ఇంటర్వ్యూ
-గేట్ స్కోర్‌కు 85 శాతం, గ్రూప్ డిస్కషన్‌కు 5 శాతం, ఇంటర్వ్యూకు 10 శాతం వెయిటేజీ ఇచ్చి తుది ఫలితాలు ప్రకటిస్తారు. 
-ప్రొబేషనరీ పీరియడ్: ఏడాది ట్రెయినింగ్ పీరియడ్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా దేశంలో ఎక్కడైనా పోస్టింగ్ ఇస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఈ మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌తోపాటు గేట్-2019 రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేయాలి.
-దరఖాస్తులకు చివరితేదీ: జనవరి 31
-వెబ్‌సైట్: www.ntpccareers.net
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నల్సార్‌లో ఎంబీఏ ప్రవేశాలు,
హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లాకు చెందిన సెంటర్ ఫర్ మేనేజ్‌మెంట్ స్టడీస్ ఎంబీఏ ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
nalsar-university
-కోర్సు పేరు: ఎంబీఏ 
-కోర్సు పీరియడ్: రెండేండ్లు 
-అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. క్యాట్, గ్జాట్, జీమ్యాట్, సీమ్యాట్, జీఆర్‌ఈ స్కోర్ ఉండాలి. ఈ స్కోర్ లేనివారు నల్సార్ మేనేజ్‌మెంట్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎన్-మెట్)కు దరఖాస్తు చేయాలి. 
-ఎంపిక: క్యాట్ స్కోర్/రాత పరీక్ష, జీడీ, ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జనవరి 31
-ఎన్ -మెట్ పరీక్ష: ఫిబ్రవరి 17
-వెబ్‌సైట్: www.cms.nalsar.ac.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
 ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఎమ్మెస్సీ కోర్సులు,

డెహ్రాడూన్‌లోని ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
forest-research
-కోర్సులు- వివరాలు:ఎమ్మెస్సీ ఫారెస్ట్రీ
-అర్హత: బీఎస్సీ (అగ్రికల్చర్/ఫారెస్ట్రీ, బాటనీ, మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, జియాలజీ, జువాలజీ) ఉత్తీర్ణత.
-ఎమ్మెస్సీ ఉడ్ సైన్స్&టెక్నాలజీ
-అర్హత: బీఎస్సీ (ఎంపీసీ) లేదా బీఎస్సీ (ఫారెస్ట్రీ) ఉత్తీర్ణత.
-ఎమ్మెస్సీ ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్
-అర్హత: బేసిక్ లేదా అప్లయిడ్ సైన్సెస్‌లో డిగ్రీ లేదా బీఎస్సీ ఫారెస్ట్రీ/అగ్రికల్చర్ లేదా బీఈ/బీటెక్ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్‌లో ఉత్తీర్ణత.
-ఎమ్మెస్సీ సెల్యులోజ్&పేపర్ టెక్నాలజీ 
-అర్హత: బీఈ/బీటెక్ (కెమికల్/మెకానికల్) లేదా బీఎస్సీ (కెమిస్ట్రీ).
-నోట్: ఈ కోర్సు రెండో ఏడాది సీపీపీఆర్‌ఐ, సహరాన్‌పూర్‌లో నిర్వహిస్తారు.
-ఎంపిక: ప్రవేశపరీక్ష ద్వారా
-దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
-చివరితేదీ: ఏప్రిల్ 8
-ప్రవేశపరీక్ష తేదీ: మే 19
-వెబ్‌సైట్: www.fridu.edu.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నాటా-2019.

న్యూఢిల్లీలోని కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఆర్కిటెక్చర్ విద్యాసంస్థల్లో 2019-20కిగాను ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ బీఆర్క్ డిగ్రీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే నాటా ప్రకటన విడుదల చేసింది.
nata
-నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ (నాటా)-2019
-ఈ ఏడాది నుంచి నాటాను జేఈఈ మెయిన్ తరహాలో ఈసారి నుంచి కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ప్రతి ఏటా రెండుసార్లు నిర్వహించనుంది.
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో 10+2 లేదా ఇంటర్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. 
-పరీక్ష పేరు: నాటా ఎంట్రెన్స్ టెస్ట్
-ఇది ఆన్‌లైన్ ఎంట్రెన్స్ టెస్ట్. ఈ పరీక్ష మొత్తం 200 మార్కులకు ఉంటుంది. పార్ట్-ఏలో ప్రతి ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున మొత్తం 120 మార్కులకుగాను మ్యాథమెటిక్స్-20, జనరల్ ఆప్టిట్యూడ్-40 ప్రశ్నలను ఇస్తారు. 60 నిమిషాల్లో పూర్తిచేయాలి. పార్ట్-బీలో డ్రాయింగ్ టెస్ట్ ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 40 మార్కుల చొప్పున మొత్తం 80 మార్కులకు పేపర్, పెన్సిల్ రూపంలో నిర్వహిస్తారు. 120 నిమిషాల్లో పూర్తిచేయాలి.
-నోట్: ఆబ్జెక్టివ్ పరీక్షలో 120కి 30, డ్రాయింగ్ పరీక్షలో 80కి 20 కనీస అర్హత మార్కులు సాధించాలి. నెగెటివ్ మార్కింగ్ విధానం లేదు.
-అప్లికేషన్ ఫీజు: మొదటి విడత లేదా రెండో విడత పరీక్షకు రూ.1800/-, (ఎస్సీ/ఎస్టీలకు రూ.1500/-) 
-రెండు పరీక్షలు రాయడానికి రూ.3500/- (ఎస్సీ/ఎస్టీలకు రూ.2800/-)
-పరీక్షకేంద్రాలు: హైదరాబాద్, వరంగల్
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-మొదటి విడత పరీక్షతేదీ: ఏప్రిల్ 14,
-రెండో విడత పరీక్షతేదీ: జూలై 7
-చివరితేదీ: మొదటి పరీక్షకు మార్చి 11, రెండో పరీక్షకు జూన్ 12 
-వెబ్‌సైట్: www.nata.in

No comments:

Post a Comment