Thursday, 31 January 2019

ఎస్‌సీఐలో మెరైన్ ఇంజినీర్లు, బిమ్‌టెక్‌లో పీజీడీఎం ప్రవేశాలు, ఐఎస్‌ఐలో ప్రవేశాలు, ఫారెస్ట్‌లో పీజీ డిప్లొమా ప్రవేశాలు, ప్యాకేజింగ్‌లో డిప్లొమా కోర్సు.

ఎస్‌సీఐలో మెరైన్ ఇంజినీర్లు,

ముంబైలోని షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌సీఐ)-మారిటైమ్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్‌లోని జీఎంఈ కోర్సు ద్వారా గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీర్ కోసం అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
sci-marine-engineers
-మొత్తం ఖాళీల సంఖ్య-40 (జనరల్-20, ఓబీసీ-11, ఎస్సీ-6, ఎస్టీ-3)
-పోస్టు పేరు: గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీర్
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. పదోతరగతి/ఇంటర్ స్థాయిలోని ఇంగ్లిష్ సబ్జెక్టులో కూడా 50 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి.
-వయస్సు: 2019 ఏప్రిల్ 1 నాటికి 28 ఏండ్లకు మించరాదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది
-స్టయిఫండ్: రూ. 15,000/- (ట్రైయినింగ్ పీరియడ్‌లో)
-అప్లికేషన్ ఫీజు: రూ.1000/-(ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.100/-)
-ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
-ఆబ్జెక్టివ్ రాతపరీక్షలో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ టెస్ట్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ టెస్ట్ అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. రెండు గంటలలో పూర్తిచేయాలి.
-ప్రతి విభాగంలో కనీస అర్హత మార్కులను సాధించాలి.
-రాతపరీక్షలో మెరిట్ సాధించిన వారిని 1:3 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు పిలుస్తారు.
-దరఖాస్తు : ఆన్‌లైన్‌లో
-ఆన్‌లైన్‌లో పంపిన హార్డ్‌కాపీ దరఖాస్తులను ప్రింట్ తీసి సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.
-చివరితేదీ : ఫిబ్రవరి 11
-రాతపరీక్ష తేదీ: ఫిబ్రవరి 17
-వెబ్‌సైట్ : www.shipindia.com
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

బిమ్‌టెక్‌లో పీజీడీఎం ప్రవేశాలు,

నోయిడాలోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ (బిమ్‌టెక్) 2019 విద్యాసంవత్సరానికిగాను పీజీడీఎం, డాక్టోరల్ ప్రోగ్రామ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.
BIMTECH-STUDENTS
కోర్సు సీట్ల వివరాలు
-పీజీడీఎం (రెండేండ్ల ఎంబీఏకు సమానం)-240 సీట్లు
-పీజీడీఎం-ఇంటర్నేషనల్ బిజినెస్-60 సీట్లు
-పీజీడీఎం-ఇన్సూరెన్స్ బిజినెస్ మేనేజ్‌మెంట్-60 సీట్లు
-పీజీడీఎం-రిటైల్ మేనేజ్‌మెంట్-60 సీట్లు
-డాక్టోరల్ ప్రోగ్రామ్ (ఎఫ్‌పీఎం, ఈఎఫ్‌పీఎం)
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ (10+2+3 విధానంలో) 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. పైనల్ ఇయర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 
-ఎంపిక: క్యాట్, జీమ్యాట్/మ్యాట్, గ్జాట్, సీమ్యాట్, ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జనవరి 31
-వెబ్‌సైట్ : www.bimtech.ac.in/admissions
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ఐఎస్‌ఐలో ప్రవేశాలు,

కోల్‌కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎస్‌ఐ) 2019-20 విద్యా సంవత్సరానికిగాను డిగ్రీ/పీజీ, డిప్లొమా, రిసెర్చ్ ఫెలోషిప్స్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ISI-MainGate
మూడేండ్ల డిగ్రీ (ఆనర్స్) కోర్సులు
-బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ (స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్)
రెండేండ్ల పీజీ డిగ్రీ కోర్సులు
-మాస్టర్ ఆఫ్ పోస్టు గ్రాడ్యుయేట్ (స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, క్వాంటిటేటివ్ ఎకనామిక్స్, క్వాలిటీ మేనేజ్‌మెంట్ సైన్స్, లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సైన్స్, ఎంటెక్ ( కంప్యూటర్ సైన్స్, క్రిప్టాలజీ & సెక్యూరిటీ, క్వాలిటీ, రిలియబిలిటీ అండ్ ఆపరేషన్స్ రిసెర్చ్)
పీజీ డిప్లొమా కోర్సులు
-కంప్యూటర్ అప్లికేషన్, స్టాటిస్టికల్ మెథడ్స్ అండ్ అనాలిసెస్
రిసెర్చ్ ఫెలోషిప్ కోర్సులు
-స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, క్వాంటిటేటివ్ ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్, క్వాలిటీ, రిలియబిలిటీ అండ్ ఆపరేషన్స్ రిసెర్చ్, ఫిజిక్స్ అండ్ అప్లయిడ్ మ్యాథమెటిక్స్, జియాలజీ, లైబ్రేరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, బయాలజికల్ సైన్స్.
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి ఇంటర్ బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
-అప్లికేషన్ ఫీజు: రూ.1250/-, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు రూ. 625/-
-ఎంపిక: ఐఎస్‌ఐ అడ్మిషన్ టెస్ట్ ద్వారా 
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభం
-చివరితేదీ: మార్చి 12
-అడ్మిషన్ టెస్ట్: 2019 మే 112
-వెబ్‌సైట్: www.isical.ac.in


---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ఫారెస్ట్‌లో పీజీ డిప్లొమా ప్రవేశాలు,
భోపాల్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ (ఐఐఎఫ్‌ఎం)లో పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన విడుదలైంది.
IIFMB_-BHOPAL
కోర్సులు:
-పీజీ డిప్లొమా ఇన్ ఫారెస్ట్రీ మేనేజ్‌మెంట్ (పీజీడీఎఫ్‌ఎం)
-పీజీ డిప్లొమా ఇన్ సస్టెయినబిలిటీ మేనేజ్‌మెంట్ (పీజీడీఎస్‌ఎం)
-అర్హతలు: పై రెండు కోర్సులకు కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. ప్రస్తుతం ఫైనల్ ఇయర్ పరీక్షలకు హాజరుకానున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వీరు జూన్ 30 నాటికి డిగ్రీ సర్టిఫికెట్ దాఖలు చేయాలి. క్యాట్-2018 / ఎక్స్‌ఏటీ-2019 దరఖాస్తు చేసుకొని ఉండాలి. ఈ స్కోర్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి రాతపరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తారు.
-ఈ రెండు కోర్సులు రెండేండ్ల ఫుల్‌టైం రెసిడెన్షియల్ కోర్సులు
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఫిబ్రవరి 20
-వెబ్‌సైట్: www.iifm.ac.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ప్యాకేజింగ్‌లో డిప్లొమా కోర్సు.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (ఐఐపీ) డిప్లొమా కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Indian-Institute
-కోర్సు: డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్ (డీపీసీ)
-అర్హతలు: సైన్స్, ఇంజినీరింగ్, టెక్నాలజీ, కామర్స్, ఆర్ట్స్‌ల్లో డిగ్రీ పూర్తిచేసి, పరిశ్రమలో ప్రొడక్షన్, పర్చేజ్, మార్కెటింగ్, క్వాలిటీ కంట్రోల్ విభాగాల్లో కనీసం ఏడాదైనా పనిచేసిన అనుభవం ఉండాలి.
-కోర్సు కాలవ్యవధి: 18 నెలలు
-కోర్సు: ఇంటెన్సివ్ ట్రెయినింగ్ సర్టిఫికెట్ కోర్సు ఇన్ ప్యాకింగ్ (ఐటీసీ)
-కాలవ్యవధి: మూడు నెలలు
-అర్హతలు: ఇంటర్/ఐటీఐ లేదా డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణత. 
-ప్రవేశాలు: మొదట వచ్చిన వారికి మొదట 
-దరఖాస్తు: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: జనవరి 31
-వెబ్‌సైట్: www.iip-in.com

No comments:

Post a Comment