Tuesday, 22 January 2019

ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో యాంత్రిక్ ఉద్యోగాలు, ఎయిమ్స్‌లో 119 ప్రొఫెసర్లు ఉద్యోగాలు, సీఐటీడీలో వాక్ ఇన్ ఇంటర్వ్యూ, నిమ్‌హాన్స్‌లో ప్రవేశాలు, వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగాలు.

ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో యాంత్రిక్ ఉద్యోగాలు,

భారత రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ కోస్ట్‌గార్డ్ ఖాళీగా ఉన్న యాంత్రిక్ (డిప్లొమా హోల్డర్స్-02/2019 బ్యాచ్) పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Indian-Coast-Guard

-పోస్టు పేరు: యాంత్రిక్ (డిప్లొమా)
-అర్హతలు: ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) నుంచి కనీసం 60 శాతం మార్కులతో ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ & టెలి కమ్యూనికేషన్ (రేడియో/పవర్) ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత. ఎస్సీ/ఎస్టీ, జాతీయ స్థాయి క్రీడల్లోని 1, 2, 3వ స్థానాల్లో చాంపియన్‌షిప్ పొందిన అభ్యర్థులకు ఉత్తీర్ణతలో 5 శాతం సడలింపు ఉంటుంది.
-వయస్సు: 18-22 ఏండ్ల మధ్య ఉండాలి. అంటే 1997, ఆగస్టు 1 నుంచి 2001, జూలై 31 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-జీతభత్యాలు: రూ.29,200 + యాంత్రిక్ పే రూ.6,200/- వీటికి అదనంగా డీఏ, కిట్ మెయింటెనెన్స్ అలవెన్స్, ఇతర అలవెన్సులు ఉంటాయి.
-పదోన్నతులు: యాంత్రిక్ టెక్నికల్ నుంచి ప్రధాన్ సహాయక్ ఇంజినీర్ హోదా వరకు వెళ్లవచ్చు.
-శారీరక ప్రమాణాలు: ఎత్తు:157 సెం.మీ ఉండాలి. ఛాతీ- శరీరానికి తగ్గ అనుపాతంలో ఉండాలి. గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. వ్యాకోచం తప్పనిసరి. కంటిచూపు- 6/24, 6/9, 6/12 ఉండాలి. 
-ఎంపిక విధానం: రాతపరీక్ష, పీఎఫ్‌టీ ద్వారా 
-రాతపరీక్ష: ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. దీనిలో సంబంధిత డిప్లొమా ఇంజినీరింగ్ సబ్జెక్టులైన ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్, రీజనింగ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్‌పై కూడా ప్రశ్నలు వస్తాయి.
-రాతపరీక్షలో క్వాలిఫై అయిన వారికి ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (పీఎఫ్‌టీ), ప్రిలిమినరీ మెడికల్ ఎగ్జామినేషన్‌లను నిర్వహిస్తారు. 
-ఈ పరీక్షల నిర్వహణకు 1-2 రోజులు పడుతుంది.
-ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్: 1.6 కి.మీ. దూరాన్ని 7 నిమిషాల్లో, 10 పుష్ అప్‌లు, 20 ఉతక్ బైటక్‌లు చేయాలి.
-పరీక్ష కేంద్రాలు: ముంబై, కోల్‌కతా, చెన్నై, నోయిడా నాలుగు పరీక్ష కేంద్రాల్లో ఏదైనా ఒక పరీక్ష కేంద్రాన్ని మాత్రమే ఎంపిక చేసుకోవాలి. 
-శిక్షణ: ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్‌ఎస్ చిల్కాలో 2019, ఆగస్టు నుంచి ట్రెయినింగ్ ప్రారంభమవుతుంది.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఆన్‌లైన్ దరఖాస్తుకు కేవలం 11 రోజుల్లోనే అప్లయ్ చేసుకోవాలి.
-ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: ఫిబ్రవరి 11
-దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 21

-వెబ్‌సైట్: www.joinindiancoastguard.gov.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎయిమ్స్‌లో 119 ప్రొఫెసర్లు ఉద్యోగాలు,
మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇండియా పరిధిలో పనిచేస్తున్న ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (భోపాల్)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
aiims-professers
-పోస్టు పేరు: ఫ్యాకల్టీలు
-మొత్తం ఖాళీలు: 119 (ప్రొఫెసర్-41, అడిషనల్ ప్రొఫెసర్-28, అసోసియేట్ ప్రొఫెసర్-50)
-అర్హతలు: పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (ఎండీ/ఎంఎస్) ఉత్తీర్ణత లేదా సంబంధిత విభాగం నుంచి పీజీ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి. 
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ (జనవరి 19-25)లో వెలువడిన తేదీ నుంచి 45 రోజుల్లోగా దరఖాస్తులను పంపించాలి.
-వెబ్‌సైట్: www.aiimsbhopal.edu.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీఐటీడీలో వాక్ ఇన్ ఇంటర్వ్యూ,
హైదరాబాద్‌లోని ఎంఎస్‌ఎంఈ-టూల్ రూమ్-సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐడీటీ) ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
CITD_Logo
-పోస్టు పేరు: సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్
-అర్హత: కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, ఈఈఈ/ఐటీలో బీఈ/బీటెక్, ఎంసీఏ, ఎమ్మెసీ/బీఎస్సీ ఉత్తీర్ణత. ట్రబుల్‌షూటింగ్, సిస్టమ్ ఫార్మాటింగ్, నెట్‌వర్క్ రంగంలో రెండేండ్ల అనుభవం ఉండాలి. 
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా 
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఇంటర్వ్యూతేదీ: జనవరి 25
-వెబ్‌సైట్: www.citdindia.org

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నిమ్‌హాన్స్‌లో ప్రవేశాలు,
బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (నిమ్‌హాన్స్) వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
nimhanns-Admin-building
-మొత్తం సీట్లు: 504
-కోర్సులవారీగా ఖాళీలు: పీహెచ్‌డీ ప్రోగ్రామ్- 18, సూపర్ స్పెషాలిటీ కోర్సులు- 60, పోస్టు డాక్టోరల్ ఫెలోషిప్ కోర్సులు- 59, ఫెలోషిప్ కోర్సులు- 37, ఎండీ కోర్సులు- 38, ఎంపీహెచ్-10, ఎంఫిల్-96, ఎమ్మెస్సీ కోర్సులు-13, డిప్లొమా కోర్సులు-64, బీఎస్సీ కోర్సులు-107, సర్టిఫెకెట్ కోర్సులు-2
-అర్హత: సంబంధిత విభాగంలో ఇంటర్/డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, పీజీ లేదా తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణత.
-ఎంపిక: ఆన్‌లైన్ పరీక్ష, రాతపరీక్ష ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఫిబ్రవరి 16
-పరీక్ష తేదీ: బీఎస్సీ కోర్సులకు ఏప్రిల్ 21, మిగిలినవాటికి మార్చి 30, 31
-వెబ్‌సైట్: www.nimhans.ac.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగాలు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ (వీఎస్‌పీ) ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
vizag-stell-logonew
-అసిస్టెంట్ మేనేజర్-3 ఖాళీలు
-అర్హత: బ్యాచిలర్ డిగ్రీ, ఎంఏ (సోషల్‌వర్క్, రూరల్ డెవలప్‌మెంట్/డెవలప్‌మెంట్ స్టడీస్) లేదా ఎంఎస్‌డబ్ల్యూ ఉత్తీర్ణత. మూడేండ్ల అనుభవం ఉండాలి. 
-వయస్సు: 2019 జనవరి 1 నాటికి 30 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: ఫిబ్రవరి 6
-వెబ్‌సైట్: www.vizagsteel.com

No comments:

Post a Comment