Thursday, 31 January 2019

బిలాయ్ స్టీల్ ప్లాంట్‌లో 153 ఉద్యోగాలు, సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ సీనియర్ లైబ్రేరియన్ ఉద్యోగాలు, సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్‌లో ఉద్యోగాలు, హైదరాబాద్‌జిల్లాలో మెడికల్ ఆఫీసర్లు ఉద్యోగాలు, సీఎస్‌ఐఆర్ సైంటిస్టులు ఉద్యోగాలు.

బిలాయ్ స్టీల్ ప్లాంట్‌లో 153 ఉద్యోగాలు,

ఛత్తీస్‌గఢ్ (బిలాయ్)లోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పరిధిలో పనిచేస్తున్న బిలాయ్ స్టీల్ ప్లాంట్ (బీఎస్‌పీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రెయినీ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
sail
-మొత్తం పోస్టులు : 153
-విభాగాలవారీగా ఖాళీలు: ఫైర్ ఇంజినీర్-3, ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ట్రెయినీ-116, జూనియర్ స్టాఫ్ నర్స్ ట్రెయినీ-8, ఫార్మసిస్ట్ ట్రెయినీ-5, జూనియర్ మెడికల్ టెక్నాలజిస్ట్ ట్రెయినీ-17, అటెండెంట్ కమ్ టెక్నీషియన్ (బాయిలర్ ఆపరేషన్)-3, బ్లాస్టర్-1
-అర్హత: ఫైర్ ఇంజినీర్ పోస్టులకు.. బ్యాచిలర్ ఆఫ్ ఫైర్ ఇంజినీరింగ్. ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ పోస్టులకు.. మెట్రిక్యులేషన్/పదోతరగతితోపాటు ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెటలర్జీ, మెకానికల్, కెమికల్, రిఫ్రాక్టరీ ఇంజినీరింగ్/సిరామిక్స్, సివిల్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా. ఫార్మసిస్ట్ పోస్టులకు.. ఫార్మసీ (డిప్లొమా/డిగ్రీ). ఏసీటీ బాయిలర్ ఆపరేషన్ పోస్టులకు..పదోతరగతి +ఐటీఐ. బ్లాస్టర్ పోస్టులకు పదోతరగతి+బ్లాస్టర్ సర్టిఫికెట్. జూనియర్ మెడికల్ టెక్నాలజిస్ట్ పోస్టులకు బీఎస్సీ (నర్సింగ్, ఎంఎల్‌టీ, రేడియోగ్రఫీ, ఆప్టోమెట్రీ, ఆడియాలజీ, రెనల్ డయాలసిస్) లేదా ఇంటర్‌తోపాటు సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
-వయస్సు: 2019 ఫిబ్రవరి 9 నాటికి 18 నుంచి 28 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లవరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-ప్రొబేషనరీ పీరియడ్: రెండేండ్లు (ట్రెయినింగ్ సమయంలో మొదటి ఏడాది రూ. 10,700/-, రెండో ఏడాది రూ. 12,200/- కన్సాలిడేటెడ్ రూపంలో చెల్లిస్తారు)
-పే స్కేల్: ఫైర్ ఇంజినీర్‌కు రూ. 20,600-46,500/-, బ్లాస్టర్/అటెండెంట్ కమ్ టెక్నీషియన్ బాయిలర్‌కు రూ. 15,830-22,150/-, మిగతా వారికి రూ. 16, 800-24,110/-నెలకు జీతం చెల్లిస్తారు.
-ఎంపిక : రాతపరీక్ష, స్కిల్ టెస్ట్/ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ
-దరఖాస్తు : ఆన్‌లైన్‌లో
-అప్లికేషన్ ఫీజు : ఫైర్ ఇంజినీర్‌కు రూ. 500/-, బ్లాస్టర్/అటెండెంట్ కమ్ టెక్నీషియన్‌కు రూ. 150/-, మిగతా పోస్టులకు రూ. 250/-
-దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 9
-వెబ్‌సైట్: www.sailcareers.com
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ సీనియర్ లైబ్రేరియన్ ఉద్యోగాలు,
హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ కింది పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
vallabhab-patel
-పోస్టు: సీనియర్ లైబ్రేరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ (కాంట్రాక్టు)
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-అర్హత, జీతం, వయస్సు, పని వివరాలు తదితరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
-వెబ్‌సైట్: www.svpnpa-gov.in

--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్‌లో ఉద్యోగాలు,
హైదారాబాద్‌లోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ టెక్నీషియన్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
SPP-HYDERABAD
-మొత్తం పోస్టులు: 38 
-సూపర్‌వైజర్ (రిసోర్స్ మేనేజ్‌మెంట్)-4 ఖాళీలు
-అర్హత: బీకాం/డిప్లొమా ఇన్ ట్యాక్సేషన్, బీబీఏ లేదా ఏదైనా ప్రథమశ్రేణి డిగ్రీతోపాటు హెచ్‌ఆర్‌లో డిప్లొమా ఉండాలి.
-జూనియర్ టెక్నీషియన్-30 ఖాళీలు
-అర్హత: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత. డిప్లొమా ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. 
-వయస్సు: 18 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి. 
-పే స్కేల్ : రూ. 5200-20,200 + గ్రేడ్ పే రూ. 1800/-
-ఫైర్‌మెన్-3 ఖాళీలు
-ఎంపిక: ఆన్‌లైన్ రాతపరీక్ష
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఫిబ్రవరి 11
-ఆన్‌లైన్ రాతపరీక్ష: మార్చి/ఏప్రిల్
-వెబ్‌సైట్: https://spphyderabad.spmcil.com


--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
హైదరాబాద్‌జిల్లాలో మెడికల్ ఆఫీసర్లు ఉద్యోగాలు,

హైదరాబాద్ జిల్లాలో మెడికల్ ఆఫీసర్ (పార్ట్‌టైమ్) పోస్టుల భర్తీకి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయం (డీఎంహెచ్‌ఓ) ప్రకటన విడుదల చేసింది.
medical-officers
-పోస్టు పేరు : మెడికల్ ఆఫీసర్
-మొత్తం ఖాళీలు- 53 
-అర్హతలు: ఎంబీబీఎస్ డిగ్రీ ఉత్తీర్ణత. తెలంగాణ/ఏపీ మెడికల్ కౌన్సిల్‌లో సభ్యత్వం కలిగి ఉండాలి. 
-గమనిక : ఈ పోస్టులను నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ (ఎన్‌యూహెచ్‌ఎం)లో భాగంగా తాత్కాలిక ప్రాతిపదికన భర్తీచేస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేయాలి. 
-పే స్కేల్ : రూ. 20,050/- (నెలకు కన్సాలిడేటెడ్ పే రూపంలో)
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి, సంబంధిత పర్సనల్ అధికారికి ఆర్డినరీ పోస్ట్‌లో పంపాలి.
-చిరునామా: O/o. District Collectorate, Abids, Hyd
-ఇంటర్వ్యూ తేదీ: ఫిబ్రవరి 6
-వెబ్‌సైట్: 
http://hyderabad.telangana.gov.in
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీఎస్‌ఐఆర్ సైంటిస్టులు ఉద్యోగాలు.

కోల్‌కతాలోని సీఎస్‌ఐఆర్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీలో సైంటిస్ట్ పోస్టుల భర్తీకి 
ప్రకటన విడుదలైంది.

-సైంటిస్ట్-2 (లెవల్-11) , -ఖాళీలు-2
-జీతం: నెలకు రూ.97,889/-
-వయస్సు: 32 ఏండ్లు మించరాదు
-పోస్టు: సీనియర్ సైంటిస్ట్ (లెవల్-12), -ఖాళీలు-8
-జీతం: నెలకు రూ.1,12,652/-
-వయస్సు: 37 ఏండ్ల మించరాదు
-ప్రిన్స్‌పల్ సైంటిస్ట్ (లెవల్-13)
-వయస్సు: 45 ఏండ్ల మించరాదు
-జీతం: నెలకు రూ.1,71,571/-
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో -చివరితేదీ: ఫిబ్రవరి 28
-వెబ్‌సైట్: www.career.iicb.res.in

No comments:

Post a Comment