Tuesday, 22 January 2019

ఎంఎన్ నిట్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉద్యోగాలు, కేయూలో దూరవిద్య ప్రవేశాలు, మిలిటరీ కాలేజీలో 8వ తరగతి ప్రవేశాలు, మహబూబ్‌నగర్ జీఎంసీలో ఉద్యోగాలు.

ఎంఎన్ నిట్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉద్యోగాలు,

అలహాబాద్‌లోని మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎన్ నిట్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ (కాంట్రాక్టు ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

- మొత్తం ఖాళీలు: 142 (జనరల్-73, ఓబీసీ-34, ఎస్సీ-23, ఎస్టీ-12)
- విభాగాలు: అప్లయిడ్ మెకానిక్స్, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, ఫిజిక్స్, మేనేజ్‌మెంట్ స్టడీస్, జీఐఎస్ (జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సెల్)
- అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఇంజినీరింగ్ విభాగాలకు బీఈ/బీటెక్ లేదా ఎంసీఏతోపాటు ఎంఈ/ఎంటెక్, నాన్ ఇంజినీరింగ్ విభాగాలకు సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ (ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం, ఎంబీఏ) ఉత్తీర్ణత. నెట్/స్లెట్ లేదా పీహెచ్‌డీ ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
- వయస్సు: 60 ఏండ్లకు మించరాదు.
- పే స్కేల్: రూ. 15,600-39,100+అకడమిక్ గ్రేడ్ పే రూ. 6000/7000/8000/-
- అప్లికేషన్ ఫీజు: రూ. 500/-, ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీలకు ఫీజు లేదు.

- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చిరునామా: Registrar, Motilal Nehru National Institute Of Technology Allahabad, Prayagraj, Uttar Pradesh-211004
- దరఖాస్తులకు చివరితేదీ: జనవరి 31
- ఆన్‌లైన్ హార్డ్‌కాపీలకు చివరితేదీ: ఫిబ్రవరి 5
- వెబ్‌సైట్: www.mnnit.ac.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
కేయూలో దూరవిద్య ప్రవేశాలు,
వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

- అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు: బీఏ, బీకాం, బీకాం (కంప్యూటర్స్), బీజే, బీఎల్‌ఐఎస్సీ, బీఎస్సీ మ్యాథ్స్/స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్/బీబీఏ
- పీజీ కోర్సులు: ఎంఏ (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్, హిందీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సంస్కృతం, ఇంగ్లిష్, రూరల్ డెవలప్‌మెంట్, తెలుగు, సోషియాలజీ, జర్నలిజం, హెచ్‌ఆర్‌ఎం), ఎంకాం, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంజే, ఎంటీఎం, ఎమ్మెస్సీ మ్యాథ్స్, ఎమ్మెస్సీ సైకాలజీ, ఎమ్మెస్సీ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్.
- అర్హత: డిగ్రీ కోర్సులకు ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. ఇంటర్ అర్హతలేనివారు యూనివర్సిటీ నిర్వహించే ఎలిజిబిలిటీ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించాలి. పీజీ కోర్సులకు సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
- అప్లికేషన్ ఫీజు: యూజీ కోర్సులకు రూ.200, పీజీ కోర్సులకు రూ. 250. 
- దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా దగ్గర్లోని స్టడీ సెంటర్లలో పొందవచ్చు.
- దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 15
- రూ. 200 ఫైన్‌తో చివరితేదీ: ఫిబ్రవరి 22
- రూ. 500 ఫైన్‌తో చివరితేదీ: ఫిబ్రవరి 28
- వెబ్‌సైట్: www.sdlceku.co.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
మిలిటరీ కాలేజీలో 8వ తరగతి ప్రవేశాలు,
డెహ్రాడూన్‌లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ (ఆర్‌ఐఎంసీ)లో 8వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే ఎంట్రెన్స్ టెస్ట్ నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది.

- ప్రవేశాలు: 8వ తరగతిలోకి
- అర్హత: 2020, జనవరి 1 నాటికి ఏడోతరగతి ఉత్తీర్ణులైనవారు లేదా ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఏడోతరగతి చదువుతున్న బాలురు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
- వయస్సు: 2020, జనవరి 1 నాటికి 11 1/2 ఏండ్ల నుంచి 13 ఏండ్ల మధ్య ఉండాలి. అంటే 2007, జనవరి 2 - 2008, జూలై 1 మధ్య జన్మించి ఉండాలి.
- ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా
- ప్రవేశపరీక్ష తేదీలు: జూన్ 1, 2
- పరీక్ష విధానం: పరీక్షలో మూడు పేపర్లు ఉంటాయి. దీనిలో ఇంగ్లిష్, మ్యాథ్స్ సబ్జెక్టులను జూన్ 1న, జనరల్ నాలెడ్జ్ పేపర్‌ను జూన్ 2న నిర్వహిస్తారు. ప్రతి పేపర్‌లో కనీస అర్హత మార్కులు 50 శాతం. 
- రాతపరీక్షలో అర్హత సాధించినవారికి అక్టోబర్ 4న వైవా వాయిస్ నిర్వహిస్తారు. దీనిలో కనీస అర్హత మార్కులు 50 శాతం. ఇంటర్వ్యూలో విద్యార్థి ఇంటెలిజెన్సీ అండ్ పర్సనాలిటీని పరీక్షిస్తారు.
- పై అన్నింటిలో అర్హత సాధించినవారికి చివరగా వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. వైద్యపరంగా ఫిట్ అయినవారికి ప్రవేశాలు కల్పిస్తారు.
- పరీక్ష కేంద్రం: రాష్ట్రంలో హైదరాబాద్.

- ఫీజు: ఆర్‌ఐఎంసీలో ఏడాదికి రూ.42,400/- చెల్లించాలి. రిఫండబుల్ డిపాజిట్ కింద రూ.20 వేలు చెల్లించాలి. కోర్సు పూర్తయిన తర్వాత ఈ రుసుమును తిరిగి ఇస్తారు.
- స్కాలర్‌షిప్స్: రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిభావంతులకు ఇచ్చే స్కాలర్‌షిప్స్ కింద ఏటా రూ.10 వేల నుంచి 20 వేల వరకు స్కాలర్‌షిప్‌ను ఇస్తాయి.
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- ఫీజు: జనరల్, ఓబీసీలకు రూ.600, ఎస్సీ, ఎస్టీలకు రూ.555.
- చివరితేదీ: మార్చి 31
- వివరాలకు Secretary, Telangana State Public Service Commission, Prathibha Bhavan, M.J.Road, Nampally, Hyderabad 500001, Telangana(India)లో సంప్రదించవచ్చు.
- వెబ్‌సైట్: https://tspsc.gov.in


---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
మహబూబ్‌నగర్ జీఎంసీలో ఉద్యోగాలు.
మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల (జీఎంసీ) ఖాళీగా ఉన్న జూనియర్ రెసిడెంట్ తదితర (కాంట్రాక్టు ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

- మొత్తం ఖాళీలు: 77
- సీనియర్ రెసిడెంట్-23 ఖాళీలు
- అర్హత: సంబంధిత విభాగంలో ఎండీ/ఎంఎస్. 
- స్పెషలిస్ట్ డాక్టర్ ఎంఐసీయూ-4 ఖాళీలు
- అర్హత: సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ/డిప్లొమా.
- జూనియర్ రెసిడెంట్-50 ఖాళీలు
- అర్హత: ఎంబీబీఎస్.
- పే స్కేల్: జూనియర్ రెసిడెంట్‌కు రూ. 40,500, సీనియర్ రెసిడెంట్‌కు రూ.70,000/-, ఎంఐసీయూలో పీజీ డిగ్రీలకు రూ.1,00,000, పీజీ డిప్లొమాలకు రూ. 80,000/- కన్సాలిడేటెడ్ పే ద్వారా చెల్లిస్తారు. 
- ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా 
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- చివరితేదీ: జనవరి 30, ఇంటర్వ్యూ: జనవరి 31
- వెబ్‌సైట్: www.gmcmbnr-ts.org


No comments:

Post a Comment