Thursday, 21 February 2019

ఐవోసీఎల్‌లో 466 ఉద్యోగాలు, ఐఐటీ మద్రాస్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఎయిర్‌మెన్ ఉద్యోగాలు, ఎగ్జామినర్ ఉద్యోగాలు, కాఫీ బోర్డులో ఉద్యోగాలు, ఆర్‌ఆర్‌సీఏటీలో పీహెచ్‌డీ ప్రవేశాలు.

ఐవోసీఎల్‌లో 466 ఉద్యోగాలు,

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్) వివిధ రిఫైనరీ యూనిట్లలో ఖాళీగా ఉన్న ట్రేడ్ అప్రెంటిస్/ టెక్నీషియన్ అప్రెంటిస్‌ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.


-మొత్తం ఖాళీలు-466

విభాగాల వారీగా వివరాలు:
-ట్రేడ్ అప్రెంటిస్/అటెండెంట్ ఆపరేటర్ (కెమికల్ ప్లాంట్)-89 ఖాళీలు

-ట్రేడ్ అప్రెంటిస్ (బాయిలర్)-30 ఖాళీలు

-అర్హత: పై రెండు ట్రేడ్లకు మూడేండ్ల బీఎస్సీ (ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ) ఉత్తీర్ణత.
-ట్రేడ్ అప్రెంటిస్ (ఫిట్టర్)-43 ఖాళీలు
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతి+ఐటీఐ ఫిట్టర్‌లో ఉత్తీర్ణత.
-టెక్నీషియన్ అప్రెంటిస్-203 ఖాళీలు (కెమికల్-65, మెకానికల్)-18, ఎలక్ట్రికల్-73, ఇన్‌స్ట్రుమెంటేషన్-47)
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ లేదా ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్, కెమికల్, రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత.

-ట్రేడ్ అప్రెంటిస్ (సెక్రటేరియల్ అసిస్టెంట్)-75 ఖాళీలు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మూడేండ్ల బీఏ/బీఎస్సీ లేదా బీకాం లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
-ట్రేడ్ అప్రెంటిస్ (అకౌంటెంట్)-26 ఖాళీలు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మూడేండ్ల బీకాం లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
-రిఫైనరీ యూనిట్లు: గువాహటి, బరౌనీ, గుజరాత్, హల్దియా, మధుర, పానిపట్, దిగ్బాయ్, బొంగైగావ్, పారాదీప్
-వయస్సు: 2019 ఫిబ్రవరి 1 నాటికి 18 నుంచి 24 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ పరీక్షలో సంబంధిత టెక్నికల్ సబ్జెక్టు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీస్ , బేసిక్ ఇంగ్లిష్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. రాతపరీక్షకు 85 శాతం, ఇంటర్వ్యూకు 15 శాతం వెయిటేజీ ఇస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 8
-రాతపరీక్ష: మార్చి 24
-ఇంటర్వ్యూతేదీలు: ఏప్రిల్ 1 నుంచి 5 వరకు
-వెబ్‌సైట్: www.iocl.com
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐటీ మద్రాస్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు,
చెన్నైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) 2019-20 కిగాను పీహెచ్‌డీ, ఎంఎస్ (రిసెర్చ్) 
ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 
-పీహెచ్‌డీ, ఎంఎస్ (రిసెర్చ్)
-అర్హత: నాలుగేండ్ల బీఈ/బీటెక్ లేదా బీఎస్ ఉత్తీర్ణత సాధించినవారు నేరుగా ఎంఎస్+పీహెచ్‌డీ (ఇంజినీరింగ్/సైన్సెస్)లో రెగ్యులర్/పార్ట్ టైమ్ లేదా ఎక్స్‌టర్నల్ స్కీమ్‌లలో ప్రవేశాలు పొందవచ్చు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 31
-వెబ్‌సైట్: www.iitm.ac.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఎయిర్‌మెన్ ఉద్యోగాలు,

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ గ్రూప్ వై (నాన్ టెక్నికల్) ట్రేడ్‌లో ఖాళీగా ఉన్న ఎయిర్‌మెన్ పోస్టుల భర్తీ కోసం తెలంగాణ జిల్లాలకు చెందిన అవివాహిత పురుష అభ్యర్థులకు రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనుంది.

Airmen
-పోస్ట్ పేరు: ఎయిర్‌మ్యాన్ (గ్రూప్ వై)
-అర్హత: ఇంటర్/10+2 లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు ఉండాలి. 
-వయస్సు: 1999 జనవరి 19 నుంచి 2003 జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి.
-ఎంపిక విధానం: ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, రాతపరీక్ష, అడాఫ్టబిలిటీ టెస్ట్, డీఎఫ్‌టీ ద్వారా
-ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌లో.. 5 నిమిషాల 40 సెకండ్లలో 1.6 కి.మీ. పరుగెత్తాలి. కనీసం 8 చిన్‌అప్‌లు, 20 పుష్ అప్‌లు, 20 సిట్ అప్‌లు చేయాలి. 
-ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థులను మాత్రమే మెడికల్ టెస్ట్‌కు అనుమతిస్తారు.
-పే స్కేల్: శిక్షణ కాలంలో నెల జీతం రూ. 14,600/-, శిక్షణ కాలం పూర్తయిన తర్వాత రూ. 26,900/- అదనంగా ఉచిత వైద్య సౌకర్యం, రేషన్, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్‌లు తదితర వసతులు ఉంటాయి. 
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో 
ర్యాలీతేదీలు: ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2 వరకు
-దరఖాస్తులు ప్రారంభం: 2019 జనవరి 2 నుంచి
-ర్యాలీ వేదిక: ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ (ఐఓసీ), గజ్వేల్, తెలంగాణ
-వెబ్‌సైట్: www.airmenselection.cdac.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎగ్జామినర్  ఉద్యోగాలు,
ముంబైలోని మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్‌లోని కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్ అండ్ ట్రేడ్‌మార్క్స్‌లో తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఎగ్జామినర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
మొత్తం పోస్టులు: 75

-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ లా డిగ్రీ ఉత్తీర్ణత. న్యాయవాద వృత్తిలో రెండేండ్ల అనుభవం ఉండాలి. 
-వయస్సు: 30 ఏండ్లకు మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పేస్కేల్: రూ. 45,000/- (కన్సాలిడేటెడ్ పే)
-దరఖాస్తు: ఈ మెయిల్ (satyendra.tmr@nic.in) ద్వారా
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా 
-దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 27
-ఇంటర్వ్యూతేదీ: మార్చి 5, 6
-వెబ్‌సైట్: http://ipindia.nic.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
కాఫీ బోర్డులో ఉద్యోగాలు,
బెంగళూరులోని కాఫీ బోర్డులో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. 

-ప్రాజెక్టు అసిస్టెంట్-6 ఖాళీలు
-అర్హత: ఇంటర్ లేదా అగ్రికల్చర్‌లో ట్రెయినింగ్/డిప్లొమా ఉత్తీర్ణత. 
-టెక్నికల్ అసిస్టెంట్-2 ఖాళీలు
-అర్హత: అగ్రికల్చర్ సైన్సెస్ లేదా సోషల్ వర్క్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. 
-ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో 
-దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 11
-వెబ్‌సైట్: www.indiacoffee.org

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఆర్‌ఆర్‌సీఏటీలో పీహెచ్‌డీ ప్రవేశాలు.

ఇండోర్‌లోని రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ (ఆర్‌ఆర్‌సీఏటీ) 2019కి గాను పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

పీహెచ్‌డీ (ఫిజికల్, లైఫ్ సైన్సెస్ , ఇంజినీరింగ్ (మెకానికల్) సైన్సెస్)
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఏప్రిల్ 18
-వెబ్‌సైట్: www.rrcat.gov.in

No comments:

Post a Comment