Thursday, 21 March 2019

టీఎస్ లాసెట్ - 2019, ఐవోసీఎల్‌లో లా ఆఫీసర్లు ఉద్యోగాలు, ఐఐఎస్‌ఈఆర్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు, నలందాలో ప్రవేశాలు.

టీఎస్ లాసెట్ - 2019,

తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాలు, అనుబంధ కాలేజీల్లో ఎల్‌ఎల్‌బీ (లా), ఎల్‌ఎల్‌ఎం (పీజీ ) కోర్సుల్లో ప్రవేశానికి ప్రతి ఏటా నిర్వహించే టీఎస్ లాసెట్/పీజీలాసెట్ - 2019 నోటిఫికేషన్‌ను ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది.

అర్హతలు:
- మూడేండ్ల ఎల్‌ఎల్‌బీ: కనీసం 45 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ (10+2+3 విధానంలో) ఉత్తీర్ణత.
- ఐదేండ్ల ఎల్‌ఎల్‌బీ: కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ (10+2 విధానంలో) ఉత్తీర్ణత.
- రెండేండ్ల మాస్టర్ డిగ్రీ: మూడేండ్ల/ఐదేండ్ల లా డిగ్రీ ఉత్తీర్ణత.
- గమనిక: 2019 మార్చి/ఏప్రిల్ /మే నెలల్లో ఇంటర్, డిగ్రీ, ఫైనల్ ఇయర్ లా డిగ్రీ పరీక్షలు హాజరైన/హాజరు కానున్న వారుకూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- అప్లికేషన్ ఫీజు: టీఎస్ లాసెట్‌కు-రూ. 800/- (ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ. 500/-)
- టీఎస్ పీజీ లాసెట్‌కు రూ.1000/-(ఎస్సీ/ఎస్టీలకు రూ. 800/-)
- గమనిక: ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, మహాత్మాగాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీల్లో ప్రవేశం కల్పిస్తారు.
- ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్
- టీఎస్‌లాసెట్/ టీఎస్ పీజీలాసెట్ ఆబ్జెక్టివ్ విధానంలో 120 మార్కులకు ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 120 ప్రశ్నలు ఇస్తారు. నెగెటివ్ మార్కింగ్ లేదు.
- ఈ ఎంట్రెన్స్ టెస్ట్ (లాసెట్/ పీజీలాసెట్)ను నిర్ణయించిన తేదీల్లో 90 నిమిషాల్లో పూర్తిచేయాలి.
- కనీస అర్హత మార్కులు: టీఎస్ లాసెట్‌లో జనరల్ కేటగిరీకి 42 మార్కులు (35 శాతం). టీఎస్ పీజీలాసెట్‌లో జనరల్ కేటగిరీకి 30 మార్కులు (25 శాతం) రావాలి. ఎస్సీ, ఎస్టీ వారికి ఎలాంటి అర్హత మార్కులు లేవు.
టీఎస్ లాసెట్ పరీక్ష విధానం:
- పార్ట్ ఏ-జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ-30 మార్కులు
- పార్ట్ బీ-కరెంట్ అఫైర్స్-30 మార్కులు
- పార్ట్ సీ-లీగల్ ఆప్టిట్యూడ్ (స్టడీ ఆఫ్ లా)-60 మార్కులు
టీఎస్ పీజీలాసెట్ పరీక్ష విధానం:
- పార్ట్ ఏ-40 ప్రశ్నలు (న్యాయ మీమాంస-20, రాజ్యాంగ చట్టం-20 మార్కులు)
- పార్ట్ బీ- 80 ప్రశ్నలు (పబ్లిక్ ఇంటర్నేషనల్ లా-16, మర్కంటైల్ లా-16, లేబర్ లా-16, క్రైమ్స్ అండ్ టార్ట్స్-16, ఐపీఆర్ ఇతర లా సంబంధించిన విషయాలు-16)
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: ఏప్రిల్ 15
- పరీక్షతేదీ: టీఎస్‌లాసెట్ (మూడేండ్లు/ఐదేండ్లు)-మే 20 (ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు
- టీఎస్ పీజీలాసెట్-మే 20 (ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు)
- వెబ్‌సైట్: http://lawcet.tsche.ac.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐవోసీఎల్‌లో లా ఆఫీసర్లు ఉద్యోగాలు,

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో క్లాట్-2019 ద్వారా లా ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.


- పోస్టులు: లా ఆఫీసర్ (గ్రేడ్ ఏ/గ్రేడ్ బీ)


అర్హతలు: 
- గ్రేడ్ బీ లా ఆఫీసర్: కనీసం 60 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ/ఐదేండ్ల లా డిగ్రీతోపాటు ఐదేండ్ల అనుభవం.
- జీతం: ఏడాదికి సుమారుగా రూ. 21 లక్షలు వస్తుంది.
- గ్రేడ్ ఏ లా ఆఫీసర్ - ఎల్‌ఎల్‌బీ/ఐదేండ్ల ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణులు. కనీసం రెండేండ్ల వృత్తి అనుభవం ఉండాలి.
- వయస్సు: జూన్ 30 నాటికి 30 ఏండ్లు మించరాదు. రిజర్వ్‌డ్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- జీతం: ప్రారంభ వేతనం నెలకు రూ.60 వేలు+ ఇతర అలవెన్స్‌లు ఉంటాయి. (ఏడాదికి సుమారుగా 17 లక్షల వరకు వస్తాయి)
- ఎంపిక విధానం: ఎల్‌ఎల్‌ఎం కోసం నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) -2019లో వచ్చిన స్కోర్ ఆధారంగా దరఖాస్తు చేసుకున్నవారిని షార్ట్‌లిస్ట్ చేసి వ్యక్తిగత ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్/గ్రూప్ టాస్క్‌ల ద్వారా ఎంపిక చేస్తారు.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- నోట్: అభ్యర్థులు మొదట క్లాట్ ఎల్‌ఎల్‌ఎం దరఖాస్తు చేసుకుని తర్వాతి అడ్మిట్‌కార్డు/హాల్‌టికెట్ నంబర్‌తో ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్‌లో పై పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.
- పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్: https://www.iocl.com

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐఎస్‌ఈఆర్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు,
తిరువనంతపురంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్) 2019కిగాను పీహెచ్‌డీ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.


- కోర్సు పేరు: ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ
- విభాగాలు: బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్
- అర్హత: బయాలజికల్, కెమికల్, ఫిజికల్, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. జేజీఈఈబీఐఎల్‌ఎస్/జామ్, ఎన్‌బీహెచ్‌ఎం, సంబంధిత సబ్జెక్టులో జామ్, ఐఐఎస్‌ఈఆర్ టీవీఎం 2019 టెస్ట్‌లో ఉత్తీర్ణత. 
- కోర్సు పేరు:పీహెచ్‌డీ ప్రోగ్రామ్
- అర్హత: సంబంధిత పీజీలో ఉత్తీర్ణత. గేట్/సీఎస్‌ఐఆర్ /యూజీసీ నెట్, జెస్ట్, ఎన్‌బీహెచ్‌ఎం జేఆర్‌ఎఫ్, జేజీఈఈబీఐఎల్‌ఎస్ లేదా తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణత.
- ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: ఏప్రిల్ 5 (ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ), ఏప్రిల్ 30 (పీహెచ్‌డీ)
- వెబ్‌సైట్: www.iisertvm.ac.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నలందాలో ప్రవేశాలు.


నలందా యూనివర్సిటీ (ఎన్‌యూ)లో 2019-20 విద్యాసంవత్సరానికిగాను పీజీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.


- నలందా యూనివర్సిటీ జాతీయ ప్రాముఖ్యత కలిగిన విద్యాసంస్థ. 17 దేశాల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న అంతర్జాతీయ విశ్వవిద్యాలయం.
- కోర్సులు: ఎమ్మెస్సీ/ఎంఏ 
- విభాగాలు: స్కూల్ ఆఫ్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్‌మెంట్ స్టడీస్, స్కూల్ ఆఫ్ హిస్టారికల్ స్టడీస్, స్కూల్ ఆఫ్ బుద్దిస్ట్ స్టడీస్, ఫిలాసఫీ, కంపారిటివ్ రిలీజియన్స్.
- ఎంపిక: ఆన్‌లైన్ ఎగ్జామ్ 
- దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
- వెబ్‌సైట్: www.nalandauniv.edu.in

No comments:

Post a Comment