Friday, 29 March 2019

టీఎస్ సెట్-2019, మనూలో ప్రవేశాలు, ట్రైబల్ వర్సిటీలో అడ్మిషన్లు, బిట్స్‌లో పీజీ కోర్సులు.

టీఎస్ సెట్-2019,


---------పరీక్ష పేరు: స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్)
-దేనికోసం: అసిస్టెంట్ ప్రొఫెసర్&లెక్చరర్‌గా పనిచేయడానికి ఈ పరీక్షలో అర్హత సాధించాలి. 
-అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో పీజీ(ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం, ఎంబీఏ, ఎంఎల్‌ఐఎస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంసీజే, ఎల్‌ఎల్‌ఎం, ఎంసీఏ, ఎంటెక్ (సీఎస్‌ఈ&ఐటీ మాత్రమే) ఉత్తీర్ణత. బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు అయితే పీజీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది.
-గమనిక: పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్న/పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సెట్ ఫలితాలు వెలువడిన తేదీ నుంచి రెండేండ్లలోపుగా పీజీ సర్టిఫికెట్‌ను తగిని ఉత్తీర్ణత శాతంతో సమర్పిస్తే సెట్ అర్హులుగా గుర్తిస్తారు లేకుంటే వారిని అనర్హులుగా ప్రకటిస్తారు.
-వయస్సు: గరిష్ఠ వయోపరిమితి లేదు.
పరీక్ష విధానం: 
-పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పరీక్ష బహుళైచ్ఛిక (ఆబ్జెక్టివ్) విధానంలో ఉంటుంది.
-పరీక్ష కాలవ్యవధి మూడు గంటలు.
-కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (ఆన్‌లైన్) విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. 

పేపర్ -I:
-50 ప్రశ్నలు. ప్రతి ప్రశ్నకు రెండుమార్కు లు. మొత్తం 100 మార్కులు. అన్ని ప్రశ్నలకు తప్పనిసరిగా జవాబులు రాయాలి.
-ఈ పేపర్‌లో టీచింగ్/రిసెర్చ్ ఆప్టిట్యూడ్‌ను పరీక్షిస్తారు. దీనిలో రీజినింగ్ ఎబిలిటీ, కాంప్రహెన్షన్, విభిన్నమైన ఆలోచనలు, జనరల్ అవేర్‌నెస్‌పై అభ్యర్థులను పరీక్షిస్తారు.
పేపర్-II:
-100 ప్రశ్నలు. 200 మార్కులు. అన్ని ప్రశ్నలు తప్పనిసరిగా రాయాలి. 
-ఈ పేపర్‌లో సంబంధిత సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఇస్తారు.
సెట్ నిర్వహించే సబ్జెక్టులు:
-జాగ్రఫీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్& అండ్ అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, జర్నలిజం&మాస్ కమ్యూనికేషన్స్, మేనేజ్‌మెంట్, హిందీ, హిస్టరీ, లా, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు, ఉర్దూ, లైబ్రేరి &ఇన్ఫర్మేషన్ సైన్స్, సంస్కృతం, సోషల్ వర్క్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, లింగ్విస్టిక్స్.
-పరీక్ష కేంద్రాలు: ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి.
-ఫీజు: ఓసీలకు రూ.1,200/-, బీసీలకు రూ.1,000/-, ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీ, ట్రాన్స్‌జెండర్‌లకు రూ.700/-
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఏప్రిల్ 26
-పరీక్ష తేదీలు: జూలై 5, 6, 8
-హాల్‌టికెట్ డౌన్‌లోడింగ్: జూన్ 25 నుంచి
-వెబ్‌సైట్: www.telanganaset.org
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
మనూలో ప్రవేశాలు,

ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా ప్రవేశాలు కల్పించే కోర్సులు:
-యూజీ ప్రోగ్రామ్స్: బీఈడీ, బీటెక్ (కంప్యూటర్ సైన్స్)
-పీజీ ప్రోగ్రామ్స్: ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ (కంప్యూటర్ సైన్స్), ఎంఈడీ
-ప్రొఫెషనల్ డిప్లొమాలు: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, పాలిటెక్నిక్ డిప్లొమా (సివిల్, కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, ఐటీ, మెకానికల్, ఎలక్ట్రికల్, ఈఈఈ, అప్పెరల్, ఆటోమొబైల్)
-పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్: ఉర్దూ, ఇంగ్లిష్, హిందీ, అరబిక్, పర్షియన్, ట్రాన్స్‌లేషన్ స్టడీస్, ఉమెన్ స్టడీస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, సోషల్ వర్క్, ఇస్లామిక్ స్టడీస్, హిస్టరీ, ఎకనామిక్స్, సోషియాలజీ, మేనేజ్‌మెంట్, కామర్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, కంప్యూటర్ సైన్స్, ఎస్‌ఈఐపీ.
-ఎంట్రెన్స్‌తో ప్రవేశాలు కల్పించే కోర్సులకు చివరితేదీ: మే 1
మెరిట్ ద్వారా ప్రవేశాలు కల్పించే కోర్సులు:
-పీజీ: ఉర్దూ, ఇంగ్లిష్, హిందీ, అరబిక్ ట్రాన్స్‌లేషన్ స్టడీస్, పర్షియన్, ఉమెన్ స్టడీస్.
-యూజీ కోర్సులు: బీఏ, బీఏ (ఆనర్స్)- జేఎంసీ, బీకాం, బీఎస్సీ, బీఎస్సీ లైఫ్ సైన్సెస్. 
-బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ కోర్సులు: మెడికల్ ఇమేజింగ్, మెడికల్ ల్యాబొరేటరీ, టెక్నాలజీ. లేటరల్ ఎంట్రీ: బీటెక్, పాలిటెక్నిక్, పీజీ డిప్లొమా: రిటైల్ మేనేజ్‌మెంట్
-నోట్: హైదరాబాద్‌తోపాటు లక్నో, శ్రీనగర్, భోపాల్, దర్భంగా (బీహార్), నుహ (హర్యానా), బీదర్ క్యాంపసుల్లో పై వాటిలో కొన్ని కోర్సులను మనూ అందిస్తుంది. 
-మెరిట్ ద్వారా ప్రవేశాలు కల్పించే ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 30
-పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్: www.manuu.ac.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ట్రైబల్ వర్సిటీలో అడ్మిషన్లు,
అమర్‌కంటక్‌లోని ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీలో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను 
ఆహ్వానిస్తుంది.

అమర్‌కంటక్ క్యాంపస్‌లో...
-యూజీ కోర్సులు: బీఏ, బీఎస్సీ, బీఎస్సీ (యోగా), బీకాం, బీఏ ఆనర్స్, బీవొకేషనల్ (సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, థియేటర్, స్టేజ్ క్రాఫ్ట్, ఫిల్మ్ ప్రొడక్షన్& మీడియా టెక్నాలజీ).
-ప్రొఫెషనల్ ప్రోగ్రామ్స్: బీసీఏ, బీబీఏ, బీబీఏ (టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్), బీఫార్మా, డీఫార్మా, బీఈడీ.
-పీజీ కోర్సులు: ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం, ప్రొఫెషనల్ పీజీ ప్రోగ్రామ్స్.
మణిపూర్ క్యాంపస్‌లో కోర్సులు:
-ఎంఏ, ఎంసీఏ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: మే 16
-ఎంట్రెన్స్ తేదీలు: జూన్ 1, 2
-పరీక్ష కేంద్రాలు: రాష్ట్రంలో ఆదిలాబాద్
-వెబ్‌సైట్: www.igntu.ac.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బిట్స్‌లో పీజీ కోర్సులు.

కోర్సులు: ఎంఈ/ఎంఫార్మా
కాలవ్యవధి: రెండేండ్లు 
కోర్సు: ఎంఫిల్
కాలవ్యవధి: మూడు సెమిస్టర్లు (ఏడాదిన్నర)
నోట్: పై కోర్సులను పిలానీ, గోవా, హైదరాబాద్ క్యాంపస్‌లు ఆఫర్ చేస్తున్నాయి.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత.
-ఎం.ఫిల్ కోసం డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: ఏప్రిల్ 30
వెబ్‌సైట్: www.bitsadmissions.com
ఎంపిక: బిట్స్ నిర్వహించే టెస్ట్ లేదా గేట్/జీప్యాట్ స్కోర్ ద్వారా. 
కంప్యూటర్‌బేస్డ్ టెస్ట్ తేదీ: మే 15 -26 మధ్య నిర్వహిస్తారు.

No comments:

Post a Comment