Thursday, 21 March 2019

నెహ్రూ యువ కేంద్రాల్లో ఉద్యోగాలు, ఓఎన్‌జీసీలో ఎగ్జిక్యూటివ్‌లు ఉద్యోగాలు, cimfr ప్రాజెక్టు అసిస్టెంట్లు ఉద్యోగాలు, సీపెట్‌లో సూపర్‌వైజర్లు ఉద్యోగాలు, సీయూ సెట్-2019, టీఎస్ ఎంసెట్-2019, జేఈఈ అడ్వాన్స్‌డ్ తేదీ మార్పు.

నెహ్రూ యువ కేంద్రాల్లో ఉద్యోగాలు,

పోస్టులు-ఖాళీలు:
-జిల్లా యూత్ కోఆర్డినేటర్-100
అర్హతలు: ఏదైనా సబ్జెక్టులో పీజీ ఉత్తీర్ణత.
వయస్సు: 2019, జనవరి 1 నాటికి 28 ఏండ్లు మించరాదు.
-అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్టు - 73 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ/ విశ్వవిద్యాలయం నుంచి బీకామ్ లేదా ఏదైనా డిగ్రీతోపాటు అకౌంట్స్ వర్క్‌లో కనీసం రెండేండ్ల అనుభవం. నిమిషానికి 30 పదాలను ఇంగ్లిష్‌లో టైపింగ్ చేసే సామర్థ్యం ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్స్‌పై నాలెడ్జ్ ఉండాలి.
వయస్సు: 2019, జనవరి 1 నాటికి 28 ఏండ్లు మించరాదు.
-మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్)-52 ఖాళీలు
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
వయస్సు: 2019, జనవరి 1 నాటికి 18-25 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: దేశవ్యాప్తంగా నిర్వహించనున్న పరీక్ష ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: మార్చి 31
వెబ్‌సైట్: http://nyks.nic.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఓఎన్‌జీసీలో ఎగ్జిక్యూటివ్‌లు ఉద్యోగాలు,

పోస్టు: హ్యూమన్ రిసోర్స్ ఎగ్జిక్యూటివ్
-ఖాళీల సంఖ్య - 20. వీటిలో జనరల్-10, ఓబీసీ-5, ఎస్సీ-3, ఎస్టీ-1, ఈడబ్ల్యూఎస్-1 ఖాళీలు ఉన్నాయి.
పోస్టు: పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్
-ఖాళీల సంఖ్య - 3 (ఇవి జనరల్ కేటగిరీలో ఉన్నాయి. 2 పీహెచ్‌సీ వీహెచ్‌కు కేటాయించారు)
ఎంపిక: అర్హులైన అభ్యర్థులు యూజీసీ నెట్ - జూన్ 2019లో వచ్చిన స్కోర్ ఆధారంగా.
పేస్కేల్: రూ.60,000-1,80,000/ (ఈ1 లెవల్)
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: ఏప్రిల్ 9
వెబ్‌సైట్: www.ongcindia.com
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
cimfr ప్రాజెక్టు అసిస్టెంట్లు ఉద్యోగాలు,
పోస్టు: ప్రాజెక్టు అసిస్టెంట్ (లెవల్-1)
-ఖాళీల సంఖ్య - 40
స్టయిఫండ్: నెలకు రూ.15,000/-
అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో డిప్లొమా(కెమికల్ ఇంజినీరింగ్ లేదా మైనింగ్ ఇంజినీరింగ్/డిగ్రీ (బీఎస్సీ జియాలజీ/ కెమిస్ట్రీ) ఉత్తీర్ణత.
పోస్టు: ప్రాజెక్టు అసిస్టెంట్ (లెవల్-2)
- ఖాళీల సంఖ్య -10
అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో కెమిస్ట్రీ/అప్లయిడ్ కెమిస్ట్రీలో ఎమ్మెస్సీ లేదా ఎమ్మెస్సీ (టెక్) ఉత్తీర్ణత లేదా సివిల్/కెమికల్ లేదా మైనింగ్ ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణత లేదా ఎమ్మెస్సీ (కంప్యూటర్‌సైన్స్/ఐటీ) ఉత్తీర్ణత.
వయస్సు: లెవల్-1 పోస్టులకు 28 ఏండ్లు, లెవల్-2 పోస్టులకు 30 ఏండ్లు మించరాదు. రిజర్వ్‌డ్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
ఇంటర్వ్యూ తేదీలు: ఏప్రిల్ 2 నుంచి 9 మధ్య నిర్వహిస్తారు.
దరఖాస్తు: వెబ్‌సైట్‌లో 
వెబ్‌సైట్: http://cimfr.nic.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీపెట్‌లో సూపర్‌వైజర్లు ఉద్యోగాలు,
-సూపర్‌వైజరీ (టెక్నికల్) విభాగంలో -
-సీనియర్ టెక్నికల్ ఆఫీసర్-7, టెక్నికల్ ఆఫీసర్-6, సైంటిస్ట్-6, జూనియర్ సైంటిస్ట్-3 ఖాళీలు ఉన్నాయి.
-సూపర్‌వైజరీ (నాన్ టెక్నికల్) విభాగంలో -
-మేనేజర్ (పర్సనల్&అడ్మినిస్ట్రేషన్)-1, మేనేజర్ (ఫైనాన్స్&అకౌంట్స్)-1 ఖాళీ ఉన్నాయి.
-అర్హతలు, వయస్సు, ఎంపిక తదితర వివరాల కోసం వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
చివరితేదీ: ఏప్రిల్ 15
వెబ్‌సైట్: www.cipet.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీయూ సెట్-2019,
కేంద్రీయ విశ్వవిద్యాలయాలు పలు ప్రత్యేకతలతో విద్యనందిస్తూ అగ్రశ్రేణి విద్యాసంస్థలుగా పేరుగాంచాయి. విభిన్నమైన, ఉపాధికి భరోసానిచ్చే కోర్సులను అందిస్తున్న సంస్థలు ఇవి. దేశవ్యాప్తంగా 14 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో వివరాలు సంక్షిప్తంగా...

- కోర్సులు: యూజీ,పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ
- యూజీ కోర్సులు: ఇంటర్నేషనల్ రిలేషన్స్, అప్పెరల్ (డ్రెస్ డిజైనింగ్ అండ్ ట్రెయినింగ్), బీఎస్సీ బీఈడీ (మ్యాథ్స్),బీఏ బీఈడీ, బీఏ ఎల్‌ఎల్‌బీ, బీఎస్సీ- ఎమ్మెస్సీ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యూటీ అండ్ వెల్‌నెస్, బయోకెమిస్ట్రీ, బయోమెడికల్ సైన్సెస్, టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్, టూరిజం మేనేజ్‌మెంట్, టెక్స్‌టైల్, మ్యాథ్స్, జువాలజీ తదితర డిగ్రీ కోర్సులు ఉన్నాయి. 
- వీటితోపాటు ఇంటిగ్రేటెడ్ యూజీ కోర్సులు, పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ కోర్సులు ఉన్నాయి.

ప్రవేశాలు కల్పించే విశ్వవిద్యాలయాలు:
- దేశవ్యాప్తంగా ఉన్న 14 సెంట్రల్ యూనివర్సిటీలు అవి... ఏపీ, అసోం, గుజరాత్, హర్యానా, జమ్ము, జార్ఖండ్, కర్ణాటక, కాశ్మీర్, కేరళ, మహాత్మాగాంధీ (బీహార్), రాజస్థాన్, తమిళనాడు, పంజాబ్, దక్షణ బీహార్‌తోపాటు బెంగళూరులోని డా.బీఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్.
- ఫీజు: జనరల్/ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.800/-, ఎస్సీ, ఎస్టీలకు రూ.350/-, పీహెచ్‌సీలకు ఎటువంటి ఫీజు లేదు.
- పరీక్ష విధానం: అన్ని ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో ఇస్తారు. 
- పార్ట్ ఏ లో లాంగ్వేజీ, జనరల్ అవేర్‌నెస్, మ్యాథమెటికల్ ఆప్టిట్యూడ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు.
- పార్ట్ బీలో సంబంధిత సబ్జెక్టు నుంచి 75 ప్రశ్నలు ఇస్తారు. 
- ఎంబీఏ, ఎంసీఏ, బీవొకేషనల్, ఎల్‌ఎల్‌బీ తదితర ఇంటిగ్రేటెడ్ కోర్సులకు 100 ప్రశ్నలు ఇస్తారు. ఒక్క పేపర్ మాత్రమే ఉంటుంది.
- పరీక్ష కాలవ్యవధి రెండు గంటలు.
- అండర్ గ్రాడ్యుయేట్, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కులు కోత విధిస్తారు.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: ఏప్రిల్ 13
- పరీక్ష తేదీలు: మే 25, 26, 
- పరీక్ష ఫలితాల వెల్లడి: జూన్ 21 
- పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్.
- వెబ్‌సైట్: https://cucetexam.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
టీఎస్ ఎంసెట్-2019,
తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్,అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎంసెట్) నోటిఫికేషన్‌ను జేఎన్‌టీయూహెచ్ విడుదల చేసింది.

- ఎంసెట్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్, అగ్రికల్చరల్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్. దీన్ని తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీఎస్‌సీహెచ్‌ఈ) తరపున జేఎన్‌టీయూ హైదరాబాద్ నిర్వహిస్తుంది.
ఇంజినీరింగ్ స్ట్రీమ్:
- బీఈ/బీటెక్, బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్), బీటె క్ (డెయిరీ టెక్నాలజీ), బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ), బీటెక్ (బయోటెక్నాలజీ), బీఫార్మా (ఎంపీసీ)/ఫార్మా-డీ (ఎంపీసీ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
- అర్హతలు: ఇంటర్/10+2లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఉత్తీర్ణులు లేదా సెకండియర్ పరీక్షలు రాసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ వొకేషనల్ కోర్సు చేసినవారు సంబంధిత సబ్జెక్టుల్లో బ్రిడ్జ్ కోర్సు చేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల నాటికి అభ్యర్థుల వయస్సు 16 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి లేదు.
- బీటెక్ (డెయిరీ టెక్నాలజీ, ఏజీ ఇంజినీరింగ్, ఎఫ్‌టీ, సీఏ అండ్ బీఎం), ఫార్మా డీ కోర్సుల్లో ప్రవేశాల నాటికి 17 ఏండ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి 22 ఏండ్లు, రిజర్వ్‌డ్ కేటగిరీలకు 25 ఏండ్లు.

ఎంసెట్ అగ్రికల్చరల్ అండ్ మెడికల్ (ఫార్మసీ, వెటర్నరీ తదితర)
- ఎంసెట్ (ఏఎం) స్ట్రీమ్ ద్వారా బీఎస్సీ (అగ్రికల్చరల్), బీఎస్సీ (హార్టికల్చర్), బీఎస్సీ (ఫారెస్ట్రీ), బీవీఎస్సీ & ఏహెచ్, బీఎఫ్‌ఎస్సీ, బీటెక్ (ఎఫ్‌టీ), బీఫార్మా, బీటెక్ (బయోటెక్నాలజీ-బైపీసీ), ఫార్మా -డీ (బైపీసీ).
అర్హత మార్కులు
- టీఎస్ ఎంసెట్‌లో 25 శాతం మార్కులు (మొత్తం మార్కుల్లో) వస్తే అర్హతగా పరిగణించి ర్యాంకింగ్ ఇస్తారు. ఎస్సీ/ఎస్టీలకు ఎటువంటి అర్హత మార్కులు లేవు. 
- మూడురోజుల్లో నిర్వహించే పరీక్షకు నార్మలైజేషన్ విధానంలో మార్కులను ప్రకటించి ర్యాంకింగ్ ఇస్తారు.
- అగ్రికల్చరల్ అండ్ మెడికల్ (ఏఎం) పరీక్ష తేదీలు: మే 8, 9
- ప్రతిరోజు రెండు సెషన్లు ఉంటాయి. ఉదయం 10 నుంచి 1 గంట వరకు. మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు.
- పరీక్ష విధానం: మొత్తం 160 ప్రశ్న లు- 180 నిమిషాలు.
- బయాలజీ-80 (బాటనీ-40, జువాలజీ-40), ఫిజిక్స్-40, కెమిస్ట్రీ-40 ప్రశ్నలు ఇస్తారు.
- అన్ని ప్రశ్నలు ఆబ్జెక్టివ్ (మల్టిపుల్ చాయిస్) విధానంలో ఉంటాయి
- నెగెటివ్ మార్కింగ్ విధానం లేదు.

- అర్హతలు: ఇంటర్ ఉత్తీర్ణులు లేదా సెకండియర్ పరీక్ష లు రాసినవారు అర్హులు. కోర్సుల వారీగా అర్హతలు... (కింద ఆయా కోర్సులకు ఎదురుగా ఇచ్చిన వాటిలో రెండు/మూడు సబ్జెక్టులను చదివి ఉండాలి)
- బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్, బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్ - ఫిజికల్ సైన్సెస్,బయాలజికల్ లేదా నేచురల్ సైన్సెస్, అగ్రికల్చర్, అగ్రికల్చర్‌లో వొకేషనల్ కోర్సు.
- బీఎస్సీ (ఫారెస్ట్రీ) - ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదా మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ
- బీవీఎస్సీ &ఏహెచ్- ఫిజికల్ సైన్సెస్, బయాలజికల్ లేదా నేచురల్ సైన్సెస్
- బీఎఫ్‌ఎస్సీ - ఫిజికల్ సైన్సెస్, బయాలజికల్ లేదా నేచురల్ సైన్సెస్ లేదా ఫిషరీ సైన్సెస్‌లో వొకేషనల్ కోర్సు.
- బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ)- మ్యాథ్స్, ఫిజిక్స్ లేదా ఫిజికల్ సైన్సెస్, బయాలజికల్ సైన్సెస్/నేచురల్ సైన్సెస్.

పరీక్ష విధానం:
- మీడియం- ప్రశ్నపత్రం ఇంగ్లిష్, తెలుగు/ ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో ఇస్తారు. 
- పరీక్షలో 160 ప్రశ్నలు ఉంటాయి. 160 మార్కులు.
- మ్యాథ్స్ -80, కెమిస్ట్రీ-40, ఫిజిక్స్-40 ప్రశ్నల చొప్పున ఇస్తారు.
- పరీక్ష కాలవ్యవధి 3 గంటలు
- పరీక్ష తేదీలు - మే 3, 4, 6. ప్రతిరోజు రెండు సెషన్లు ఉంటాయి. ఉదయం 10 నుంచి 1 గంట వరకు. రెండో సెషన్ 3 నుంచి 6 గంటల వరకు.
- నెగెటివ్ మార్కింగ్ విధానం లేదు.
- ఎగ్జామ్ ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ (మల్టిపుల్ చాయిస్) విధానంలో ప్రశ్నలు ఇస్తారు.
నోట్: పైన పేర్నొన్న ఏ సబ్జెక్టు చదివినా ఏఎం స్ట్రీమ్‌లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి మాత్రమే ప్రశ్నలు ఇస్తారు. అభ్యర్థులకు 17 ఏండ్లు నిండి ఉండాలి. 22 ఏండ్లు మించరాదు.
- బీఫార్మా కోర్సు- ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణత. ఆప్షనల్ సబ్జెక్టుల్లో కనీసం 45 శాతం మార్కులు వచ్చి ఉండాలి. ప్రవేశాల నాటికి 16 ఏండ్లు నిండి ఉండాలి.

- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: ఏప్రిల్ 5
- రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.800/-
- ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.400/-
- అపరాధ రుసుం రూ. 500తో చివరితేదీ: ఏప్రిల్ 11
- వెబ్‌సైట్: www.eamcet.tsche.ac.in 
- ఫార్మా- డీ కోర్సు - (50 శాతం సీట్లు ఎంపీసీ, 50 శాతం బైపీసీ విద్యార్థులకు కేటాయిస్తారు) - ఇంటర్ ఎంపీసీ/బైపీసీ ఉత్తీర్ణత. ఆప్షనల్ సబ్జెక్టుల్లో కనీసం 45 శాతం మార్కులు రావాలి. డిసెంబర్ 31 నాటికి 17 ఏండ్లు నిండి ఉండాలి.

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
జేఈఈ అడ్వాన్స్‌డ్ తేదీ మార్పు.

జేఈఈ అడ్వాన్స్‌డ్ ద్వారా దేశంలోని 23 ఐఐటీలతోపాటు మరికొన్ని జాతీయస్థాయి విద్యాసంస్థల్లో బీఈ/బీటెక్, డ్యూయెల్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
-జేఈఈ అడ్వాన్స్‌డ్ తేదీ: మే 27 (పేపర్-1 ఉదయం 9 నుంచి 12, పేపర్-2 మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు)
ముఖ్యతేదీలు:
-జేఈఈ మెయిన్ (రెండో సెషన్) - ఏప్రిల్ 8 నుంచి 12 వరకు
-జేఈఈ మెయిన్ ఫలితాల వెల్లడి - ఏప్రిల్ 30
-జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్- మే 3 నుంచి 9 వరకు
-ఫీజీ చెల్లించడానికి చివరితేదీ - మే 10
-అడ్మిట్ కార్డు డౌన్‌లోడింగ్ - మే 20 నుంచి 27 వరకు
-జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ - మే 27
-ఫలితాల వెల్లడి - జూన్ 14 
-ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ - జూన్ 14, 15
-ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ - జూన్ 17
-ఆర్కిటెక్చర్ టెస్ట్ ఫలితాల వెల్లడి - జూన్ 21
-పూర్తి వివరాల కోసం 
వెబ్‌సైట్: https://jeeadv.ac.in

No comments:

Post a Comment