ఐఐఐటీ బాసరలో బీటెక్ పోగ్రామ్ ప్రవేశాలు,
నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) 2019-20 విద్యా సంవత్సరానికిగాను ఆరేండ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
IIIT
-కోర్సు పేరు: ఇంటిగ్రేటెడ్ బీటెక్
-విభాగాలు: కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్
-మొత్తం సీట్ల సంఖ్య: 1000
-అర్హత: 2018-19 విద్యాసంవత్సరం జరిగిన పరీక్షల్లో మొదటి ప్రయత్నంలో ఉత్తీర్ణులైన తెలంగాణ/ ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన పదో తరగతి విద్యార్థులు.
-మొత్తం సీట్లలో 85 శాతంతెలంగాణ ప్రాంతానికి (లోకల్), మిగతా 15 శాతం సీట్లను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన విద్యార్థులకు కేటాయించారు.
-వయస్సు: 2019 డిసెంబర్ 31 నాటికి 18 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక: పదోతరగతి అకడమిక్ మార్కుల (ప్రతి సబ్జెక్టులోని గ్రేడ్ పాయింట్ యావరేజ్) ఆధారంగా.
-అప్లికేషన్ ఫీజు: రూ.200/- (ఎస్సీ/ఎస్టీలకు రూ.150/-).
గమనిక: అప్లికేషన్ ఫీజును టీఎస్ ఆన్లైన్ ్ల చెల్లించాలి.
-నాన్ రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థుల జీపీఏకు 0.4 డిప్రైవేషన్ స్కోర్ కలుపుతారు.
-దరఖాస్తు: ఆన్లైన్లో. ఆన్లైన్ హార్డ్‌కాపీ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తుకు సంబంధిత ధ్రువపత్రాలు జతచేసి రిజిస్టర్/స్పీడ్‌పోస్ట్‌లో సంబంధిత ఆర్జీయూకేటీ బాసర కన్వీనర్ లేదా పర్సనల్ అధికారికి పంపాలి.
-చిరునామా:
The Convener, RGUKT
Basar, Nirmal District,
Telangana State - 504107
-దరఖాస్తులకు చివరితేదీ: మే 24
-హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేదీ: మే 31
-ఎంపికైన విద్యార్థుల జాబితా వెల్లడి: జూన్ 10
-వెబ్సైట్: www.rgukt.ac.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

సీసీఐలో మేనేజర్లు ఉద్యోగాలు,
న్యూఢిల్లీలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
cci-ltd
-మొత్తం ఖాళీలు: 19
-విభాగాలవారీగా.. మేనేజర్ (డిప్యూటీ మేనేజర్ (మెకానికల్/ఎలక్ట్రికల్/మార్కెటింగ్/ఎంఎం)-5, (పొడక్షన్/మెకానికల్)-2, ఇంజినీర్-3, ఆఫీసర్ (హెచ్ఆర్)-3, ఆఫీసర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్)-3, అకౌంట్స్ ఆఫీసర్-3 ఖాళీలు ఉన్నాయి
-విద్యార్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ, ఎమ్మెస్సీ, ఎంబీఏ లేదా పీజీ డిప్లొమా, మూడేండ్ల డిప్లొమా, సీఏ/ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతోపాటు నిర్దిష్ట అనుభవం ఉండాలి.
-వయస్సు: పోస్టులను బట్టి 35- 44 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: మే10
-వెబ్సైట్: https://cciltd.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో ఉద్యోగాలు,
రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తున్న ఇండియన్ కోస్ట్‌గార్డ్ వెస్టర్న్ రీజియన్ పరిధిలోని వివిధ సబ్ ఆఫీసుల్లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
ICG
-మొత్తం ఖాళీలు: 18
-పనిచేసే ప్రదేశాలు: రత్నగిరి, గోవా, కొచ్చి, ముంబై, డామన్,
-విభాగాలవారీగా ఖాళీలు: డ్రాఫ్ట్స్‌మెన్-1, సివిలియన్ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్-4, ఇంజిన్ డ్రైవర్-3, సారంగ్ లస్కర్-2, లస్కర్-8
-అర్హతలు: పదోతరగతి, సంబంధిత ట్రేడుల్లో కాంపిటెన్సీ సర్టిఫికెట్, డిప్లొమా, డ్రైవింగ్ లైసెన్స్‌తోపాటు నిర్దిష్ట అనుభవం ఉండాలి.
-వయస్సు: 18-30 ఏండ్ల మధ్య ఉండాలి. పోస్టులను బట్టి వేర్వేరుగా వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.
-ఎంపిక విధానం: రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్ ద్వారా
-దరఖాస్తు: ఆన్లైన్లో
-చివరితేదీ: జూన్ 30
-వెబ్సైట్: www.joinindiancoastguard.gov.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
హెచ్ఎంటీలో ఉద్యోగాలు,
బెంగళూరులోని హెచ్ఎంటీ మెషిన్ టూల్స్ లిమిటెడ్‌లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
HMT
-మొత్తం ఖాళీలు: 38
-పోస్టులు ఖాళీల వివరాలు: జాయింట్ జనరల్ మేనేజర్ (ప్రొడక్షన్)-5, జనరల్ మేనేజర్ (మార్కెటింగ్)-1, రీజినల్ మేనేజర్ (మార్కెటింగ్) -10, ఏజీఎం (ఫైనాన్స్)-5, ఆఫీసర్ (ఫైనాన్స్)-5, ఏజీఎం (హెచ్ఆర్)-6, మెడికల్ సూపరింటెండెంట్-1, మెడికల్ ఆఫీసర్-5 ఖాళీలు ఉన్నాయి.
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి ఇంజినీరింగ్ డిగ్రీ, ఎంబీబీఎస్, ఎంబీఏ, పీజీడీఎం, సీఎంఏ, సీఏ, ఐసీడబ్యూఏ ఉత్తీర్ణత.
-ఎంపిక: దరఖాస్తు చేసుకున్నవారిని షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-చివరితేదీ: మే 14
-వెబ్సైట్: www.hmtindia.com
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
టీసీఐఎల్‌లో ఉద్యోగాలు.
టెలీకమ్యూనికేషన్స్ కన్సెల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (టీసీఐఎల్)లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
tcil
పోస్టుల వివరాలు:
-జనరల్ మేనేజర్ (టెలికం/ఐటీ)-4, మేనేజర్ (ఫైనాన్స్)-3, డిప్యూటీ మేనేజర్ (టెలికం/ఐటీ)-6, డిప్యూటీ మేనేజర్ (సివిల్)-4, అసిస్టెంట్ మేనేజర్ (టెలికం/ఐటీ)-4, అసిస్టెంట్ మేనేజర్ (సివిల్)-10 ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు, వయస్సు, ఎంపిక తదితరాల కోసం వెబ్సైట్ చూడవచ్చు.
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-చివరితేదీ: మే 14
-వెబ్సైట్: www.tcil-india.com