Saturday, 6 April 2019

ఎస్‌బీఐలో 2000 పీవో పోస్టులు, ఏడోతరగతి ప్రవేశ పరీక్ష, ఐఐటీ తిరుపతిలో పీహెచ్‌డీ ప్రవేశాలు, ఐఐటీ ఢిల్లీలో ఎంటీఎస్ ఉద్యోగాలు, గార్డెన్ రీచ్‌లో సూపర్‌వైజర్లు ఉద్యోగాలు.

ఎస్‌బీఐలో 2000 పీవో పోస్టులు,

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.-పోస్టు పేరు: ప్రొబేషనరీ ఆఫీసర్
-మొత్తం పోస్టుల సంఖ్య: 2000 (జనరల్-810, ఓబీసీ-540, ఎస్సీ-300, ఎస్టీ-150)
-అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. ప్రస్తుతం డిగ్రీ ఫైనల్ ఇయర్/సెమిస్టర్ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 2019, ఆగస్టు 31 నాటికి సంబంధిత డిగ్రీ లేదా ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ సర్టిఫికెట్ ఉండాలి.
-వయస్సు: 2019, ఏప్రిల్ 1 నాటికి కనీసం 21 ఏండ్లు, గరిష్ఠంగా 30 ఏండ్లకు మించరాదు.
-పేస్కేల్: పోస్టింగ్ & ప్రదేశాన్ని బట్టి ఏడాదికి కనీసం రూ.8.20 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.13.08 లక్షలు సీటీసీ జీతం ఉంటుంది
-అప్లికేషన్ ఫీజు: రూ.750/- (ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ.125/-)
నోట్: సివిల్స్ మాదిరిగానే ఎస్‌బీఐ పరీక్ష కూడా జనరల్ అభ్యర్థులు నాలుగుసార్లు, ఓబీసీలు ఏడుసార్లు, ఎస్సీ/ఎస్టీ/హీహెచ్‌సీలకు గరిష్ఠ వయోపరిమితిలోపల ఎన్నిసార్లయినా రాయవచ్చు.
-ఎంపిక: రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ
-ఆన్‌లైన్ రాతపరీక్ష ప్రిలిమినరీ (ఫేజ్-1), మెయిన్ (ఫేజ్-2) రెండు విధాలుగా ఉంటుంది.
-ప్రిలిమినరీ 100, మెయిన్ 200 మార్కులకు ఉంటుంది.
-ప్రకటించిన మొత్తం పోస్టుల్లో ఒక పోస్టుకు 10 మంది చొప్పున మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తారు.
-మెయిన్ పరీక్ష ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ విధానంలో ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తారు.
-ఆబ్జెక్టివ్ పరీక్షలో ప్రతి తప్పు సమాధానానికి 1/4వ వంతు మార్కులు కోత విధిస్తారు.
-ప్రిలిమినరీ పరీక్షలో ఇంగ్లిష్ లాంగ్వేజ్-30, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-35, రీజనింగ్ ఎబిలిటీ -35 ప్రశ్నలు ఇస్తారు.
-మెయిన్ పరీక్షలో రీజనింగ్ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్-45, డాటా అనాలిసిస్ & ఇంటర్‌ప్రిటేషన్-35, జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్‌నెస్-40, ఇంగ్లిష్ లాంగ్వేజ్-35 ప్రశ్నలు ఇస్తారు. ప్రిలిమినరీ పరీక్ష 90 నిమిషాలు, మెయిన్ పరీక్ష 3 గంటల్లో పూర్తిచేయాలి.
-డిస్క్రిప్టివ్ రాత పరీక్ష 50 మార్కులకు ఉంటుంది. 30 నిమిషాల్లో పూర్తి చేయాలి. దీనిలో టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ (లెటర్ రైటింగ్& ఎస్సే). ఇది కేవలం క్వాలిఫయింగ్ పరీక్ష మాత్రమే.
-గ్రూప్ డిస్కషన్ 20 మార్కులకు, ఇంటర్వ్యూ 30 మార్కులకు ఉంటుంది.
-ఫైనల్ సెలక్షన్‌లో మెయిన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

ముఖ్యమైన తేదీలు
-చివరితేదీ: ఏప్రిల్ 22
-ప్రిలిమినరీ పరీక్ష: జూన్ 8, 9 & 15,16
-మెయిన్ ఆన్‌లైన్ టెస్ట్: జూలై 20
-గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ తేదీ: సెప్టెంబర్
-వెబ్‌సైట్:https://bank.sbi/careers
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఏడోతరగతి ప్రవేశ పరీక్ష,
హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ 2019-20 విద్యా సంవత్సరానికి 7వతరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

అర్హతలు: 2018-19 విద్యాసంవత్సరంలో 6వ తరగతి చదువుతున్న రాష్ట్రంలోని 33 జిల్లాల బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థులు. తల్లిదండ్రుల ఆదాయం ఏడాదికి గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000/-, పట్టణ ప్రాంతాల్లో రూ. 2,00,000 మించరాదు.
-వయస్సు: 2019, ఆగస్టు 31 నాటికి 13 ఏండ్లకు మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు రెండేండ్ల వరకు మినహాయింపు ఉంటుంది.
-అప్లికేషన్ ఫీజు: రూ. 100/-
-ఎంపిక: -పరీక్ష ఆధారంగా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో 
-దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 15
-ప్రవేశపరీక్షతేదీ: ఏప్రిల్ 30
-వెబ్‌సైట్: mjptbcwreis.cgg.gov.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐటీ తిరుపతిలో పీహెచ్‌డీ ప్రవేశాలు,
తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) 2019కుగాను పీహెచ్‌డీ, ఎంఎస్ (రిసెర్చ్) ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 

-పీహెచ్‌డీ
-విభాగాలు: ఇంజినీరింగ్, సైన్సెస్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్
-ఎంఎస్ (రిసెర్చ్)
-విభాగాలు: ఇంజినీరింగ్‌లోని సివిల్, కంప్యూటర్, కంప్యూటర్ సైన్సెస్, ఇంజినీరింగ్ తదితర విభాగాలు.
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ కోర్సులకు సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీతోపాటు గేట్/యూజీసీ/సీఎస్‌ఐఆర్ నెట్/ఎన్‌బీహెచ్‌ఎం ఉత్తీర్ణత. ఎంఎస్ (రిసెర్చ్) కోర్సులకు బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. సంబంధిత సబ్జెక్టులో గేట్/నెట్ స్కోరు, ఇంటర్వ్యూ 
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 30
-వెబ్‌సైట్: https://iittp.ac.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐటీ ఢిల్లీలో ఎంటీఎస్ ఉద్యోగాలు,
న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో ఖాళీగా ఉన్న ఎంటీఎస్ పోస్టుల (కాంట్రాక్టు ప్రాతిపదికన) భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

-మొత్తం ఖాళీలు: 10
-పోస్టు పేరు: మల్టీ టాస్కింగ్ స్టాఫ్
-అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతోపాటు ఎంఎస్ ఆఫీస్ (ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్)లో పరిజ్ఞానం ఉండాలి. ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్‌లో సంబంధిత రంగంలో ఐదేండ్ల అనుభవం ఉండాలి. 
-పేస్కేల్: రూ. 20,000-45,000/-
-ఎంపిక: రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్/స్కిల్ టెస్ట్ 
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 10
-వెబ్‌సైట్:www.iitd.ac.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
గార్డెన్ రీచ్‌లో సూపర్‌వైజర్లు ఉద్యోగాలు.

గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సూపర్‌వైజర్ (తాత్కాలికంగా) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
-పోస్టు పేరు: సూపర్‌వైజర్-20 ఖాళీలు
-విభాగాలవారీగా.. మెకానికల్-5, అడ్మినిస్ట్రేషన్ అండ్ హెచ్‌ఆర్-2, ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్-5, ఫైనాన్స్-1, మెటీరియల్స్ మేనేజ్‌మెంట్-1, ఫైర్ ఫైటింగ్-1, కెమిస్ట్-1, వెల్డర్-1, పెయింటర్-1, నేవల్ ఆర్కిటెక్చర్-2 ఖాళీలు ఉన్నాయి.
-వయస్సు: 28 ఏండ్లకు మించరాదు. 
-పే స్కేల్: రూ. 23,800-83,300/-
-ఎంపిక విధానం: రాతపరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 23
-వెబ్‌సైట్: www.grse.nic.in

2 comments: