Tuesday, 23 April 2019

ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్ నోటిఫికేషన్, మహిళలకు ఇండో యూఎస్ ఫెలోషిప్ నోటిఫికేషన్, యూపీఎస్సీ అసిస్టెంట్ హైడ్రోజియాలజిస్టులు నోటిఫికేషన్.

ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్ నోటిఫికేషన్,

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పలు శాఖల్లో నాన్ టెక్నికల్ విభాగాల్లో (గ్రూప్ సీ నాన్ గెజిటెడ్/నాన్ మినిస్టీరియల్ విభాగం) ఖాళీగా ఉన్న మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ssc-mts
-కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పదివేల ఉద్యోగాలు
-పదోతరగతి/మెట్రిక్యులేషన్ అర్హత
-ఆబ్జెక్టివ్, డిస్రిప్టివ్ రాతపరీక్ష ద్వారా ఎంపిక
-పోస్టు పేరు: మల్టీ టాస్కింగ్ స్టాఫ్
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్/పదోతరగతి ఉత్తీర్ణత.
-వయస్సు: 18-25 ఏండ్ల మధ్య ఉండాలి
-వయోపరిమితి: ఎస్సీ, ఎస్టీల అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీల కు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పేస్కేల్: రూ. 5200 - 20200 + గ్రేడ్ పే రూ. 1800/- అదనంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇన్సూరెన్స్, ప్రావిడెంట్ తదితర సదుపాయాలు ఉంటాయి.
-అప్లికేషన్ ఫీజు: రూ. 100 ఎస్సీ/ఎస్టీ, మహిళలు, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్లకు ఎటువంటి ఫీజు లేదు.
-ఎంపిక: రాత పరీక్ష (ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్) ద్వారా
-పేపర్1లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనిం గ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ , జనరల్ ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్ అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
-పేపర్- 2 రాతపరీక్షలో షార్ట్ ఎస్సే, లెటర్ రైటింగ్ ఇన్ ఇంగ్లిష్, తదితర అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఈ పరీక్షను అభ్యర్థులు ఇంగ్లిష్/హిందీ మాధ్యమాలలో లేదా గుర్తింపు పొందిన (8వ షెడ్యూల్ ప్రకారం) ఏదైనా ప్రాంతీయ భాషలో పరీక్ష రాయవచ్చు. అభ్యర్థికి సంబంధిత భాషలో ప్రాథమిక పరిజ్ఞానం ఏ మేరకు ఉందో పరిశీస్తారు. దీనిలో కనీస అర్హత మార్కులను సాధించాలి.
-పేపర్-1లో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కుల కోతవిధిస్తారు.
-పేపర్-1లో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. పేపర్-2 కేవలం క్వాలిఫయింగ్ మాత్రమే.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఏప్రిల్ 22 నుంచి
-చివరితేదీ: మే 22 (సాయంత్రం 5 గంటల వరకు)
-పరీక్ష తేదీలు: ఆగస్టు 2-సెప్టెంబర్ 6 వరకు
-వెబ్‌సైట్: http://ssconline.nic.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
మహిళలకు ఇండో యూఎస్ ఫెలోషిప్ నోటిఫికేషన్,
ఇండో యూఎస్ ఫెలోషిప్ ఫర్ ఉమెన్ నోటిఫికేషన్‌ను డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్‌టీ) విడుదల చేసింది.
indo-fellowships
-ఫెలోషిప్ పేరు: ఇండో యూఎస్ ఫెలోషిప్ ఫర్ ఉమెన్ 
నోట్:ఈ ఫెలోషిప్‌ను డీఎస్‌టీ, ఇండో-యూఎస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫోరం సంయుక్తంగా ఇస్తున్నాయి.
-విభాగాలు: సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్, మెడిసిన్
ఈ ఫెలోషిప్ రెండు రకాలుగా ఇస్తారు. 
1. ఉమెన్ ఓవర్‌సీస్ స్టూడెంట్ ఇంటర్న్‌షిప్ 
2. ఉమెన్ ఓవర్‌సీస్ ఫెలోషిప్
అర్హత: రెండు రకాల ఫెలోషిప్‌లకు బేసిక్ సైన్సెస్, ఇంజినీరింగ్/టెక్నాలజీ, అగ్రికల్చరల్ అండ్ మెడికల్ సైన్సెస్‌లో పీహెచ్‌డీ చదువుతున్నవారు అర్హులు. 
-వయస్సు: 2019 జూన్ 17 నాటికి ఉమెన్ ఓవర్‌సీస్ స్టూడెంట్ ఇంటర్న్‌షిప్‌కు 21 నుంచి 35 ఏండ్లు, ఉమెన్ ఓవర్‌సీస్ ఫెలోషిప్‌కు 27 నుంచి 45 ఏండ్ల మధ్య ఉండాలి. 
-ఫెలోషిప్‌లో భాగంగా స్టయిఫండ్, రిటన్ ఎయిర్‌ఫేర్, హెల్త్ ఇన్సూరెన్స్, కంటిన్‌జెన్సీ అండ్ కాన్ఫరెన్స్ అలవెన్స్‌లు ఇస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూన్ 17
-వెబ్‌సైట్: www.iusstf.org

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
యూపీఎస్సీ అసిస్టెంట్ హైడ్రోజియాలజిస్టులు నోటిఫికేషన్.
మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డులో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ హైడ్రోజియాలజిస్ట్ ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
ugc-net
-మొత్తం ఖాళీలు -50 (జనరల్-25, ఈడబ్ల్యూఎస్-5, ఓబీసీ-12, ఎస్సీ-5, ఎస్టీ-3)
-పోస్టు పేరు: అసిస్టెంట్ హైడ్రోజియాలజిస్ట్
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి జియాలజీ లేదా అప్లయిడ్ జియాలజీ లేదా జియో ఎక్స్‌ప్లోరేషన్ లేదా ఎర్త్ సైన్స్ అండ్ రిసోర్స్ మేనేజ్‌మెంట్/హైడ్రాలజీలో మాస్టర్ డిగ్రీ లేదా ఎంఈ/ఎంటెక్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
-వయస్సు: 30 ఏండ్లకు మించరాదు. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: రూ. 47,600- రూ. 1,51,100 (7వ వేతన స్కేలు ప్రకారం)
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ 
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-అప్లకేషన్ ఫీజు: రూ. 25/- (ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు)
-దరఖాస్తులకు చివరితేదీ:మే 2
-వెబ్‌సైట్: www.upsconline.nic.in


No comments:

Post a Comment