Friday, 10 May 2019

డీఎంఆర్‌సీలో జాబ్స్, ఐఐటీ ఖరగ్‌పూర్‌లో జాబ్స్, ఐఎంయూ లేటరల్ ఎంట్రీ ప్రవేశాలు, ఐఐఎంలో ఐపీఎం ప్రవేశాలు, ఓయూలో పీహెచ్‌డీ ప్రవేశాలు.

డీఎంఆర్‌సీలో జాబ్స్,

ఐసీఎంఆర్ పరిధిలోని డిజర్ట్ మెడిసిన్ రిసెర్చ్ సెంటర్ (డీఎంఆర్‌సీ)లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
పోస్టులు- ఖాళీలు-అర్హతలు: 
-సైంటిస్ట్ బీ- 2
-అర్హతలు: పీజీ, పీహెచ్‌డీతోపాటు ఏడాది అనుభవం ఉండాలి.
-ఫీల్డ్ వర్కర్/టెక్నీషియన్-10
-అర్హతలు: ఇంటర్ సైన్స్ గ్రూప్/డీఎంఎల్‌టీ లేదా బీఎస్సీ లైఫ్ సైన్స్‌తోపాటు అనుభవం ఉండాలి. 
-టెక్నికల్ అసిస్టెంట్-2
-అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ/పీజీతోపాటు అనుభవం.
-డాటా ఎంట్రీ ఆపరేటర్-1
-అర్హత: ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణతతోపాటు అనుభవం.
-మల్టీటాస్కింగ్ స్టాఫ్-2
-అర్హతలు : పదోతరగతి లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-ఇంటర్వ్యూ తేదీలు: మే 4 నుంచి10 మధ్య నిర్వహిస్తారు. వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

-వెబ్‌సైట్: http://dmrcjodhpur.nic.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐటీ ఖరగ్‌పూర్‌లో జాబ్స్,

ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో ప్రాజెక్టు అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
-పోస్టులు: ప్రాజెక్టు అసిస్టెంట్ (రిసెర్చ్)-1, జూనియర్ ప్రాజెక్టు ఆఫీసర్ (సబ్జెక్టు మ్యాటర్ ఎక్స్‌పర్ట్)-3, రిసెర్చ్ అసోసియేట్ (రిసెర్చ్)-1, జేఆర్‌ఎఫ్/ఎస్‌ఆర్‌ఎఫ్-1, జేఆర్‌ఎఫ్ (రిసెర్చ్)-2, రిసెర్చ్ ఇంజినీర్ (రిసెర్చ్)-1, రిసెర్చ్ అసోసియేట్-1, జేఆర్‌ఎఫ్ (సీఎస్‌ఈ)-3, రిసెర్చ్ కన్సల్టెంట్-1, జేఆర్‌ఎఫ్ (స్కూల్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్)-1, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (రిసెర్చ్)-1, జేఆర్‌ఎఫ్ /ఎస్‌ఆర్‌ఎఫ్ (రబ్బర్ టెక్నాలజీ)-1, జేఆర్‌ఎఫ్ (అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ఇంజినీరింగ్)-1, జేఆర్‌ఎఫ్ (సోషల్ మీడియా)-1తోపాటు పలు ఇతర విభాగాల్లో ప్రాజెక్టు టెక్నికల్ అసిస్టెంట్లు, జేఆర్‌ఎఫ్ పోస్టులు ఉన్నాయి.
-అర్హతలు, వయస్సు, ఎంపిక తదితరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: కొన్ని పోస్టులకు మే 7, మరికొన్నింటికి మే 14వ తేదీ వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

-వెబ్‌సైట్: http://www.iitkgp.ac.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఎంయూ లేటరల్ ఎంట్రీ ప్రవేశాలు,

ఇండియన్ మారిటైం యూనివర్సిటీ (ఐఎంయూ) లేటరల్ ఎంట్రీ స్కీం ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
imu
-కోర్సు: బీటెక్ (మెరైన్ ఇంజినీరింగ్) చెన్నై క్యాంపస్
-అర్హత: మెరైన్/మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ లేదా ఈఈఈ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా కోర్సు కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. లేదా నాలుగేండ్ల షిప్‌బిల్డింగ్ ఇంజినీరింగ్‌లో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. 
-సీట్ల సంఖ్య- 27
-వయస్సు: 18- 25 ఏండ్ల మధ్య ఉండాలి.
-కోర్సు: బీఎస్సీ (నాటికల్ సైన్స్)
-వయస్సు: 18-26 ఏండ్ల మధ్య ఉండాలి.
-అర్హత: ఏడాది కాలపరిమితిగల నాటికల్ సైన్స్ డిప్లొమా ఉత్తీర్ణత. 
-దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
-చివరితేదీ: బీటెక్ కోర్సుకు జూలై 10, బీఎస్సీ కోర్సుకు జూలై 15


-వెబ్‌సైట్: https://www.imu.edu.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐఎంలో ఐపీఎం ప్రవేశాలు,


రోహతక్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లో ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ (ఐపీఎం)లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
-కోర్సు: ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్
-కాలవ్యవధి: ఐదేండ్లు
-కోర్సు ప్రత్యేకతలు: ఇంటర్ తర్వాత బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో ఐదేండ్ల కాంప్రహెన్షన్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ ఇది. మూడేండ్ల యూజీ, తర్వాత రెండేండ్ల పీజీ, కోర్సు పూర్తయిన తర్వాత మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ) సర్టిఫికెట్ ఇస్తారు. ఎవరైనా మూడేండ్ల ప్రోగ్రామ్ చేసి సంస్థ నుంచి వెళ్లిపోతే మూడేండ్ల బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) డిగ్రీ ప్రదానం చేస్తారు.
-అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో పదోతరగతి, ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. ఎస్సీ/ఎస్టీలు 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. 
నోట్: జూలై 31 నాటికి ఇంటర్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
-వయస్సు: 2019, జూలై 31 నాటికి 20 ఏండ్లు మించరాదు.
ఎంపిక విధానం: 
-అభ్యర్థుల అకడమిక్, ఎక్స్‌ట్రా కరికులం యాక్టివిటీస్‌ల ప్రావీణ్యతలను పరిశీలిస్తారు.
-ఐపీఎం ఆప్టిట్యూడ్ టెస్ట్‌ను నిర్వహిస్తారు. దీనిలో ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లిష్‌పై ప్రశ్నలు ఇస్తారు.
-ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉత్తీర్ణత సాధించినవారికి రిటన్ ఎబిలిటీ టెస్ట్, వ్యక్తిగత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అకడమిక్, జనరల్ అవేర్‌నెస్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
ముఖ్యతేదీలు:
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: మే 10
-ఐపీఎం ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఆన్‌లైన్): మే 17
-పర్సనల్ ఇంటర్వ్యూ తేదీ: జూన్ 14-16
-ఎంపిక తేదీ: జూలై 2019
-ఇండక్షన్ & ఓరియంటేషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్: ఆగస్టు 2019

-వెబ్‌సైట్: http://www.iimrohtak.ac.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఓయూలో పీహెచ్‌డీ ప్రవేశాలు.

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో పార్ట్‌టైం పీహెచ్‌డీలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
-ప్రోగ్రామ్: పార్ట్ టైం పీహెచ్‌డీ
-విభాగాలు: ఈసీఈ, సీఎస్‌ఈ 
-విశ్వేశ్వరయ్య పీహెచ్‌డీ స్కీంలో భాగంగా ఈ ప్రోగ్రామ్‌ను అందిస్తున్నారు. 
-అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో బీఈ/బీటెక్‌తోపాటు ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణులు. 
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: మే 4
-వెబ్‌సైట్: http://uceou.edu

No comments:

Post a comment