Friday, 10 May 2019

ఇండియన్ నేవీలో సెయిలర్లు ఉద్యోగాలు, ఇర్కాన్ ప్రాజెక్టు ఇంజినీర్లు ఉద్యోగాలు, జిప్‌మర్‌లో ప్రవేశాలు, ఎన్‌ఐటీలో ఎంబీఏ ప్రవేశాలు, సీఎస్‌ఐఓలో డిప్లొమా ప్రవేశాలు.

ఇండియన్ నేవీలో సెయిలర్లు ఉద్యోగాలు,
భారత రక్షణశాఖ పరిధిలోని ఇండియన్ నేవీ (ఐఎస్) సెయిలర్ (మ్యుజీషియన్) పోస్టుల భర్తీకి అవివాహిత పురుషుల నుంచి దరఖాస్తులను కోరుతుంది.
INDAN-ANVY-SAILERS
- సెయిలర్ ఫర్ మెట్రిక్ రిక్రూట్ (మ్యుజీషియన్)
- అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతి ఉత్తీర్ణత. నిర్దేశించిన సంగీత సామర్థ్యాలు, మ్యూజికల్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్ ఉండాలి. కనీసం 157 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి.
- పీఎఫ్‌టీలో భాగంగా 1.6 కిలో మీటర్ల దూరాన్ని 7 నిమిషాల్లో పూర్తిచేయాలి. 20 ఉతక్ బైటక్‌లు, 10 పుష్‌అప్‌లు చేయాలి.
- శిక్షణ: 2019 అక్టోబర్‌లో ప్రారంభమవుతుంది. 15 వారాల పాటు బేసిక్ ట్రెయినింగ్‌ను ఐఎన్‌ఎస్ చిల్కాలో, మిలిటరీ మ్యూజిక్ ట్రెయినీగా ముంబైలో 26 వారాలపాటు శిక్షణ ఇస్తారు.
- వయస్సు: 1994 అక్టోబర్ 1 నుంచి 2002 సెప్టెంబర్ 30 మధ్య జన్మించి ఉండాలి.
- ఎంపిక: సంగీత సామర్థ్యం, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్
- పే &అలవెన్సులు: ట్రెయినింగ్‌లో రూ. 14,600 క్షణ తర్వాత రూ. 21,700-69,100 + రూ. 5,200/- ఎంఎస్‌పీ+ డీఏ చెల్లిస్తారు.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో మే 6 నుంచి
- దరఖాస్తులకు చివరితేదీ: మే 19
- వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఇర్కాన్  ప్రాజెక్టు ఇంజినీర్లు ఉద్యోగాలు,
ఇర్కాన్ పరిధిలోని ఇర్కాన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్ లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
IRCONISL
-మొత్తం పోస్టులు: 5 
-సీనియర్ ప్రాజెక్టు ఇంజినీర్
-అర్హత: సివిల్ ఇంజినీరింగ్ లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. 
-పేస్కేల్: రూ. 90, 000/-
-ఎంపిక: ఇంటర్వ్యూద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేది: మే 14
-వెబ్‌సైట్: www.irconisl.com

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
జిప్‌మర్‌లో ప్రవేశాలు,

పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (జిప్‌మర్) 2019 ఆగస్టు సెషన్‌కుగాను వివిధ డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
JIPMER-MBBS-STUDENTS
-కోర్సు పేరు: బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్సీ నర్సింగ్, బ్యాచిలర్ ఆఫ్ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ (బీఏఎస్‌ఎల్‌పీ), బీఎస్సీ ఐల్లెడ్ హెల్త్ సైన్సెస్).
-వయస్సు: కనీసం 17 ఏండ్లు నిండి ఉండాలి.
-అర్హత: ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/బాటనీ & జువాలజీ, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
గమనిక: కోర్సు తర్వాత ఏడాదిపాటు స్టయిఫండరీ ఇంటర్న్‌షిప్ అవకాశాన్ని జిప్‌మర్ కల్పిస్తుంది. 

-కోర్సు పేరు: పీజీ డిప్లొమా, ఎమ్మెస్సీ/ఎంపీహెచ్, పీబీడీ, పీజీడీ/పీజీఎఫ్, పీహెచ్‌డీ
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి సంబంధిత బ్రాంచీలో బీఎస్సీ/బ్యాచిలర్ డిగ్రీ, ఎంబీబీఎస్, బీడీఎస్ లేదా బీఈ/బీటెక్, బీఎస్సీ నర్సింగ్, బీవీఎస్సీ (వెటర్నరీ సైన్స్/ ఆయుష్), జనరల్ నర్సింగ్&మిడ్‌వైఫరీలో డిప్లొమా, బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ/ఎంఫిల్ మెడికల్ సైకాలజీ, ఎమ్మెస్సీ/బీటెక్ (బయోటెక్నాలజీ), ఎండీ/ఎంఫార్మసీ, ఎంపీహెచ్, ఎంఈడీ, పీజీ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
-అప్లికేషన్ ఫీజు: బీఎస్సీ/ఎమ్మెస్సీ, ఎంపీహెచ్, పీబీడీ, పీజీడీ/పీజీఎఫ్, పీహెచ్‌డీ కోర్సులకు జనరల్/ఓబీసీలకు రూ. 1500/- ఎస్సీ/ఎస్టీలకు-రూ.1200/-పీహెచ్‌సీలకు ఫీజు లేదు.
-పీబీడీ & ఎమ్మెస్సీ నర్సింగ్ /ఎంపీహెచ్ అండ్ పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా (జెనెటిక్ కౌన్సిలింగ్) కోర్సులకు జనరల్/ఓబీసీలకు 
-రూ. 2500/- ఎస్సీ/ఎస్టీలకు-రూ.1800/- పీహెచ్‌సీలకు ఫీజు లేదు.
-పరీక్ష కేంద్రాలు: చెన్నై, కోల్‌కతా, ముంబై, న్యూఢిల్లీ, పుదుచ్చేరీ, త్రివేడ్రం, విజయవాడ.
గమనిక: పీహెచ్‌డీ అడ్మిషన్ పొందిన అభ్యర్థులకు మొదటి ఏడాది రూ. 25,000/- రెండో ఏడాది రూ. 28,000/-స్టయిఫండ్ చెల్లిస్తారు. 

-ఎంపిక: ఆన్‌లైన్ రాతపరీక్ష ద్వారా 
-రాతపరీక్షలో 100 మార్కులు-100 ప్రశ్నలను ఇస్తారు. పార్ట్-ఏలో ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్, బయోస్టాటిస్టిక్స్, రిసెర్చ్ మెథడాలజీ నుంచి 40 ప్రశ్నలు, పార్ట్-బీలో సంబంధిత సబ్జెక్టు నుంచి 60 ప్రశ్నలు ఇస్తారు. 
-బీఎస్సీ కోర్సులకు - ఆన్‌లైన్ రాతపరీక్షలో 100 ప్రశ్నలను ఇస్తారు. ఫిజిక్స్-20, కెమిస్ట్రీ-20, బయాలజీ-40, ఇంగ్లిష్ లాంగ్వేజ్-10, లాజికల్ &క్వాంటిటేటివ్ రీజనింగ్-10 ప్రశ్నలు ఇస్తారు. 
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: మే 24
-ఆన్‌లైన్ రాతపరీక్ష: జూన్ 22
-వెబ్‌సైట్: www.jipmer.edu.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఐటీలో ఎంబీఏ ప్రవేశాలు,

భోపాల్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) 2019కిగాను ఎంబీఏ ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.
MANIT-LOGO
- కోర్సు పేరు: ఎంబీఏ 
- కోర్సు వ్యవధి: రెండేండ్లు
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ లేదా బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
- ఎంపిక: క్యాట్/జీమ్యాట్ స్కోర్, జీడీ /ఇంటర్వ్యూ
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో 
- దరఖాస్తులకు చివరితేది: జూన్ 24
- వెబ్‌సైట్: www.manit.ac.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీఎస్‌ఐఓలో డిప్లొమా ప్రవేశాలు.

డీగఢ్‌లోని సీఎస్‌ఐఆర్-సెంట్రల్ సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ (సీఎస్‌ఐఓ)కి చెందిన ఇండో స్విస్ ట్రెయినింగ్ సెంటర్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
CSIO-INDI-SWISS

ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులు

- మొత్తం సీట్ల సంఖ్య: 140
- మూడేండ్ల డిప్లొమా (మెకానికల్ ఇంజినీరింగ్ (టూల్ అండ్ డై), ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్)
- నాలుగేండ్ల అడ్వాన్స్‌డ్ డిప్లొమా (డై అండ్ మౌల్డ్ మేకింగ్, మెకట్రానిక్స్ అండ్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్)
- అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి పదోతరగతి లేదా ప్రస్తుత్త అకడమిక్ ఇయర్ (2018-19)లో పరీక్షలు రాసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- వయస్సు: 2000 ఆగస్టు 1 తర్వాత జన్మించి ఉండాలి. 
- ఎంపిక: రాతపరీక్ష (ప్రవేశ పరీక్ష) 
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: మే 31
- వెబ్‌సైట్: www.csio.res.in


No comments:

Post a comment