Friday, 10 May 2019

బీఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్ జాబ్స్, ఏఏఎస్‌ఎల్‌లో పైలట్‌లు జాబ్స్, ఐఐపీలో పీజీ డిప్లొమా ప్రవేశాలు, బిట్స్ పిలానీలో ప్రవేశాలు, రూర్కెలా నిట్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు.

బీఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్ జాబ్స్,
భారత మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) కమ్యూనికేషన్ విభాగంలో తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 
bsf
-పోస్టు పేరు: హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్/మెకానిక్)
-రేడియో ఆపరేటర్-300 ఖాళీలు
-రేడియో మెకానిక్-772 ఖాళీలు
-అర్హతలు: మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన పరీక్షతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ లేదా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణత. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. 
-వయస్సు: 2019, జూన్ 12 నాటికి 18 - 25 ఏండ్ల మధ్య ఉండాలి. 
-పే స్కేల్: రూ. 25,500 -81,100/-
-అప్లికేషన్ ఫీజు: రూ. 100/-(ఎస్సీ/ఎస్టీ, బీఎస్‌ఎఫ్ ఉద్యోగులు, మహిళాలకు ఎలాంటి ఫీజు లేదు)
-పీఎస్‌టీ: పురుషులు 168 సెం.మీ ఎత్తు, మహిళలు -157 సెం.మీ ఎత్తు కలిగి ఉండాలి.
-ఎంపిక: రాతపరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డిస్క్రిప్టివ్ టెస్ట్ ద్వారా
-మొదటి దశ-ఓఎమ్‌ఆర్ బేస్డ్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. ఈ పరీక్షలో మొత్తం 200 మార్కులకుగాను 100 ప్రశ్నలను మూడు గంటల్లో పూర్తిచేయాలి.
-ఓఎమ్‌ఆర్ బేస్డ్ స్క్రీనింగ్ టెస్ట్‌లో ఇంగ్లిష్ అండ్ జనరల్ నాలెడ్జ్-20, మ్యాథమెటిక్స్-20, ఫిజిక్స్-40, కెమిస్ట్రీ-20 ప్రశ్నలను ఇస్తారు
-నెగెటివ్ మార్కింగ్‌లో భాగంగా ప్రతి తప్పు సమాధానానికి 1/2 లేదా 0.50 కోత విధిస్తారు.
-ఆబ్జెక్టివ్ టెస్ట్‌లో జనరల్/ఓబీసీ అభ్యర్థులు 38 శాతం, ఎస్సీ/ఎస్టీలకు 33 శాతం కనీస అర్హత మార్కులు రావాలి. 
-రెండో దశ-పీఎస్‌టీ/పీఈటీ, మూడో దశలో డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది.
-గమనిక: మొత్తం ఖాళీల్లో 25 శాతం బీఎస్‌ఎఫ్‌లో పనిచేస్తున్న అభ్యర్థులకు కేటాయించారు
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 12
-ఓఎమ్‌ఆర్ బేస్డ్ స్క్రీనింగ్ టెస్ట్: జూలై 28

-వెబ్‌సైట్: http://bsf.nic.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఏఏఎస్‌ఎల్‌లో పైలట్‌లు జాబ్స్,

ఎయిర్‌లైన్ ఐల్లెడ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఏఎస్‌ఎల్) కాంట్రాక్టు ప్రాతిపదికన ఖాళీగా ఉన్న కో పైలట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
AirIndia
-పోస్టు పేరు: కో పైలట్(ఏటీఆర్ రేటింగ్ )
-మొత్తం పోస్టులు: 10
-అర్హత: ఇంటర్/10+2 లేదా తత్సమాన స్థాయి ఉత్తీర్ణత. డీజీసీఏ ఇండియా జారీచేసిన వినియోగంలో ఉన్న సీపీఎల్, ఐఆర్ వ్యాలిడ్ ఏటీఆర్, ఎఫ్‌ఆర్‌టీవో, క్లాస్-1 మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్, ఐఆర్ ఎండార్స్‌మెంట్ (సీపీఎల్) ఈఎల్‌పీ, డబ్ల్యూపీసీ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ జారీ చేసిన వినియోగంలో ఉన్న ఆర్‌టీఆర్ లైసెన్స్ కలిగి ఉండాలి.
-వయస్సు: 45 ఏండ్లకు మించరాదు.
-అప్లికేషన్ ఫీజు: రూ. 3000/- 
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 30

-వెబ్‌సైట్: www.airindia.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐపీలో పీజీ డిప్లొమా ప్రవేశాలు,
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (ఐఐపీ) 2019-21 విద్యాసంవత్సరానికి రెండేండ్ల పీజీ డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్ (ఫుల్‌టైమ్) కోర్సులో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
IIP
-కోర్సు పేరు: పీజీ డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్
-మొత్తం సీట్ల సంఖ్య: 300 (హైదరాబాద్-60, ముంబై-80, ఢిల్లీ-100, కోల్‌కతా-60)
-అర్హత: బీఈ/బీటెక్ లేదా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, మైక్రోబయాలజీ/బయోకెమిస్ట్రీ, అగ్రికల్చర్, ఫుడ్ సైన్స్, పాలిమర్ సైన్స్, ఫార్మా విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
-వయస్సు: 2019 మే 31 నాటికి 30 ఏండ్లకు మించరాదు. 
-గమనిక: ముంబై క్యాంపస్‌లో మాత్రమే బాలురు, బాలికలకు హాస్టల్ వసతి కలదు.
-అప్లికేషన్ ఫీజు: రూ. 500/-
-ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా 
-పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, ముంబై, అహ్మదాబాద్, చెన్నై, కోల్‌కతా, న్యూఢిల్లీ
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
-దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 7
-రాతపరీక్ష: జూన్ 13
-వెబ్‌సైట్: www.iip-in.com

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బిట్స్ పిలానీలో ప్రవేశాలు,
బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) పిలానీ, అనుబంధ క్యాంపస్‌లలో 2019 ఆగస్టు సెషన్‌కుగాను పీహెచ్‌డీ ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది. 
BITS
-పీహెచ్‌డీ ప్రోగ్రామ్ (ఫుల్‌టైమ్/పార్ట్‌టైమ్)
విభాగాలవారీగా: 
-ఇంజినీరింగ్ (కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, మెకానికల్) 
-సైన్స్ (బయాలజికల్ సైన్సెస్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్), ఫార్మసీ
-ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్, మేనేజ్‌మెంట్, హ్యుమానిటీస్ & సోషల్ సైన్సెస్
-అర్హతలు: ఎంఈ/ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంబీఏ, ఎంఫిల్, ఎమ్మెస్సీ, బీఈ/బీటెక్, బీఫార్మసీలో 60 శాతం, ఎంఏలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-ఫెలోషిప్: ఫుల్‌టైమ్ అభ్యర్థులకు నెలకు రూ. 31,000/- స్టయిఫండ్ చెల్లిస్తారు.
-ఎంపిక: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: మే 16
-వెబ్‌సైట్: www.bitsadmission.com

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
రూర్కెలా నిట్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు.

రూర్కెలాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో 2019 జూలై సెషన్‌కుగాను పీహెచ్‌డీ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
-కోర్సు పేరు: పీహెచ్‌డీ
-విభాగాలు: ఇంజినీరింగ్, సైన్స్, ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, మేనేజ్‌మెంట్ అండ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్.
-అర్హత: మాస్టర్ డిగ్రీతోపాటు గేట్/ నెట్ స్కోర్ ఉండాలి. 
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: మే 19
-వెబ్‌సైట్: http://nitrkl.ac.in

No comments:

Post a comment