Tuesday, 25 June 2019

ఐడీబీఐలో 600 మేనేజర్లు ఉద్యోగాలు, ఎయిర్‌పోర్ట్ అథారిటీలో 272 ఉద్యోగాలు, టీఎంసీలో ఫెలోషిప్, సీఈసీఆర్‌ఐలో ప్రాజెక్ట్ అసిస్టెంట్లు, బీఈసీఐఎల్‌లో ఉద్యోగాలు.

ఐడీబీఐలో 600 మేనేజర్లు ఉద్యోగాలు,
ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) పీజీ డిప్లొమా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సు ద్వారా ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్-ఏ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

- మొత్తం ఖాళీలు: 600 (జనరల్-273, ఈడబ్ల్యూఎస్-30, ఓబీసీ-162, ఎస్సీ-90, ఎస్టీ-45, పీహెచ్‌సీ-24)
- కోర్సు పేరు: పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్
- ఈ కోర్సును ఐడీబీఐ, మణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ సంయుక్తంగా నిర్వహి స్తున్నాయి.
- అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత
- వయస్సు: 2019 జూన్ 1 నాటికి కనిష్ఠంగా 21 ఏండ్లు, గరిష్ఠంగా 28 ఏండ్లకు మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- పే స్కేల్: మొదటి తొమ్మిది నెలలకు రూ. 2500/-(ట్రెయినింగ్ పీరియడ్), ఇంటర్న్‌షిప్ పీరియడ్‌లో మూడు నెలలకు . 10,000/-, స్టయిఫండ్ చెల్లిస్తారు. ఏడాది కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులను అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్ ఏ) హోదాలో పే స్కేల్ రూ. 23,700-42,020/- ఉంటుంది.
- సర్వీస్‌బాండ్: ఎంపికైన అభ్యర్థులు ఐడీబీఐ బ్యాంక్‌లో మూడేండ్లపాటు సర్వీస్ చేయాల్సి ఉంటుంది లేదా సర్వీస్ పూర్తిచేయకపోతే రూ.2 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.
- అప్లికేషన్ ఫీజు: రూ. 700/- (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు రూ. 150/-)
IDBI-Bank1
- ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
- ఆన్‌లైన్ ఉమ్మడి రాతపరీక్ష కేవలం ఇంగ్లిష్/హిందీలో మాత్రమే ఉంటుంది.
- ఆన్‌లైన్ పరీక్షలో ప్రతి తప్పు జవాబుకు 1/4 మార్కులను తగ్గిస్తారు.
- శిక్షణ కేంద్రం: మణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్, బెంగళూరు
- పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడతోపాటు దేశవ్యాప్తంగా 94 సెంటర్ల లో పరీక్షను నిర్వహిస్తారు.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- పరీక్ష తేదీ: జూలై 21
- వెబ్‌సైట్: www.idbi.com
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎయిర్‌పోర్ట్ అథారిటీలో 272 ఉద్యోగాలు,
ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలోని ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ & ఐల్లెడ్ సర్వీసెస్ కంపెనీ ఖాళీగా ఉన్న సెక్యూరిటీ స్క్రీనర్ ( కాంట్రాక్టు ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

- పోస్టు పేరు: సెక్యూరిటీ స్క్రీనర్స్
- మొత్తం పోస్టులు: 272
- స్టేషన్ల వారీగా ఖాళీలు: కోల్‌కతా-87, అలహాబాద్-42, కాలికట్-87, చెన్నై-56
- అర్హతలు: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, బీసీఏఎస్ బేసిక్ ఏవీఎస్‌ఈసీ సర్టిఫికెట్ (బీసీఏఎస్ స్క్రీనర్/ఇన్‌లైన్ స్క్రీనర్) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. హిందీ/ఇంగ్లిష్, స్థానిక (ప్రాంతీయ) భాషల్లో పరిజ్ఞానం ఉండాలి.
- వయస్సు: 2019 జూన్ 1 నాటికి 45 ఏండ్లకు మించరాదు.
- పే స్కేల్: రూ. 25,000-30,000 జీతం చెల్లిస్తారు.
- అప్లికేషన్ ఫీజు: రూ. 500/- (ఎస్సీ/ఎస్టీ, మహిళ అభ్యర్థులకు ఫీజు లేదు)
- ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా. నాన్ ఏవీఎస్‌ఈసీ అభ్యర్థులకు ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ (పీఈటీ) నిర్వహిస్తారు.
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- ఇంటర్వ్యూతేదీలు: జూన్ 28, 30 & జూలై 5, 7
- వెబ్‌సైట్: www.airportsindia.org.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
టీఎంసీలో ఫెలోషిప్,

అటామిక్ ఎనర్జీ డిపార్ట్‌మెంట్ పరిధిలోని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) విశాఖపట్నంలోని సెంటర్ కోసం కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

- పోస్టు: టీఎంసీ ఫెలోషిప్
- కాలపరిమితి: ఏడాది
- విభాగాలు: గైనిక్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, హెడ్ &నెక్ ఆంకాలజీ, ప్లాస్టిక్ సర్జరి, అనెస్థీషియా, మెడికల్ ఆంకాలజీ, పాథాలజీ, రేడియో-డయాగ్నసిస్, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్, న్యూక్లియర్ మెడిసిన్.
- ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
- ఇంటర్వ్యూ తేదీలు: జూలై 2, విశాఖపట్నంలోని టీఎంసీలో
- వెబ్‌సైట్: http://tmc.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీఈసీఆర్‌ఐలో ప్రాజెక్ట్ అసిస్టెంట్లు,
తమిళనాడు(కరైకుడి)లోని సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఈసీఆర్‌ఐ) ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

- మొత్తం ఖాళీలు: 7 (ప్రాజెక్ట్ అసిస్టెంట్-6, జేఆర్‌ఎఫ్-1) 
- అర్హత: ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ), డిప్లొమా (మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్), ఎంటెక్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
- ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- చిరునామా: Central Electrochemical Research Institute, Karaikudi
- ఇంటర్వ్యూ తేదీ: జూలై 5
- వెబ్‌సైట్: www.cecri.res.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బీఈసీఐఎల్‌లో ఉద్యోగాలు.
న్యూఢిల్లీలోని బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. 

- మొత్తం పోస్టులు: 15
- పోస్టుల వారీగా: అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్-1, డాటా అనలిస్ట్-1, సైబర్ క్రైమ్ త్రెట్ ఇంటెలిజెన్స్ ప్రొఫెషనల్స్-2, బిజినెస్/రిసెర్చ్ అనలిస్ట్-6, సొల్యూషన్ ఆర్కిటెక్ట్-2, ప్రోగ్రామ్ మేనేజర్-2, లీగల్ అసిస్టెంట్-1 
- ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- చివరితేదీ: జూలై 5
- వెబ్ సైట్: www.becil.com.

No comments:

Post a Comment