Monday, 17 June 2019

ఐసీఎఫ్‌లో అప్రెంటిస్‌లు, అగ్రికల్చర్ పాలిటెక్ని క్‌లో ప్రవేశాలు, హోంసైన్స్ కాలేజీలో బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ ప్రవేశాలు, ఆర్‌సీఎఫ్‌ఎల్‌లో ఇంజినీర్లు ఉద్యోగాలు, నీరీలో ఉద్యోగాలు.

ఐసీఎఫ్‌లో అప్రెంటిస్‌లు,
చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్‌ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచిదరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Integral-Coach-factory
-ట్రేడ్ అప్రెంటిస్‌లు
-మొత్తం ఖాళీల సంఖ్య: 992
-విభాగాలవారీగా ఖాళీలు: కార్పెంటర్-80, ఎలక్ట్రీషియన్-200, ఫిట్టర్-260, పెయింటర్-80, వెల్డర్-290, పాసా-2
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి సైన్స్/మ్యాథ్స్ సబ్జెక్టులతో 10+2 లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. సంబంధిత బ్రాంచీలో ఐటీఐ ట్రేడ్‌లో సర్టిఫికెట్ ఉండాలి.
-వయస్సు: 2019 అక్టోబర్ 1 నాటికి 15 ఏండ్ల నుంచి 24 ఏండ్ల మధ్య ఉండాలి.
-స్టయిఫండ్ : మొదటి ఏడాదికి రూ. 5700/-, రెండో ఏడాదికి రూ. 6500/- చెల్లిస్తారు.
-ఎంపిక: అకడమిక్ మార్కులు/ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 24
-వెబ్‌సైట్: www.icf.indianrailways.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
అగ్రికల్చర్ పాలిటెక్ని క్‌లో ప్రవేశాలు,
రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ 2019-20 విద్యా సంవత్సరానికి రెండేండ్ల/ మూడేండ్ల డిప్లొమా ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
jya-shanker-coll
-మొత్తం సీట్ల సంఖ్య: 880 (వ్యవసాయం-620, విత్తన సాంకేతిక పరిజ్ఞానం-80, సేంద్రీయ వ్యవసాయం-60, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్-110)
-అర్హత: పదోతరగతి/తత్సమాన పరీక్షలో కనీసం 5.0 గ్రేడ్ పాయింట్ (హిందీతో కలిపి)తో ఉత్తీర్ణులైనవారు అర్హులు. పదోతరగతి కంపార్ట్‌మెంట్/ ఇంటర్ ఫెయిలైన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ పాసైనవారు, దానికంటే పై చదువులు చదివిన అభ్యర్థులు అర్హులుకారు. పదోతరగతిలోపు ఏదైనా నాలుగేండ్లపాటు గ్రామీణ ప్రాంతాల్లో (నాన్ మున్సిపల్ పరిధి) చదివిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
-వయస్సు: 2019 డిసెంబర్ 31 నాటికి 15 నుంచి 22 ఏండ్ల మధ్య ఉండాలి.
-అప్లికేషన్ ఫీజు: జనరల్/బీసీలు రూ.1100/- ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీలు రూ. 600/-చెల్లించాలి.
-ఎంపిక: పదోతరగతి మార్కుల ఆధారంగా 
-కోర్సు కాలపరిమితి: వ్యవసాయం, విత్తన సాంకేతిక పరిజ్ఞానం/ సేంద్రీయ వ్యవసాయం- రెండేండ్లు. అగ్రికల్చరల్ ఇంజినీరింగ్-మూడేండ్లు 
-కోర్సు ఫీజు: రూ. 12,700/-, (ప్రైవేట్ పాలిటెక్నిక్‌లో రూ. 17,200/-) చెల్లించాలి.
ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్‌ల సీట్ల వివరాలు
-నాగర్‌కర్నూల్ (పాలెం), జగిత్యాల (పొలాస), నల్లగొండ (కంపాసాగర్), సంగారెడ్డి(బసంతపూర్), ఖమ్మం(మధిర), సంగారెడ్డి (జోగిపేట), సిద్దిపేట (తోర్నాల), కరీంనగర్ (జమ్మికుంట), కామారెడ్డి(మాల్‌తుమ్మెద), నిజామాబాద్ (రుద్రూరు), హైదరాబాద్ (రాజేంద్రనగర్) వీటితోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది ప్రైవేట్ పాలిటెక్నిక్‌లలో ఈ కోర్సును నిర్వహిస్తున్నాయి.
-వ్యవసాయం, విత్తన సాంకేతిక పరిజ్ఞానం, సేంద్రీయ వ్యవసాయం కోర్సుల్లో ప్రతి ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో 20 సీట్లు, ప్రైవేట్ పాలిటెక్నిక్‌లలో 60 సీట్లు ఉన్నాయి. అగ్రికల్చర్ ఇంజినీరింగ్‌లో ప్రతి ప్రైవేట్ పాలిటెక్నిక్‌లలో 30 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జూలై 4
-వెబ్‌సైట్: www.pjtsau.ac.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
హోంసైన్స్ కాలేజీలో బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ ప్రవేశాలు,
రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ 2019-20 ఇయర్‌కిగాను యూనివర్సిటీ సైఫాబాద్ హోంసైన్స్ కాలేజీలో నాలుగేండ్ల బీఎస్సీ (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్ కోర్సులో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.

-కోర్సు పేరు: బీఎస్సీ (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్ 
-కాలేజ్ ఆఫ్ హోంసైన్స్ సైఫాబాద్, హైదరాబాద్‌లో క్లాసులు జరుగుతాయి. ఈ కోర్సు చేయడానికి బాలికలు మాత్రమే అర్హులు.
-మొత్తం సీట్ల సంఖ్య: 60
-అర్హత: బైపీసీ, ఎంపీసీ, ఎంబైపీసీ సబ్జెక్టులతో రెండేండ్ల వ్యవధిగల ఇంటర్/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. మూడేండ్ల డిప్లొమా కోర్సు (హోమ్‌సైన్స్)లో సర్టిఫికెట్ ఉన్నవారికి సూపర్‌న్యూమరీకోటాలో 10 శాతం సీట్లను కేటాయిస్తారు. 
-వయస్సు: 2019 డిసెంబర్ 31 నాటికి 17 నుంచి 22 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 25 ఏండ్లు, పీహెచ్‌సీలకు 27 ఏండ్ల వరకు సడలింపు ఉంటుంది 
-అప్లికేషన్ ఫీజు: రూ.1800/- (ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు రూ. 900/-)
-ఎంపిక: ఇంటర్/డిప్లొమాలోని ఆప్షనల్ సబ్జెక్టు లోని వచ్చిన మార్కులను ప్రామాణికంగా తీసుకుని మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. 
-నాలుగేండ్ల బీఎస్సీ (ఆనర్స్) కోర్సు ఎంపికలో రిజర్వేషన్లు ప్రభుత్వ ఉత్తర్వులకు లోబడి ఉంటాయి.
-మొత్తం సీట్లలో 40 శాతం గ్రామీణ ప్రాంతాల్లో చదివిన అభ్యర్థులకు కేటాయించారు. నాన్ మున్సిపల్ పరిధిలోని 1 నుంచి 12వ తరగతి వరకు నాలుగేండ్లపాటు చదివి ఉండాలి.
-లోకల్ అభ్యర్థులకు 85 శాతం, నాన్‌లోకల్ అభ్యర్థులకు 15 శాతం సీట్లు భర్తీచేస్తారు.
-కోర్సు ఫీజు: రూ. 36,450/-(కోర్సు తదనంతరం రూ. 14,000/- రిఫండబుల్ ఉంటుంది)
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో 
-దరఖాస్తులకు చివరితేదీ: జూలై 4
-వెబ్‌సైట్: www.pjtsau.ac.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఆర్‌సీఎఫ్‌ఎల్‌లో ఇంజినీర్లు ఉద్యోగాలు,
ముంబైలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఆర్‌సీఎఫ్‌ఎల్) ఖాళీగా ఉన్న ఇంజినీర్, ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
RFCL
-మొత్తం పోస్టులు: 16 (బాయిలర్ ప్రొఫిషియన్సీ ఇంజినీర్-15, సీనియర్ ఆఫీసర్-2)
-అర్హత: బీఈ/బీటెక్ లేదా బీఎస్సీ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత. కంపెనీ సెక్రటరీలో మెంబర్‌గా నమోదై ఉండాలి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 18
-వెబ్‌సైట్: www.rcfltd.com

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నీరీలో ఉద్యోగాలు.

నాగ్‌పూర్‌లోని సీఎస్‌ఐఆర్-నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌ఈఈఆర్‌ఐ) ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

-ప్రాజెక్ట్ అసిస్టెంట్, జేఆర్‌ఎఫ్, ఎస్‌ఆర్‌ఎఫ్
-అర్హత: సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీసీఏ/డిప్లొమా, ఎమ్మెస్సీ, బీఈ/బీటెక్‌ల లేదా ఎంఏతోపాటు నెట్/గేట్ ఉత్తీర్ణత. అనుభవం ఉండాలి.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 30
-వెబ్‌సైట్ : www.neeri.res.in

No comments:

Post a Comment