Friday, 21 June 2019

సీడీఎస్‌ఈ ఎగ్జామ్ (II) -2019, అగ్రికల్చర్ యూనివర్సిటీలో బీటెక్ ప్రవేశాలు, బీఈసీఐఎల్‌లో ఉద్యోగాలు, సీఎల్‌ఆర్‌ఐలో ప్రాజెక్టు అసిస్టెంట్లు ఉద్యోగాలు.

సీడీఎస్‌ఈ ఎగ్జామ్ (II) -2019,
త్రివిధ దళాలైన మిలిటరీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో ఉన్నత ఉద్యోగాలకు నిర్వహించే సీడీఎస్‌ఈ-II, 2019 నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది.


- కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ (సీడీఎస్‌ఈ)ను ప్రతిఏటా రెండుసార్లు యూపీఎస్సీ నిర్వహిస్తుంది.
- మొత్తం ఖాళీలు - 417
- ఇండియన్ మిలిటరీ అకాడమీ (డెహ్రాడూన్) - 100 (వీటిలో ఎన్‌సీసీ సీ సర్టిఫికెట్ అభ్యర్థులకు 13 పోస్టులు కేటాయించారు)
- ఇండియన్ నేవల్ అకాడమీ (ఎజిమల) - 45 (వీటిలో ఎన్‌సీసీ సీ సర్టిఫికెట్ అభ్యర్థులకు 6 పోస్టులు కేటాయించారు)
- ఎయిర్‌ఫోర్స్ అకాడమీ (హైదరాబాద్) - 32
- ఆఫీసర్ ట్రెయినింగ్ అకాడమీ (చెన్నై) - 225 (పురుషులకు మాత్రమే. వీటిలో ఎన్‌సీసీ సీ సర్టిఫికెట్ అభ్యర్థులకు 50 పోస్టులు కేటాయించారు)
- ఆఫీసర్ ట్రెయినింగ్ అకాడమీ (చెన్నై) - 15 (నాన్ టెక్నికల్, మహిళలకు మాత్రమే)

విద్యార్హతలు:
- ఇండియన్ మిలిటరీ అకాడమీ (ఐఎంఏ) అండ్ ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీ: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
- ఇండియన్ నేవల్ అకాడమీ: ఏదైనా బ్రాంచీలో ఇంజినీరింగ్ డిగ్రీ లేదా బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
- ఎయిర్ ఫోర్స్ అకాడమీ: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులు చదివి ఉండాలి లేదా బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
- వయస్సు: 2020, జూలై 1 నాటికి 20 - 24 ఏండ్లు (1996, జూలై 2 నుంచి 2000, జూలై 1 మధ్య జన్మించి ఉండాలి)
- ఐఎంఏ/ఇండియన్ నేవల్ అకాడమీ పోస్టులకు 1996, జూలై 2 నుంచి 2001, జూలై 1 మధ్య జన్మించి ఉండాలి.
- శారీరక ప్రమాణాలు: కనీసం 157.5 సెం.మీ. ( నేవీకి 157 సెం.మీ., ఎయిర్‌ఫోర్స్‌కు 162.5 సెం.మీ., మహిళలు 152 సెం.మీ ఎత్తు ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి)
- ఫిజికల్ కండిషనింగ్: రన్నింగ్ - 15 నిమిషాల్లో 2-4 కి.మీ. పరుగెత్తాలి.
- ఫుష్ అప్స్ - సిట్ అప్స్- కనీసం 20, రోప్ ైక్లెంబింగ్ - 3 - 4 మీటర్లు. చిన్ అప్స్- కనీసం 8.
- ఫీజు: రూ. 200/- , ఎస్సీ/ఎస్టీ, మహిళ అభ్యర్థులకు ఫీజు లేదు.
- ఎంపిక: రాతపరీక్ష + ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ (ఐపీటీ) ద్వారా ఇంటెలిజెన్స్ పర్సనాలిటీ టెస్ట్ (ఐపీటీ)
- ఎస్‌ఎస్‌బీ రెండు దశల్లో ఈ టెస్ట్ నిర్వహిస్తుంది.
- స్టేజ్ -1లో ఆఫీసర్ ఇంటెలిజెన్స్ రేటింగ్ టెస్ట్‌లు ఉంటాయి. వీటిలో పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్క్రిప్షన్ టెస్ట్‌లు ఉంటాయి.
- స్టేజ్ -2లో ఇంటర్వ్యూ, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ టాస్క్స్, సైకాలజీ టెస్ట్‌లు ఉంటాయి.
- మిలిటరీ, నేవల్, ఎయిర్‌ఫోర్స్ అకాడమీల్లో ప్రవేశాల కోసం మొత్తం 300 మార్కుల్లో భాగంగా ఇంగ్లిష్-100, జనరల్‌నాలెడ్జ్-100, ఎలిమెంటరీ మ్యాథ్స్-100 ప్రశ్నలు ఇస్తారు. ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీలో ప్రవేశాల కోసం మొత్తం 200 మార్కుల్లో భాగంగా ఇంగ్లిష్-100, జనరల్‌నాలెడ్జ్-100 నుంచి ప్రశ్నలు ఇస్తారు.

- కాలవ్యవధి - ఒక్కో సబ్జెక్టును 2 గంటల్లో పూర్తిచేయాలి.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- దరకాస్తులకు చివరితేదీ: జూలై 8
- పరీక్షతేదీ: సెప్టెంబర్ 8
- వెబ్‌సైట్: www.upsconline.nic.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
అగ్రికల్చర్ యూనివర్సిటీలో బీటెక్ ప్రవేశాలు,
హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఎంపీసీ స్ట్రీమ్ కింద (రైతుల కోటా) 2019-20కిగాను బీటెక్ కోర్సులో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

- కోర్సు పేరు: బీటెక్ (అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాలజీ)
- మొత్తం సీట్ల సంఖ్య: 36 (అగ్రికల్చర్ ఇంజినీరింగ్-18, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ -18)
- కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్, కంది (సంగారెడ్డి), కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ & టెక్నాలజీ రుద్రూర్ (నిజమాబాద్ జిల్లా) కాలేజీలు బీటెక్ కోర్సును అందిస్తున్నాయి.
- అర్హత: ఇంటర్ (మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్) ఉత్తీర్ణత. అభ్యర్థి నాన్ మున్సిపల్ ప్రాంతంలో 1 నుంచి ఇంటర్ వరకు కనీసం నాలుగేండ్లు చదవాలి. తల్లిదండ్రుల పేరిట తప్పనిసరిగా కనీసం ఎకరం భూమిని కలిగి ఉండాలి.
- వయస్సు: 2019 డిసెంబర్ 31 నాటికి 17 నుంచి 22 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 25 ఏండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు 27 ఏండ్ల వరకు సడలింపు ఉంటుంది.
- అప్లికేషన్ ఫీజు: జనరల్/బీసీలు రూ.1800/-, ఎస్సీ/ఎస్టీ/ పీహెచ్‌సీలకు రూ. 900/-
- ఎంపిక: ఎంసెట్ -2019 ర్యాంక్ ఆధారంగా.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- దరఖాస్తులకు చివరితేదీ: జూలై 12
- వెబ్‌సైట్: www.pjtsau.ac.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బీఈసీఐఎల్‌లో ఉద్యోగాలు,
నోయిడాలోని బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్)లో కాంట్రాక్టు ప్రాతిపదికన స్కిల్డ్ &అన్‌స్కిల్డ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

- మొత్తం పోస్టులు: 1100 (స్కిల్డ్ -400, అన్‌స్కిల్డ్-700)
- అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి స్కిల్డ్ పోస్టులకు ఎలక్ట్రికల్/వైర్‌మ్యాన్ ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో రెండేండ్ల అనుభవం ఉండాలి. అన్ స్కిల్డ్ పోస్టులకు ఎనిమిదో తరగతితోపాటు సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం ఉండాలి.
- ఫీజు: రూ. 500/- (ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీలకు రూ. 250/-)
- ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- చివరితేదీ: జూన్ 24
- వెబ్‌సైట్: www.becil.com

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీఎల్‌ఆర్‌ఐలో ప్రాజెక్టు అసిస్టెంట్లు ఉద్యోగాలు.
చెన్నైలోని సెంట్రల్ లెదర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎల్‌ఆర్‌ఐ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రాజెక్టు అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

- మొత్తం పోస్టులు: 28
- పోస్టులు: ప్రాజెక్టు అసిస్టెంట్ (గ్రేడ్1, గ్రేడ్2, గ్రేడ్3), జేఆర్‌ఎఫ్. ఎస్‌ఆర్‌ఎఫ్, రిసెర్చ్ అసోసియేట్.
- అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ/మాస్టర్ డిగ్రీ, ఎంఫార్మసీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత.
- ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- ఇంటర్వ్యూతేదీ: జూన్ 21
- వెబ్‌సైట్: www.clri.org


No comments:

Post a Comment