Friday, 21 June 2019

నేవీలో 2700 సెయిలర్ ఉద్యోగాలు, ఎన్‌ఐఆర్‌ఆర్‌హెచ్‌లో ఉద్యోగాలు, ఎస్‌బీఐలో జేఎస్ మేనేజర్లు ఉద్యోగాలు, ఐఎంఎస్‌లో ఉద్యోగాలు, టొబాకో బోర్డులో ఉద్యోగాలు.

నేవీలో 2700 సెయిలర్ ఉద్యోగాలు,
కేంద్ర రక్షణశాఖ పరిధిలోని ఇండియన్ నేవీ సెయిలర్ పోస్టుల భర్తీకి నిర్వహించే ఏఏ & ఎస్‌ఎస్‌ఆర్ -ఫిబ్రవరి/2020 బ్యాచ్‌లో ప్రవేశాల కోసం అర్హత గల అవివాహిత పురుషుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

- ఏఏ &ఎస్‌ఎస్‌ఆర్-ఫిబ్రవరి 2020 బ్యాచ్
- మొత్తం పోస్టుల సంఖ్య: 2700 (ఆర్టిఫైజర్ అప్రెంటిస్ (ఏఏ)-500, సీనియర్ సెకండరీ రిక్రూట్స్ (ఎస్‌ఎస్‌ఆర్)-2200)
- విద్యార్హతలు: ఇంటర్/10+2 లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. ఇంటర్ స్థాయిలో మ్యాథ్స్, ఫిజిక్స్‌తోపాటు కెమిస్ట్రీ/బయాలజీ లేదా కంప్యూటర్ సైన్స్‌లలో ఏదో ఒక సబ్జెక్టు చదివి ఉండాలి.
- వయస్సు: 2000 ఫిబ్రవరి 1 నుంచి 2003 జనవరి 31 మధ్య జన్మించి ఉండాలి.
- పే & అలవెన్సులు: శిక్షణలో నెలకు రూ. 14,600/- ఇస్తారు. ట్రెయినింగ్ పూర్తయిన తర్వాత రూ. 21,700 - 69,100 + ఎంఎస్‌పీ రూ. 5,200/- + ఎక్స్ గ్రూప్ పే రూ. 6200/-+ డీఏ ఇస్తారు.
- పదోన్నతులు: సెయిలర్ నుంచి మాస్టర్ చీఫ్ పెట్టీ ఆఫీసర్ - 1 (సుబేదార్‌కు సమాన స్థాయి) వరకు ఉంటుంది.
- ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ద్వారా
- రాతపరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఈ పరీక్షలో ఇంగ్లిష్, సైన్స్, మ్యాథ్స్, జనరల్ నాలెడ్జ్‌పై ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు.
- ప్రశ్నపత్రం ఇంటర్ స్థాయిలో ఉంటుంది. పరీక్ష కాలవ్యవధి 60 నిమిషాలు
- ప్రతి తప్పు సమాధానానికి 0.25 లేదా 1/4 మార్కులను తగ్గిస్తారు. అభ్యర్థులు ప్రతి సెక్షన్‌లో తప్పనిసరిగా క్వాలిఫై కావాలి.


ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (పీఎఫ్‌టీ):
- 7 నిమిషాల్లో 1.6 కి.మీ దూరాన్ని పరుగెత్తాలి. 20 ఉతక్, బైఠక్ (గుంజీలు), 10 పుష్ అప్స్ చేయాలి.
- శారీరక ప్రమాణాలు: 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు, ఛాతీ ఉండాలి. గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ వ్యాకోచించాలి.
- శిక్షణ: 2020 ఫిబ్రవరిలో ఆర్టిఫైజర్ అప్రెంటిస్ (ఏఏ)లకు 9 వారాల పాటు బేసిక్ ట్రెయినింగ్ & సీనియర్ సెకండరీ రిక్రూట్స్ (ఎస్‌ఎస్‌ఆర్)లకు 22 వారాల పాటు బేసిక్ ట్రెయినింగ్‌ను ఐఎన్‌ఎస్ చిల్కాలో ఇస్తారు. దీనితోపాటు ప్రొఫెషనల్ ట్రెయినింగ్‌ను నేవల్ ట్రెయినింగ్ కేంద్రా ల్లో ఇస్తారు.
- శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకున్న వారికి ఏఏలకు 20 ఏండ్లు, ఎస్‌ఎస్‌ఆర్‌లకు 15 ఏండ్లు కాలపరిమితికి నియామక ఉత్తర్వులు ఇస్తారు.
- అప్లికేషన్ ఫీజు: 205/- (ఎస్సీ/ఎస్టీలకు ఫీజులో మినహాయింపు ఉంటుంది)
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- రిజిస్ట్రేషన్ ప్రారంభం: జూన్ 28
- చివరితేదీ: జూలై 10
- వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఐఆర్‌ఆర్‌హెచ్‌లో ఉద్యోగాలు,
ఐసీఎంఆర్- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రిసెర్చ్ ఇన్ రిప్రొడక్టివ్ హెల్త్ (ఎన్‌ఐఆర్‌ఆర్‌హెచ్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది.

- మొత్తం ఖాళీలు: 11 (అసిస్టెంట్-5, పర్సనల్ అసిస్టెంట్-1, లోయర్ డివిజన్ క్లర్క్-5)
- అర్హతలు : ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎల్‌డీసీ పోస్టులకు ఇంటర్‌తోపాటు ఇంగ్లిష్/హిందీలో టైపింగ్ సామర్థ్యం ఉండాలి. 
- వయస్సు: 27 ఏండ్లకు మించరాదు. (అసిస్టెంట్‌కు 30/40 ఏండ్లు)
- పే స్కేల్: ఎల్‌డీసీ పోస్టులకు రూ. 19,900-63,200, మిగతా పోస్టులకు రూ. 35,400-1,12,400/-
- ఎంపిక: రాతపరీక్ష ద్వారా
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: జూలై 2
- పరీక్షతేదీ: జూలై 26
- వెబ్‌సైట్: www.nirrh.res.in 

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎస్‌బీఐలో జేఎస్ మేనేజర్లు ఉద్యోగాలు,
ఎస్‌బీఐ పేమెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో జోనల్ సేల్స్ మేనేజర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

- పోస్టు: జోనల్ సేల్స్ మేనేజర్
- అర్హతలు: డిగ్రీ/పీజీ ఉత్తీర్ణులు.
- అనుభవం: సంబంధిత రంగంలో కనీసం నాలుగేండ్ల అనుభవం ఉండాలి.
- ఖాళీలు ఉన్న ప్రదేశాలు: సికింద్రాబాద్, నిజామాబాద్, నల్లగొండ, వరంగల్
- దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
- చివరితేదీ: జూన్ 26
- వెబ్‌సైట్: www.sbipspl.com


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఎంఎస్‌లో ఉద్యోగాలు,
చెన్నైలోని ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ (ఐఎంఎస్)లో ప్రాజెక్టు పొజిషన్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

- పోస్టు: ప్రాజెక్టు పొజిషన్
- మొత్తం ఖాళీలు: 10
- ఈ పోస్టులను పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తారు. అర్హతలు, ఎంపిక వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
- వెబ్‌సైట్: www.imsc.res.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
టొబాకో బోర్డులో ఉద్యోగాలు.

గుంటూరులోని టొబాకో బోర్డులో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

- మొత్తం ఖాళీలు: 41 (ఫీల్డ్ ఆఫీసర్/టెక్నికల్ అసిస్టెంట్-25, అకౌంటెంట్/సూపరింటెండెంట్-16)
- అర్హత:ఫీల్డ్ ఆఫీసర్ పోస్టులకు బీఎస్సీ(అగ్రికల్చర్), అకౌంటెంట్ పోస్టులకు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. ట్యాలీ అకౌంట్స్ సాఫ్ట్‌వేర్‌లో డిప్లొమా/సర్టిఫికెట్ ఉండాలి.
- పే స్కేల్: రూ.9,300-34,800 +గ్రేడ్ పే రూ.4200/- 
- అప్లికేషన్ ఫీజు : రూ. 500 + జీఎస్‌టీ
- ఎంపిక: రాతపరీక్ష ద్వారా
- ఫీల్డ్ ఆఫీసర్ పోస్టులకు రాతపరీక్షలో భాగంగా నాలెడ్జ్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్-60, జనరల్ నాలెడ్జ్-20, జనరల్ ఇంగ్లిష్-20 ప్రశ్నల చొప్పున మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు.
- అకౌంటెంట్ పోస్టులకు రాతపరీక్షలో భాగంగా రీజనింగ్ ఎబిలిటీ-25, జనరల్ అవేర్‌నెస్/నాలెడ్జ్ ఆఫ్ అకౌంటింగ్ ప్రిన్స్‌పుల్స్-50, ఇంగ్లిష్ లాంగ్వేజ్-25, న్యూమరికల్ ఎబిలిటీ-25, ఆఫీస్ వర్క్ ఆప్టిట్యూడ్-25 విభాగాల నుంచి మొత్తం 150 ప్రశ్నలు ఇస్తారు.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: జూలై 15
- వెబ్‌సైట్:www.indiantobacco.com

1 comment: