Monday, 10 June 2019

మెకాన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు, మనూలో ఉద్యోగాలు, 10 + 2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ నోటిఫికేషన్, స్పోర్ట్స్ న్యూట్రిషన్‌లో ఎమ్మెస్సీ ప్రవేశాలు, ఐఐపీఈలో బీటెక్ ప్రవేశాలు.

మెకాన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు,

భారత ఉక్కు మంత్రిత్వశాఖకు చెందిన మెకాన్ లిమిటెడ్ (రాంచీ) కాంట్రాక్టు ప్రాతిపదికన ఇంజినీరింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
MECON-Limited
-మొత్తం పోస్టులు-205
-ప్రొఫెషనల్ పోస్టులు: ఎగ్జిక్యూటివ్, అకౌంటెంట్, జూనియర్ ఎగ్జిక్యూటివ్, సేఫ్టీ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రాజెక్టు ఇంజినీర్, హిందీ ట్రాన్స్‌లేటర్, సేఫ్టీ ఆఫీసర్, ప్రాజెక్టు ఇంజినీర్, జూనియర్ ఇంజినీర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ తదితర పోస్టులు ఉన్నాయి.
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బీఈ/బీటెక్, బీఎస్సీ ఇంజినీరింగ్, ఎంబీఏ/పీజీడీఎం, బీఆర్క్, మాస్టర్ డిగ్రీ, బీకాం, ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-అప్లికేషన్ ఫీజు: రూ. 1000/-
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 20
-వెబ్‌సైట్: www.meconlimited.co.in

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
మనూలో ఉద్యోగాలు,

దరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

-మొత్తం పోస్టులు: 95
-విభాగాలవారీగా పోస్టులు..
-ప్రొఫెసర్- 17, అసోసియేట్ ప్రొఫెసర్-30, హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ (పాలిటెక్నిక్)-12, అసిస్టెంట్ ప్రొఫెసర్-17, లెక్చరర్ (పాలిటెక్నిక్)-19
-అర్హత: యూనివిన్సటీ నిబంధనల ప్రకారం
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ 
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జూలై 8
-వెబ్‌సైట్: www.manuu.ac.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
10 + 2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ నోటిఫికేషన్,
ఇండియన్ నేవీ 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీం (పర్మినెంట్ కమిషన్ ) కింద నాలుగేండ్ల బీటెక్ కోర్సు చేయడానికి అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి ఎజిమల (కేరళ)లోని ఇండియన్ నేవల్ అకాడమీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
insian-sailors
-కోర్సు పేరు: 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీం
-వయస్సు: 2000, జూలై 2 నుంచి 2003, జనవరి1 మధ్య జన్మించి ఉండాలి.
-విద్యార్హతలు: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో కనీసం 70 శాతం మార్కులతో ఇంటర్ లేదా 10+2 పరీక్ష ఉత్తీర్ణత. ఇంగ్లిష్ (ఎస్‌స్‌సీ/ఇంటర్‌స్థాయి)లో కనీసం 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి. జేఈఈ మెయిన్ -2019 ఎగ్జామ్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.
-శారీరక ప్రమాణాలు: ఎత్తు - కనీసం 157 సెం.మీ., ఎత్తుకు తగ్గ బరువు & ఇండియన్ నేవీ నిర్దేశించిన కంటి చూపు, ఇతర వైద్య ప్రమాణాలు ఉండాలి.
-ఎంపిక: జేఈఈ మెయిన్-2019 ఆల్ ఇండియా ర్యాంక్ ఆధారంగా సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తుంది. అనంతరం ఎస్‌ఎస్‌బీ బోర్డు ఆగస్టు-అక్టోబర్ మధ్య బెంగళూరు, భోపాల్, కోయంబత్తూర్, వైజాగ్‌లలో ఏదో ఒకచోట ఇంటర్వ్యూలను మొత్తం 5 రోజులపాటు ఇంటర్వ్యూ రెండు దశల్లో కొనసాగిస్తుంది.
-స్టేజ్ -1లో ఇంటెలిజెన్స్ టెస్ట్, పిక్చర్ ప్రిసిప్షన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ ఉంటాయి. వీటిలో అర్హత సాధించిన వారిని స్టేజ్ - 2కు ఎంపిక చేస్తారు.
-స్టేజ్ - 2లో సైకలాజికల్ టెస్టింగ్, గ్రూప్ టెస్టింగ్, ఇంటర్వ్యూ
-ఆల్ ఇండియా మెరిట్ ప్రకారం ఎంపికైన అభ్యర్థులను కేరళ ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో బీటెక్‌లో ప్రవేశం కల్పిస్తారు. కోర్సు పూర్తయిన తర్వాత జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) బీటెక్ సర్టిఫికెట్‌ను ప్రదానం చేస్తుంది.
-పేస్కేల్ : సబ్ లెఫ్టినెంట్ హోదాలో నెలకు సుమారుగా రూ. 83,448-96,204/-జీతం చెల్లిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూన్ 17
-వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
స్పోర్ట్స్ న్యూట్రిషన్‌లో ఎమ్మెస్సీ ప్రవేశాలు,

హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఎన్) 2019-21 విద్యాసంవత్సరానికిగాను స్పోర్ట్స్ న్యూట్రిషన్‌లో ఎమ్మెస్సీ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
NIN-logo
-రెండేండ్ల ఎమ్మెస్సీ (స్పోర్ట్స్ న్యూట్రిషన్)
-మొత్తం సీట్ల సంఖ్య: 15
-అర్హత: హోం సైన్సెస్ (ఫుడ్ &న్యూట్రిషన్, న్యూట్రిషన్, అప్లయిడ్ న్యూట్రిషన్ & పబ్లిక్ హెల్త్, క్లినికల్ న్యూట్రిషన్ & డైటిటిక్స్, ఫుడ్ సైన్స్ & క్వాలిటీ కంట్రోల్) లేదా లైఫ్ సైన్సెస్ (బాటనీ, జువాలజీ, జెనెటిక్స్, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ)లో బీఎస్సీ, ఎంబీబీఎస్, బీఏఎంఎస్/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
-అప్లికేషన్ ఫీజు: రూ.3000/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 2700/-
-ఎంపిక: ఎంట్రెన్స్ టెస్ట్ ఆధారంగా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో. 
-దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 28
-రాతపరీక్ష తేదీ: జూలై 14
-వెబ్‌సైట్: www.nin.res.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐపీఈలో బీటెక్ ప్రవేశాలు.

విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ) 2019-20 విద్యా సంవత్సరానికిగాను నాలుగేండ్ల బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
IIPE
-కోర్సు పేరు: బీటెక్ 
-మొత్తం సీట్ల సంఖ్య: 100 (పెట్రోలియం ఇంజినీరింగ్-50, కెమికల్ ఇంజినీరింగ్-50)
-ఈ కోర్సును మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ ఆధ్వర్యంలో ఐఐటీ/ఐఐఎం పర్యవేక్షణలో నిర్వహిస్తారు.
-అర్హత: ఇంటర్‌తోపాటు జేఈఈ అడ్వాన్స్‌డ్-2019 ర్యాంక్ సాధించాలి.
-అప్లికేషన్ ఫీజు: జనరల్/ఓబీసీ రూ. 1000/-, ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీ అభ్యర్థులకు రూ. 500/-
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: జూన్ 13 నుంచి 
-వెబ్‌సైట్: www.iipe.ac.in

No comments:

Post a comment