Monday, 10 June 2019

వరంగల్ నిట్‌లో 135 ఉద్యోగాలు, బెల్‌లో కాంట్రాక్టు ఇంజినీర్లు ఉద్యోగాలు, ఎన్‌ఐటీఐఈలో ఫ్యాకల్టీలు, ఆర్‌ఐఈలో ఇంటర్వ్యూలు, బీడిజైన్‌లో ప్రవేశాలు.

వరంగల్ నిట్‌లో 135 ఉద్యోగాలు,

వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
nit-warngal
-మొత్తం ఖాళీలు: 135
-పోస్టులు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, గ్రేడ్-1 అసిస్టెంట్ ప్రొఫెసర్, గ్రేడ్-2 అసిస్టెంట్ ప్రొఫెసర్ (6వ సీపీసీలో ఏజీపీ-7,000), గ్రేడ్-2 అసిస్టెంట్ ప్రొఫెసర్ (6వ సీపీసీలో ఏజీపీ-6,000)
-విభాగాల వారీగా ఖాళీలు: సివిల్ ఇంజినీరింగ్-18, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్-11, మెకానికల్-16, ఈసీఈ-14, మెటలర్జికల్ & మెటీరియల్స్ ఇంజినీరింగ్-8, కెమికల్ ఇంజినీరింగ్-10, కంప్యూటర్ సైన్స్&ఇంజినీరింగ్-25, బయోటెక్నాలజీ-10, మ్యాథమెటిక్స్-8, ఫిజిక్స్-5, కెమిస్ట్రీ-3, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్-4, హ్యుమానిటీస్&సోషల్ సైన్సెస్-2, ట్రెయినింగ్&ప్లేస్‌మెంట్-1 పోస్టు ఉన్నాయి.
-అర్హతలు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు కనీస అర్హత ప్రథమశ్రేణిలో బీఈ/బీటెక్, ఎంటెక్/ఎంఈతోపాటు సంబంధిత బ్రాంచీలో పీహెచ్‌డీ ఉండాలి. ఆయా పోస్టును బట్టి అనుభవం తదితరాలను పరిగణనలోకి తీసుకుంటారు. మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్ తదితర సబ్జెక్టులకు ప్రథమశ్రేణిలో బీఏ/బీఎస్సీ/బీకాంతోపాటు ప్రథమశ్రేణిలో సంబంధిత సబ్జెక్టులో పీజీ, పీహెచ్‌డీ చేసి ఉండాలి.
-జీతభత్యాలు: ప్రొఫెసర్-రూ. 1,59,100, అసోసియేట్ ప్రొఫెసర్-రూ. 1,39,600, గ్రేడ్-1 అసిస్టెంట్ ప్రొఫెసర్-రూ. 1,01,500/-, గ్రేడ్-2 అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఏజీపీ 7000)-రూ. 73,000/-, గ్రేడ్-2 అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఏజీపీ 6,000)- రూ. 70,900/-
-నోట్: 2/2018 నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్నవారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే వారు తమ సమాచారాన్ని ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌డేట్ చేసుకోవాలి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూలై 5
-హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేదీ: జూలై 5
-వెబ్‌సైట్: https://www.nitw.ac.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బెల్‌లో కాంట్రాక్టు ఇంజినీర్లు ఉద్యోగాలు,

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్)లో కాంట్రాక్టు ఇంజినీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
bel
-పోస్టు: కాంట్రాక్టు ఇంజినీర్
-మొత్తం ఖాళీలు-19
-విభాగాల వారీగా ఖాళీలు అర్హతలు:
-సివిల్-12, ఎలక్ట్రికల్-6, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్-1
-అర్హతలు: బీఈ/బీటెక్‌లో సంబంధిత బ్రాంచీలో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలు అయితే ఉత్తీర్ణులు అయితే సరిపోతుంది.
-అనుభవం: 2019, జూన్ 1 నాటికి కనీస అనుభవం ఏడాది ఉండాలి.
-పనిచేయాల్సిన ప్రదేశం: బెంగళూరు, కొచ్చి, గోవా, అరక్కోణం, వైజాగ్, ముంబై, పోర్ట్‌బ్లెయిర్.
-వయస్సు: 2019, జూన్ 1 నాటికి 26 ఏండ్లు మించరాదు. ఓబీసీలకు మూడేండ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-జీతం: నెలకు రూ.23,000/-
-కాంట్రాక్టు కాలవ్యవధి: ఏడాది. అవసరాన్ని బట్టి మరికొంత కాలం పెంచవచ్చు.
-ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ (జూన్ 15)
-రాతపరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించే ప్రదేశం: బెల్, సెంటర్ ఫర్ లెర్నింగ్&డెవలప్‌మెంట్, జలహళ్లి (ఈస్ట్), బెంగళూరు.
-వెబ్‌సైట్: http://www.bel-india.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఐటీఐఈలో ఫ్యాకల్టీలు,
ముంబైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ (ఎన్‌ఐటీఐఈ)లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
nitie
-పోస్టు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్
-విభాగాలు: ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్, ఇంజినీరింగ్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్, ఆపరేషన్స్ అండ్ సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్, ప్రాజెక్టు మేనేజ్‌మెంట్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అకౌంటింగ్&ఫైనాన్స్, మార్కెటింగ్ మేనేజ్‌మెంట్, ఎకనామిక్స్ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్, ఆర్గనైజేషనల్ బిహేవియర్ అండ్ హెచ్‌ఆర్ మేనేజ్‌మెంట్.
-అర్హతలు, ఎంపిక, జీతభత్యాలు తదితరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
-వెబ్‌సైట్: www.nitie.ac.in


---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఆర్‌ఐఈలో ఇంటర్వ్యూలు,

మైసూర్‌లోని రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఆర్‌ఐఈ)లో ఫ్యాకల్టీ, ల్యాబ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 
rie--2
పోస్టులు: 
-ప్రొఫెసర్: ఫిజిక్స్-1, కెమిస్ట్రీ-1
-అసిస్టెంట్ ప్రొఫెసర్: ఫిజిక్స్-3, మ్యాథ్స్-2, కెమిస్ట్రీ-3, బాటనీ-1, పెడగాగీ ఆఫ్ ఇంగ్లిష్-1, పెడగాగీ ఆఫ్ మ్యాథ్స్-1, కౌన్సెలింగ్ సైకాలజీ/స్పెషల్ ఎడ్యుకేషన్-1, సైన్స్-2, హెల్త్/ఫిజికల్ ఎడ్యుకేషన్-1, ఇంగ్లిష్-2, జాగ్రఫీ-1, హిస్టరీ-1 ఉన్నాయి.
-డబ్ల్యూఈటీ కంప్యూటర్ సైన్స్-1, ప్రొఫెషనల్ అసిస్టెంట్ (లైబ్రేరీ)-1, ల్యాబొరేటరీ అసిస్టెంట్ (ఫిజిక్స్-1, బాటనీ-1, సైకాలజీ-1) ఉన్నాయి.
-ఎంపిక: జూన్ 13 నుంచి 15 మధ్య నిర్వహించే ఇంటర్వ్యూల ఆధారంగా
-అర్హతలు, వయస్సు, జీతభత్యాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
-వెబ్‌సైట్: www.riemysore.ac.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బీడిజైన్‌లో ప్రవేశాలు.

ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ (డీటీయూ) బీడిజైన్ కోర్సులో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.
deltech
-పోస్టు: బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ప్రొగ్రామ్ (బీడిజైన్) (నాలుగేండ్లు)
-అర్హత: ఇంటర్ (సైన్స్, కామర్స్, ఆర్ట్స్&హ్యుమానిటీస్) ఉత్తీర్ణత.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో జూన్ 8 నుంచి
-చివరితేదీ: జూన్ 30
-వెబ్‌సైట్: www.dtu.ac.in

No comments:

Post a Comment