Friday, 19 July 2019

బెల్‌లో అప్రెంటిస్‌లు, అగ్రికల్చర్‌వర్సిటీలో ప్రవేశాలు, సంతూర్ విమెన్స్ స్కాలర్‌షిప్స్, బీసీసీఎల్ నర్సింగ్‌లో డిప్లొమా కోర్సు ప్రవేశాలు.

బెల్‌లో అప్రెంటిస్‌లు,
ఘజియాబాద్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) ట్రేడ్ అప్రెంటిస్‌ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.


- కోర్సు: ట్రేడ్ అప్రెంటిస్
- మొత్తం ఖాళీలు: 100
- విభాగాల వారీగా ఖాళీలు: మెకానికల్-29, కంప్యూటర్ సైన్స్-15, మోడ్రన్ ఆఫీస్ మేనేజ్‌మెంట్ & సెక్రటేరియల్ ప్రాక్టీస్-10, ఎలక్ట్రానిక్స్-32, ఎలక్ట్రికల్-8, సివిల్-6
- అర్హతలు: సంబంధిత ఇంజినీరింగ్ విభాగాల్లో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత.
- వయస్సు: 2019 జూన్ 30 నాటికి 28 ఏండ్లు మించరాదు.
- స్టయిఫండ్: నెలకు రూ. 10,400/-
- ఎంపిక: రాతపరీక్ష ద్వారా
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: జూలై 21
- వెబ్‌సైట్: www.mhrdnats.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
అగ్రికల్చర్‌వర్సిటీలో ప్రవేశాలు,
రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ 2019-20 విద్యా సంవత్సరానికి వివిధ పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

- ఎమ్మెస్సీ (అగ్రికల్చర్)-95 సీట్లు (రాజేంద్రనగర్‌లో 84, జగిత్యాల క్యాంపస్‌లో 11)
- విభాగాలు: క్రాప్ ఫిజియాలజీ, జెనెటిక్స్ & ప్లాంట్ బ్రీడింగ్, ప్లాంట్ పాథాలజీ, మైక్రోబయాలజీ, సీడ్ సైన్స్ & టెక్నాలజీ, సాయిల్ సైన్స్, ఎంటమాలజీ, ఆగ్రానమీ, ఆగ్రానమీ (వాటర్ మేనేజ్‌మెంట్), అగ్రికల్చరల్ ఎకనామిక్స్, అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్, అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్
- అర్హత: నాలుగేండ్ల బీఎస్సీ (అగ్రికల్చర్), బీఎస్సీ (సీఏ & బీఎం)/బీఎస్సీ (అగ్రికల్చర్) లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
- ఎమ్మెస్సీ (హోమ్ సైన్స్)-17 సీట్లు (హోమ్ సైన్స్ కాలేజ్, సైఫాబాద్ క్యాంపస్‌లో)
- విభాగాలు: ఫుడ్స్ & న్యూట్రిషన్, హ్యుమన్ డెవలప్‌మెంట్ & ఫ్యామిలీ స్టడీస్, ఫ్యామిలీ రిసోర్స్ మేనేజ్‌మెంట్, హోం సైన్స్ ఎక్స్‌టెన్షన్ & కమ్యూనికేషన్ మేనేజ్‌మెంట్
- అర్హత: నాలుగేండ్ల బీఎస్సీ (హోమ్ సైన్స్) బీహెచ్‌ఎస్సీ (రూరల్), బీహెచ్‌ఎస్సీ/బీఎస్సీ (ఆనర్స్) హోమ్ సైన్స్, బీఎస్సీ (ఆనర్స్) ఫుడ్ సైన్స్ & న్యూట్రిషన్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
- ఎంబీఏ (అగ్రిబిజినెస్ మేనేజ్‌మెంట్)-18 సీట్లు (రాజేంద్రనగర్ క్యాంపస్‌లో)
- అర్హత: నాలుగేండ్ల బీఎస్సీ (అగ్రికల్చర్/హార్టికల్చర్), బీఎస్సీ (సీఏ & బీఎం), బీటెక్ (అగ్రికల్చర్ ఇంజినీరింగ్), బీవీఎస్సీ & ఏహెచ్, బీఎఫ్‌ఎస్సీ, బీహెచ్‌ఎస్సీ(రూరల్), బీఎస్సీ (హెచ్‌ఎస్సీ), బీటెక్ (డెయిరింగ్)/ బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ), బీఎస్సీ (ఫుడ్ సైన్స్ & టెక్నాలజీ), బీఎస్సీ (ఆనర్స్) ఫుడ్ సైన్స్ & న్యూట్రిషన్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.

- ఎంటెక్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్- 7 సీట్లు (సంగారెడ్డి, బాపట్ల క్యాంపస్‌లో)
- అర్హత: నాలుగేండ్ల బీటెక్ (అగ్రికల్చర్ ఇంజినీరింగ్), బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ) లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
- ఎంపిక: ఐసీఏఆర్ నిర్వహించే AIEEA PG - 2019 పరీక్ష 
- పీహెచ్‌డీ-38 సీట్లు (అగ్రికల్చర్-29 , హోమ్ సైన్స్-7, అగ్రికల్చర్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ-2)
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబెక్టుల్లో ఎమ్మెస్సీ (అగ్రికల్చర్), ఎంటెక్ (అగ్రికల్చర్ ఇంజినీరింగ్), ఎమ్మెస్సీ (హోమ్ సైన్స్) లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
- ఎంపిక: ఐసీఏఆర్ నిర్వహించే పరీక్ష AICE-JRF / SRF (PGS)-2019)కు 60 శాతం, ఎమ్మెస్సీ లెవల్‌కు 30 శాతం, బీఎస్సీ లెవల్‌కు 10 శాతం వెయిటేజీ ఇచ్చి తుది ఎంపిక చేస్తారు.
- ఫీజు: జనరల్, బీసీలు రూ.1800/- ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీలు రూ. 900/- 
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: జూలై 31
- వెబ్‌సైట్: www.pjtsau.ac.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సంతూర్ విమెన్స్ స్కాలర్‌షిప్స్,
దేశంలోని ప్రముఖ కంపెనీ విప్రో కన్జూమర్ కేర్ (విప్రో కేర్) సంతూర్ విమెన్స్ స్కాలర్‌షిప్ కోసం అర్హత, ఆసక్తి కలిగిన బాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.

- స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 900
- అర్హతలు: ప్రభుత్వ కాలేజీల్లో ఇంటర్ పూర్తిచేసి, 2019-20 విద్యా సంవత్సరంలో ఫుల్‌టైం బ్యాచిలర్ డిగ్రీ కోర్సులో ప్రవేశం పొందినవారు అర్హులు.
- ఆర్థిక ఇబ్బందుల వలన ఇంటర్ తర్వాత ఉన్నత విద్య చదవలేని తెలంగాణ, ఆంధ్రపదేశ్, కర్ణాటక రాష్ర్టాలకు చెందిన బాలికల కోసం విప్రో సంస్థ ఈ స్కాలర్‌షిప్స్‌ను అందజేస్తుంది. 
- స్టయిఫండ్: ఏడాదికి రూ. 24,000/- 
- దరఖాస్తు: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌లో 
- చిరునామా: Wipro Cares-Santoor Schlorship, Doddakannelli, Sarjapur Road, Bangalore-560035
- దరఖాస్తులను ఈ-మెయిల్ ద్వారా కూడా పంపవచ్చు. 
- ఈ-మెయిల్: santoor.scholarship@buddy4study.com లేదా call on 0120 6834200
- చివరితేది: ఆగస్టు 15 
- వెబ్‌సైట్: www.santoorscholarships.com

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బీసీసీఎల్ నర్సింగ్‌లో డిప్లొమా కోర్సు ప్రవేశాలు.

ధన్‌బాద్‌లోని కోల్ ఇండియా లిమిటెడ్ పరిధిలోని భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్) జనరల్ నర్సింగ్ & మిడ్ వైఫరీలో డిప్లొమా కోర్సు ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.

- డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ & మిడ్ వైఫరీ (డీజీఎస్‌ఎం)
- కాలవ్యవధి: మూడేండ్లు
- అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి 45 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత
- వయస్సు : 2019 సెప్టెంబర్ 30 నాటికి 17 నుంచి 23 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- అప్లికేషన్ ఫీజు: రూ.150/-
- ఎంపిక: రాతపరీక్ష ద్వారా
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో 
- చిరునామా: Principal, School of Nursing, Central Hospital, Jagjivan Nagar, Dhanbad-826003
- చివరితేదీ: ఆగస్టు 14
- ప్రవేశపరీక్ష: సెప్టెంబర్ 3
- వెబ్‌సైట్: www.bccl.gov.in

No comments:

Post a Comment