Friday, 19 July 2019

ఎయిర్‌ ఇండియాలో ఉద్యోగాలు, ఓయూలో దూరవిద్య ప్రవేశాలు, సీడాక్‌లో ప్రాజెక్టు అసోసియేట్‌ ఉద్యోగాలు, ఎన్‌పీసీఐఎల్‌ స్టయిఫండరీ ట్రెయినీలు, కర్ణాటక బ్యాంకులో క్లర్కు ఉద్యోగాలు.

ఎయిర్‌ ఇండియాలో ఉద్యోగాలు,

న్యూఢిల్లీలోని ఎయిర్‌ ఇండియా ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఏఐఈఎస్‌ఎల్‌) వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Air-India
-ఏఐఈఎస్‌ఎల్‌ అనేది ఎయిర్‌ ఇండియా లిమిటెడ్‌ ఆధ్వర్యలో నడిచే సంస్థ. ఈ పోస్టులను ఐదేండ్ల కాలానికి భర్తీచేస్తారు. అభ్యర్థి పనితీరును బట్టి మరో ఐదేండ్లవరకు పొడిగిస్తారు.
-పోస్టు: ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌ ఇంజినీర్‌
-మొత్తం ఖాళీలు: 125 (జనరల్‌-51, ఈడబ్ల్యూఎస్‌-12, ఓబీసీ-35, ఎస్సీ-18, ఎస్టీ-9)
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్‌ లేదా 10+2 (మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ) ఉత్తీర్ణత. B737-700/800/900 ఎయిర్‌క్రాఫ్ట్‌లో పనిచేసి ఉండాలి.
నోట్‌: ఈ పోస్టులను ముంబై, నాగ్‌పూర్‌, ఢిల్లీతోపాటు దేశంలోని ఎక్కడైనా భర్తీచేస్తారు.
-పే స్కేల్‌: రూ.95,000-1,28,000/-
-అప్లికేషన్‌ ఫీజు: రూ.1000/- ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు రూ.500/-
-ఎంపిక విధానం: వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: అర్హత కలిగిన అభ్యర్థులందరూ నిర్ణీత నమూనాలో దరఖాస్తును నింపి, డిమాండ్‌ డ్రాఫ్ట్‌, సంబంధిత సర్టిఫికెట్లతో నేరుగా పర్సనల్‌ అధికారి వద్ద హాజరుకావాలి.
-ఇంటర్వ్యూ తేదీ: ఆగస్టు 26-30
-వెబ్‌సైట్‌:www.airindia.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఓయూలో దూరవిద్య ప్రవేశాలు,
ఉస్మానియా విశ్వవిద్యాలయం దూరవిద్య విధానంలో 2019-20 విద్యాసంవత్సరానికి గాను వివిధ యూజీ, పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
OUCDE
-పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సులు: ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ (ఇంగ్లిష్‌, హిందీ, తెలుగు, సంస్కృతం, ఉర్దూ, ఫిలాసఫీ, సోషియాలజీ, పబ్లిక్‌ పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌, ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌, హిస్టరీ, సైకాలజీ), ఎంకామ్‌, ఎమ్మెస్సీ (మ్యాథమెటిక్స్‌, స్టాటిస్టిక్స్‌)
-గ్రాడ్యుయేట్‌ కోర్సులు: బీఏ, బీకాం జనరల్‌, బీబీఏ, బీఏ (మ్యాథ్స్‌ & స్టాటిస్టిక్స్‌)
-పీజీ డిప్లొమా కోర్సులు (ఏడాది): మ్యాథమెటిక్స్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టీచింగ్‌, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, బయోఇన్ఫర్మాటిక్స్‌, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌
n అర్హత: పీజీ కోర్సులకు సంబంధిత విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ, అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులకు ఇంటర్‌, పీజీ డిప్లొమా కోర్సులకు ఏదైనా డిగ్రీ/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. ఎంబీఏ/ఎంసీఏ కోర్సులకు డిగ్రీతోపాటు టీఎస్‌/ఏపీ ఐసెట్‌-2019 లేదా పీజీఆర్‌ఆర్‌సీడీఈ నిర్వహించే అర్హత పరీక్షలో పాసవ్వాలి.
గమనిక: ఈ విద్యాసంవత్సరం నుంచి ఎంఏ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, బీకాం కంప్యూటర్‌ అప్లికేషన్‌, పీజీ డిప్లొమా ఇన్‌ డాటా సైన్స్‌ కోర్సులను ప్రారంభించనున్నారు.
-దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్‌ 30
-వెబ్‌సైట్‌: www.oucde.net

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
 సీడాక్‌లో ప్రాజెక్టు అసోసియేట్‌  ఉద్యోగాలు,
చెన్నైలోని సీడాక్‌లో ప్రాజెక్టు అసోసియేట్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
-ప్రాజెక్టు అసోసియేట్‌-7 ఖాళీలు (ఢిల్లీ-2, ముంబై-1, విశాఖపట్నం-1, కోల్‌కతా-2, కొచ్చి-1)
-అర్హతలు: బీఈ/బీటెక్‌/ఎంసీఏ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత లేదా బీ లెవల్‌తోపాటు ఏడాది అనుభవం ఉండాలి లేదా పీజీ సీఎస్‌ఈ/ఎలక్ట్రానిక్స్‌ లేదా ఐటీ ఉత్తీర్ణత. 35 ఏండ్లు మించరాదు.
-ప్రాజెక్టు అసోసియేట్‌-4 ఖాళీలు
-అర్హతలు: బీఈ/బీటెక్‌/తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-చివరితేదీ: జూలై 31
-వెబ్‌సైట్‌: https://cdac.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌పీసీఐఎల్‌ స్టయిఫండరీ ట్రెయినీలు,
న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌పీసీఐఎల్‌)లో స్టయిఫండరీ ట్రెయినీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
NPCIL
-పోస్టు: స్టయిఫండరీ ట్రెయినీ (సైంటిఫిక్‌ అసిస్టెంట్‌)
-మొత్తం పోస్టులు: 37 
-విభాగాలవారీగా ఖాళీలు: మెకానికల్‌ ఇంజినీరింగ్‌-12, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌-6, బీఎస్సీ ఫిజిక్స్‌-2, కెమికల్‌ ఇంజినీరింగ్‌-10, ఎలక్ట్రానిక్స్‌-4, కెమిస్ట్రీ-6, సివిల్‌ ఇంజినీరింగ్‌-3 
-వయస్సు: 2019 ఆగస్టు 3 నాటికి 18-25 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత బ్రాంచీలో డిప్లొమా ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణత. (పదోతరగతి తర్వాత డిప్లొమా చేసి ఉండాలి), బీఎస్సీ పోస్టులకు ఫిజిక్స్‌/కెమిస్ట్రీ లేదా తత్సమాన సబ్జెక్టుల్లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
-స్టయిఫండ్‌: మొదటి ఏడాది రూ.16,000/- రెండో ఏడాది రూ.18,000/-
-శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకున్న తర్వాత నెలకు కనీస జీతం రూ.35,400/- (లెవల్‌-6) చెల్లిస్తారు. 
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఆగస్టు 3
-వెబ్‌సైట్‌: https://npcilcareers.co.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
కర్ణాటక బ్యాంకులో క్లర్కు ఉద్యోగాలు.

మంగళూరులోని కర్ణాటక బ్యాంక్‌ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని బ్రాంచీల్లో ఖాళీగా ఉన్న ప్రొబేషనరీ క్లర్క్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
KARNATAKA
-పోస్టు: ప్రొబేషనరీ క్లర్క్‌
-అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత. ప్రాంతీయ భాషతోపాటు హిందీ, ఇంగ్లిష్‌ మాట్లాడాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి.
-వయస్సు: 2019, జూలై 1 నాటికి 26 ఏండ్లు మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-జీతం: నెలకు రూ.37,000/-
-ప్రొబేషనరీ పీరియడ్‌: ఆరు నెలలు
-అప్లికేషన్‌ ఫీజు: రూ.600/-, ఎస్సీ/ఎస్టీలకు రూ.500/-)
-ఎంపిక: ఆన్‌లైన్‌ టెస్ట్‌ (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌) 
-పరీక్ష కేంద్రాలు: బెంగళూరు, ఢిల్లీ, ధార్వాడ్‌-హుబ్లీ, మంగళూరు, ముంబై, మైసూర్‌.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూలై 20
-వెబ్‌సైట్‌: www.karnatakabank.com

No comments:

Post a Comment